
‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్‌లో ‘నాని ఓదెల 2’ (వర్కింగ్ టైటిల్) చిత్రం షురూ అయింది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ– ‘‘నా ఫస్ట్ సినిమా ‘దసరా’కి 2023 మార్చి 7న చివరిసారిగా కట్, షాట్ ఓకే అని చెప్పాను. 2024 సెపె్టంబర్ 18న ‘నాని ఓదెల 2’ ప్రకటన వీడియో కోసం మళ్లీ యాక్షన్ చెప్పాను.
48,470,400 సెకన్లు గడిచాయి. ప్రతి సెకను ఈ ్రపాజెక్ట్ కోసం సిన్సియర్‌గా ఉన్నాను. ‘దసరా’ చిత్రం స్థాయిని ‘నాని ఓదెల 2’తో వంద రెట్లు పెంచుతానని మాట ఇస్తున్నాను’’ అని తెలిపారు. ‘‘నానీని ఎక్స్‌ట్రార్డినరీ క్యారెక్టర్‌లో చూపిస్తూ, యునిక్ అండ్ ఎగ్జయిటింగ్ నెరేటివ్‌తో గొప్ప సినిమాటిక్ అనుభూతిని ‘నాని ఓదెల 2’ చిత్రం అందించనుంది’’ అని నిర్మాత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment