కయల్ చంద్రన్‌తో సాట్నాటైటస్ | satna titus Kayal Chandran tamil up in Gemini Ganesan movie | Sakshi
Sakshi News home page

కయల్ చంద్రన్‌తో సాట్నాటైటస్

Published Thu, Jul 14 2016 1:59 AM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

కయల్ చంద్రన్‌తో సాట్నాటైటస్

కయల్ చంద్రన్‌తో సాట్నాటైటస్

 కయల్ చిత్రం ఫేమ్ చంద్రన్‌తో పిచ్చైక్కారన్ చిత్ర నాయకి జత కట్టనున్నారు.ఈ చిత్రం శుక్రవారం ప్రారంభం కానుంది.టు మూవీ బఫ్స్ (2ఎంబీ) పతాకంపై రూపొందనున్న ఈ చిత్ర  వివరాలను ఆ సంస్థ అధినేత రఘునాథన్ తెలుపుతూ తాను టెలికామ్ ఇండస్ట్రీలో సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో 12 ఏళ్లు పనిచేశానన్నారు.అయితే సినిమా అన్నది తనకు చిన్నతనం నుంచి ఫ్యాషన్ అన్నారు.
 
 ఆ ఆసక్తితోనే టు మూవీ బఫ్స్ సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా అమ్మా క్రియేషన్స్ టి.శివతో కలిసి అధర్వ కథానాయకుడిగా జెమినీగణేశన్ సరుళీ రాజానుమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నానని తెలిపారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే ఇప్పుడు కయల్ చంద్రన్, పిచ్చైక్కారన్ ఫేమ్ సాట్నా టైటస్ జంటగా మరో చిత్రం ప్రారంభించనున్నట్లు తెలిపారు. వ్యాపార దృక్పథంతో మాత్రమే తాను చిత్రాలు తీయనున్నారు. తమ సంస్థ నుంచి జనరంజకమైన చిత్రాలనే అందించాలన్నది తన దృఢ నిశ్చయం అన్నారు.
 
  కయల్ చంద్రన్, సాట్నాటైటస్ జంటగా నటించే చిత్రం పూర్తిగా వినోదభరితంగా ఉంటుందన్నారు. నట దర్శకుడు ప్రతాప్‌పోతన్, శ్యామ్, ఇదర్కుదానే ఆశైపడ్డాయ్ బాలకుమారా డాని ముఖ్యపాత్రలు పోషించనున్నారని తెలిపారు. సర్క్యూట్ అనే లఘు చిత్రంతో మంచి పేరును పొందిన సదర్‌ను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాత అమ్మాక్రియేషన్స్ టి.శివ 25 ఏళ్ల సినీ అనుభవం తమకు చాలా హెల్ప్ అవుతోందనే అభిప్రాయాన్ని రఘునాథన్ వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement