
అర్జున్ రెడ్డి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ షాలిని పాండే(Shalini Pandey).. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆమె మహానటి, 100% కాదల్, గొరిల్లా, 118 వంటి సినిమాలతో సౌత్ ఇండియాలో మెప్పించింది. కానీ, తర్వాత తను నటించిన సినిమాలు ఎవీ పెద్దగా మెప్పించలేదు. దీంతో ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆమె ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలిని.. తన కెరీర్ ఆరంభంలో ఒక దర్శకుడు వల్ల ఇబ్బందిపడినట్లు ఆమె చెప్పింది.
షాలినీ పాండే తాజాగా 'డబ్బా కార్టెల్' వెబ్ సిరీస్‌లో నటించింది. ఇందులో షబానా అజ్మీ, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో షాలినీ పాండే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఒక దర్శకుడి గురించి ఆమె ఇలా చెప్పింది. 'సినిమా ఇండస్ట్రీలో రాణించాలనే కోరికతో నేను మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నుంచి వచ్చాను. ఒక రోజు దర్శకులు సందీప్ రెడ్డి వంగా నా ఫోటోలను ఫేస్‌బుక్‌లో చూసి ఆయన తన టీమ్‌తో నన్ను సంప్రదించారు. అలా అర్జున్ రెడ్డిలో ఛాన్స్ దక్కింది. సుమారు ఏనిమిదేళ్లుగా చిత్రపరిశ్రమలో ఉన్నాను. ఈ ప్రయాణంలో ఎందరో నటీనటులతో పాటు మేకర్స్ నాకెంతో అండగా నిలిచారు. అయినప్పటికీ నాకు కూడా కొన్ని సవాళ్లు ఇక్కడ ఎదుర్కొవాల్సి వచ్చింది.
నా కెరీర్ ప్రారంభంలో సౌత్ ఇండియాలో ఒక సినిమా చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఇప్పటికీ మరిచిపోలేను. ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా కారవాన్‌లో నేను దస్తులు మార్చకుంటున్నాను. ఆ సమయంలో నా అనుమతి లేకుండానే దర్శకుడు డోర్ తీశాడు. వెంటనే చాలా కోపంతో అరిచేశాను. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, కొంత సమయం తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్లు ఒక సలహా ఇచ్చారు.. అలా కోపంగా తిట్టడం కరెక్ట్ కాదని చెప్పారు. నేను సైలెంట్‌గానే వెళ్లిపోయాను. ఈ ఘటన తర్వాత నాకు ఎక్కడా కూడా అలాంటి సమస్య రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా కోప్పడకుండా వారికి ఎలా సమాధానం చెప్పాలో తెలుసుకున్నాను.' అని షాలినీ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment