మహానటి మూవీతో అభిరుచి గల డైరెక్టర్ అని నిరూపించుకున్నారు నాగ్ అశ్విన్. తీసింది రెండు సినిమాలే అయినా... రెండూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. మహానటి సినిమా విడుదలైనప్పటి నుంచి నాగ్ అశ్విన్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. సినిమా కోసం నాగ్ పడిన కష్టం తెరపైన కనపడుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు మహానటి దర్శక నిర్మాతలను సత్కారించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అశ్వనీదత్ మాట్లాడుతూ... గత రెండు మూడేళ్లుగా చిరంజీవి గారికి ఎన్నో కథలు వినిపిస్తున్నాము, కానీ కుదరట్లేదు. మా కాంబినేషన్‌లో ఒక పెద్ద సినిమా ఉంటుంది. నాగ్ అశ్విన్ కూడా ఒక లైన్ అనుకున్నారని.. సినిమా పేరు భైరవ అని... టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో సినిమా ఉండొచ్చని అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ.. నాకూ పాతాళ భైరవి లాంటి సినిమా, జానపద నేపథ్యంలో, మాయలు మంత్రాలు లాంటి సినిమా చేయాలని ఉందంటూ తెలిపారు.
వైజయంతీ మూవీస్, చిరంజీవి, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఓ సినిమా మాత్రం ఉంటుందని తెలిసిపోయింది. అయితే అది ఇప్పట్లో మాత్రం కుదిరేలా లేదు. చిరంజీవి ప్రస్తుతం సైరాతో బిజీగా ఉన్నారు. తరువాత బోయపాటి శీను, త్రివిక్రమ్, కొరటాల శివతో సినిమాలు ఉంటాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వీటన్నంటిలో ఏది పట్టాలెక్కుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment