
మహానటి సినిమాకు వసూళ్లతో పాటు ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. సినిమా విడుదల అయిన రోజు నుంచీ సినీ ప్రముఖులు చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు. సినీ విమర్శకులు సైతం ‘మహానటి’ని సావిత్రికి నివాళిగా అభివర్ణించారు. మహానటి ఇంత గొప్ప విజయం సాధించడానికి దర్శక,నిర్మాతలు పడిన కష్టం తెరమీద కనబడుతోంది.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంక దత్‌లను మీడియా సమక్షంలో సత్కరించారు. తాజాగా అల్లు అరవింద్, అల్లు అర్జున్ మహానటి బృందానికి ప్రత్యేక విందు పార్టీని ఇచ్చారు. నిన్న (ఆదివారం) సాయంత్రం ఏర్పాటు చేసిన ఈ పార్టీకి రాజమౌళి, కీరవాణిలు కూడా హాజరయ్యారు. స్వప్నదత్, ప్రియాంక దత్, నాగ్ అశ్విన్‌లను అల్లు అర్జున్, అరవింద్ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలుస్తోంది. మే 9న రిలీజైన మహానటి అమెరికాలో మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి విజయవంతంగా దూసుకెళ్తోంది.
Comments
Please login to add a commentAdd a comment