ఎన్టీఆర్, కృష్ణలను గుర్తు చేస్తున్నాడు | Nara rohith busy with savithri raja cheyi vesthe | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్, కృష్ణలను గుర్తు చేస్తున్నాడు

Published Tue, Nov 17 2015 1:50 PM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

ఎన్టీఆర్, కృష్ణలను గుర్తు చేస్తున్నాడు

ఎన్టీఆర్, కృష్ణలను గుర్తు చేస్తున్నాడు

ప్రజెంట్ జనరేషన్ హీరోలు ఒక సినిమా సెట్స్ మీద ఉండగా, మరో సినిమా గురించి ఆలోచించే ప్రయత్నం కూడా చేయటం లేదు. ముఖ్యంగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలైతే ఏడాదికి ఒక్క సినిమా చేయటమే గగనంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్నాడు యంగ్ హీరో నారా రోహిత్.

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న రోహిత్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్నాడు. చాలాకాలం క్రితమే ప్రారంభమైన సావిత్రి షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉండగా, ఇటీవల రాజా చెయ్యి వేస్తే సినిమాను మొదలు పెట్టాడు. ఈ రెండు సినిమాల షూటింగ్లలో ప్యారలల్గా పాల్గొంటున్న రోహిత్, అచ్చంగా రోజుకు 24 గంటలూ సెట్లోనే ఉంటున్నాడు.

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాజా చెయ్యివేస్తే, ఆ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి మర్నాటి ఉదయం 6 గంటల వరకు సావిత్రి సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. షాట్ బ్రేక్లలో రెస్ట్ తీసుకుంటూ యమా స్పీడుగా ఈ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ లాంటి సీనియర్ హీరోలు ఇలాగే రోజులో రెండు మూడు సినిమాల్లో నటించేవారు. ఈ జనరేషన్లో ఒక్క రోహిత్ మాత్రమే ఇంత సాహసం చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement