టైటిలే ప్లస్ అయింది | bichagadu title Main plus point | Sakshi
Sakshi News home page

టైటిలే ప్లస్ అయింది

Published Wed, Jun 1 2016 1:07 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

టైటిలే ప్లస్ అయింది

టైటిలే ప్లస్ అయింది

- హీరో విజయ్ ఆంటోని
‘‘మొదట ఈ చిత్రానికి ‘బిచ్చగాడు’ అని టైటిల్ పెట్టినప్పుడు నెగటివ్ ఇంపాక్ట్ వస్తుందని చాలామంది అన్నారు. కానీ, ఈ చిత్రానికి టైటిలే పెద్ద ప్లస్ అయింది. ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో, అంతకుమించి తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇకపై నా చిత్రాల షూటింగ్స్ యాభై శాతం తెలుగు రాష్ట్రాల్లో చేస్తా’’ అని సంగీత దర్శకుడు, కథానాయకుడు విజయ్ ఆంటోని పేర్కొన్నారు. శశి దర్శకత్వంలో విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా తమిళంలో తెరకెక్కిన ‘పిచ్చైకారన్’ చిత్రాన్ని చదలవాడ పద్మావతి ‘బిచ్చగాడు’ పేరుతో తెలుగులో విడుదల చేశారు.

ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ బాగుండటంతో హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు.‘‘కథను నమ్మి, హ్యూమన్ ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం చేశా. తెలుగులో పెద్ద హిట్‌గా నిలిచినందుకు సంతోషంగా ఉంది’’ అని దర్శకుడు తెలిపారు. చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో రేపటి నుంచి థియేటర్లను పెంచుతున్నాం’’ అని చెప్పారు. సినిమా విజయవంతం కావడంపై  కథానాయిక సత్న టైటస్ ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement