Producer Ashwini Dutt Secret Reveals About Jr NTR Role In Mahanati Film - Sakshi
Sakshi News home page

Ashwini Dutt: మహానటిలో జూనియర్‌ ఎన్టీఆర్‌ లేకపోవడానికి కారణం అదే..

Published Wed, Aug 17 2022 9:27 PM | Last Updated on Thu, Aug 18 2022 12:05 PM

Producer Ashwini Dutt Reveals About Jr NTR In Mahanati - Sakshi

దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్‌ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే కీర్తికి స్టార్‌ హీరోయిన్‌ అన్న ఇమేజ్‌ను తీసుకొచ్చింది. ఓవర్‌ నైట్‌ స్టార్‌డమ్‌తో కీర్తి కెరీర్‌లో ది బెస్ట్‌ మూవీగా నిలిచిందీ సినిమా. అంతేకాకుండా జాతీయ అవార్డును సైతం అందుకుంది ఈ చిత్రం. ఈ చిత్రంలో శివాజీ గణేశన్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ నటించగా, అక్కినేని నాగేశ్వర రావు పాత్రను ఆయన మనవడు, యంగ్‌ హీరో నాగ చైతన్య పోషించి మెప్పించిన విషయం తెలిసిందే. కానీ నట సార్వభౌముడు సీనియర్‌ ఎన్టీఆర్‌ పాత్రను మాత్రం ఎవరూ చేయలేదు. 

ముందుగా సీనియర్‌ ఎన్టీఆర్‌ రోల్‌లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ నటించాల్సింది. పలు కారణాల వల్ల అలా కుదరలేదని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ తాజాగా తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ''మహానటి చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను తారక్‌తో చేయిద్దామని అనుకున్నాం. కానీ ఈలోగా బాలకృష్ణ గారు ఎన్టీఆర్‌ బయోపిక్‌ ప్రకటించారు. దీంతో మా సినిమాలో సీనియర్‌ ఎన్టీఆర్ పాత్రలో ఎవరిని పెట్టి తీసినా తప్పుగా భావిస్తారేమో అని అనిపించింది. ఒకవేళ తారక్‌ చేసినా బాగుండదేమో అని కూడా అనిపించింది. నాగ్‌ అశ్విన్‌తో చెబితే అసలు ఆయన పాత్ర లేకుండానే తీస్తా అని చెప్పి తెరకెక్కించాడు. ఆయన పాత్రకు రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ చేప్పారు. మిగతా అంతా మేనేజ్‌ చేశాం'' అని వెల్లడించారు.

చదవండి: హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో నాజర్‌కు గాయాలు !
నేనేం స్టార్‌ కిడ్‌ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్‌ రాజ్‌పుత్‌
సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement