మూడు తరాల ముచ్చట్లు | New upcoming movie starting regular shooting | Sakshi
Sakshi News home page

మూడు తరాల ముచ్చట్లు

Published Mon, Mar 24 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM

New upcoming movie starting regular shooting

సీనియర్ రచయిత పూసల దర్శకునిగా మారి తెరకెక్కించనున్న చిత్రం ‘డాలర్‌కి మరో వైపు’. ఎ.సత్యనారాయణ, కె.రంగారావు నిర్మాతలు. ఉగాది నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే ఈ చిత్రంలో పాత, కొత్త నటీనటులు నటిస్తారు. ఈ సందర్భంగా పూసల మాట్లాడుతూ- ‘‘మూడు తరాల ముచ్చట్ల సమాహారం ఈ కథ.
 
 బంధాలు, అనుబంధాలు... ఈ నేపథ్యంలో కథ సాగుతుంది. పూర్తిస్థాయి కామెడీతో అన్ని వయసులవారూ చూసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ: ఎ.జమునాకుమారి, కెమెరా: మోహన్‌చంద్, సంగీతం: నాని, నిర్మాణ నిర్వహణ: పూసల బుజ్జి, నిర్మాణం: శ్రీ ఓం సాయిరాం ప్రొడక్షన్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement