
సినిమాల్లో బాల నటులుగా నటించిన వారు కొంతమంది పెద్దాయ్యాక ఇతర రంగాల్లో రాణిస్తుండగా.. మరికొందరూ సినిమాల్లో స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇప్పటి మన స్టార్స్ ఒకప్పుడు సినిమాల్లో బాల నటులుగా నటించిన వారే. ఊయలలో ఉన్నప్పుడే వారు వెండితెర ఎంట్రీ ఇచ్చారు. కాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తండ్రి కృష్ణ సినిమాలతో బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్, మంచు విష్ణు, మనోజ్‌లు కూడా బాల నటులుగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే బ్లాక్ అండ్ వైట్ కాలంలో నటించిన మన స్టార్ హీరోలు చైల్డ్ అర్టిస్టులుగా నటించిన విషయం తెలుసా?.. వారుల ఎలా ఉంటారో చూశారా?. (చదవండి: మీరే నా బలం, నా జీవితం: మెగా బ్రదర్)
కాగా అప్పటి లెజెండరీ నటుడి తనయుడు చైల్డ్ అర్టిస్టుగా నటించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన ఎవరో గుర్తుపట్టలేక చాలా మంది బుర్రకు పని చెబుతున్నారు. మహానటి సావిత్రి ఎత్తుకుని ముద్దాడుతున్న ఆ చిన్నారి ఇప్పటి స్టార్ ఎవరో గుర్తుపట్టలేక నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. అయితే ఈ బుడ్డోడు ఓ లెజెండరి నటుడు తనయుడు.. తెలుగు ప్రముఖ హీరోల్లో ఒకడు.. అంతేకాదు ఆయన తనయులు కూడా ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పుడైన సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా... లేదా.. అయితే ఎవరో తెలుసుకుందా రండి!. (చదవండి: ‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్, మేకప్‌కు అంత సమయమా..!)
అయితే అప్పట్లో టాలీవుడ్‌ను ఏలిన కథానాయకులు ఎన్‌టీ రామారావు, అక్కినేని నాగేశ్వరావుల కుమారులు చిన్నతనంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినిమాల్లో చైల్డ్ అర్టిస్టులుగా హరికృష్ణ, బాలకృష్ణలు నటిస్తుండగా, నాగేశ్వరావు సినిమాల్లో ఆయన తనయుడు నాగార్జున బాలనటుడిగా రెండు సినిమాలు చేశాడు. అందులో నాగేశ్వరావు, సావిత్రిలు జంటగా నటించిన వెలుగు-నీడలు చిత్రంలో నాగ్ చైల్డ్ అర్టిస్టుగా కనిపించాడు. ఈ మూవీ సమయంలో నాగార్జున 8 నెలల పసిపాపగా ఉన్నాడు. అనంతరం ‘సుడిగుండాలు’ సినిమాలో కూడా నాగార్జున బాలనటుడిగా నటించిన సంగతి తెలిసిందే. మరీ ఇప్పడు మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. అప్పటి నటశిరోమణి చేతిలో తెరపై ఆడుకున్న ఈ బుడ్డోడే ఇప్పటి మన ‘కింగ్’ నాగార్జున. (చదవండి: Meera Jasmine Now: మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుంది?)
Comments
Please login to add a commentAdd a comment