నేను బాగానే ఉన్నా: షాలినీ పాండే | shalini pandey clarifies about illness | Sakshi
Sakshi News home page

నేను బాగానే ఉన్నా: షాలినీ పాండే

Published Wed, Sep 13 2017 3:29 PM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

నేను బాగానే ఉన్నా: షాలినీ పాండే

నేను బాగానే ఉన్నా: షాలినీ పాండే

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ షాలిని పాండే స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. నెల్లూరులో షాలిని ఓ సెల్ ఫోన్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానుల హాజరయ్యారు. అయితే అదే సమయంలో షాలిని పాండే అస్వస్థతకు గురవ్వడంతో నిర్వాహకులు ఆమెను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. చికిత్స అనంతరం ఆమెను డిశ్చార్జి కూడా చేశారు. అయితే ఆమె తీవ్ర అస్వస్వతకు గురయ్యారంటూ పుకార్లు రావడంతో షాలిని అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. చాలామంది తనకు ఫోన్లు చేసి పరామర్శిచడంతో ఆమె నేరుగా ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి తనకు ఏం కాలేదని, బాగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. కొద్దిగా తలనొప్పి, జ్వరం ఉంటే ఆసుపత్రికి వెళ్లానని, అంతే తప్ప కొన్ని మీడియాల్లో వస్తున్నట్టు తీవ్ర అస్వస్థత కాదని తెలిపింది.
 

అర్జున్ రెడ్డి సినిమాతో ఆకట్టుకున్న షాలిని ప్రస్తుతం టాలీవుడ్ కోలీవుడ్ లలో వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సావిత్రి బయోపిక్‌ మహానటిలో అలనాటి అందాల తార జమున పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుందని తెలిపింది. త్వరలోనే తన కొత్త సినిమా ప్రాజెక్ట్‌లను వెల్లడిస్తానని చెప్పింది. తన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందొద్దని అభిమానులకు సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement