మహేష్ తరువాత ‘మహానటి’ కోసం..! | Jr Ntr Chief Guest For Mahanati Audio Release | Sakshi
Sakshi News home page

Published Tue, May 1 2018 10:08 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

Jr Ntr Chief Guest For Mahanati Audio Release - Sakshi

అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహానటి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తీ సురేష్‌, సావిత్రి పాత్రలో నటిస్తున్నారు. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అ‍శ్విన్‌ దర్శకుడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన స్టిల్స్‌ టీజర్‌ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి. తాజాగా చిత్రయూనిట్ ఆడియో రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తోంది.

ఈ రోజు(మంగళవారం) జరగనున్న ఆడియో వేడుకకు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. వైజయంతి మూవీస్‌ సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఎన్టీఆర్‌ మహానటి ఆడియో రిలీజ్‌కు హాజరయ్యేందుకు అంగీకరించారు. మిక్కి జే మేయర్‌ సంగీతమందించిన ఈ సినిమాలో సమంత, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement