Satna Titus
-
'నీవెవరు ?' అంటూ వస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్..
Satna Titus Starrer Who Are You Movie Shooting Started In Hyderabad: సురేష్ సపవత్, సత్నా టైటస్ హీరో హీరోయిన్లుగా వైకుంఠ్ బోణు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హు ఆర్ యు?’. బొక్కిశం భూలక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి ప్రియా నాయుడు క్లాప్ ఇవ్వగా, లలిత కెమెరా స్విచాన్ చేశారు. వైకుంఠ్ బోణు మాట్లాడుతూ- ‘‘సస్పెన్స్ క్రైమ్ డ్రామా నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ మా సినిమా వాటికి భిన్నంగా ఉంటుంది. కుటుంబ నేపథ్యంతో ముడిపడిన ఓ భిన్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది.’’ అని అన్నారు. అలాగే బిచ్చగాడు సినిమాతో ఆకట్టుకున్న హీరోయిన్ సత్నా టైటస్, హీరో సురేష్‌లో జోడీ ఆకట్టుకునేలా ఉంటుంది. నీవెవరు ? అని ఇందులో ఎవరు ఎవరిని ప్రశ్నించారనేది ఆసక్తికరంగా ఉంటుంది. అని డైరెక్టర్ వైకుంఠ్ బోణ్ తెలిపారు. ‘‘ప్రియా నాయుడు మంచి కథ అందించారు. మంచి టీమ్ కుదిరింది. ఏకధాటిగా సినిమా చిత్రీకరణను ప్లాన్ చేశాం’’ అని నిర్మాత భూలక్ష్మి పేర్కొన్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రహకుడిగా సురేష్ గొంట్ల పనిచేయగా శ్రీనివాస్ తేజ సంభాషణలు రాశారు. -
నిర్మాతలకు దండం పెట్టాలనిపించింది..
‘‘నీదీ నాదీ ఒకే కథ’ టైటిల్ విని ఈరోజుల్లో ఇటువంటి సినిమాలు ఎవరు చూస్తారులే అనుకున్నా. రివ్యూస్ చూశాక సినిమా చూడాలనిపించింది. ఈ సినిమా చూశాక నా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇంత మంచి సినిమా నిర్మించిన నిర్మాతలకు దండం పెట్టాలనిపించింది’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. శ్రీ విష్ణు, సాట్నా టైటస్ జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించిన ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. చిత్ర సమర్పకుడు నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘మా ఆరాన్ మీడియా వర్క్స్ బేనర్లో కొత్తదనం ఉన్న కథలతో మరిన్ని సినిమాలు వస్తాయి. ఈరోజుల్లో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు? అని చెప్పారు. అయినా నా డబ్బు, నా ఇష్టం. నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘నా సినిమాలకు వేణు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయడానికి నాలాంటి దర్శకులందరికీ కొత్త ఉత్సాహాన్ని కలిగించిన చిత్రమిది’’ అన్నారు దర్శకుడు మదన్. ‘‘సినిమా చూస్తున్నంత సేపు నాకు దర్శకుడు వేణు, శ్రీవిష్ణులే కన్పించారు’’ అన్నారు దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి. ‘‘సినిమా చూస్తున్నంత సేపు నాకు బాలచందర్‌గారే గుర్తుకొచ్చారు’’ అని దర్శకుడు వీఎన్ ఆదిత్య అన్నారు. ‘‘ఈ సినిమా చేయకపోయుంటే జీవితంలో ఒక గొప్ప గౌరవాన్ని మిస్ అయ్యేవాణ్ణి’’ అన్నారు దేవిప్రసాద్. ‘‘ప్రతి ఒక్కరూ ఇది నా కథ, మా ఇంట్లో జరిగిన కథ అని ఓన్ చేసుకుంటున్నారు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘రివ్యూస్ బాగున్నాయి. కొన్ని విమర్శలూ ఉన్నాయి. అవన్నీ సరిదిద్దుకొని తర్వాత ఓ మంచి సినిమా తీయడానికి కృషి చేస్తా’’ అన్నారు వేణు ఊడుగుల. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, కెమెరామెన్ రాజ్ తోట, ఎడిటర్ బొంతల నాగేశ్వరరెడ్డి, శ్రీ వైష్ణవి క్రియేషన్స్ అధినేత నారాయణరావు, నిర్మాతలు రాజ్ కందుకూరి, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘నీదీ నాదీ ఒకే కథ’ మూవీ రివ్యూ
టైటిల్ : నీదీ నాదీ ఒకే కథ జానర్ : ఫ్యామిలీ డ్రామా తారాగణం : శ్రీ విష్ణు, సాట్నా టిటస్, దేవీ ప్రసాద్, పోసాని కృష్ణ మురళీ సంగీతం : సురేష్ బొబ్బిలి దర్శకత్వం : వేణు ఊడుగుల నిర్మాత : నారా రోహిత్, ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణరావు అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో లాంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు.. లీడ్ రోల్ లో తెరకెక్కిన తాజా చిత్రం నీదీ నాదీ ఒకే కథ. మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చదువులు, ర్యాంకుల కోసం పరుగులు, పరువు ప్రతిష్టల కోసం తల్లిదండ్రులు పిల్లలను పెట్టే ఇబ్బందులు ప్రధానంగా ప్రస్థావించారు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా శ్రీ విష్ణుకు మరో విజయాన్ని అందించిందా..? కథ : రుద్రరాజు దేవీ ప్రసాద్ (దేవీ ప్రసాద్) ప్రొఫెసర్. ఉన్నత మైన చదువు చదుకొని సమాజంలో పరువు ప్రతిష్ట ఉన్న మధ్య తరగతి తండ్రి. తన కొడుకు జీవితంలో మంచి స్థాయిలో సెటిల్ అవ్వాలని తపన పడే తండ్రి. సాగర్ (శ్రీ విష్ణు) డిగ్రీ మూడు సార్లు ఫెయిల్ అయ్యి తన చెల్లెలితో కలిసి మళ్లీ ఎగ్జామ్స్ రాసే కుర్రాడు. జీవితం మీద, భవిష్యత్తు మీద క్లారిటీ లేకుండా టైం పాస్ చేసేస్తుంటాడు. కానీ తండ్రి బాధ తెలుసుకున్న సాగర్ ఎలాగైనా తండ్రి కోరుకున్నట్టుగా మారాలని ప్రయత్నిస్తాడు. అందుకోసం ధార్మిక (సాట్నా టిటస్) సాయం తీసుకుంటాడు. కానీ ఈ ప్రయత్నాల్లో తనని తాను కోల్పోవడం ఇష్టం లేక.. తండ్రి ఆశించినట్టుగా మారలేక నలిగిపోతుంటాడు. చివరకు సాగర్.. తండ్రి కోరుకున్నట్టుగా మారాడా..? లేక తనలాగే తాను ఉండిపోయాడా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : సినిమా అంతా తండ్రీ కొడుకుల మధ్యే నడిచే కథ కావటంలో ప్రధానం గా రెండు పాత్రలే తెరమీదే కనిపిస్తుంటాయి. జీవితంలో ఏది సాధించలేననే నిరుత్సాహంలో బతికే కుర్రాడిగా శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడు. తన కొడుకు జీవితంలో ఉన్నతంగా సెటిల్ అవ్వాలన్న తండ్రి కోరిక నేరవేర్చలేక.. తనని తాను కోల్పోలేక సతమతమ్యే పాత్రలో మంచి భావోద్వేగాలను పండించాడు. తొలిసారిగా తెరపైన కనిపించిన దర్శకుడు దేవీ ప్రసాద్.. నటుడిగానూ మంచి మార్కులు సాధించాడు. మధ్య తరగతి మనుషుల మనస్థత్వాలకు, ఆలోచనలకు, ఆశలకు ప్రతిరూపంగా నటించి మెప్పించారు. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సాట్నా టిటస్కు ఈ సినిమాలో కూడా నటనకు ఆస్కారమున్న పాత్రే దక్కింది. ఫస్ట్ హాఫ్‌లో నవ్వించే ప్రయత్నం చేసిన సాట్నా.. ద్వితీయార్థంలో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో మంచి నటన కనబరిచింది. విశ్లేషణ : మధ్య తరగతి కుటుంబాల్లో ప్రతీ ఇంట్లోను ఉండే సమస్యలనే కథా వస్తువుగా తీసుకున్న దర్శకుడు వేణు ఊడుగుల తొలి ప్రయత్నంలోనే మంచి విజయం సాధించాడు. ప్రతీ ప్రేక్షకుడు ఏదో ఒక సన్నివేశంలో ఇది నా కథే అనిపించేలా ఉంది కథనం. ప్రస్తుత సమాజంలో అందరు మనుషులు ముసుగులు వేసుకునే బతుకున్నారన్న అంశాన్ని మనసుకు హత్తుకునేలా ప్రజెంట్ చేశాడు. పోటీ ప్రపంచంలో ర్యాంకుల కోసం, పరువు ప్రతిష్టల కోసం తల్లిదండ్రులు పిల్లలను ఎంత ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఆ ఒత్తిడి వల్ల పిల్లలు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారన్న అంశాలను బలమైన ఎమోషనల్ సీన్స్‌తో తెర మీద ఆవిష్కరించాడు.. సంగీతం కూడా సినిమాకు తగ్గట్టుగా కుదిరింది. ఎక్కడ కమర్షియల్ లెక్కల కోసం పాటలను ఇరికించకుండా ప్రతీ పాట కథలో భాగంగా వచ్చిపోతుంటాయి. సినిమాకు మరో ప్రధానబలం నేపథ్య సంగీతం. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి తన నేపథ్య సంగీతంతో కథలోని భావోద్వేగాలను మరింతగా ఎలివేట్ చేశాడు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథా కథనం శ్రీ విష్ణు నటన సంగీతం మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
ఈ సినిమా కొనాలనుకున్నా – శర్వానంద్
‘‘నీది నాది ఒకే కథ’ ట్రైలర్ చూడగానే మార్నింగ్ షో చూడాలనిపించింది. ఈ సినిమాను నేను కొనుక్కుంటే బావుంటుందనిపించి విజయ్‌కి కాల్ చేస్తే, అప్పటికే బిజినెస్ పూర్తయ్యింది. మంచి సినిమాను మిస్ చేసుకున్నానే అనిపిస్తోంది’’ అన్నారు హీరో శర్వానంద్. శ్రీ విష్ణు, సాట్నా టైటస్ జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’. ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణ రావు నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో దర్శకుడు దేవీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘చాలామంది అడిగినా నటించలేదు. ఈ కథ నచ్చి, చేశా. హీరో తర్వాత అంత ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ నాదే’’ అన్నారు. ‘‘కథ విన్నప్పుడు ‘ఏంట్రా ఇదేదో నా స్టోరీలాగే ఉందే’ అనిపించింది. నా జీవితాన్ని ఎప్పుడైనా సినిమాగా చూసుకోవాలంటే ఈ చిత్రం చూసుకోవచ్చని చేశా. ఒక అమ్మాయి వెంటపడి ప్రేమ కోసం ఒప్పించేటప్పుడు.. జీవితం కోసం ఎంత ఒప్పించాలని చెప్పేదే ఈ సినిమా’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘ఈ చిత్రం ట్రైలర్ చూడగానే పెద్ద హిట్ అవుతుందనే వైబ్రేషన్ కలిగింది. ‘ఆకలిరాజ్యం’ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ గుర్తుండిపోయింది. మరోసారి ఆ చిత్రాన్ని గుర్తుకు తెచ్చిన సినిమా ఇది’’ అని దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ – ‘‘ఇంటర్ చదివే రోజుల్లో నా ఫ్రెండ్ బాస్కెట్ బాల్ ప్లేయర్ అవ్వాలనుకుంటే ఇంట్లో ఒప్పుకోలేదు. దాంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యాడు. అలాంటివాళ్ల గురించి చెప్పే చిత్రమిది’’ అన్నారు. -
‘నా కథలా కూడా అనిపిస్తుంది’
యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం నీదీ నాదీ ఒకే కథ. మధ్య తరగతి మనుషుల జీవితం కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల సినీ ప్రముఖుల కోసం స్పెషల్ ప్రీమియర్‌ను నిర్వహించారు చిత్రయూనిట్. ఈ షో చూసిన దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు. తాజాగా యంగ్ హీరో నాని కూడా ఈ సినిమాపై స్పందించారు. సినిమా ట్రైలర్‌ను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన నాని... ‘ఇది నా కథలా కూడా అనిపిస్తుంది. శ్రీ విష్ణు నటనలో అతను ఎంత మనసుపెట్టి పర్ఫామ్ చేశాడో తెలుస్తోంది. అతనికి అతని టీంకు నా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు నాని. This looks like my Katha too .. there’s a lot of heart in sree vishnu’s performance .. wishing him and his team all the very best :)#NeedhiNaadhiOkeKatha https://t.co/hoisBjLIFl — Nani (@NameisNani) 22 March 2018 -
ఆ మాట అనిపించుకోకూడదు
‘‘చదువు సరిగ్గా రాని కుర్రాడి జీవితంలో చదువు పూర్తయినప్పటి నుంచి సెటిలయ్యే వరకు ఏం జరిగిందన్నదే ‘నీది నాది ఒకే కథ’. వేణుగారు ఫుల్ క్లారిటీతో మంచి సినిమా తీశారు’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు, సాట్నా టైటస్ జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’. ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నా క్యారెక్టర్ని చూసి, చాలామంది కుర్రాళ్లు వాళ్లను వాళ్లు చూసుకుంటున్నట్లుగా భావిస్తారు. జీవితంలో కీలక సమయాల్లో సొసైటీ గురించి ఆలోచిస్తాం. కానీ, సొసైటీ మనకేమీ చేయదు. అందుకే.. అన్ని సందర్భాల్లో సమాజం గురించి ఆలోచించి, మన ఇష్టాయిష్టాలను చంపేసుకోవాల్సిన అవసరం లేదని మా చిత్రంలో చెబుతున్నాం. దర్శకులు దేవి ప్రసాద్‌గారు నా తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన పాత్రతో పెద్దవాళ్లు కనెక్ట్ అవుతారు. ఆయన ఓ డైరెక్టర్లా కాకుండా మాతో ఓ నటుడిలా కలిసిపోయారు. ఆయన పాత్ర చూసి థ్రిల్ అవుతారు. మాస్ హీరో అయిపోవాలనే ఆలోచనతో ఇలాంటి పాత్రలు ఎంచుకోవడం లేదు. కథ నచ్చే ఒప్పుకుంటున్నా. అయినా.. మాస్ హీరో అవ్వడం చాలా కష్టం. ఈ చిత్రంలో డోగ్మే 95 టెక్నిక్ వాడారు. అది 1995 టెక్నిక్.తక్కువ బడ్జెట్లో సినిమా తీయడం ఎలా అనేది అందులో మెయిన్. ట్రాలీలు, జిమ్మీలు, సెట్లు వంటివి లేకుండా చాలా తక్కువలో సినిమా చేశాం. ఆ టెక్నిక్ వాడి తెలుగులో తీసిన మొదటి సినిమా మాదే. ఒకే తరహా సినిమాలు, పాత్రలు చేస్తే ‘వీడు ఒకే టైప్ క్యారెక్టర్స్ చేస్తున్నాడ్రా’ అంటారు. ఆ మాట అనిపించుకోకూడదన్నదే నా ప్రయత్నం. అందుకే డిఫరెంట్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు వెంకటేష్‌గారంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ‘వీరభోగ వసంతరాయలు’ సినిమా చేస్తున్నాను. తర్వాత ‘అసుర’ దర్శకుడితో ‘తిప్పరా మీసం’ చేస్తా. ఆ తర్వాత కొత్త డైరెక్టర్‌తో ఓ పోలీస్ స్టోరీ చేయనున్నా’’ అన్నారు. -
ఇద్దరిదీ ఒకే కథ
‘నువ్వు ఆత్మన్యూనతా భావంతో బాధ పడుతున్నావ్.. అయ్యో.. ఇదేదో బ్లడ్ క్యాన్సరో, మౌత్ క్యాన్సరో కాదు కదా అండీ?.. దానికన్నా పెద్దది’... ‘పాన్‌షాపు వాడిది బతుకు కాదా? కొబ్బరి బోండాలు అమ్ముకునేవాడిది ఓ బతుకు కాదా? మెకానిక్ షెడ్డు వాడిది బతుకు కాదా? డ్రైవర్‌ది బతుకు కాదా? ఏం.. మీలాంటి లెక్చరర్లు, డాక్టర్లు, ఇంజనీర్లవే బతుకులా?’ వంటి డైలాగులు ‘నీది నాది ఒకే కథ’ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. శ్రీ విష్ణు, ‘బిచ్చగాడు’ ఫేమ్ సాట్నా టైటస్ జంటగా నటించిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’. వేణు ఊడుగుల దర్శ కత్వంలో ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ మా సినిమా టీజర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. శ్రీ విష్ణు స్టూడెంట్‌గా కనిపించనున్నారు. చిత్తూరు యాసలో తను పలికిన ఘాటైన డైలాగులు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా కూడా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, దేవిప్రసాద్ నటించిన ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: రాజ్ తోట (అర్జున్‌రెడ్డి ఫేమ్). -
మార్చి 23న ‘నీది నాది ఒకే కథ’
శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘నీది నాది ఒకే కథ’ చిత్రం మార్చి 23 న విడుదల కానుంది. టీజర్ మరియు పాటలకు అద్భుత స్పందన వస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు స్టూడెంట్ గా కనిపించనున్నారు. టీజర్ లో చిత్తూర్ యాసలో శ్రీ విష్ణు పలికిన ఘాటైన డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. డిఫరెంట్ కాన్పెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీవిష్ణు మరో సక్సెస్ సాధిస్తాడన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన ‘బిచ్చగాడు’ ఫేమ్ సాట్నా టైటస్ హీరోయిన్గా కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రశాంతి, కృష్ణ విజయ్ మరియు అట్లూరి నారాయణ రావు అరాన్ మీడియా వర్క్స్ మరియు శ్రీ వైష్ణవి క్రియేషన్స్ బ్యానర్ లపై సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘నీది నాది ఒకే కథ’ చిత్రం మార్చి 23 న విడుదల కానుంది. -
రహస్య వివాహం చేసుకున్న హీరోయిన్
పిచ్చైక్కారన్ చిత్ర నాయకి సాట్నా టైటస్ రహస్యంగా వివాహం చేసుకున్నారు. సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన పిచ్చైక్కారన్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన నటి సాట్నాటైటస్. ఆ చిత్రం తమిళంలో విజయవంతమైన విషయం, అంతకంటే సంచలన విజయాన్ని అనువాద చిత్రంగా తెలుగులో సాధించిన విషయం తెలిసిందే. దీంతో నటి సాట్నాకు కోలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు రావడం మెదలెట్టాయి. అయితే పిచ్చైక్కారన్ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన బయ్యర్లలో ఒకరైన కార్తికీ నటి సాట్నాకు మధ్య ప్రేమ చిగురించింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. నెల రోజుల ముందే ఈ ప్రేమ జంట రిజిస్టర్ వివాహం చేసుకున్నారన్న విషయం కాస్త ఆలస్యంగా బయట పడింది. దీంతో సాట్నా నటించడానికి అంగీకరించిన తిట్టం పోట్టు తిరుడర కూట్టం చిత్రానికి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అదే విధంగా అమీర్ దర్శకత్వంలో నటించడానికి సంగదేవన్ చిత్రం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. కాగా నటి సాట్నా తల్లికి ఈ పెళ్లి ఇష్టం లేదని, కార్తీ తన కూతురిని మాయలో పడేశారని, అతని నుంచి సాట్నాను విడిపించాల్సిందిగా నడిగర్ సంఘాన్ని ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఉండగా సాట్నాను రిజిస్టర్ వివాహం చేసుకున్న కార్తీ మాత్రం తమ పెళ్లి ఇరు కుటుంబాల సమ్మతంతోనే జరిగిందని, త్వరలో బహిరంగంగా మళ్లీ వివాహం చేసుకుంటామని పేర్కొనడం గమనార్హం. సాట్నా చిత్రాలను తగ్గించుకుంటున్నార ని, పెళ్లి తరువాత నటనకు స్వస్తి చెప్పనున్నారని, ఇది తామిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. మరి వీరి వివాహ తంతు ఎటు దారి తీస్తుందో చూద్దాం. -
కయల్ చంద్రన్‌తో సాట్నాటైటస్
కయల్ చిత్రం ఫేమ్ చంద్రన్‌తో పిచ్చైక్కారన్ చిత్ర నాయకి జత కట్టనున్నారు.ఈ చిత్రం శుక్రవారం ప్రారంభం కానుంది.టు మూవీ బఫ్స్ (2ఎంబీ) పతాకంపై రూపొందనున్న ఈ చిత్ర వివరాలను ఆ సంస్థ అధినేత రఘునాథన్ తెలుపుతూ తాను టెలికామ్ ఇండస్ట్రీలో సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో 12 ఏళ్లు పనిచేశానన్నారు.అయితే సినిమా అన్నది తనకు చిన్నతనం నుంచి ఫ్యాషన్ అన్నారు. ఆ ఆసక్తితోనే టు మూవీ బఫ్స్ సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా అమ్మా క్రియేషన్స్ టి.శివతో కలిసి అధర్వ కథానాయకుడిగా జెమినీగణేశన్ సరుళీ రాజానుమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నానని తెలిపారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే ఇప్పుడు కయల్ చంద్రన్, పిచ్చైక్కారన్ ఫేమ్ సాట్నా టైటస్ జంటగా మరో చిత్రం ప్రారంభించనున్నట్లు తెలిపారు. వ్యాపార దృక్పథంతో మాత్రమే తాను చిత్రాలు తీయనున్నారు. తమ సంస్థ నుంచి జనరంజకమైన చిత్రాలనే అందించాలన్నది తన దృఢ నిశ్చయం అన్నారు. కయల్ చంద్రన్, సాట్నాటైటస్ జంటగా నటించే చిత్రం పూర్తిగా వినోదభరితంగా ఉంటుందన్నారు. నట దర్శకుడు ప్రతాప్‌పోతన్, శ్యామ్, ఇదర్కుదానే ఆశైపడ్డాయ్ బాలకుమారా డాని ముఖ్యపాత్రలు పోషించనున్నారని తెలిపారు. సర్క్యూట్ అనే లఘు చిత్రంతో మంచి పేరును పొందిన సదర్‌ను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాత అమ్మాక్రియేషన్స్ టి.శివ 25 ఏళ్ల సినీ అనుభవం తమకు చాలా హెల్ప్ అవుతోందనే అభిప్రాయాన్ని రఘునాథన్ వ్యక్తం చేశారు. -
టైటిలే ప్లస్ అయింది
- హీరో విజయ్ ఆంటోని ‘‘మొదట ఈ చిత్రానికి ‘బిచ్చగాడు’ అని టైటిల్ పెట్టినప్పుడు నెగటివ్ ఇంపాక్ట్ వస్తుందని చాలామంది అన్నారు. కానీ, ఈ చిత్రానికి టైటిలే పెద్ద ప్లస్ అయింది. ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో, అంతకుమించి తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇకపై నా చిత్రాల షూటింగ్స్ యాభై శాతం తెలుగు రాష్ట్రాల్లో చేస్తా’’ అని సంగీత దర్శకుడు, కథానాయకుడు విజయ్ ఆంటోని పేర్కొన్నారు. శశి దర్శకత్వంలో విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా తమిళంలో తెరకెక్కిన ‘పిచ్చైకారన్’ చిత్రాన్ని చదలవాడ పద్మావతి ‘బిచ్చగాడు’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ బాగుండటంతో హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు.‘‘కథను నమ్మి, హ్యూమన్ ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం చేశా. తెలుగులో పెద్ద హిట్‌గా నిలిచినందుకు సంతోషంగా ఉంది’’ అని దర్శకుడు తెలిపారు. చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో రేపటి నుంచి థియేటర్లను పెంచుతున్నాం’’ అని చెప్పారు. సినిమా విజయవంతం కావడంపై కథానాయిక సత్న టైటస్ ఆనందం వ్యక్తం చేశారు.