
అలనాటి ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కి విజయం సాధించిన మూవీ మహానటి. ఇటీవల విడుదలైన ‘మహానటి’లో నటనకుగానూ కీర్తి సురేష్‌కు నటిగా మంచి మార్కులు పడ్డాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది ‘మహానటి’. అయితే డిలీటెడ్ సీన్ అని క్యాప్షన్‌తో ఓ వీడియో క్లిప్ పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రియదర్శిని పేటిక ముందు కీర్తి సురేష్ మాట్లాడిన క్లిప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటివి నిజంగా ఉంటే బాగుండు.. వేరే షూటింగ్‌లో ఉన్న మా ఆయనతో ఎంచక్కా మాట్లాడుకోవచ్చునంటూ కీర్తి చెప్పడం వీడియోలో వీక్షించవచ్చు. విదేశాల్లోనూ మహానటి మూవీ మంచి వసూళ్లు సాధిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్నా సినిమా బ్యానర్లపై సీనియర్ నిర్మాత అశ్వనిదత్, ఆయన కుమార్తెలు స్వప్నాదత్, ప్రియాంకదత్‌లు ఈ సినిమాను నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment