తొలితరం హీరోయిన్ సావిత్రి అద్భుత పాత్రలతో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె జీవితం ఆధారంగా ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను చూసిన సినీ ప్రముఖులు, ప్రేక్షకులు చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
బాక్సాఫీసు వద్ద ‘మహానటి’ మంచిగా రాణిస్తోందని ప్రముఖలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేరిపోయారు. ఈ చిత్రంపై తన ట్విటర్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. అంతేకాక చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ‘మహానటి ఓ అనుభవం. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటనను వర్ణించడానికి మాటలు సరిపోవు. బహుశా సావిత్రి గారే ఆమెతో అలా చేయించారేమో. అలనాటి నటి సావిత్రి గారికి ఈ చిత్రం రూపంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఘన నివాళి ఇచ్చారు.’
‘ఈ చిత్రానికి జీవం పోసినందుకు ప్రియాంక, స్వప్న, దత్ గారికి థ్యాంక్స్. ఈ ‘మహానటి’లో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, చిత్రం యూనిట్ చాలా కష్టపడి అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ బ్రిలియంట్ మ్యూజిక్ సమకూర్చారు. ‘మహానటి’ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు’ అని జూనియర్ ఎన్టీఆర్ వరుస ట్వీట్లు చేశారు. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కించారు. మే 9న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకుపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment