హైదరాబాద్‌లో సరిపోదా... | Saripodhaa Sanivaaram Movie Shedule Release | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో సరిపోదా...

Published Thu, Dec 28 2023 6:08 AM | Last Updated on Thu, Dec 28 2023 6:08 AM

Saripodhaa Sanivaaram Movie Shedule Release - Sakshi

‘అంటే సుందరానికీ!’ చిత్రం తర్వాత హీరో నాని, డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్‌జే సూర్య కీలక పాత్ర చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ్రపారంభమైంది. ‘‘సరిపోదా శనివారం’ చిత్రంలో నాని పూర్తిగా యాక్షన్‌–΄్యాక్డ్‌ అవతార్‌లో కనిపిస్తారు.

హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. నవంబరులో ఒక షెడ్యూల్‌ పూర్తి చేశాం. రెండో షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో ్రపారంభించాం. ఈ షెడ్యూల్‌లో ఇంటెన్స్‌ యాక్షన్‌ బ్లాక్‌తో పాటు నాని, ఇతర ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్ట్‌ని చిత్రీకరించనున్నాం. పాన్‌ ఇండియా చిత్రంగా రూ΄÷ందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది’’ అన్నారు మేకర్స్‌. ఈ చిత్రా నికి సంగీతం: జేక్స్‌ బిజోయ్, కెమెరా: మురళి జి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement