'తరాలను నిర్మించే స్త్రీ జాతికోసం' | Mahanati Savithri Movie Casting Call | Sakshi

'తరాలను నిర్మించే స్త్రీ జాతికోసం'

Mar 8 2017 11:55 AM | Updated on Sep 5 2017 5:33 AM

'తరాలను నిర్మించే స్త్రీ జాతికోసం'

'తరాలను నిర్మించే స్త్రీ జాతికోసం'

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ్ అశ్విన్, మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ్ అశ్విన్, మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఇంతవరకు నటీనటులతో పాటు ఇతర వివరాలేవి వెల్లడించలేదు. ముఖ్యంగా సావిత్రి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఉమెన్స్ డే సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన దర్శకుడు మరింత కన్ఫ్యూజన్ పెంచాడు.

మాయబజార్ సినిమాలోని సావిత్రి స్టిల్, వెనుక ఒకవైపు కీర్తి సురేష్, మరోవైపు సమంత ఫోటోలను యాడ్ చేశారు. అయితే ఈ ఇద్దరిలో సావిత్రిగా ఎవరు కనిపించబోతున్నారన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అదే సమయంలో ఈ చరిత్రలో భాగమయ్యేందుకు మీరు ముందుకు రండి అంటూ కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చారు. 'తరాలను నిర్మించే స్త్రీ జాతికోసం, తరతరాలు గర్వించే మహానటి సావిత్రి కథ' అనే లైన్తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో టైటిల్ను మాత్రం రివీల్ చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement