మహానటి చిత్ర దర్శక నిర్మాతలతో మెగాస్టార్ చిరంజీవి
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. గత బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చిత్రయూనిట్‌కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా మెగా స్టార్ చిరంజీవి.. దర్శక నిర్మాతలను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా చిత్రం ఘనవిజయం సాధించినందుకు గానూ శుభాకాంక్షలు తెలియజేసిన చిరు.. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్నా దత్‌లకు శాలువాలు కప్పి సత్కరించారు. శుక్రవారం తమిళనాట నడిగయ్యార్ తిలగం పేరుతో రిలీజ్ అయిన మహానటికి అక్కడ కూడా సూపర్ హిట్ టాక్ రావటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment