మహానటికి సినీ సావిత్రి ధన్యవాదాలు | Keerthy Suresh About Mahanati Savithri | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 9 2018 12:15 PM | Last Updated on Sun, Dec 9 2018 12:15 PM

Keerthy Suresh About Mahanati Savithri - Sakshi

దివంగత మహానటి సావిత్రి కీర్తిని, ఆమె నటనను వర్ణించడానికి తెలుగు పదాలు చాలావనడం అతిశయోక్తి కాదేమో. ఆమె పేరు సినీ జగతిలో అజరామరం. ఇక ఇటీవల ఆమెలా మహానటి చిత్రంలో జీవించిన యువ నటి కీర్తీసురేశ్‌ ఎంతగానో పేరు తెచ్చుకుంది. మహానటి కీర్తీసురేశ్‌ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. అందుకు కారణం మహానటి సావిత్రినే అవుతారు.అది గుర్తించిన కీర్తిసురేశ్‌ సావిత్రి జయంతిని పురస్కరించుకుని ఆమెకు ధన్యవాదాలు చెబుతూ ఒక లేఖను రాసి తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

‘ఎప్పుడూ గుర్తుంచుకునే మీ కోసం ఇది రాస్తున్నాను. మీరే మమ్మల్ని ఎంచుకున్నారు. మమ్మల్ని ప్రేమతోనూ, ఆశీర్వాదాలను అందించారు. మేమిక్కడ నిలబడడానికి, వ్యతిరేకతను అధిగమించడానికి, ఎల్లలు దాటడానికి, అన్నివిధాలా శక్తిని మీరే ఇచ్చారు. మేము పొందుతున్న అన్నిటికీ అర్హులమని భావించేలా చేశారు. మిమ్మల్ని నేను కూడా సంతోషపడేలా చేశానని భావిస్తున్నాను. మహానటి చిత్రంతో మిమ్మల్ని మళ్లీ ఈ లోకానికి తీసుకొచ్చి మీకు మేము న్యాయం చేశాం అని నమ్ముతున్నాను. మాకు చేతనైంది మేము చేశాం. అయితే మిమ్మల్ని మరిపించడం ఎవరి తరంకాదు. మీరు మా జీవితాలను మార్చేశారు. ధన్యవాదాలు సావిత్రి అమ్మా’ అని కీర్తీసురేశ్‌ ట్వీట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement