మహానటి మొదలవుతోంది..! | Mahanati regular shooting date confirmed | Sakshi
Sakshi News home page

మహానటి మొదలవుతోంది..!

Published Sat, Apr 22 2017 2:08 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

మహానటి మొదలవుతోంది..!

మహానటి మొదలవుతోంది..!

సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన బయోపిక్ మహానటి సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. చాలా కాలంగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ను మే 10 ప్రారంభించాలని నిర్ణయించారు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా మారిన నాగఅశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ మహానటి సావిత్రి పాత్రలో నటిస్తోంది. ఆమెతో పాటు మరింత మంది తెలుగు, తమిళ నటులు ఈ సినిమాలో అలరించనున్నారు.

కథను నడిపించే కీలకమైన పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తుండగా, సావిత్రి సమకాలీన నటి జమున పాత్రలో అనుష్క కనిపించనుంది. అయితే అప్పటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, జెమినీ గణేషన్ల పాత్రలలో ఎవరు కనిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే నటీనటుల వివరాలతో పాటు రిలీజ్ డేట్ను కూడా చిత్రయూనిట్ ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement