సావిత్రి పాత్రపై కీర్తి క్లారిటీ..! | keerthy suresh Clarifies About Rumours On Weight Issues | Sakshi
Sakshi News home page

సావిత్రి పాత్రపై కీర్తి క్లారిటీ..!

Published Fri, Jun 30 2017 2:07 PM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

సావిత్రి పాత్రపై కీర్తి క్లారిటీ..!

సావిత్రి పాత్రపై కీర్తి క్లారిటీ..!

అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆదారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సావిత్రిలా కనిపించేందుకు కీర్తి బరువు పెరుగుతోందని, అందుకోసమే షూటింగ్ ఆలస్యం చేస్తున్నారన్న ప్రచారం జరిగింది.

అయితే ఈ వార్తలపై హీరోయిన్ కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది. తాను సావిత్రి పాత్ర కోసం బరువు పెరగటం లేదని తెలిపింది. అంతేకాదు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న పవన్, త్రివిక్రమ్ సినిమా కోసం బరువు తగ్గుతున్నానని.. అయితే సావిత్రి పాత్ర కోసం ప్రొస్థటిక్ మేకప్ వాడతామని తెలిపింది. ఈ రెండు సినిమాలతో పాటు సూర్య నెక్ట్స్ సినిమా, విక్రమ్ సామి 2, విశాల్ పందెం కోడి 2 సినిమాల్లోనూ కీర్తి సురేష్ నటించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement