సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘మహానటి’ | Mahanati Gets U certificate From Censor | Sakshi
Sakshi News home page

Published Fri, May 4 2018 4:12 PM | Last Updated on Fri, May 4 2018 4:12 PM

Mahanati Gets U certificate From Censor - Sakshi

లెజెండరీ నటి, తెలుగు వాళ్లు గర్వించదగ్గ నటి మహానటి సావిత్రి.  అలాంటి నటిపై వస్తున్న సినిమా ‘మహానటి’. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ కత్తెరకు పని చెప్పకుండా... ఒక్క సన్నివేశం కూడా అభ్యంతర కరంగా లేవని సెన్సార్‌ వాళ్లు... క్లీన్‌ యూ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. ఈ విషయాన్ని నిర్మాతలు ట్విటర్‌ ద్వారా తెలిపారు. 

ఇప్పటికే విడుదల చేసిన టీజర్స్‌, లుక్స్‌, మోషన్‌ పోస్టర్స్‌,సాంగ్స్‌ ప్రేక్షకులకు చేరువయ్యాయి. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేశ్‌, జెమినీ గణేషన్‌గా దుల్కర్‌సల్మాన్‌ నటించిన విషయం తెలిసిందే. ఇతర కీలక పాత్రల్లో సమంత, విజయ్‌ దేవరకొండ నటించారు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించగా, మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూర్చగా, వైజయంతీ మూవీస్‌ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement