
సీనియర్ నటి జమున , కీర్తిసురేశ్
తమిళసినిమా: నాకా అర్హత ఉంది అంటోంది యువ నటి కీర్తిసురేశ్. నట వారసురాలిగా రంగప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మకు కోలీవుడ్‌లో తొలిచిత్రం నిరాశపరచినా, మలి చిత్రం రజనీమురుగన్ నుంచే విజయాలు ముంగిట వరించాయి. అంతే కాదు ఇలయదళపతి విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలను తక్కువ కాలంలోనే అందిపుచ్చుకున్న కీర్తిసురేశ్. ఇక మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు) నడిగైయార్ తిలగం చిత్రంలో సావిత్రిగా నటించే అవకాశం కీర్తినే వరించింది. అయితే ఈ చిత్రానికే ఈ యువ నటి విమర్శలను ఎదుర్కొంటోంది. నడిగైయార్ తిలగం చిత్రం దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇందులో కీర్తిసురేశ్‌తో పాటు, సమంత, దుల్కర్‌సల్మాన్, విజయ్‌దేవరకొండ నటిస్తున్నారు.
ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తిసురేశ్ నటించడాన్ని సీనియర్ నటి జమున ఆక్షేపణ వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఒక భేటీలో సావిత్రి పాత్రలో నటించే అర్హత కీర్తిసురేశ్‌కు లేదని అన్నారు. దీనికి కాస్త ఆలస్యంగానే కీర్తిసురేశ్ స్పందించింది. తను పేర్కొంటూ సావిత్రి పాత్రలో నటించడానికి తాను అర్హురాలినేనని పేర్కొంది. తాను ఏమీ ఆలోచించకుండా సావిత్రి పాత్రలో నటించడానికి అంగీకరించలేదని, ఆమె గురించి క్షణంగా తెలుసుకున్న తరువాతనే ఆమెలా నటించడానికి అంగీకరించానని చెప్పింది.అందుకు చాలా శిక్షణ పొందానని చెప్పింది. ముందుగా సావిత్రికి సంబంధించిన పుస్తకాలను చదివానని, ఆ తరువాత సావిత్రి కూతురు ఛాముండేశ్వరిని కలిసి సావిత్రి మేనరిజం గురించి అడిగి తెలుసుకున్నానని చెప్పింది.
అప్పుడు ఛాముండేశ్వరి తనకు చాలా విషయాలను చెప్పారని అంది. అదే విధంగా సావిత్రి నటించిన పలు చిత్రాలు చూశానని చెప్పింది. ఆ తరువాత ఆమెలా నటించడంలో శిక్షణ పొందానని, ఇవన్నీ దర్శక నిర్మాతలకు సంతృప్తిని కలిగించిన తరువాతనే ఆ పాత్రలో నటించడం ప్రారంభించానని తెలిపింది. మరో విషయం ఏమిటంటే సావిత్రి అమ్మకు తనకు చాలా విషయాల్లో సాపిత్యం ఉందని సావిత్రి అమ్మకు క్రికెట్ క్రీడ అన్నా, స్మిమ్మింగ్, డ్రైవింగ్ అన్నా చాలా ఆసక్తి అని, తనకూ అవంటే చాలా ఆసక్తి అని కీర్తి చెప్పింది. అంతే కాదు చిత్రం విడుదలైన తరువాత తన నటన గురించి విమర్శించడం సబబుగా ఉంటుందని అంది.
Comments
Please login to add a commentAdd a comment