ఫైట్‌తో ప్రారంభం | Natural Star Nani Saripodhaa Sanivaaram Shooting Started | Sakshi
Sakshi News home page

ఫైట్‌తో ప్రారంభం

Published Wed, Nov 15 2023 12:15 AM | Last Updated on Wed, Nov 15 2023 5:43 AM

Natural Star Nani Saripodhaa Sanivaaram Shooting Started - Sakshi

‘అంటే..సుందరానికీ!’ చిత్రం తర్వాత హీరో నాని, దర్శకుడు వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా సినిమా ‘సరిపోదా శనివారం’. ప్రియాంకా అరుళ్‌ మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య ఓ కీలక పాత్రధారి. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌తో మంగళవారం హైదరాబాద్‌లోప్రారంభమైంది.

ఫైట్‌ మాస్టర్‌ రామ్‌–లక్ష్మణ్‌ ఈ ఫైట్‌ ఎపిసోడ్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలతో పాటు నాని, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్‌ బిజోయ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement