
గాలిగోపురంలో రోహిత్, నందిత
ఏలూరు : హీరో రోహిత్, నందిత సందడి చేశారు. వీరికి సహాయ నటులు ప్రభాస్ శ్రీను, అజయ్, మురళీశర్మ, ప్రియ తోడయ్యూరు. విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బీవీ రాజేంద్రప్రసాద్ నిర్మాణ సారథ్యంలో పవన్ సాధినేని కథ, స్కీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్న సావిత్రి చిత్రం షూటింగ్ శనివారం ఏలూరు శనివారపుపేటలోని గాలిగోపురంలో జరిగింది.
హీరోహీరోయిన్లు, సహాయ నటులు నడుచుకుంటూ ఆలయానికి రావడం, ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత జనార్దనస్వామి పాదాల ముందు శుభలేఖలు పెట్టి అర్చకులచే పూజలు చేయించడం వంటి సన్నివేశాలను చిత్రీకరించారు. హీరో రోహిత్, హీరోయిన్ నందిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉదయం 9 గంటల నుంచి షూటింగ్ చూసేందుకు నగరవాసులు ఎగబడ్డారు. ఆలయ ప్రహరీ గోడ ఎక్కి సందడి చేశారు. నటులు సైతం వారిని పలకరించి ఉత్సాహపరిచారు. ఆదివారం కూడా ఇక్కడ షూటింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది.