సావిత్రి భర్తగా స్టార్ హీరో..? | Suriya to reprise the role of a legendary actor | Sakshi
Sakshi News home page

సావిత్రి భర్తగా స్టార్ హీరో..?

Mar 26 2017 8:33 AM | Updated on Sep 5 2017 7:09 AM

సావిత్రి భర్తగా స్టార్ హీరో..?

సావిత్రి భర్తగా స్టార్ హీరో..?

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ అశ్విన్ తన రెండో ప్రయత్నంగా మహానటి జీవిత

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ అశ్విన్ తన రెండో ప్రయత్నంగా మహానటి జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అశ్వనిదత్ నిర్మాణంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇప్పటికే సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ను మరో కీలక పాత్రకు సమంతను ఎంపిక చేశారు. అలనాటి మహానటుల పాత్రలను తెర మీద చూపించేందుకు ఆ స్థాయి నటులనే ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సావిత్రి జీవితంలో కీలకమైన ఆమె భర్త, అప్పటి స్టార్ హీరో జెమినీ గణేషన్ పాత్రకు ఓ కోలీవుడ్ స్టార్ హీరోను సంప్రదిస్తున్నారు. కాస్త నెగెటివ్ టచ్ ఉండే ఈ పాత్రను హీరో సూర్యతో చేయించాలని భావిస్తున్నారట. ఎక్కువగా తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న నటులనే ఎంపిక చేసే ప్లాన్ ఉన్న చిత్రయూనిట్ జెమినీ గణేషన్ పాత్రకు సూర్య అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారట. ఇప్పటికే దర్శకుడు నాగఅశ్విన్,  సూర్యకు కథ కూడా వినిపించగా, సూర్య మాత్రం తన నిర్ణయం చేప్పలేదని తెలుస్తోంది. త్వరలోనే సినిమాలోని నటీనటుల వివరాలతో పాటు షూటింగ్ షెడ్యూల్ డిటెయిల్స్ ను వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement