
సోషల్ మీడియాలో హీరో అభిమానుల మధ్య యుద్ధం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. టీజర్, ట్రైలర్ మొదలు సినిమా రిలీజ్ వరకు ప్రతీది పోల్చుతూ హీరో ఫ్యాన్స్ ఏదో రకంగా గొడవ పడుతూనే ఉంటారు. అయితే హీరోలు మాత్రం అవేవి పట్టించుకోకుండా కలిసి మెలిసే ఉంటారు. అయితే ఈ ఫ్యాన్స్ వార్ అనేది ఇటీవల సోషల్ మీడియాలో బాగా పెరిగిపోయింది.నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య నెట్టింట పెద్ద యుద్ధమే జరుగుతోంది. తాజాగా దీనిపై ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) స్పందించారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నాని(nani), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కలిసి నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మూవీ ఈ నెల 21న రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటిస్తూ పదేళ్ల క్రితం తెరకెక్కించిన ఆ సినిమా సంగతులను పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘సోషల్ మీడియాలో నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి సినిమా చేయగలరా?’ అని ఓ విలేకరి అడగ్గా నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. ‘ఫ్యాన్స్ వార్ గురించి తెలియదు కానీ, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సమయంలో విజయ్‌కు నాని సపోర్ట్‌గా నిలిచేవాడు. ప్రతి సన్నివేశాన్ని ఒకరికొకరు చర్చించుకుని నటించేవారు’ అన్నారు.
అలాగే నాని, విజయ్‌తో కలిసి మళ్లీ ఇలాంటి సినిమా చేసే ఆలోచన ఉందా? అని అడగ్గా.. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో వారితో సినిమా చేయలేం. నా నాలుగో సినిమాని మళ్లీ ఇలాంటి నేపథ్యంతో తీస్తే.. అది ఇంత బాగా రాకపోవచ్చు. టెక్నికల్‌గా బాగున్నప్పటికీ.. ఇంత నేచురల్‌గా తీయడం సాధ్యంకాకపోవచ్చు’ అన్నారు. ఎవడే సుబ్రమణ్యంలోని నాని పాత్రను ఇప్పుడున్న యంగ్ హీరోలలో నవీన్ పొలిశెట్టి చేయగలడని, విజయ్ పాత్రను పోషించాలంటే కొత్త హీరో కావాల్సిందేనని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.
నాని - విజయ్ కి మొదట్లో చాలా సపోర్టివ్ ఉండేవాడు..
వివాదాలపై స్పందించిన నాగ్ అశ్విన్ : #NagAshwin@NameisNani @TheDeverakonda #Nani #VijayDevaraKonda pic.twitter.com/CqCUlBPh0x— The Cult Cinema (@cultcinemafeed) March 18, 2025
Comments
Please login to add a commentAdd a comment