Gemini Ganesan
-
Indian actress Rekha: పన్నీరద్దుకున్న పసిడి రేఖ
రేఖ... నేటితో 70 నిండి 71లోకి అడుగుపెడుతోంది. కాని మొన్న ఐఫా వేడుకలో వేదిక మీద ఆమె చేసిన 15 నిమిషాల నృత్యం చూస్తే వయసు 17 దగ్గరే ఆగిపోయిందని అనిపించింది. రేఖ – ఎన్నో ఆటుపోట్లు జీవితపు ఎదురుదెబ్బలు ఎదుర్కొంది. కాని ముందుకు సాగడం సౌందర్య భరితంగా జీవించడమే జీవిత పరమార్థం అని నిరూపిస్తూనే ఉంది. కొంచెం కలత చెందితే విరక్తి అవతారం దాల్చే నేటి యువత రేఖ నుంచి ఎంత నేర్చుకోవాలి?1993.ఫిల్మ్‌ఫేర్ మేగజైన్ వారు చెన్నైలో జెమినీ గణేశన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు బహూకరిస్తున్నారు. వేడుకలో దక్షిణాది దిగ్గజాలంతా ఉన్నారు. ప్రతిష్టాత్మకమైన సందర్భం. జెమినీ గణేషన్ స్టేజ్ మీదకు వచ్చారు. మైక్‌లో వినిపించింది– ఇప్పుడు జెమినీ గణేశన్‌కు అవార్డు బహూకరించవలసిందిగా రేఖను ఆహ్వానిస్తున్నాము...చప్పట్లు మిన్నంటాయి. రేఖ స్టేజ్ మీదకు వచ్చింది. జెమిని గణేశన్‌కు అవార్డు ఇచ్చింది. జెమిని మైక్ అందుకుని ‘నా కూతురు రేఖ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది’...రేఖ ఊహ తెలిసినప్పటి నుంచి ఈ మాట కోసం ఎదురు చూస్తోంది. ‘రేఖ నా కూతురు’ అని జెమిని అనాలని ఎదురు చూసిన మాట. ఇంతకాలానికి విన్నమాట. రేఖ సంతోషంతో వెక్కివెక్కి ఏడ్చింది.∙∙ స్త్రీకి మగవాడి తోడు ఉండాలని భారతీయ సంప్రదాయం అంటుంది. అలా తోడు ఉండక తప్పని పరిస్థితులు మన దేశంలో ఉంటాయి. రేఖకు బాల్యం నుంచి కూడా తండ్రి తోడు లేదు. తల్లి పుష్పవల్లి, తండ్రి జెమిని గణేశన్ వివాహ బంధంలో లేకుండానే రేఖను కన్నారు. రేఖ తన బాల్యంలో ‘అక్రమ సంతానం’ గా నింద అనుభవించింది. పుష్పవల్లిని భార్యగా, రేఖను కుమార్తెగా స్వీకరించడానికి జెమిని సిద్ధంగా లేడు. బతుకు గడవడానికి కుమార్తెను సినిమాల్లో ప్రవేశ పెట్టింది పుష్పవల్లి. కాని మద్రాసులో రేఖను హీరోయిన్గా చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు– జెమిని భయంతో. అదీగాక పుష్పవల్లికి నటిగా ఉన్న రోజుల్లో హిందీలో వెలగాలని ఆశ ఉండేది. ఆ ఆశను కనీసం కుమార్తె అయినా నెరవేర్చాలని కోరుకుంది. అప్పటికే ఆమెకు మద్రాసులో చాలా బాధలు ఉన్నాయి. అందుకని తన చెల్లెల్ని తోడు ఇచ్చి రేఖను బొంబాయి పంపింది. పద్నాలుగేళ్ల అమ్మాయి రేఖ. ఏమీ తెలియని రేఖ. బొంబాయిని చూసి బెంబేలెత్తిపోయిన రేఖ.1970లో నవీన్ నిశ్చల్ పక్కన హీరోయిన్గా నటించిన ‘సావన్ భాదో’ సినిమా విడుదలైంది. బొంబాయి పత్రికలన్నీ రేఖను తెర మీద చూసి ఫక్కున నవ్వాయి. నల్లగా, లావుగా ఉన్న రేఖను గేలి చేశాయి. ‘అగ్లీ డక్లింగ్’ అని పేరు పెట్టాయి. ‘33 ఇంచుల నడుము హీరోయిన్’ అని ఎద్దేవా చేశాయి. రేఖకు ఇవన్నీ ఏమీ అర్థం కాలేదు– తాను సినిమాల్లో నటిస్తే ఇంటి దగ్గర కష్టాలు తీరుతాయి అన్న ఒక్క సంగతి తప్ప. పబ్లిసిటీ కోసం రేఖ చేత ఇంటర్వ్యూల్లో అవాకులు చవాకులు మాట్లాడించేవారు నిర్మాతలు. ‘ముద్దు సీన్లు నటించే’ అమ్మాయిగా రేఖకు పేరు పడింది. రేఖను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు.రేఖ బి–గ్రేడ్ సినిమాల్లో నటిస్తూ ఉంటే ఆ సమయానికి పరిచయమైన జితేంద్రలో ఆమె భవిష్యత్ భాగస్వామిని ఊహించుకుంది రేఖ. అయితే అతను రేఖతో స్నేహంగా ఉన్నా తన గర్ల్‌ఫ్రెండ్, ఎయిర్ హోస్టెస్ శోభనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత వినోద్ మెహ్రా ఆమెకు ఎంత దగ్గరయ్యాడంటే అతడిని పొందలేక రేఖ ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్తలు వచ్చాయి. తర్వాతి రోజుల్లో విలన్‌గా చేసిన కిరణ్ కుమార్ కూడా ఆమె బోయ్ ఫ్రెండ్‌గా ఉన్నాడు. ఈ దశలన్నీ దాటాక 1976లో ‘దో అంజానే’లో అమితాబ్‌తో కలిసి నటించాక రేఖ జీవితం మారిపోయింది. జీవితాన్నీ, కెరీర్‌నీ సీరియస్‌గా తీసుకోవడం అమితాబ్ నుంచి రేఖ నేర్చుకుంది. ఆమె అమితాబ్‌ను పేరు పెట్టి ఎప్పుడూ పిలవదు. ‘ఓ’ (వారు/ఆయన) అంటుంది. పత్రికలు కూడా ‘ఓ’ అనే రాసేవి. అమితాబ్–రేఖల జోడి సూపర్ హిట్ అయ్యింది. ఆలాప్, ఖూన్ పసీనా, మొకద్దర్ కా సికిందర్, మిస్టర్ నట్వర్లాల్, రామ్ బలరామ్, సుహాగ్, సిల్సిలా. ఆమ్స్టర్ డామ్ డచ్ తులిప్ పూల మధ్య రేఖ, అమితాబ్‌ల మధ్య సాగే ‘దేఖా ఏక్ ఖ్వాబ్ తో ఏ సిల్సిలే హుయే’ పాట హిందీ సినిమాలకు సంబంధించి అత్యంత రొమింటిక్ గీతంగా నేటికీ అభిమానులను సంపాదించుకుంటూనే ఉంది.ప్రతికూలతలను రేఖ అనుకూలంగా మార్చుకుంటూ పోరాటం సాగిస్తూ వచ్చింది. ఒక నటికి దేహానికి మించిన పెట్టుబడి లేదని, దాని పోషణ ప్రథమమని గ్రహించిన మొదటి హీరోయిన్ రేఖ. ఇందుకు అమితాబ్ గైడెన్స్ ఉపయోగపడింది. బరువు తగ్గడం ఒక వ్రతంగా పెట్టుకున్న రేఖ నెలల తరబడి కేవలం యాలకులు కలిపిన పాలు తాగి బతికింది. బాలీవుడ్లో ఆమె వల్లే యోగా, ఏరోబిక్స్ పరిచయం అయ్యాయి. మేకప్ రహస్యాలు నటికి తెలిసి ఉండాలని లండన్ వెళ్లి మేకప్ కోర్సు చేసి వచ్చిందామె. ఇప్పుడు బాలీవుడ్లో ఎలా కనపడాలో, ఎలా ముందుకు సాగాలో, ఎలా ఇమేజ్ను పెంచుకుంటూ వెళ్లాలో ఆమెకు తెలుసు. అంతవరకూ సినిమా స్టిల్స్ మాత్రమే పత్రికలకు అందేవి. రేఖ ప్రత్యేకంగా ఫొటో షూట్స్ చేసి ఆ స్టిల్స్ పత్రికలకు ఇచ్చేది. ఇది బొత్తిగా కొత్త. అందువల్ల ఆమె ఎప్పుడూ కవర్ గర్ల్‌గా నిలిచేది. ఆ తర్వాత హీరో హీరోయిన్లు ఆ ట్రెండ్‌ను ఫాలో అవక తప్పలేదు. రేఖ కేవలం ఒక గ్లామర్ డాల్ కాదు ఆమె మంచి నటి అని చెప్పే సినిమా వచ్చింది. ‘ఘర్’. గుల్జార్ దర్శకత్వంలో 1978లో వచ్చిన ఈ సినిమా రేఖలోని సమర్థమైన నటిని ప్రేక్షకులకు చూపింది. ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్. ఆ తర్వాత హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖూబ్సూరత్’ (1980) రేఖను యూత్‌కు బాగా దగ్గర చేసింది. దాంతోపాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డు తెచ్చి పెట్టింది. అదే సంవత్సరం విడుదలైన ‘ఉమ్రావ్ జాన్’ రేఖ ఒక ఉత్కృష్టమైన నటిగా ప్రపంచానికి చాటింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం దక్కాక ఇక రేఖ గురించి విమర్శకులు ఎప్పుడూ తక్కువ చేసే పరిస్థితి రాలేదు. రేఖ ఇప్పుడు అన్ని విధాలుగా పరిపూర్ణమైన నటి.రేఖను చాలా తెలివితేటలతో, గ్లామర్‌తో, పరిశ్రమతో ఇండస్ట్రీలో నిలిచింది తప్ప నిజానికి ఇండస్ట్రీ ఆమె టాలెంట్‌ను ఎప్పుడూ పూర్తిగా ఉపయోగించుకోలేదు. పెద్ద నిర్మాణ సంస్థలూ పెద్ద దర్శకులు ఆమెను సపోర్ట్ చేయలేదు. శ్యామ్ బెనగళ్ ‘కలియుగ్’ (1981), గిరిష్ కర్నాడ్ ‘ఉత్సవ్’ (1984), ఆస్థా (1997) రేఖకు చెప్పుకోవడానికి మిగిలాయి. ఆ తర్వాత ఆమె యాక్షన్ సినిమాలకు మళ్లి ‘ఖూన్ భరీ మాంగ్’, ‘ఫూల్ బనే అంగారే’ వంటి సినిమాలు చేసి ‘లేడీ అమితాబ్’ అనిపించుకునే వరకూ వెళ్లింది. ఒక దశలో ఆమె అమితాబ్‌లాగా కాస్ట్యూమ్స్ కూడా ధరించేది.రేఖ అన్‌స్టాపబుల్. అన్లిమిటెడ్. ఆమె ‘కల్ హోన హో’,‘క్రిష్’ వంటి సినిమాల్లో తల్లి/బామ్మ పాత్రలు పోషించినా ప్రేక్షకులు ఎప్పుడూ నల్లజుట్టు రేఖనే ఇష్టపడ్డారు. ఆమె తన ఆకృతిని, ఫిట్‌నెస్‌ని 70 ఏళ్ల వయసు వచ్చినా ఎప్పుడూ కోల్పోలేదు. నేటికీ ఆమె ప్రత్యేకమైన ఫొటోషూట్స్ చేస్తూ కవర్‌గర్ల్ గానే ఉంది. ఇలా హాలీవుడ్ నటీమణులకు చెల్లిందిగానీ మన దేశంలో రేఖకు మాత్రమే సాధ్యమైంది. రేఖ గొప్ప డాన్సర్. పాటలు బాగా పాడుతుంది. కవిత్వం రాస్తుంది. ఆమెలో ఏదో ఆకర్షణ ఉంది. ‘నేను ప్రేమిస్తే సంపూర్ణంగా ప్రేమిస్తాను’ అనే రేఖ ప్రేక్షకులకు కూడా అంతే సంపూర్ణంగా ప్రేమ అందించడం వల్లే నేటికీ నిలబడి ఉంది.ఈ గొప్ప యోధ, కళాకారిణి తెలుగువారి అమ్మాయి కూడా కావడం తెలుగువారు గర్వపడాల్సిన విషయం.రేఖకు జన్మదిన శుభాకాంక్షలు. రేఖ టాప్ 10 సాంగ్స్1. తేరే బినా జియా జాయేనా – ఘర్2. ఆజ్కల్ పావ్ జమీ పర్ – ఘర్3. సున్ దీదీ సున్ తేరేలియే – ఖూబ్సూరత్4. సలామే ఇష్క్ మేరీ జాన్ – ముకద్దర్ కా సికిందర్5. దిల్ చీజ్ క్యా హై – ఉమ్రావ్ జాన్6. ఛోటి సి కహానీ సే బారిషోంకే పానీ సే – ఇజాజత్7. పర్దేశియా ఏ సచ్ హై పియా – మిస్టర్ నట్వర్లాల్8. మన్ క్యూ బెహకా రే బెహకా – ఉత్సవ్9. గుమ్ హై కిసీ కే ΄్యార్ మే – రామ్‌పూర్ కా లక్ష్మణ్10. ఏ కహా ఆగయే హమ్ – సిల్సిలా -
చిన్నప్పటి ‘సావిత్రి’ నా మనుమరాలే..
తెలుగు సినీ ప్రేక్షకులకు మహానటి సావిత్రి గుర్తున్నంతకాలం తానూ గుర్తుంటానని ‘మహానటి’లో సావిత్రి పాత్రధారి కీర్తి సురేష్ అన్నారు. ‘మహానటి’ సినిమా విజయవంతమైన సందర్భంగా చేపట్టిన కృతజ్ఞతా పర్యటనలో భాగంగా చిత్రం యూనిట్ ఆదివారం రాజమహేంద్రవరంలో సందడి చేసింది. నటకిరీటి రాజేంద్రప్రసాద్, చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తదితరులు థియేటర్లోప్రేక్షకుల్ని కలుసుకున్నారు. ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): తెలుగు సినీ ప్రేక్షకులకు మహానటి సావిత్రి గుర్తున్నంతకాలం తానూ గుర్తుంటానని ‘మహానటి’లో సావిత్రి పాత్రధారి కీర్తి సురేష్ అన్నారు. ‘మహానటి’ విజయవంతమైన సందర్భంగా చిత్రం యూనిట్ కృతజ్ఞతా పర్యటన చేపట్టింది. ఆదివారం స్థానిక జేఎన్‌రోడ్‌లోని ఎంఆర్ఆర్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కీర్తి సురేష్ మాట్లాడుతూ దర్శకుడు నాగ్అశ్విన్ ఆలోచనల నుంచే ఈ సినిమా వచ్చిందన్నారు. చిత్రనిర్మాణంలో ప్రియాంకదత్, స్వప్నదత్ ఎంతో సహకరించారన్నారు. టెక్నీషియన్లు అద్భుతంగా పనిచేశారని, సమంత, దుల్కర్, విజయ్ దేవరకొండతో పాటు సహనటులు ఎంతో ప్రతిభ కనబరిచారని అన్నారు. ముఖ్యం గా డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ డానియేల్ అ ద్భుతమైన ప్రతిభను కనబరిచారన్నారు. మహానటిలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ స్వంత తండ్రిలా ప్రోత్సహించారని, ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. సావిత్రి పాత్ర ను ఇచ్చిన నాగ్ అశ్విన్, నిర్మాతలతో పాటు చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘మహానటి’పై తెలుగువారి ప్రేమేవిజయానికి మూలం దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ తెలుగువారికి సావిత్రిపై ఉన్న ప్రేమే మహానటిని పెద్ద విజయవంతం చేసిందన్నారు. ఈసినిమా రూపకల్పనలో ఏదో శక్తి ముందుండి నడిపించిందని నమ్ముతున్నానన్నారు. సావిత్రి స్టార్ పవర్ ఎంతో 40 ఏళ్ళ తర్వాత కూడా మహానటి సినిమా రుజువు చేస్తోందన్నారు. మహానటి సావిత్రి జీవితం ఒక విజయవంతమైన సినిమాతో ముగిసి ఉంటే బాగుంటుందన్న కోరికతోనే ఈ సినిమా రూపొందించానన్నారు. 40 సంవత్సరాల జీవితకథను మూడు గంటల్లో చూపించేందుకు స్క్రీన్‌ప్లే రాయడమే చాలా కష్టంగా అనిపించిందని, అయితే కష్టానికి తగ్గ ఫలితాన్ని ప్రేక్షకులు అందించారని అన్నారు. కేవీ చౌదరి పాత్ర గుర్తుండి పోతుంది.. నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘ఆ నలుగురు’ సినిమాలో రఘురామ్ పాత్రను ప్రేక్షకులు ఎంతగా గుర్తుంచుకున్నారో, మహానటిలో కేవీ చౌదరి పాత్రకూడా అంతగా గుర్తుండి పోతుందన్నారు. సావిత్రితో విభేదించి దూరమైన తరువాత ఆమెకు ఆరోగ్యం బాగోలేని సమయంలో కలుసుకున్న సీన్ అద్భుతంగా పండిందన్నారు. మహానటి సావిత్రి మళ్ళీపుట్టిందా అన్నంతగా కీర్తి సురేష్ ఆమె పాత్రలో ఆకట్టుకుందన్నారు. సావిత్రి పాత్రలో జీవించేందుకు ఆమె ఎంతగానో కష్టపడిందని ప్రశంసించారు. దర్శకుడు, నిర్మాతలు, నటీనటులు నిజాయితీతో కష్టపడి పనిచేసిన మహానటి తెలుగుసినిమా చరిత్రలోనే ఒక అద్భుతమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. ‘బయోపిక్ ఎవరు చూస్తారులే’ అని అంతా పెదవి విరిచినా నాగ్అశ్విన్ ప్రతిభాపాటవాలతో మహానటిని ఒక క్లాసిక్‌గా నిలబెట్టారన్నారు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ డేనియల్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారని, సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని అన్నారు. స్వామి థియేటర్లో మహానటి యూనిట్ కృతజ్ఞతాపర్యటనలో భాగంగా ‘మహానటి’ యూనిట్ రాజమహేంద్రవరం స్వామి థియేటర్లో మ్యాట్నీషోలో ప్రేక్షకులను కలుసుకుంది. కీర్తి సురేష్, రాజేంద్రప్రసాద్, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు ప్రియాదత్, స్వప్నదత్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ డానియేల్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ‘అమ్మాడీ’ కీర్తిసురేష్ మహానటిలోని సినిమాడైలాగులతో సందడి చేసింది. థియేటర్ యజమాని లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి ‘సావిత్రి’ నా మనుమరాలే.. ‘మహానటి’లో చిన్నప్పటి సావిత్రిగా నటించింది తన మనుమరాలేనని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆ పాప తన కూతురి కుమార్తె అన్నారు. నిర్మాత స్వప్నదత్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ డేనియల్, సినీ డిస్ట్రిబ్యూటర్ నెక్కంటి రామ్మోహరావు, థియేటర్ల యజ మానులు, మేనేజర్లు, డిస్ట్రిబ్యూటర్ పాల్గొన్నారు. -
సావిత్రి స్వీయ తప్పిదాలే...
సాక్షి, చెన్నై: దిగ్గజ నటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ ఇటు తెలుగులో, ‘నడిగయర్ తిలకం’ పేరుతో అటు తమిళ్లో సూపర్ హిట్ టాక్‌తో ప్రదర్శితమౌతోంది. అయితే సావిత్రి ఎదుగుదల.. పతనాన్ని కూలంకశంగా చూపించిన ఈ చిత్రంపై పలువురు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. తన తండ్రిని చిత్రంలో తప్పుడుగా చూపించారంటూ కమల సెల్వరాజ్(జెమినీ మొదటి భార్య అలమేలు కుమార్తె) మహానటిపై పెదవి విరిచారు. (పూర్తి ఇంటర్వ్యూ కోసం క్లిక్ చెయ్యండి). ఇప్పుడు ఈ చిత్రంపై జెమినీ గణేషన్ సన్నిహితుడు, సీనియర్ నటుడు రాజేష్ కూడా స్పందించారు. సావిత్రి జీవితం అలా అయిపోవటానికి ఆమె స్వీయ తప్పిదాలే కారణమని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘జెమినీ గణేషన్‌కు వివాహం అయిన సంగతి సావిత్రికి తెలుసు. అయినా ఆమె ఆయన్ని ప్రేమించింది. పెళ్లయిన వ్యక్తిని ప్రేమించడం నైతికత కాదన్నది ఆమెకు తెలీదా?. పైగా జెమినీ లైప్ స్టైల్, విలువలు చాలా ప్రత్యేకంగా ఉండేవి. కానీ, అవేవీ పట్టించుకోకుండా సావిత్రి తప్పటడుగు వేసింది. ఆమె జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు జెమినీ గణేషన్‌కు వివాహం చేసుకోవటమే’ అని రాజేష్ వ్యాఖ్యానించారు. ఇక సావిత్రి కూడా పలువురితో సంబంధాలు నడిపారంటూ కమల సెల్వరాజ్ చేసిన వ్యాఖ్యలపై రాజేష్ స్పందించారు. (విబేధాలు కోరుకోవట్లేదు) ‘సావిత్రి వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడలేను. కానీ, ఎంజీఆర్‌తో ఆమె నటించపోవటానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని విషయం మాత్రం తెలుసు’ అని పేర్కొన్నారు. సావిత్రి తాగుడు అలవాటు గురించి ప్రస్తావిస్తూ... ‘ ఉదాహరణకు సమాజంలో హోదా ఉన్న ఓ వ్యక్తి నన్ను తాగమని బలవంతపెడితే నేను తప్పకుండా తాగుతాను. మోడ్రన్ కల్చర్‌లో అదో భాగం. జెమినీ గణేషన్ కూడా సావిత్రిని అలానే ప్రొత్సహించారు. కానీ, ఆమె తాగుడుకు బానిసై పోయారు. అది కూడా ముమ్మాటికీ సావిత్రి తప్పే’ అని రాజేష్ పేర్కొన్నారు. సీనియర్ నటుడు రాజేష్ -
జెమినీ గణేశన్ కుమార్తెల కలయిక
చెన్నై : నటుడు జెమినీ గణేశన్ కుమార్తెలు అందరూ కలిసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన నడిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి విశేష ప్రజాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో తన తండ్రి జెమినీ గణేశన్‌ను వాస్తవాలకు భిన్నంగా చూపించారని ఆయన కుమార్తెల్లో ఒకరైన కమలా సెల్వరాజ్ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తన తండ్రిపై ఓ డాక్యుమెంటరీని నిర్మించనున్నట్లు ప్రకటన చేశారు. కాగా జెమినీ గణేశన్‌కు అలిమేలు, పుష్పవల్లి, సావిత్రి, జూలియాను వివాహం చేసుకున్న విషయం విదితమే. జెమినీ గణేశన్‌కు ఏడుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇక డాక్టర్ జయ శ్రీధర్, డాక్టర్ రేవితి స్వామినాధన్, డాక్టర్ కమలా సెల్వరాజ్, నారాయణి గణేశన్ మొదటి భార్య అలిమేలు కుమార్తెలు. ఇక బాలీవుడ్ నటి రేఖ, రాధా సయ్యద్ ...పుష్పవల్లి కుమార్తెలు కాగా వీరిలో మూడో భార్య సావిత్రి. ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి, కుమారుడు సతీష్. వీరంతా ఒక్క తల్లి బిడ్డలు కాకపోయినా అందరూ అక్కాచెల్లెళ్లుగా ప్రేమాభిమానాలు కురిపించుకుంటారు. ప్రతి ఏడాది ఒక వేడుకలా అందరూ కలుసుకుంటారు. అలాంటి ఒక కలయిక శుక్రవారం రాత్రి చెన్నైలో చోటుచేసుకుంది. ఒకే వేదికపై జెమినీ గణేశన్ ఏడుగురు కుమార్తెలు కలిసి ఉన్న చిత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
‘మహానటి’కి కౌంటర్
ప్రస్తుతం వెండితెరపై బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల మహానటి సినిమాతో ఈ ట్రెండ్ దక్షిణాదిలోనూ ఊపందుకుంది. తాజాగా మరో బయోపిక్ తెరమీదకు రానుంది. అయితే ఆ బయోపిక్ మహానటి కి కౌంటర్‌గా తెరకెక్కుతుండటం విశేషం. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రను తప్పుగా చూపించారని ఆయన కూతురు డాక్టర్ కమల ఆరోపిస్తున్నారు. తన తండ్రి అవకాశాలు రాక సావిత్రి వేదించినట్టుగా తాగుబోతుగా చూపించారని అది నిజం కాదని ఆమో వాదిస్తున్నారు. అంతేకాదు త్వరలో జెమినీ గణేషన్ కథతో ఓ డాక్యుమెంటరినీ రూపొందిస్తున్నట్టుగా కమల వెల్లడించారు. మహానటి వివాదం తెర మీదకు వచ్చిన తరువాత జర్నలిస్ట్ అనుపమా సుబ్రమణియంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మహానటిలో కేవలం ఒక వైపు నుంచి మాత్రమే చూపించారని అందుకే తన తండ్రి అసలు ఎలాంటి వారో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్టుగా తెలిపారు. గంటా నలబై నిమిషాల నిడివితో రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీని చెన్నైతో పాటు హైదరబాద్‌లోనూ మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తామని వెల్లడించారు. -
సావిత్రి గొప్పే.. మా నాన్న కాదా?
పిల్లలకు తండ్రంటే చాలా ప్రేమ ఉంటుంది. ఆ తండ్రి గొప్ప స్టార్ అయితే ఆ ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుంది.‘మహానటి’ సినిమా సావిత్రిని వర్తమానంలోకి తెచ్చింది.అలాగే జెమినీ గణేశన్‌ను కూడా. జెమినీ మీద తెలుగు సమాజంలో ఉన్న అపోహలను ‘మహానటి’ సినిమా దూరం చేసిందని అనుకునేవారు ఇప్పుడు ఉన్నారు. కానీ జెమినీ మొదటి భార్య అలమేలు కుమార్తె కమలా సెల్వరాజ్ మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నారు.ఆమె తరఫు వాదన ఏమిటో విందాం. ► ‘మహానటి’ సినిమా విషయంలో మీ స్పందనలు తెలుస్తున్నాయి. ఆ సినిమా గురించి మీ అభ్యం తరం ఏమిటి? మా నాన్నగారు సావిత్రమ్మను చూసి అసూయ పడినట్లుగా చూపించారు. మా నాన్నగారు పెద్ద స్టార్. శివాజీ గణేశన్, ఎం.జి.ఆర్‌లతో పాటు మా నాన్న కూడా స్టార్డమ్ చూశారు. అలాంటి వ్యక్తి సావిత్రమ్మను చూసి అసూయ పడాల్సిన అవసరం ఉందంటారా? అలాగే సావిత్రమ్మ ఆకర్షణలో మా నాన్నగారు ఆమె వెంట తిరిగినట్లు చూపించారు. సావిత్రిగారు మా నాన్న వెంట తిరిగి ఉండొచ్చు కదా. అలాగే ఆమె మద్యానికి ఎలా బానిసయ్యారో ఎవరూ చెప్పలేరు. అందులో మా నాన్న ప్రమేయం ఉన్నట్టు చూపడం సరికాదు. ► ‘మహానటి’ సినిమా చూసి జెమినీ గణేశన్ మీద అపోహలు తొలిగాయని ఇక్కడ తెలుగు ప్రేక్షకులు అంటున్నారు. అంటే మీ నాన్నను పాజిటివ్‌గా చూపించినట్టే కదా? నిజంగానే మా నాన్నగారు మంచి వ్యక్తే. అన్నేసి లవ్ సీన్స్ తీయడం ఎందుకు? సావిత్రిగారు గొప్ప స్టార్ అని ఎలివేట్ చేశారు. మా నాన్నగారు కూడా పెద్ద స్టార్. అది ఎలివేట్ చేసినట్లు అనిపించలేదు. ఆయనేదో అవకాశాలు తగ్గిపోయి బాధపడినట్లు చూపించారు. అది నిజం కాదు. సావిత్రమ్మను ఆయన మోసం చేయాలని ఏనాడూ అనుకోలేదు. ‘నా భార్య’ అని సమాజానికి చెప్పారు. మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే అసలు పెళ్లి చేసుకునేవారు కాదు. పైగా ఇద్దరు ప్రముఖ వ్యక్తుల జీవితాల గురించి సినిమా తీస్తున్నప్పుడు ఆ ఇద్దరికీ సంబంధించిన వ్యక్తులతో మాట్లాడాలి. సావిత్రమ్మ తరఫున వాళ్ల పిల్లలతో మాట్లాడినట్లే నాన్నగారి తరఫున మాతో మాట్లాడి ఉండాలి. అప్పుడు ఇంకా చాలా విషయాలు చెప్పేదాన్ని. అసలైన నిజాలతో సినిమా ఇంకా బాగా వచ్చి ఉండేది. ► సినిమా విషయంలో మీ ఒపీనియన్ మీది.. సావిత్రిగారి కూతురు విజయ చాముండేశ్వరిగారి ఒపీనియన్ ఆమెది.. ఈ సినిమా మీలో మనస్పర్థలు రావడానికి కారణం అవుతుందా? అస్సలు కాదు. మేమంతా చాలా బాగుంటాం. సినిమా విషయంలో ఎవరి ఒపీనియన్ వాళ్లకు ఉంటుంది. అది మా పర్సనల్ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపించదు. మేమంతా ఎప్పటిలానే బాగుంటాం. ► సావిత్రిగారితో మీకున్న మెమొరీస్ గుర్తు చేసు కుంటారా? సావిత్రి గారిది చాలా లవింగ్, కైండ్ నేచర్. చాలా ఆప్యాయత చూపించేవారు మా మీద. ఎవరికైనా మమ్మల్ని పరిచయం చేసేటప్పుడు నా మొదటి అమ్మాయి, రెండో అమ్మాయి అని మమ్మల్ని పరిచయం చేశాకే వాళ్ల పిల్లల్ని (విజయ చాముండేశ్వరి, సతీష్‌ను) పరిచయం చేసేవారు. నేను మెడికల్ కాలేజ్‌లో చదువుతున్న రోజుల్లో సావిత్రిగారు విజిట్ చేసేవారు. నాకు హెయిర్ కట్ చేసేవారు. కాశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్లారు. ఆ ట్రావెల్‌ని ఎంజాయ్ చేశాం. ఆవిడ నైస్ పర్సన్. ► సావిత్రమ్మగారితో మీ అమ్మ అలమేలుగారి ఈక్వేషన్ గురించి? ఇంట్లో హింసిస్తున్నారంటూ అర్ధరాత్రి సావిత్రిగారు ఏడ్చుకుంటూ మా ఇంటికొస్తే మా అమ్మగారు ఇంట్లోకి రానిచ్చారు. ఏనాడూ ఒక్క మాట అన్నది లేదు. సావిత్రిగారు కూడా మా అమ్మగారంటే ఎంతో అభిమానంగా ఉండేవారు. మా అమ్మకి మేం నలుగురు కూతుళ్లం. పుష్పవల్లి అమ్మకు ఇద్దరు కూతుళ్లు. సావిత్రమ్మకు ఒక కూతురు, కొడుకు. పిల్లలందరం బాగుండేవాళ్లం. మా అమ్మగారు, పుష్పవల్లి అమ్మ, సావిత్రమ్మగారు.. మమ్మల్నందర్నీ సమానంగా చూసేవారు. ► ‘మా నాన్నగారు డిగ్నిఫైడ్ పర్సన్’ అని ఇంతకు ముందు మీరన్నారు. మరి కట్టుకున్న భార్య ఉండగా వేరే అమ్మాయిలతో ఆయన ఎఫైర్స్ గురించి మీరేమంటారు? మా నాన్నగారు కావాలని ఎవరి చుట్టూ తిరగలేదు. ఆయన చాలా హ్యాండ్సమ్ మ్యాన్. బాగా చదువుకున్నారు. స్టార్ హీరో. ఆయన చుట్టూనే అమ్మాయిలు తిరిగేవారు. నాన్నను ప్రేమించినవాళ్లంతా సింగిల్ ఉమన్. పుష్పవల్లిగారు, సావిత్రిగారు.. ఇద్దరూ పెళ్లి కానివాళ్లే. ప్లస్ మా నాన్నగారు తనకు పెళ్లయిన విషయాన్ని ఎవరి దగ్గరా దాచి పెట్టలేదు. పుష్పవల్లి అమ్మను నాన్న పెళ్లి చేసుకోలేదు. ఆమె ద్వారా ఆయనకు ఇద్దరు కూతుళ్లు పుట్టారు. వాళ్లకు ఐడెంటిటీ ఇవ్వడం కోసం తన పిల్లలే అని యాక్సెప్ట్ చేశారు. అంతేకానీ మా నాన్నగారు మ్యారీడ్ ఉమెన్ లైఫ్‌లోకి ఎంటరై, వాళ్ల కాపురాలను నాశనం చేయలేదు. ► సావిత్రమ్మగారిని పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మగారు పడిన బాధ మీకు తెలుసా? అప్పుడు మేం చిన్నపిల్లలం. ఏం జరుగుతుందో తెలియని వయసు. అయితే బాగా ఏడ్చేదని మాత్రం తెలుసు. మా ఇంటి పక్కన విజ్జీయమ్మ అని ఉండేవారు. ఆవిడ దగ్గర చెప్పుకుని బాధపడేవారు. అయితే పిల్లల దగ్గర తన బాధను చెప్పుకోలేదు. ► స్కూల్లో మీ ఇంటి విషయాల గురించి మీ స్నేహితులు అడిగేవారా? అలా జరుగుతుందని అమ్మకు తెలుసు కాబట్టి, ఎవరేం అడిగినా ‘మాకు తెలియదు’ అని చెప్పమన్నారు. ‘మీ నాన్నగారు సావిత్రిని పెళ్లి చేసుకున్నారట?’ అని ఎవరైనా అడిగితే అమ్మ చెప్పమన్నట్లే ‘మాకు తెలియదు’ అనేవాళ్లం. ► విజయ చాముండేశ్వరిగారు మీ అమ్మగారి గురించి కానీ మీ గురించి కానీ ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. తన తండ్రి గురించి కూడా తప్పుగా చెప్పలేదు... అవును. నేనూ ఎవర్నీ విమర్శించడంలేదు. విజ్జీ నన్ను సొంత అక్కలానే అనుకుంటుంది. నేను నా సొంత చెల్లెలిలానే అనుకుంటాను. మాలో మాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. సావిత్రమ్మగారు మమ్మల్ని బాగా చూసినట్లే మా అమ్మగారు కూడా విజ్జీని, తన తమ్ముడు సతీష్‌ని బాగా చూసేవారు. మా అక్క రేవతి పెళ్లప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చారు. అమ్మ నాలుగు గోడల మధ్య పెరిగిన వ్యక్తి. అంత మంది మధ్యలోకి రావడానికి ఆవిడ ఇబ్బందిపడ్డారు. అప్పుడు సావిత్రమ్మే అన్నీ చూసుకున్నారు. చాలామంది రేవతక్క సావిత్రమ్మ కూతురు అనుకున్నారు. ► సావిత్రమ్మగారు చనిపోకముందే విజయ చాముండేశ్వరిగారి పెళ్లి జరిగింది. ఆ తర్వాత సతీష్ మీ ఇంట్లో ఉండేవారట? సావిత్రమ్మగారు చనిపోయాక ‘విజ్జీ అక్కతో ఉంటావా? నాతో పాటు ఉంటావా?’ అని నాన్నగారు సతీష్‌ని అడిగితే.. ‘మీతో ఉంటాను నాన్నా’ అన్నాడు. దాంతో నాన్నగారు మా ఇంటికి తీసుకొచ్చేశారు. మా అమ్మగారు సతీష్‌ని తన సొంత కొడుకులానే చూసుకున్నారు. మేం కూడా మా తమ్ముడనే అనుకున్నాం. సతీష్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నాన్నగారు ఏమీ అనలేదు. సతీష్‌కి కొడుకు పుడితే పుట్టు వెంట్రుకలు తీయించడానికి నేనే పళని గుడికి తీసుకెళ్లాను. మేమంతా అంత బాగుంటాం. ► మరి.. ముంబైలో సెటిలైన నటి రేఖ (పుష్పవల్లి కూతురు)గారితో మీరంతా టచ్‌లోనే ఉన్నారా? మేమంతా నెలకోసారి ఫోన్లో మాట్లాడుకుంటాం. వీలు చేసుకుని ఆర్నెల్లకోసారి కలుస్తాం. ► సావిత్రిగారి ఆస్తుల్ని జెమినీగారు తీసుకున్నారని రూమర్ ఉండేది.. అది నిజం కాదు. నాన్నగారి ఆస్తిని ఆవిడ, ఆవిడ ఆస్తులను నాన్నగారు తీసుకోలేదు. అసలు మా నాన్నగారు తన పేరు మీద ఆస్తులు కొనేవారు కాదు. మా అమ్మ పేరు మీదనో, నానమ్మ పేరు మీదనో కొనేవారు. ► సావిత్రిగారు కోమాలోకి వెళ్లిపోయి ఆస్పత్రిలో చేరే నాటికి ఆవిడకు ఆస్తులు లేవని చాలామంది చెప్పుకుంటారు... ఆవిణ్ణి చాలామంది మోసం చేశారు. నాన్నగారు చెప్పాలని ప్రయత్నిస్తే చాన్స్ ఇవ్వలేదు. ఆయన్ను దగ్గరికి రానివ్వలేదు. బంధువులు కొందరు, ఇంట్లో పని చేసినవాళ్లు కొందరు ఎవరి చేతికి చిక్కినవి వాళ్లు తీసుకెళ్లిపోయారు. ఆవిడ ఆస్పత్రిలో చేరాక మా నాన్నగారు చూసుకోలేదని చాలామంది అంటారు. అది నిజం కాదు. మొత్తం హాస్పిటల్ ఖర్చంతా ఆయనే కట్టారు. ► సావిత్రిగారి అంత్యక్రియలు మీ ఇంట్లోనే జరిగాయి కదా? అవును. మా అమ్మగారు, పుష్పవల్లి అమ్మగారు దగ్గరుండి చేశారు. భర్త బతికి ఉండగా చనిపోయిన స్త్రీ చివరి యాత్ర ఎలా జరుగుతుందో అలా సంప్రదాయానుసారం మా అమ్మ దగ్గరుండి చేయించారు. ► ఫైనల్లీ సావిత్రిగారిలా కీర్తీ సురేశ్ నటన, జెమినీగారిలా దుల్కర్ నటన మీకు నచ్చాయా? కీర్తీ సురేశ్ అచ్చంగా సావిత్రమ్మల్లా మౌల్డ్ అయ్యారు. దుల్కర్ బాగా యాక్ట్ చేశారు. అయితే నాన్నగారు అందగాడు. కళ్లతోనే చెప్పాలనుకున్న విషయాలను కన్వే చేసేవారు. ఆయనలాంటి అందగాడు, నటుడు రారు. ఆయనకు రీప్లేస్మెంట్ లేదు. ► సావిత్రిగారి జీవితం నాశనం కావడానికి ఆవిడే కారణం అంటారా? నా ఒపీనియన్ అదే. ఆమె కొంచెం యారోగెంట్‌గా ఉండేవారు. అలాగని మంచి మనిషి కాదని కాదు. అందరికీ సహాయం చేసేవారు. కానీ మొండి మనిషి. నాన్నతో పాటు ఉన్నప్పుడు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలన్నీ చక్కగా చూసుకునేవారు. ఆయనకు దూరమయ్యాక చుట్టూ ఉన్నవాళ్లు ఆమెను మోసం చేయడం మొదలుపెట్టారు. మోసపోవద్దని చెప్పడానికి వెళ్లిన నాన్నను నానా మాటలు అన్నారు. ఆవిడ జీవితం అలా కావడానికి ఆమే కారణం. ► మీ అక్కాచెల్లెళ్ల గురించి చెబుతారా? మా నాన్నగారు ఎడ్యుకేషన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. మమ్మల్ని బాగా చదివించారు. మేం నలుగురుం బాగా స్థిరపడ్డాం. మా అక్క రేవతి పెద్ద డాక్టర్, నేను కూడా డాక్టర్. చెల్లెలు జయలక్ష్మీ డాక్టర్, చిన్న చెల్లెలు నారాయణి మంచి జర్నలిస్ట్. మా అందరికీ చాలా మంచి పేరుంది. కమలా సెల్వరాజ్, అలమేలు, జెమినీ గణేశన్, రేవతి (పైన) నారాయణి, జయలక్ష్మి నానమ్మ, నాన్న, అమ్మ అలమేలు, ఒళ్లో జయలక్ష్మి (పై వరస) నారాయణి, రేవతిలతో కమల – ఇంటర్వ్యూ: డి.జి. భవాని – కర్టెసీ: సంజయ్, చెన్నై -
మహానటి యూనిట్‌పై జెమినీ కూతురు ఫైర్
-
మహానటి యూనిట్‌పై జెమినీ కూతురు ఫైర్
తమిళసినిమా: నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కించిన ద్విభాషా చిత్రం నడిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) ఇటీవలే తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు సావిత్రి పాత్రలో నటించిన నటి కీర్తీసురేశ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి కూడా చిత్రం బాగుందని ప్రశంసించారు. ఇలాంటి పరిస్థితుల్లో సావిత్రి భర్త జెమినీగణేశన్ కూతురు, ప్రముఖ వైద్యురాలు కమలాసెల్వరాజ్ ఆ చిత్ర యూనిట్‌పై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆమె బుధవారం ఒక వెబ్సైట్ విలేకరితో మాట్లాడుతూ నడిగైయిన్‌తిలగం చిత్రంలో తన తండ్రి జెమినీ గణేశన్‌ను తప్పుగా చిత్రీకరించారంటూ తీవ్రంగా ఆరోపించారు. తన తండ్రికి కళంకం ఆపాదించేలా చిత్రంలో చూపించారని అన్నారు. తన తండ్రి బిజీ నటుడన్న విషయం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. అలాంటిది ఆయన అవకాశాలు లేక ఖాళీగా ఉన్నట్లు చూపించడమేంటని ప్రశ్నించారు. తొలిప్రేమ సావిత్రిపైనేనా? నాన్నకు తొలిసారిగా ప్రేమ కలిగింది సావిత్రి పైనే అనేలా చిత్రీకరించారని, అయితే అంతకు ముందు తన తల్లిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కన్నారని అన్నారు. అంటే తన తల్లిపై ప్రేమ లేకుండానే పెళ్లి చేసుకున్నారా అని ప్రశ్నించారు. నాన్నే సావిత్రికి మద్యం అలవాటు చేశారా? అదే విధంగా తన తండ్రే సావిత్రికి మద్యం సేవించడం అలవాటు చేసిన తాగుబోతుగా చిత్రంలో చూపించడం చూసి తాను దిగ్భ్రాంతికి గురైయ్యానన్నారు. ఈ చిత్రంలో నాన్నను ప్రేక్షకులు అంగీకరించని నటుడిగా చిత్రీకరించారని, అలాంటప్పుడు ఆయనకు ప్రేక్షకులు కాదల్‌మన్నన్ ( ప్రేమరాజు) అనే పట్టం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సావిత్రి ప్రాప్తం చిత్రం చేయడానికి సిద్ధం అయినప్పుడు అంత పెద్ద నటి ఈ రిస్క్ తీసుకోవడం ఎందుకు అని తన తండ్రి వద్దని చెప్పారన్నారు. ఎందరో ప్రముఖ నటులతో నటించిన సావిత్రికి ఆ నటులు సహాయం చేసి కాపాడవచ్చుగా అని అన్నారు. కానీ తన తండ్రే సావిత్రిని కాపాడే ప్రయత్నం చేశారని చెప్పారు. ప్రేమించిన వాళ్లనే పెళ్లి చేసుకున్నారు నాన్న గురించి చెప్పాలంటే తనను ప్రేమించిన వారినే ఆయన పెళ్లి చేసుకున్నారని, పెళ్లయిన వారినెవరిని ఆయన చెడగొట్టలేదని అన్నారు. కుక్కను ఉసిగొల్పి గెంటేశారు ప్రాప్తం చిత్ర నిర్మాణం చేయాలన్న పంతంతో ఉన్న సావిత్రి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని చెప్పడానికి నాన్నతో కలసి తానూ ఆమె ఇంటికి వెళితే తమపై కుక్కను వదిలి గెంటేశారని, తాము కుక్క బారి నుంచి తప్పించుకోవడానికి గోడ దూకి పారిపోవలసి వచ్చిందన్నారు. ఆ సంఘటన తరువాత నాన్న మళ్లీ సావిత్రి ఇంటికి వెళ్లలేదని కమలా సెల్వరాజ్ చెప్పారు. -
సావిత్రీ గణేశుడు
అలనాటి అందాలతార సావిత్రి జీవితంలో కీలక వ్యక్తి తమిళ నటుడు ‘జెమిని’ గణేశన్. సావిత్రి జీవిత కథతో నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ సంస్థ ‘మహానటి’ సినిమా తీయనున్నట్టు ప్రకటించగానే... ‘జెమిని’ గణేశన్ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది? ఎవరు నటిస్తారు? అనే డిస్కషన్ మొదలైంది. తమిళ హీరో సూర్య నుంచి ప్రకాశ్‌రాజ్ వరకు పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరకు, ‘జెమిని’ గణేశన్ పాత్రకు మలయాళ స్టార్ మమ్ముట్టి తనయుడు, మణిరత్నం ‘ఓకే బంగారం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ సల్మాన్‌ను తీసుకున్నారు. తొలుత తెలుగు, తమిళ భాషల్లో తీయాలనుకున్న ఈ సినిమాను ఇప్పుడు మలయాళంతో కలిపి మూడు భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సావిత్రిగా కీర్తీ సురేశ్, జర్నలిస్ట్‌గా సమంత నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే రెండో వారంలో మొదలు కానుంది. అనుష్కను ఈ సినిమాలో కీలక పాత్ర (భానుమతి/జమున?) కు సంప్రదించిన సంగతి తెలిసిందే. -
మహానటి భర్తగా విలక్షణ నటుడు..?
ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ అశ్విన్ చేస్తున్న రెండో సినిమా మహానటి. అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఇప్పటికే సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ను ఫైనల్ చేయగా, కథను నడిపించే జర్నలిస్ట్ పాత్రకు సమంతను తీసుకున్నారు. సావిత్రి సమకాలీన నటి అయిన జమున పాత్రను అనుష్క చేయించాలని భావిస్తున్నారు. అయితే సావిత్రి జీవితంలో కీలకమైన ఆమె భర్త, హీరో జెమినీ గణేషన్ పాత్రను ఎవరితో చేయిస్తారన్న ప్రశ్న చాలా రోజులుగా అభిమానులను వేదిస్తోంది. ఈ పాత్రకు నెగెటివ్ షేడ్స్ కూడా ఉండే అవకాశం ఉండటంతో ఎవరు చేస్తారన్న దానిపై మరింత ఆసక్తి నెలకొంది. ఒక సమయంలో హీరో సూర్య సావిత్రి భర్తగా నటిస్తున్నరన్న టాక్ వినిపించినా.. తరువాత కాదని తేలిపోయింది. తాజాగా ఈ పాత్రకు విలక్షన నటుణ్ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటుడిగా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ మహానటి సినిమాలో సావిత్ర భర్తగా నటించనున్నాడు. ఇప్పటికే దర్శకుడు నాగఅశ్విన్ ప్రకాష్ రాజ్ కు కథ కూడా వినిపించాడు. త్వరలోనే సావిత్రి సినిమాలో పాత్రలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
సావిత్రి భర్తగా స్టార్ హీరో..?
ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ అశ్విన్ తన రెండో ప్రయత్నంగా మహానటి జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అశ్వనిదత్ నిర్మాణంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇప్పటికే సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ను మరో కీలక పాత్రకు సమంతను ఎంపిక చేశారు. అలనాటి మహానటుల పాత్రలను తెర మీద చూపించేందుకు ఆ స్థాయి నటులనే ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సావిత్రి జీవితంలో కీలకమైన ఆమె భర్త, అప్పటి స్టార్ హీరో జెమినీ గణేషన్ పాత్రకు ఓ కోలీవుడ్ స్టార్ హీరోను సంప్రదిస్తున్నారు. కాస్త నెగెటివ్ టచ్ ఉండే ఈ పాత్రను హీరో సూర్యతో చేయించాలని భావిస్తున్నారట. ఎక్కువగా తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న నటులనే ఎంపిక చేసే ప్లాన్ ఉన్న చిత్రయూనిట్ జెమినీ గణేషన్ పాత్రకు సూర్య అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారట. ఇప్పటికే దర్శకుడు నాగఅశ్విన్, సూర్యకు కథ కూడా వినిపించగా, సూర్య మాత్రం తన నిర్ణయం చేప్పలేదని తెలుస్తోంది. త్వరలోనే సినిమాలోని నటీనటుల వివరాలతో పాటు షూటింగ్ షెడ్యూల్ డిటెయిల్స్ ను వెల్లడించనున్నారు. -
కయల్ చంద్రన్‌తో సాట్నాటైటస్
కయల్ చిత్రం ఫేమ్ చంద్రన్‌తో పిచ్చైక్కారన్ చిత్ర నాయకి జత కట్టనున్నారు.ఈ చిత్రం శుక్రవారం ప్రారంభం కానుంది.టు మూవీ బఫ్స్ (2ఎంబీ) పతాకంపై రూపొందనున్న ఈ చిత్ర వివరాలను ఆ సంస్థ అధినేత రఘునాథన్ తెలుపుతూ తాను టెలికామ్ ఇండస్ట్రీలో సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో 12 ఏళ్లు పనిచేశానన్నారు.అయితే సినిమా అన్నది తనకు చిన్నతనం నుంచి ఫ్యాషన్ అన్నారు. ఆ ఆసక్తితోనే టు మూవీ బఫ్స్ సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా అమ్మా క్రియేషన్స్ టి.శివతో కలిసి అధర్వ కథానాయకుడిగా జెమినీగణేశన్ సరుళీ రాజానుమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నానని తెలిపారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే ఇప్పుడు కయల్ చంద్రన్, పిచ్చైక్కారన్ ఫేమ్ సాట్నా టైటస్ జంటగా మరో చిత్రం ప్రారంభించనున్నట్లు తెలిపారు. వ్యాపార దృక్పథంతో మాత్రమే తాను చిత్రాలు తీయనున్నారు. తమ సంస్థ నుంచి జనరంజకమైన చిత్రాలనే అందించాలన్నది తన దృఢ నిశ్చయం అన్నారు. కయల్ చంద్రన్, సాట్నాటైటస్ జంటగా నటించే చిత్రం పూర్తిగా వినోదభరితంగా ఉంటుందన్నారు. నట దర్శకుడు ప్రతాప్‌పోతన్, శ్యామ్, ఇదర్కుదానే ఆశైపడ్డాయ్ బాలకుమారా డాని ముఖ్యపాత్రలు పోషించనున్నారని తెలిపారు. సర్క్యూట్ అనే లఘు చిత్రంతో మంచి పేరును పొందిన సదర్‌ను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాత అమ్మాక్రియేషన్స్ టి.శివ 25 ఏళ్ల సినీ అనుభవం తమకు చాలా హెల్ప్ అవుతోందనే అభిప్రాయాన్ని రఘునాథన్ వ్యక్తం చేశారు. -
హీరో అయిన విలన్
సినిమా చాలా మందికి ప్రేమ, ఆశ, ఆసక్తి అన్నింటికి మించి దాన్ని నమ్ముకున్న వారికి జీవితం. ఇక్కడ స్వశక్తితో ఉన్నత శిఖరాలను అధిష్టించిన వారెందరో, ఇక నటనను నమ్ముకున్న వాళ్లు చాలా మంది కింద స్థాయి నుంచే మన్ననలు అందుకునే స్థాయికి ఎదిగా రు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి పలువురు ప్రతి నా యకుడి పాత్రల నుంచి నా యకుల స్థాయికి చేరి సాధిం చారు.అలాంటి వారి స్ఫూర్తి తో ఇక్కడ తమ ప్రతిభను చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కోవకు చెందిన నటుడిగా రాజ్‌భరత్‌ను చెప్పుకోవచ్చు. అందం, చక్కని పర్సనాలిటీ, మంచి రంగు ఒక హీరోకు కావలసిన అర్హతలన్నీ ఉన్నాయని సీనియర్ నటుడు శివకుమార్ చేతనే ప్రశంసలు, ఆశీస్సులు అందుకున్న ఈయన గొప్ప సినీ నేపథ్యం నుంచి వచ్చిన నటుడు. రాజ్‌భరత్ తండ్రి ప్రఖ్యాత దర్శక, నిర్మాత మల్లియం రాజ్‌గోపాల్. ఈయన దివంగత ప్రఖ్యాత నటుడు శివాజీగణేశన్, జెమినీగణేశన్,శివకుమార్ వంటి నటులతో పలు చిత్రాలు చేశారు. ఇప్పుడు రాజ్‌గోపాల్ వారసుడుగా రాజ్‌భరత్ నటనను వృత్తిగా ఎంచుకున్నారు. శశి దర్శకత్వం వహించిన 555 చిత్రం ద్వారా ప్రతినాయకుడిగా చిన్న పాత్ర ద్వారా తెరంగేట్రం చేసిన రాజ్‌భరత్ గ్రోత్ దినదినాభివృద్ధి చెందుతుందనే చెప్పాలి. మిష్కిన్ దర్శకత్వంలో ఓనాయుమ్ ఆటుకుట్టియుమ్ చిత్రంలో మెరుగైన విలనీయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.తదుపరి ప్రమోషన్‌గా ఆంధ్రామెస్ చిత్రంలో కథానాయకుడి అవతారం ఎత్తా రు. ఈ చిత్రం విడుదలకు ముందే నట్పధికారం 79 చి త్రంలో హీరోగా నటించారు.చాలా మంది విషయంలో జరిగినట్లుగానే రాజ్‌భరత్ హీరోగా నటించిన తొలి చి త్రం కంటే ముందుగా రెండో చిత్రం విడుదల కానుంది. ఆయన నటించిన నట్పధికారం 79 చిత్రం ఈ నెల 11న తెరపైకి రానుంది.ఈ సందర్భంగా ఆయన్ని పలకరించగా నట్పధికారం చిత్రంలో నటించడం మంచి అనుభవం అన్నారు.ఇంకా చెప్పాలంటే రవిచంద్రన్ దర్శకత్వంలో నటించడమే గొప్ప అవకాశంగా పేర్కోన్నారు.ఆయన ఇంతకు ముందు కన్నెదిరే తోండ్రినాళ్ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమేనని,అలాంటి స్నేహం ఇది వృత్తంగా మరో కోణంలో రూపొందిన చిత్రం నట్పధికారం 79 చిత్రం అని తెలిపారు. ఈ చిత్రానికి సహయ దర్శకుడిగా ప్రారంభించి కథానాయకుడిగా నటించే వరకూ తన భాగం ఉందన్నారు.కారణం దర్శకుడు రవిచంద్రన్‌తో ఉన్న అనుబంధమేనని చెప్పారు.చిన్న ఎమోషన్‌తో కూడిన ఈ చిత్రం జనరంజకంగా ఉంటుందని తెలిపారు. నటి రేష్మీమీనన్, తేజస్విని కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించే అవకాశం ఉందా?అన్న ప్రశ్నకు అనువాదంగా కాదుగానీ రీమేక్ అయ్యే అవకాశం ఉందని బదులిచ్చారు.కారణం ఇది యూనివర్సల్ కన్టెంట్తో రూపొందిన కథా చిత్రం అని ఆయన తెలిపారు.రాజ్‌భరత్ నటించిన మరో చిత్రం జీరో కూడా త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. -
జెమినీ గణేశన్‌లో లక్ష్మీమీనన్
కోలీవుడ్‌లో లక్కీ హీరోయిన్ అంటే లక్ష్మీమీనన్‌నే. తొలి చిత్రం కుంకీ నుంచి ఇటీవల తెరపైకొచ్చిన వేదాళం వరకూ వరుసగా విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఏకైక నటి లక్ష్మీమీనన్. విక్రమ్‌ప్రభు, విమల్ లాంటి వర్ధమాన హీరోలతో అయినా, విశాల్, కార్తీ, అజిత్ లాంటి స్టార్ హీరోలతో అయినా లక్ష్మీమీనన్ నటించిందంటే ఆ చిత్రం హిట్టే అన్నంతగా పేరు సంపాదించుకుందీ మలయాళీ కుట్టి. నటిగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు చదువుకోవాలంటూ నటనకు గ్యాప్ ఇచ్చి ప్లస్‌టూ పరిక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది. ఆ గ్యాప్ తన నట జీవితాన్ని దెబ్బ తీస్తుందని ఏమాత్రం భయపడలేదు.అలాగే కథానాయకిగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న సమయంలో వేదాళం చిత్రంలో అజిత్‌కు చెల్లెలిగా నటించే అవకాశం వస్తే వెనుకా ముందు ఆలోచించకుండా ఆ పాత్ర చేయడానికి సమ్మతం చెప్పేసింది. అయినా లక్ష్మీమీనన్ కెరీర్‌కు వచ్చిన డోకా ఏమీలేదు. ఇప్పుడామె హీరోయిన్గా బిజీ అవుతోంది. ప్రస్తుతం జయంరవి సరసన మిరుదన్ చిత్రంలో నటిస్తోంది. కాగా తాజాగా జీవాతో రొమాన్స్ చేసే అవకాశం లక్ష్మీమీనన్‌ను వరించింది. ఇంతకు ముందు ఈ చిత్రంలో నటి తమన్న నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు నటి లక్ష్మీమీనన్‌ను ఎంపిక చేశారు. పీటీ.సెల్వకుమార్ నిర్మించనున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు ముత్తుకుమార్ దర్శకత్వం వహించనున్నారు.దీనికి జెమినీగణేశన్ అనే పేరును నిర్ణయించారు.ఇది రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం అని అంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. జీవా ప్రస్తుతం పోకిరిరాజా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత జెమినీగణేశన్ చిత్రంలో పాల్గొననున్నారు. -
జెమినీ గణేశన్ పేరుతో చిత్రం
తమిళసినిమా: ప్రఖ్యాత నటుల పేర్లతో చిత్రాలు రావడం అన్నది అరుదైన విషయమే. ఆ మధ్య విశాల్ నటించిన చిత్రానికి ఎంజీఆర్ అనే టైటిల్ నిర్ణయించగా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మదగజరాజా అనే పేరును మార్చాల్సి వచ్చింది. నంబియార్ పేరుతో ఒక చిత్రం తెరకెక్కింది. ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్ పేరుతో ఒక హిందీ అనువాద చిత్రానికి రజనీకాంత్ అంగీకరించకపోవడంతో ఆ చిత్రం విడుదల నిలిచిపోయింది. ఇప్పుడు ప్రఖ్యాత నటుడు జెమినీగణేశన్ పేరుతో ఒక చిత్రం తెరకెక్కడానికి సిద్ధమవుతోంది. ఈ టైటిల్‌కు జెమినీగణేశన్ కుటుంబం నుంచి అనుమతి లభించినట్లు దర్శకుడు ముత్తుకుమార్ తెలిపారు. ఈయన దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నటుడు జీవా హీరోగా టైటిల్ పాత్రను పోషించనున్నారట. త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని దర్శకుడు వెల్లడించారు. నటుడు జీవాకు వరుస అపజయాలు ఎదురవ్వడంతో చిన్న గ్యాప్ తీసుకుని వరుసగా చిత్రాలను అంగీకరిస్తున్నారు. నయనతారతో నటిస్తున్న తిరునాళ్ షూటింగ్ తుది దశకు చేరుకుంది. కవలెవైండామ్, కో చిత్రాల టీమ్‌తో మరోసారి కలిసి నటించనున్నారు. ఇకపై వరుసగా తన చిత్రాల విడుదలకు జీవా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. -
జెమినీ గణేశన్‌గా..!
‘లవర్ బోయ్’ ఇమేజ్ను సొంతం చేసుకున్న అలనాటి హీరోల్లో ‘జెమినీ’ గణేశన్ ఒకరు. ఒకప్పుడు తమిళంలో హీరోగా ఓ రేంజ్లో దూసుకెళ్లిన ఆయన చనిపోయి పదేళ్లయినా, ఇప్పటికీ గుర్తుండిపోతారు. ఇప్పుడు జెమినీ గణేశన్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ఆయన పాత్రను చేసే అవకాశం యువ హీరో చేతన్ చీనూకి దక్కింది. ఇటీవల విడుదలైన ‘మంత్ర 2’లో నటించిన చేతన్ ప్రస్తుతం ‘రాజుగారి గది’, ‘చెక్‌పోస్ట్’ చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళంలో జెమినీ గణేశన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘కాదల్ మన్నన్ జెమిని గణేశన్’ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈరోజు జరుపుకుంటున్న తన పుట్టినరోజుకి ఈ చిత్రం ఓ మంచి కానుక అవుతుందని చేతన్ చెప్పారు. -
జెమినీ గణేశన్‌గా నటిస్తున్నా..
యువ హీరో చేతన్ శ్రీను రాజమండ్రి: తమిళంలో హీరో జెమినీగణేశన్ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆయన పాత్రలో నటిస్తున్నానని, అదో అరుదైన అనుభూతి అని యువహీరో చేతన్ శ్రీను తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగువాడిగా, తెలుగు గడ్డపై పేరు తెచ్చుకోవాలన్నది తన తాపత్రయమని, ఇకపై ఏడాదికి నాలుగు తెలుగు సినిమాలు, ఒక తమిళ సినిమా చేయాలనుకుంటున్నాని అన్నారు. ఇటీవల విడుదలైన ‘మంత్ర-2’లో తన పాత్రకు జిల్లా అంతటా మంచి స్పందన వచ్చిందన్నారు. బాపు దర్శకత్వం వహించిన ‘పెళ్ళిపుస్తకం’ వంటి కుటుంబ కథాచిత్రాలలో చేయాలని కోరుకుంటున్నానన్నారు. తాను నటించిన ‘రాజుగారి గది’ త్వరలో విడుదలవుతుందన్నారు. అయిదుగురు హీరోయిన్లు నటించే ఒక భారీ తెలుగు సినిమాలో హీరోగా నటించబోతున్నానని, వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. తమిళంలో కూడా భారీ సినిమా చేస్తున్నానన్నారు. తెలుగు ప్రేక్షకులు ప్రోత్సహించాలని కోరారు. విలేకరుల సమావేశంలో నిర్మాతలు ఇడుపుగంటి శేషగిరి, గార్లపాటి సూర్యనారాయణ పాల్గొన్నారు. -
క్లయిమాక్స్‌లో రామానుజన్
గణిత శాస్త్రమేధావి రామానుజన్ జీవిత కథ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రామానుజన్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి జ్ఞాన రాజశేఖరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు పెరియార్, భారతీ వంటి నాయకుల జీవిత కథలను తెరపై ఆవిష్కరించారు. దివంగత నటుడు జెమిని గణేశన్ మనవడు అభినయ్ రామానుజన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన భార్యగా ప్రముఖ కన్నడ, మల యాళ నటి భామ నటిస్తున్నారు. సుహాసిని, అబ్బాస్, శరత్ బాబు, నిళల్గల్ రవి తదితరులు నటిస్తున్నారు. చిత్ర విశేషాలను దర్శకుడు తెలుపుతూ రామానుజన్ ప్రఖ్యాత గణితశాస్త్ర మేధావి అన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయితే అలాంటి కీర్తి గడించిన వ్యక్తి తొలి రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు ఆ తరువాత ప్రపంచం ఆయన గణిత శాస్త్ర ప్రావీణ్యాన్ని గుర్తించడం తదితర పలు ఆసక్తికరమైన సంఘటనల సమాహారంగా రామానుజన్ చిత్రం ఉంటుందన్నారు. చిత్రంలోని చాలా సన్నివేశాలను లండన్‌లో చిత్రీకరించినట్లు తెలిపారు. చిత్రంలో చాలా మంది తమిళం తెలిసిన అమెరికన్లు నటించడం విశేషం అని చెప్పారు. తమిళం, ఆంగ్ల భాషల్లో రూపొం దిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి షెడ్యూల్ జరుపుకుంటుందని చెప్పారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
జెమినీ గణేషన్ బాటలో పవన్ కళ్యాణ్!
టాలీవుడ్ లో రికార్డులను సృష్టించడంలో పవన్ కళ్యాణ్ తనకు తానే సాటి అనడం సందేహం అక్కర్లేదు. అయితే పెళ్లిళ్ల విషయంలో తమిళ నటుడు జెమినీ గణేషన్ ఫాలో అవుతున్నాడా అంటే అవునే చెప్పవచ్చు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేషన్ కు ధీటుగా హీరోగా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న జెమినీ గణేషన్ బాలీవుడ్ తార రేఖ తండ్రి. తమిళ తెరకే కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమకు సుపరిచితుడైన రామస్వామి గణేశన్ ఉరఫ్ జెమిని గణేశన్ ప్రముఖ నటి సావిత్రికి భర్త. ఓ దశలో ఎంజీ రాంచంద్రన్ యాక్షన్ చిత్రాలతో దూసుకుపోతుంటే.. తమిళ రంగంలో 'కాదల్ మన్నన్ (కింగ్ ఆఫ్ రొమాన్స్)'గా పేరును సొంతం చేసుకున్నారు. తెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా జెమినీ గణేషన్ కింగ్ రొమాన్స్ గా మారి నాలుగు పెళ్లిళ్లతో తనదైన మార్కును సొంతం చేసుకున్నారు. జెమినీ గణేషన్ తొలుత అలమేలును పెళ్లి చేసుకున్నాడు. ఆతర్వాత పుష్పవల్లి వివాహ మాడారు. పుష్పవల్లి, జెమినీ గణేషన్ కూతురే రేఖ. తమిళ తెరపైన జెమినీ,సావిత్రిల జంటకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. అయితే సావిత్రితో సాగించిన ప్రేమాయణ జెమినీ గణేషన్ మూడోపెళ్లికి దారి తీసింది. ఆతర్వాత సావిత్రితో విబేధాలు తలెత్తడంతో ఇద్దరు విడిపోయారు. ఆతర్వాత జెమినీ గణేషన్ తన 79వ ఏట విదేశీ వనిత జూలియానా యువతిని పెళ్లాడి..కుటుంబాన్ని, స్నేహితుల్ని, సినీ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. జెమినీ గణేషన్ జీవితంలో మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం మూడో పెళ్లి చేసుకుని అభిమానులను మీడియాను, అభిమానులను ఆశ్చర్యానికి లోను చేశారు. గతంలో పవన్ విశాఖ చెందిన నందినిని మొదట పెళ్ళి చేసుకున్నాడు. ఆ తర్వాత బద్రి సినిమాలో హీరోయిన్గా నటించిన రేణుదేశాయ్‌తో సహజీవనం చేసి ....ఓ కుమారుడు పుట్టిన తర్వాత చట్టబద్దంగా వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి అకీరాతో పాటు ఓ పాప కూడా ఉన్నారు. అయితే కొంతకాలం నుండి పవన్, రేణు దేశాయ్ వేర్వేరుగా ఉంటున్నారు. పవన్‌కళ్యాణ్ ముచ్చటగా మూడోసారి పెళ్ళి చేసుకున్న ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్30న ఎర్రగడ్డ సబ్‌రిజిస్టార్ ఆఫీస్‌లో పవన్-అన్నా లెజ్నోవా ( డానా మార్క్స్) రిజస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలిసింది. పవన్‌కు రష్యన్ మోడల్ అయిన దానా మార్క్స్ తో 'తీన్మార్' చిత్రం సమయంలో ప్రేమ చిగురించిందని చెబుతున్నారు. ప్రేమ, పెళ్లిళ్ల వ్యవహారంలో జెమినీ గణేషన్, పవన్ కళ్యాణ్ కు దగ్గరి పోలీకలు కనిపిస్తున్నాయి.