'ప్రపంచస్థాయి సినిమాకు ఏమాత్రం తగ్గలేదు'.. కల్కిపై పుష్పరాజ్‌ కామెంట్స్‌ | Allu Arjun Review On Prabhas Nag Ashwin Movie Kalki 2898 AD | Sakshi
Sakshi News home page

Allu Arjun: 'ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేశాడు'.. నాగ్‌ అశ్విన్‌పై బన్నీ ప్రశంసలు

Published Sun, Jun 30 2024 7:28 AM | Last Updated on Sun, Jun 30 2024 7:50 AM

Allu Arjun Review On Prabhas Nag Ashwin Movie Kalki 2898 AD

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజే సూపర్ హిట్‌ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశాపటానీ లాంటి సూపర్ స్టార్స్‌ నటించారు.

అయితే ఈ సినిమాపై పలువురు దిగ్గజ నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌, ప్రభాస్ నటన అద్భుతం అంటూ రివ్యూలు ఇ‍చ్చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్‌ సైతం తన అభిప్రాయం వ్యక్తం చేశారు.  కల్కి మూవీ చిత్రబృందానికి బన్నీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అల్లు తన ట్వీట్‌లో రాస్తూ..' కల్కి టీమ్‌కు నా అభినందనలు. అద్భుతమైన విజువల్ వండర్. ముఖ్యంగా నా మిత్రుడు ప్రభాస్‌ నటన సూపర్బ్‌. అమితాబ్‌ బచ్చన్‌ నటన గురించి ఇక మాటల్లేవ్. కమల్‌ హాసన్‌,దీపికా పదుకొణె, దిశా పటానీ నటన అద్భుతం.  ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిట్, మేకప్‌ బృందానికి, సాంకేతిక సిబ్బందికి అభినందనలు. ఇంత రిస్క్ తీసుకుని భారతీయ సినిమా స్థాయిని పెంచినందుకు నిర్మాతలు అశ్వనీదత్‌, స్వప్నదత్‌, వైజయంతి మూవీస్‌కు నా ధన్యవాదాలు. కల్కితో ప్రతి ఒక్క సినీ ప్రేమికుడిని ఆశ్చర్యానికి గురి చేశాడు నాగ్.  మా తరానికి చెందిన నాగ్‌ ‍అశ్విన్‌కు ప్రత్యేక అభినందనలు. చివరిగా ప్రపంచ సినిమాస్థాయి ప్రమాణాలకు సరిపోయే.. మన సాంస్కృతిక, సున్నితమైన అంశాలతో కూడిన చిత్రమే కల్కి' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప-2 లో నటిస్తున్నారు. ఈ సినిమాను పుష్ప సీక్వెల్‌గా సుకుమార్ ‍డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 6న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement