telugu audience
-
'తెలుగు ఆడియన్స్ మాత్రమే అలా చేస్తారు'.. సాయిపల్లవి కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు ఆడియన్స్‌పై ప్రశంసలు కురిపించారు. భాషతో సంబంధం లేకుండా ఆదరించేది కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమేనన్నారు. గతంలో నన్ను భానుమతి, వెన్నెల అని పిలిచేవారు.. ఇప్పుడేమో ఇందు రెబెకా వర్గీస్ అని పిలుస్తున్నారు. సినిమాను గొప్పగా ప్రేమించే ఆడియన్స్ ఎవరైనా ఉన్నారంటే అది తెలుగువారు మాత్రమేనని సాయిపల్లవి కొనియాడారు. మీ ప్రేమ, ఎంకరేజ్మెంట్ చూసి నేను మరిన్ని మంచి సినిమాలు చేయాలని అనిపిస్తోందని అన్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అంటూ సాయిపల్లవి మాట్లాడారు.కాగా.. ఈ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. 2014లో కాశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవితాన్ని అమరన్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. "Telugu audience andariki chala pedda thanks" ❤️ Heroine @Sai_Pallavi92 at #Amaran Success Meet ❤️🔥#AmaranMajorSuccess #MajorMukundVaradharajan #saipallavisenthamarai #SaiPallavi #YouWeMedia pic.twitter.com/YYbGoGHPNU— YouWe Media (@MediaYouwe) November 6, 2024 -
మద్రాసు అమ్మాయితో హిందీలో పాట..
మల్లెలు, గులాబీల మధ్య ఎప్పుడూ ఒక సన్నజాజి పువ్వు ఉంటుంది. కోకిలలు, మైనాల మధ్య పేరును పట్టించుకోని ఒక పిట్ట గానం ఉంటుంది. పూజలు చేయ పూలు తెచ్చాను... విధి చేయు వింతలెన్నో... ఇన్ని రాశుల యునికి... తెలిమంచు కరిగింది తలుపు తీయరా... ఇన్ని పాటలతో వాణి జయరామ్ తెలుగు ప్రేక్షకులతో ఎన్నెన్నో జన్మల బంధం వేశారు. చెన్నైలో చదువుకుని, హైదరాబాద్‌లో బ్యాంక్ ఉద్యోగం చేసిన వాణి జయరాం తెలుగువారి ఇష్టగాయనిగా మారి దశాబ్దాలు అవుతోంది. నవంబర్ 30న ఆమెకు 75 నిండుతాయి. ప్రతి వసంతంలోనూ పాటల కొమ్మలను విస్తరించుకుంటూ వెళ్లిన ఈ నిరాడంబర వృక్షం తల ఎత్తి చూడదగ్గది. ఈ సందర్భాన తలుచుకోదగ్గది. రేడియో సిలోన్లో బినాకా గీత్‌మాలా ఊపేస్తోంది. అమిన్ సయానీ మొదలెట్టిన షో ప్రతి వారం హిందీలో విడుదలైన జనరంజకమైన పాటల్ని ప్లే చేసి టాప్ లిస్ట్‌ను ఇస్తూ ఉంటుంది. మేల్ సింగర్స్ అయితే దాదాపుగా రఫీ ఉంటాడు. ఫిమేల్ సింగర్స్ అయితే లతా మంగేష్కర్ సింహాసనం వేసుకుని కూచుని ఉంటుంది. అలాంటి షోలో ఒకవారం అయినా తమ పాట వినపడాలని ప్రతి గాయని, గీత కర్తా, సంగీత దర్శకుడు భావిస్తున్న సమయాన ఒక మద్రాసు అమ్మాయి హిందీలో ఒక పాట పాడింది. ఆ పాట ఆ అమ్మాయికి మొదటి పాట. అది బయటకు విడుదల అయ్యింది. లతా కాకుండా, ఆశా భోంస్లే కాకుండా హిందీలో మరొకరు, అందునా ఒక సౌత్ అమ్మాయి పాడటమా అని జనానికి వింత. అది బినాకాకు ఎక్కడం మరీ వింత. ఒక వారం కాదు రెండు వారాలు కాదు 16 వారాలు ఆ పాట చార్ట్ బస్టర్‌గా నిలవడం ఇంకా వింత. ఆ వింతను సాధించిన గాయని వాణి జయరామ్. బాలీవుడ్ ఎగిరిన తొలి దక్షిణాది గాన పతాక. ఆ సినిమా ‘గుడ్డి’. ఆ పాట ‘బోల్రే పపీ హరా’. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుదని అంటారు పెద్దలు. ఎదిగే బుద్ధి ఉన్న వారు మౌనంగా ఉంటారని కూడా అంటారు. వాణి జయరామ్‌కు సంగీతం ఎంత తెలుసో చాలామందికి తెలియదు. ఆమె ఎప్పుడూ పెద్దగా చెప్పుకోదు. కాని పాటను సాంతం తన చేతిలోకి తీసుకున్నట్టుగా ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆమె తల్లి గాయని. తమిళనాడులోని వేలూరులో తన 9 మంది సంతానంలో ఐదవ బాలికగా జన్మించి వాణిలో ఆమె సంగీతాన్ని పసిగట్టింది. ఐదేళ్లకే వాణి కీర్తనలు పాడేది. చెదరకుండా ఆలాపన కొనసాగించేది. నేను అంతగా సక్సెస్ చూడలేకపోయాను నా కూతురైనా చూడాలి అని వాణికి పదేళ్లు వచ్చేసరికి కుటుంబాన్ని మద్రాసుకు మార్చిందామె. అక్కడే వాణి క్లాసికల్ గురుముఖతా నేర్చుకుంది. మరో ఒకటి రెండేళ్లకే మూడు గంటల కచేరీ ఇవ్వడం కూడా మొదలెట్టింది. మద్రాసులోని మహా సంగీతకారుల దగ్గర వాణి పాఠాలు నేర్చుకుని వచ్చిన విద్యను ఆడంబరంగా ప్రదర్శించరాదని గ్రహించి వినయంగా ఉండటం నేర్చుకుంది. వాణి చాలా చురుకైన స్టూడెంట్. మద్రాసులో బి.ఏ ఎకనామిక్స్ చేసింది. ఎన్నడూ ఏమీ మాట్లాడనట్టుగా కనిపించే ఆమె కాలేజీలో డిబేట్స్ కోసం వేదిక ఎక్కితే అవతలి పక్షం ఓటమి అంగీకరించి నోరు మెదపక దిగిపోయేది. చదువులో టాపర్ అయిన వాణికి స్టేట్ బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. ఏదో కచేరిలో పాడుతుంటే చూసిన ఒకామె ఈమె నా కోడలు అని నిశ్చయించుకుని తన కుమారుడు జయరామ్‌ను ఆమెకు భర్తగా ఇచ్చింది. వాణి కొన్నాళ్లు హైదరాబాద్‌లో కూడా ఉద్యోగం చేసి ఆ తర్వాత ముంబై ట్రాన్స్ఫర్ అయితే ముంబైకి వెళ్లింది. అక్కడే ఆమె గాయనిగా మొదటిసారి వెలిగింది. వాణి భర్త జయరామ్‌కు సంగీతప్రియుడు. ఆయనకు సితార్ వాదన తెలుసు. ‘వాణి జయరామ్’గా మారిన భార్యకు హిందూస్తానీ కూడా వచ్చి ఉంటే బాగుంటుందని అక్కడే ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ ఖాన్ దగ్గర సంగీత పాఠాలకు పెట్టాడు. ఉస్తాద్ ఆమె పాటలు విని అమ్మా... ఇంకా ఆ దండగమారి బ్యాంకు ఉద్యోగం ఎందుకు... బంగారం లాంటి నీ గొంతు ఉండగా అని సంగీతం నేర్పించి, సంగీత దర్శకుడు వన్రాజ్ భాటియాకు ఆమెను పరిచయం చేశాడు. వన్రాజ్ భాటియా అప్పుడే తాను సంగీతం చేస్తున్న ‘గుడ్డి’ సినిమా కోసం దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ, రచయిత గుల్జార్‌లను వాణి జయరామ్ తొలి పరిచయానికి ఒప్పించాడు. అలా వాణి జయరామ్ దేశానికి ఒక ప్రభాత గీతంగా, భక్తి గీతంగా దేశానికి తెలిసింది. కాని లతా మంగేశ్కర్, ఆశా భోంస్లే కెరీర్లో పోటాపోటీగా ఉన్న సమయంలో మరో చెల్లెలు ఇలా ప్రత్యక్షం కావడం అంత ప్రసన్నం కలిగించే విషయంగా భావించలేకపోయారు. సంగీత దర్శకుల, గాయకుల లాబీలో గొప్ప ప్రతిభ ఉన్నా అక్కడ వాణి జయరామ్ నిలువలేకపోయింది. పోనీ.. ఈ గంధం దక్షణాది గడపలకే సొంతమని విధి రాసి పెట్టి ఉందేమో మద్రాసుకు వచ్చేసింది. అటు పిమ్మట వాణి జయరామ్ గొంతు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో పాలు కలిపిన మామిడి పండు రసం రుచిని పాటలలో పంచింది. ఎస్.పి.బాలూకు పాడే అవకాశం ఇచ్చిన కోదండపాణీయే ‘అభిమానవంతులు’ సినిమాతో వాణి జయరామ్‌కు తొలి అవకాశం ఇచ్చాడు. కాని ఈ గొంతు గాన పూజకు వచ్చిందని ‘పూజ’ సినిమాయే తెలుగు ప్రేక్షకులకు చెప్పింది. రాజన్ – నాగేంద్ర చేసిన ‘పూజ’ పాటలు తెలుగు దేశాన మోగిపోయాయి. ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది’ పాటను ప్రతి ఉదయం నాష్టా పొయ్యి మీద పెడుతూ, మధ్యాహ్నం భోజనాలు వడ్డిస్తూ, రాత్రిళ్లు పిల్లలకు పక్కలు సిద్ధం చేస్తూ ఇల్లాళ్లు వేలాదిసార్లు విన్నారు. వింటున్నారు. ఆ సినిమాలోని ‘నింగి నేలా ఒకటాయెనే’, ‘పూజలు చేయ పూలు తెచ్చాను’... పాటలూ వాణి జయరామ్ గొంతు గిరాకీని శ్రోతల్లో పెంచాయి. అయితే తెలుగులో ఆమె ప్రవేశం, కొనసాగింపు స్థిరంగా లేదు. సుశీల, జానకీ ‘హీరోయిన్ల గొంతు’గా స్థిరపడి ఉన్నారు. వారిని దాటి వాణి జయరామ్‌కు చోటు దొరకడం అన్నిసార్లు జరిగేది కాదు. కాని జరిగిన ప్రతిసారీ చిన్న చిరునవ్వుతో, గోరింటాకు పెట్టుకుని పండిన ఎడమ చేతిని ఊపుతూ పాడి మార్కులు ఎగరేసుకొని పోయేది. ‘ఈ రోజు మంచి రోజు’ (ప్రేమ లేఖలు), ‘విధి చేయు వింతలెన్నో’ (మరో చరిత్ర), ‘నువ్వు వస్తావని బృందావని’ (మల్లెపూవు), ‘హే కృష్ణా మళ్లీ నీవే జన్మిస్తే’ (మొరటోడు), ‘నీలి మేఘమా జాలి చూపుమా’ (అమ్మాయిల శపథం), ‘సీతే రాముడి కట్నం’ (మగధీరుడు)... ఈ పాటలన్నీ సిగన మల్లెలు ముడుచుకున్న వనితలా గుమగుమలాడుతూ భావతరంగాల కిందా మీదకు కారణమయ్యేవి. వాణి జయరామ్ గొంతులోని విశిష్టత ఏమిటంటే అది స్త్రీలకూ సరిపోయేది. యంగ్ అడల్ట్స్కూ సరిపోయేది. ఇది గమనించిన దర్శకుడు కె.విశ్వనాథ్ ‘శంకరాభరణం’, ‘స్వాతికిరణం’, ‘శృతిలయలు’ సినిమాలలో ఆమె గొంతును సమర్థంగా ఉపయోగించుకున్నారు. ఆ సినిమాలకు ఆమె గొంతు కేవలం పాటగా మాత్రమే కాదు కథాబలంగా కూడా ఉపయోగపడింది. ‘శంకరాభరణం’లో ‘బ్రోచే వారెవరురా’, ‘మానస సంచరరే’, ‘ఏ తీరుగ నను దయ చూసెదవో’.. ఈ పాటలన్నీ ఆమెకు అవార్డులు తెచ్చి పెట్టాయి. ‘స్వాతి కిరణం’లో మాస్టర్ మంజునాథ్‌కు మేచ్ అయ్యేలా వాణి జయరామ్ పాడిన ‘తెలి మంచు కరిగింది’, ‘ఆనతినీయరా’, ‘ప్రణతి ప్రణతి ప్రణతి’, ‘కొండ కోనల్లో లోయల్లో’... అద్భుతం. పునరావృతం లేని కళ అది. వాణి జయరామ్ గొంతు భిన్న సందర్భాల పాటగా వెలిగింది. ‘నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా’ (వయసు పిలిచింది), ‘మిన్నేటి సూరీడు వచ్చెను మా పల్లె’ (సీతాకోకచిలుక), ‘నేనా పాడనా పాట’ (గుప్పెడు మనసు), గీతా ఓ గీతా (శివమెత్తిన సత్యం)... వీటన్నింటికి గట్టి అభిమానులు ఉన్నారు. స్ట్రయిట్ పాటలే కాదు తెలుగు డబ్బింగ్ గీతాలు కూడా వాణి జయరామ్‌ను తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉంచాయ్. ఆమె పాడిన ‘ఒక బృందావనం సోయగం’ (ఘర్షణ) చిత్రలహరిలో జనం వేయిసార్లు చూశారు. వాణి జయరామ్ సింపుల్‌గా ఉండటమే ఘనత అని నమ్ముతారు. ఆమెకు చాలా భాషలు వచ్చు. కవిత్వం రాస్తారు. భజనలు రాస్తారు. సినిమా కథలు కూడా తయారు చేస్తారు. ఆమె జగతితో తానుగా కాక పాటతో సంభాషించాలని కోరుకుంటారు. తీయటి గాయని వాణి జయరామ్ పాటకు ప్రత్యక్షంగా సేవ చేసి పరోక్షంగా మానవ స్వాంతనకు దోహదపడ్డారు. ఆమె 75 ఏళ్లు నిండిన సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. హృదయాలను సంగీతమయం చేస్తూనే ఉండమని కోరుకోవాలి. దొరకునా ఇటువంటి సేవ..నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ...– సాక్షి ఫ్యామిలీ -
18 నెలలు టైమ్ ఇవ్వండి!
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ వంటి సూపర్ హిట్ సినిమాలతో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. కొంతకాలంగా సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులను పలకరించడం తగ్గింది. 2017లో ‘గృహం’ అనే హారర్ సినిమాతో కనిపించారు. లేటెస్ట్గా నేను మళ్లీ తెలుగుకు తిరిగి వస్తున్నాను అంటున్నారు సిద్ధార్థ్. ‘‘ఎవరేమన్నా నేను తిరిగి వస్తాను. ఈ ప్రామిస్‌ను గుర్తు పెట్టుకోండి. నా తెలుగు ప్రేక్షకులను మరొక్కసారి తప్పకుండా ఆకట్టుకుంటాను. నాకు 18 నెలల సమయం ఇవ్వండి. మంచి కథ దారిలో ఉంది. త్వరలోనే మాట్లాడుకుందాం’’ అని తన ట్వీటర్లో పేర్కొన్నారు సిద్ధార్థ్. ప్రస్తుతం తమిళంలో ఓ మూడు సినిమాలు, హిందీలో ఓ సినిమాతో బిజీబిజీగా ఉన్నారు సిద్ధార్థ్. -
జాతులు, కులాలతో చండాలంగా చిత్ర పరిశ్రమ
-
చండాలంగా కళారంగం
జాతులు, కులాలు, వర్గాల ఆధిపత్యపోరు పెరిగింది భాషపై అంకిత భావం లేనివారు తెలుగువారే: ఎస్పీ బాలు లబ్బీపేట (విజయవాడ తూర్పు): ప్రస్తుతం కళారంగం (సినిమా) జాతులు, కులాలు, వర్గాలు ఆధిపత్య పోరుతో చండాలంగా మారిందని ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. ఫ్యాన్స్ మాత్రమే సినిమాలను చూస్తే కలెక్షన్లు రావని, అందరు అన్ని సినిమాలను ఆదరిం చాలని కోరారు. తాను 15 భాషల్లో పాటలు పాడుతున్నానని, భాషపై అంకితభావం లేనివారు తెలుగువారేనని ఆవేదన వ్యక్తం చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యానికి ఆదివారం విజయవాడలో జీవిత సాఫల్య పురస్కా రాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా స్థాయిని ప్రజలే నిర్ణయించాల్సి ఉందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషను సైతం విస్మరిస్తూ చిత్రాలు రావడం దురదృష్టకరమ ని చెప్పారు. అలాంటి వాటిని విమర్శించే ధైర్యం తనకు లేదన్నారు. ఒకపాట విజయవంతం కావాలంటే గాయకుడితో పాటు రచయిత, సంగీత దర్శకుడు, నటుల కృషి ఉంటుందని చెప్పారు. శంకరాభర ణంలో పాట పాడేందుకు తాను అర్హుడిని కాదని భావించి చాలాకాలం తప్పుకొని తిరిగానని, వచ్చిన అవకాశాన్ని వదులుకో కూడదని భావించి పాడానని గుర్తుచేసుకు న్నారు. మనకు అక్షరశిల్పులు చాలామంది ఉన్నారని, మల్లాది, సముద్రాల, ఆరుద్ర, జాలాది వంటి వారు గొప్పపాటలు అందిం చారని చెప్పారు. వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి గొప్పరచయితలు మనకు ఉన్నారన్నారు. మహ్మద్ రఫీ మంచి గాయకుడని, ఆయన ప్రభావం తనపై ఉందని చెప్పారు. -
టైటిలే ప్లస్ అయింది
- హీరో విజయ్ ఆంటోని ‘‘మొదట ఈ చిత్రానికి ‘బిచ్చగాడు’ అని టైటిల్ పెట్టినప్పుడు నెగటివ్ ఇంపాక్ట్ వస్తుందని చాలామంది అన్నారు. కానీ, ఈ చిత్రానికి టైటిలే పెద్ద ప్లస్ అయింది. ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో, అంతకుమించి తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇకపై నా చిత్రాల షూటింగ్స్ యాభై శాతం తెలుగు రాష్ట్రాల్లో చేస్తా’’ అని సంగీత దర్శకుడు, కథానాయకుడు విజయ్ ఆంటోని పేర్కొన్నారు. శశి దర్శకత్వంలో విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా తమిళంలో తెరకెక్కిన ‘పిచ్చైకారన్’ చిత్రాన్ని చదలవాడ పద్మావతి ‘బిచ్చగాడు’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ బాగుండటంతో హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు.‘‘కథను నమ్మి, హ్యూమన్ ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం చేశా. తెలుగులో పెద్ద హిట్‌గా నిలిచినందుకు సంతోషంగా ఉంది’’ అని దర్శకుడు తెలిపారు. చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో రేపటి నుంచి థియేటర్లను పెంచుతున్నాం’’ అని చెప్పారు. సినిమా విజయవంతం కావడంపై కథానాయిక సత్న టైటస్ ఆనందం వ్యక్తం చేశారు. -
చెన్నై పోదాం చలో... చలో!
‘‘మేం పక్కా లోకల్. మా తెలుగు పేక్షకులు మా సినిమా చూస్తే చాలు’’ అనేది నిన్నటి మాట. ‘‘మా ప్రేక్షకులతో పాటు పొరుగు రాష్ట్రం ప్రేక్షకులు కూడా మా సినిమాలు చూస్తే మేలు’’ అనేది ఇవాళ్టి మాట. నిన్న మొన్నటి వరకూ మన తెలుగు స్టార్స్ మన భాష మీదే దృష్టి పెట్టారు. ఇప్పుడు మాత్రం పర భాషపై కూడా వీళ్ల దృష్టి పడింది. పెరుగుతున్న నిర్మాణ వ్యయానికి తగ్గ వసూళ్లు రాబట్టాలంటే పక్క రాష్ట్రాల్లో కూడా సినిమాని విడుదల చేస్తే ఉపయోగం ఉంటుందని గ్రహించినట్లున్నారు. అది కూడా అనువాద రూపంలో కాకుండా.. నేరుగా చేస్తే ఇంకా ఉపయోగం ఉంటుందని లెక్కలేసినట్లున్నారు. అందుకే ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేయాలని కొంతమంది హీరోలు ఫిక్స్ అయ్యారు. తమిళ తంబీలు ఒక అడుగు ముందే... వాస్తవానికి తమిళ హీరోలు ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారు. సీనియర్ హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్‌లకు తమిళంలో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. విక్రమ్ కూడా వీళ్ల రూట్‌నే ఫాలో అవుతూ అక్కడా, ఇక్కడా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించారు. ఆ వరుసలో సూర్య, కార్తీ, తమిళంలో తమ చిత్రం విడుదలైనప్పుడే తెలుగులో కూడా అనువదించి, విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. ఇంకా అజిత్, విజయ్, శింబు, ధనుష్ వంటి హీరోలు కూడా అడపా దడపా తెలుగు తెరపై ప్రత్యక్షమవుతున్నారు. తెలుగు కుర్రాడు విశాల్, తమిళంలో చేస్తున్న చిత్రాలు తెలుగులో కూడా విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా తెలుగులో స్ట్రయిట్ చిత్రం చేయడానికి రెడీ అయిపోయారు. మనవాళ్లల్లో తమిళంలో మార్కెట్ సంపాదించుకున్న హీరోలు లేకపోలేదు. ‘శివ’, ‘గీతాంజలి’, ‘రక్షకుడు’.. ఇలా అప్పట్లోనే నాగార్జున ఇటు తెలుగు అటు తమిళంలో మార్కెట్ పెంచుకున్నారు. కానీ, ఆ తర్వాత మాత్రం ఎందుకనో కోలీవుడ్‌పై ఆయన పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ‘ఊపిరి’తో మళ్లీ తమిళ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి.. మళ్లీ ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేస్తారా? లేదా తన చిత్రాలు అక్కడ అనువాదమై, విడుదలయ్యేలా చూసుకుంటారా? అనేది కాలమే చెప్పాలి. నేటి తరం హీరోల్లో మహేశ్‌బాబు, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోల చిత్రాలు ఇక్కడ విడుదలైనప్పుడో, ఆ తర్వాతో పరభాషలోకి అనువాదమవుతున్నాయి. ఆ విధంగా పొరుగు రాష్ట్రాల్లో వాళ్లు మార్కెట్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ‘బాహుబలి’తో ఇతర భాషల్లో ప్రభాస్‌కి మంచి మార్కెట్ ఏర్పడింది. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో పవన్ కల్యాణ్ తొలిసారిగా హిందీకి తన మార్కెట్‌ను విస్తరించుకున్నారు. ఈ హీరోలందరూ అనువాద రూపంలో కాకుండా ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేస్తే, మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు కొంతమంది హీరోలు ద్విభాషా లేదా త్రిభాషా చిత్రాలు చేస్తున్నారు. కొన్ని చిత్రాలు ఆన్ సెట్స్‌లో ఉన్నాయి.. కొన్ని సెట్స్‌కి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. అవేంటంటే... ‘బాహుబలి -2’పై భారీ అంచనాలు దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడుకునేలా రూపొందిన టెక్నికల్ వండర్ ‘బాహుబలి’. ప్రస్తుతం ఈ చిత్రానికి రెండో భాగంగా తెరకెక్కుతోన్న ‘బాహుబలి: ద కన్‌క్లూషన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి భాగంతో దర్శకుడిగా రాజమౌళికీ, హీరోగా ప్రభాస్‌కీ ఇతర భాషల్లో మార్కెట్ పెరిగింది. అందుకే తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో రెండో భాగాన్ని రూపొందిస్తున్నారు. మలయాళంతో పాటు ఇతర భాషల్లోకి అనువదించి విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తర్వాత ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రం చేస్తారని టాక్. దీన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్లాన్ చేస్తున్నారట. మహేశ్ తమిళ్ పేసువారు! ‘గజిని’ ఫేం మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ చిత్రం చేయ నున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్నారు. ఇన్నాళ్లూ లోకల్, ఓవర్సీస్ మార్కెట్ గురించి మాత్రమే ఆలోచించిన మహేశ్ ఇప్పుడు మాత్రం పొరుగు రాష్ర్టంలో కూడా పాగా వేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకు తగ్గ దర్శకుణ్ణి సెలక్ట్ చేసుకున్నారు. తమిళ దర్శకుడు మురుగదాస్‌కి తమిళ్‌తో పాటు ‘స్టాలిన్’తో ఇటు తెలుగులో, ‘గజిని’ హిందీ రీమేక్‌తో హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది. ఆ విధంగా మురుగదాస్ దర్శకత్వం వహించే చిత్రం అంటే ఈ మూడు భాషల్లోనూ అంచనాలు ఉంటాయి. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న హీరో కాబట్టి, మహేశ్‌బాబు తమ భాషలో నేరుగా నటిస్తున్నాడంటే పరభాష ప్రేక్షకులు కూడా అంచనాలు పెంచుకుంటారు. ఆ విధంగా మురుగదాస్‌తో చేయబోయే చిత్రంతో మహేశ్‌బాబు తమిళంలో జెండా పాతడం ఖాయం అని ఊహించవచ్చు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. మహేశ్ పుట్టిందీ పెరిగిందీ చెన్నైలోనే. అందుకని తమిళ భాష బాగా వచ్చు. ‘‘చెన్నై లవ్లీగా ఉంటుంది. అక్కడ నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి’’ అని ‘సాక్షి’తో అన్నారు. తమిళంలో డబ్బింగ్ చెప్పుకుంటానని కూడా పేర్కొన్నారు. సో.. మహేశ్ తమిళ్ పేసువారు (మాట్లాడతారు) అన్నమాట. గోపీ.. గోయింగ్ టు చెన్నై! అచ్చ తెలుగు కుర్రాడిలా ఉంటే మన తెలుగు హీరోల్లో గోపీచంద్ ఒకరు. మంచి మాస్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న గోపీచంద్ ఇప్పటివరకూ ఇతర భాషల మార్కెట్‌పై ఆసక్తి కనబర్చలేదు. కానీ, ఇప్పుడు దృష్టి పెట్టారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ‘ఆక్సిజన్’ చిత్రంలో నటిస్తున్నారు. ‘భారతీయుడు’, ‘జీన్స్’, ‘ఒకే ఒక్కడు’, ‘ఖుషి’ వంటి సూపర్ హిట్స్ తీసిన ఎ.యం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. టైటిల్ నుంచే ఈ చిత్రంపై అంచనాలు మొదలయ్యాయి. ఇకపై ‘కోలీ’ అర్జున్ కూడా... అల్లు అర్జున్ తెలుగులోనే కాదు మలయాళంలో కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్నారు. తెలుగులో బన్నీ చేస్తున్న సినిమాలన్నీ దాదాపు మలయాళంలో అనువాదమై, విడుదలవుతుంటాయ్. మంచి వసూళ్లు కూడా రాబడతాయి. అక్కడివాళ్లకు అల్లు అర్జున్ అంటే ఎంత అభిమానం అంటే... ‘మల్లు అర్జున్’ అంటారు. అనువాద చిత్రాలకే అంత పేరు తెచ్చుకుంటే.. ఇక స్ట్రయిట్ చిత్రం చేస్తే ఎంత మార్కెట్ వస్తుందో? భవిష్యత్తులో మలయాళంలో సినిమా చేసే ఉద్దేశం ఉందో? లేదో కానీ, ప్రస్తుతానికి బన్నీ తమిళ మార్కెట్‌పై దృష్టి పెట్టారు. అందుకే ఓ ద్విభాషా చిత్రం చేయాలని ఫిక్సయ్యారు. ప్రస్తుతం తమిళ దర్శకులు లింగుస్వామి, విక్రమ్‌కుమార్‌లతో చర్చలు జరుగుతున్నాయి. ఈ ఇద్దరిలో బన్నీ ఎవరితో సినిమా చేసినా అది తెలుగు, తమిళ భాషల్లో ఉంటుందని టాక్. ఒకేసారి రెండు చిత్రాల్లో సందీప్... ‘ప్రస్థానం’తో మంచి పేరు తెచ్చుకుని, దాదాపు విలక్షణ చిత్రాల్లోనే నటిస్తున్న సందీప్ కిషన్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘మాయవన్’ అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నారు. అలాగే, ‘మానగరమ్’ అనే తమిళ స్ట్రయిట్ చిత్రంలోనూ అతనే హీరో. మన తెలుగు హీరోల్లో తమిళంలో మంచి గుర్తింపు పొందినవారిలో నాని, శర్వానంద్, రానా ఉన్నారు. తమిళ చిత్రం ‘వెప్పమ్’, తమిళంలో విడుదలైన ‘నాన్ ఈ’ (తెలుగులో ‘ఈగ’) నానీని అక్కడివారికి దగ్గర చేశాయి. ఆ తర్వాత ‘నీదానే ఎన్ పొన్ వసంతం’, ‘నిమ్రిందు నిల్’, ‘పల్లాండు వాళ్గ’ వంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేశారు. బలంగా దృష్టి పెడితే.. తమిళంలో మార్కెట్ పెంచుకోవడం నానీకి పెద్ద కష్టమేం కాదు. అలాగే శర్వానంద్‌కి తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ‘గమ్యం’ తమిళ రీమేక్ ‘కాదలున్నా సుమ్మా ఇల్లే’, ‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్’ (తెలుగులో ‘జర్నీ’) వంటి చిత్రాలతో శర్వానంద్‌కి అక్కడ బాగానే మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత ఎందుకనో తెలుగు చిత్రాలపైనే దృష్టి పెట్టారు. ‘ఆరంభం’, ‘బెంగళూరు నాట్కళ్’ చిత్రాల్లో చేసిన పాత్రలు రానాకి అక్కడ బాగానే గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా’ అనే చిత్రంలో రానా నటిస్తున్నారు. ఈ ఆరడుగుల హీరో ఇంకా కేర్ తీసుకుంటే తమిళంలో బాగానే మార్కెట్ పెంచుకోవచ్చు. ‘కళాకారులకు భాషతో సంబంధం లేదు’ అంటారు. సో.. ఈడ.. ఆడ.. ఏడ అయినా సినిమాలు చేసుకునే వెసులుబాటు ఉంది. సొంతింట్లోనే కాకుండా.. పొరుగింట్లో కూడా మార్కెట్ తెచ్చుకుంటే ఆ మజానే వేరు. ప్రస్తుతం మన హీరోలు ఆ పని మీదే ఉన్నారు. -
ప్రాంతాలు వేరైనా... ప్రేక్షకుల టేస్ట్ ఒక్కటే!
‘నకిలీ’, ‘డా. సలీం’ చిత్రాల తర్వాత ‘బిచ్చగాడు’గా తెలుగు ప్రేక్షకులముందుకొచ్చారు కథానాయకుడు విజయ్ ఆంటోనీ. శశి దర్శకత్వంలో ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ను శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ పతాకంపై చదలవాడ పద్మావతి ‘బిచ్చగాడు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం గురించి చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ -‘‘ ‘బిచ్చగాడు’ చిత్రానికి తమిళంలో ఎంత ఆదరణ వచ్చిందో తెలుగులోనే అదే ఆదరణ లభిచింది. తెలుగు, తమిళ ప్రేక్షకుల టేస్ట్ ఒక్కటే. ఇకపై నా చిత్రాలన్నీ తెలుగులో కూడా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నా. ఈ చిత్రకథ విన్నప్పుడు ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశా. హీరోగా నటించడంతో పాటు సంగీతం, ప్రొడక్షన్ చూసుకుంటున్నా కష్టమనిపించడం లేదు. ‘సైతాన్’, ‘యముడు’ చిత్రాల్లో నటిస్తున్నా. వీటి తర్వాత ‘డా. సలీమ్’ సీక్వెల్లో నటిస్తా’’ అని తెలిపారు. ‘‘టైటిల్ చూసి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే టెన్షన్ ఉండేది. అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు’’అని నిర్మాత పద్మావతి పేర్కొన్నారు. మాటల రచయిత బాషాశ్రీ పాల్గొన్నారు. -
సొట్టబుగ్గల రాక్షసి
అందమైన అమ్మాయి ఏం చేసినా అబ్బాయిలకు బాగానే ఉంటుంది. రాక్షసిలా సాధించినా పడబుద్ధేస్తుంది. తను నడిచిన దారిలో ఎన్ని ప్రేమలేఖల్ని పూలలా పరిచారో! ఆ హై హీల్స్‌తో 'వన్స్ మోర్' అంటూ ఎన్ని గుండెలు తొక్కించుకున్నాయో! సొట్టబుగ్గలతో కాటేసినా ఆ పుట్టలోన ఉండబుద్దేస్తుంది. 'ఛీ.. పో' అని చీదరించుకున్నా అయస్కాంతమై లాక్కోవాలనిపిస్తుంది. మేడమ్ తుమ్మినా, దగ్గినా ఈ మ్యాడ్ బాయ్స్కే జ్వరం వచ్చేస్తుంటుంది. ఇదండీ.. లావణ్య త్రిపాఠీ ఉరఫ్ కాలేజ్ క్యూటీ ఉరఫ్ అందాల రాక్షసి ఉరఫ్ లేటెస్ట్ బ్యూటీ లైఫ్. ‘అందాల రాక్షసి’గా పేరు తెచ్చుకున్నారు. ఇంతకీ మీరు తెలుగు రాక్షసేనా? (నవ్వుతూ...) అలా రాక్షసి అనేయకండి! అసలే నేను చాలా మంచి అమ్మాయిని. సినిమా వరకూ ఓకే. అందులో అలా అనిపించుకోవడం నాకు నచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎక్కడ చూసినా ఆప్యాయంగా రాక్షసీ అని పిలుస్తుంటే అదో థ్రిల్. నేను పుట్టిందేమో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో. పెరిగింది డెహ్రాడూన్‌లో. కాలేజ్ ముంబయ్‌లో. అక్కడే ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశా. బాగానే చదివేవారా? యావరేజ్ స్టూడెంట్‌ని. ఎందుకంటే స్పోర్ట్స్, డ్యాన్స్ అంటే ఇష్టం ఉండేది. స్పోర్ట్స్‌లో యాక్టివ్‌గా ఉండడం వల్లేనేమో అబ్బాయిలా ప్రవర్తించేదాన్ని. అందుకని నన్ను ‘టామ్ బాయ్’ అనేవాళ్లు. కాలేజీ రోజుల్లో ఎవరైనా ఐ లవ్ యూ చెప్పారా? నా వెంటపడ్డ వాళ్ల జాబితా చాలానే ఉంది. కానీ నేను చాలా స్ట్రిక్ట్. కాబట్టి, డెరైక్ట్‌గా నాతో చెప్పడానికి సాహసం చేసేవారు కాదు. కొంతమంది మాత్రం వచ్చి చెప్పేవాళ్లు. నేను వాళ్ల ప్రేమను అంగీకరించకపోయినా, వాళ్ళు అలా చెప్పడాన్ని ఎంజాయ్ చేసేదాన్ని. వాళ్ల లాగా నేను ఎవరి వెనుకా పడకుండా జాగ్రత్త పడేదాన్ని. మీ ఫ్యామిలీ గురించి? అమ్మ టీచర్. నాన్న లాయర్. మా అక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్. తనకు డ్యాన్స్ అంటే ఇష్టం. కథక్‌లో డిప్లమో చేసింది. అన్నయ్య కూడా మంచి డ్యాన్సర్. నేను మాత్రం కథక్ జోలికి పోలేదు. స్కూల్లో ప్రోగ్రామ్స్‌కు భరతనాట్యం నేర్చుకుని, చేసేదాన్ని. మా ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. నేను, అక్క, అన్నయ్య... ఏం చేస్తామన్నా మా అమ్మానాన్న కాదనలేదు. మా వాళ్లు రాంగ్ విషయాలను ప్రోత్సహించరు. రైట్ అనిపిస్తే మాత్రం బోల్డంత సపోర్ట్ ఇస్తారు. అలాగే డిసిప్లిన్ కూడా! మా నాన్నగారు రాత్రి ఒంటి గంటకు నిద్రపోయినా ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచేస్తారు. నాకు కూడా అది అలవాటైంది. అలా పంక్చువాల్టీ ఇప్పుడు చాలా హెల్ప్ అవుతోంది. లేట్ నైట్ షూటింగ్లో పాల్గొన్నా, మర్నాడు ఠంచనుగా నిద్ర లేచి, షూటింగ్‌కు వెళ్లిపోతాను. చెప్పిన టైమ్‌కి లొకేషన్లో ఉంటాను. ఈ బుగ్గ సొట్ట ఎక్కణ్ణుంచి వచ్చింది? మా నాన్నగారికి ఉంది. నాకూ వచ్చింది. ఆ బుగ్గ సొట్ట భలే ఉంటుందని అంటుంటారు. నాకు కూడా చాలా ఇష్టం. సినిమాల్లోకి రావాలని ఎప్పుడనుకున్నారు? ముంబయ్‌లో కాలేజ్ పూర్తయ్యాక డెహ్రాడూన్ వెళ్లిపోయా. ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకున్నా. కాకపోతే అది అంత పాపులార్టీ తీసుకురాదు. నాకేమో ఫేమస్ కావాలని ఉండేది. అందుకని, ‘మిస్ ఉత్తరాఖండ్’ పోటీలో పాల్గొన్నా. టైటిల్ గెల్చుకోవడంతో నా ఆశ ఇంకా పెరిగిపోయింది. నా టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవడానికి పెద్ద వేదిక కావాలనుకున్నా. ముంబయ్ వెళతానని అమ్మతో అంటే ‘నువ్వింకా చిన్నపిల్లవే! ఎవరైనా ముంబయ్ నుంచి డెహ్రాడూన్ వచ్చి, అవకాశం ఇస్తే చేద్దువుగాని’ అని చెప్పింది. ముంబయ్ నుంచి ఎవరైనా డెహ్రాడూన్ వస్తారా? ఇది సాధ్యం కాదులే అనుకున్నా. కానీ ఒకరోజు ఆ మిరకిల్ జరిగింది. ‘ష్.. కోయీ హై’ అనే టీవీ సీరియల్ దర్శక, నిర్మాతలు మా థియేటర్ వర్క్‌షాప్‌కు వచ్చి నన్ను సెలక్ట్ చేశారు. ‘నీలో మంచి నటి ఉంది. నువ్వు ముంబయ్ వస్తే చాలా అవకాశాలు వస్తాయి’ అని ఆ సీరియల్‌కు పనిచేసినవాళ్లు అన్నారు. దాంతో ముంబయ్ షిప్ట్ అయ్యా. మా అమ్మగారు కూడా నాతో పాటు వచ్చారు. తెలుగులో ‘అందాల రాక్షసి’ అవకాశం ఎలా వచ్చింది? ముంబయ్‌లో చాలా యాడ్స్‌లో నటించా. ‘లైఫ్ ఇదేనా’ అనిపించింది. చాలా బోర్ కొట్టింది. డెహ్రాడూన్ వెళ్లిపోదామనుకున్నా. ఆ సమయంలో నా ఫ్రెండ్ ఫోన్ చేసి, ‘ఓ తెలుగు సినిమాకి కథానాయిక కావాలట. మేకప్ లేకుండా రా’ అంటే, వెళ్లాను. చాలా ఫొటోలు తీసి, అవి దర్శకుడు హను రాఘవపూడికి పంపించారు. మర్నాడు ఆయన వచ్చారు. మేకప్ లేకుండా మళ్లీ రమ్మంటే, వెళ్లాను. నాకు నచ్చినవి ఏవైనా చెప్పమంటే, చెప్పాను. ‘యు ఆర్ సెలెక్టెడ్’ అన్నారు. అప్పుడేమనిపించింది? ఈ సినిమా పూర్తయ్యేవరకూ వేరే సినిమా ఒప్పుకోకూడదనుకున్నా. వంద శాతం నా పాత్రకు న్యాయం చేయాలనుకున్నా. షూటింగ్ ఆరంభించే నెల ముందే ఇక్కడికి వచ్చేశా. తెలుగు ప్రాక్టీస్ చేశా. ‘అందాల రాక్షసి’ తర్వాత మీరు బిజీ అవుతారని అందరూ ఊహించారు. కానీ, అలా జరగకపోవడానికి కారణం? నా కెరీర్ కన్నా వర్క్‌ను సీరియస్‌గా తీసుకుంటాను. ఎన్ని సినిమాలు చేశానన్నది నాకు ముఖ్యం కాదు. ‘అందాల రాక్షసి’ తర్వాత వచ్చిన అవకాశాలను ఒప్పుకుని ఉంటే, ఈపాటికి నావి పది సినిమాలు విడుదలై ఉండేవి. ఆ సినిమాల్లోని పాత్రలన్నీ ‘అందాల రాక్షసి’లో నేను చేసిన పాత్రలలానే ఉన్నాయి. అందుకే ఒప్పుకోలేదు. రోజూ ఒకే రకం ఫుడ్ తినమంటే తినలేం కదా! ‘అందాల రాక్షసి’ తర్వాత చేసిన ‘దూసుకెళ్తా’ శాటిస్ఫ్యాక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకోవాలనుకున్నా. డెహ్రాడూన్ వెళ్లిపోయి, ఆ తర్వాత ‘మనం’లో గెస్ట్ రోల్‌కు మంచి పేరొచ్చింది. తమిళంలో ‘బ్రాహ్మణ్’ అనే సినిమా చేశాను. మీరు పెద్దగా పార్టీల్లో కనిపించరు. ఇండస్ట్రీలో కూడా ఎవరితోనూ ఫ్రెండ్లీగా ఉన్నట్లు కనిపించరు. ఎందుకలా? పార్టీలంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఇండస్ట్రీలో నాకు తెలిసిన వాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటాను. అవకాశాలు సంపాదించాలంటే పార్టీలకెళ్లి నలుగురితో పరిచయాలు పెంచుకోవాలంటుంటారు? ఏమో నాకా విషయం తెలియదు. కానీ, అవకాశాల కోసం నేనెవరితోనూ ఫ్రెండ్షిప్ చేయను. అంత స్వార్థం నాకు లేదు. అలాగే, నాతో పరిచయం ఉన్న కొద్దిమందికీ నేనేంటో తెలుసు. ‘ఈ పార్టీకి లావణ్యను తీసుకెళితే బాగుంటుంది’ అని వాళ్లకు అనిపిస్తే, అప్పుడు కాదనకుండా వెళతాను. పార్టీలకు వెళ్లనంత మాత్రాన నాకు నష్టం జరగలేదు. ఇప్పుడు మూడు సినిమాల్లో నటిస్తున్నా. నాగార్జునగారితో ‘సోగ్గాడే చిన్ని నాయనా’, నానీతో ‘భలే భలే మగాడివోయ్’, నవీన్‌చంద్ర పక్కన ‘లచ్చుమీదేవికి లక్కుంటే’ చేస్తున్నా. నాగార్జునకు సరిజోడీ అనిపించుకోవడానికి ఏం చేశారు? కొంచెం బరువు పెరిగా. దాంతో మెచ్యూర్డ్‌గా కనిపిస్తా. ఈ సినిమా తర్వాత ‘భలే భలే మగాడివోయ్’ కోసం మళ్లీ నా నార్మల్ వెయిట్‌కి వచ్చేశా. ‘సోగ్గాడే..’లో మీ పాత్ర గురించి? అందులో ‘సెక్సీ ఇండియన్ ఉమన్’ని. అలాగే, ట్రెడిషనల్‌గా ఉంటాను. చీరల్లో కనిపిస్తాను. నాగ్ సార్ అయితే, ‘లావణ్యా! నువ్వు చీర కట్టుకున్నావ్. లేడీ లాగా నడిస్తే బాగుంటుంది’ అంటుంటారు. ఏదేమైనా మీకు రావాల్సినంత బ్రేక్ రాలేదనే చెప్పాలి...? ఎక్కడో డెహ్రాడూన్ నుంచి ఇక్కడికి వచ్చి, మొదటి సినిమాతోనే ‘మన తెలుగుమ్మాయి’ అని ఇక్కడివాళ్లతో అనిపించుకున్నా. అంతకు మించిన బ్రేక్ ఏముంటుంది? ఓ పది సినిమాలు ఒప్పేసుకుని, వాటిలో ఒక్క సినిమా అయినా బ్రేక్ అవ్వకుండా పోతుందా? అని ఆలోచిస్తే, ఒక్క బెస్ట్ సినిమా కోసం తొమ్మిది వేస్ట్ సినిమాలకు ఎనర్జీ వేస్ట్ చేసుకున్నట్లవుతుంది. ఇప్పుడు నేను చేస్తున్న మూడు సినిమాలూ ఒకదానికొకటి పోలిక లేనివి. వాటిలో నావి మంచి పాత్రలు. అదేంటీ! ఎందుకలా అన్నారు? చిన్నప్పుడు నన్ను అందరూ చిచ్చరపిడుగు అనేవాళ్లు. టామ్‌బాయ్‌లా ఉండేదాన్నని చెప్పాను కదా! ఇప్పుడూ అంతే. చీర కట్టుకున్నప్పుడు ఒద్దికగా ఉండాలి కదా. అలా ఉండను. మగరాయుడిలా ఉంటాను. అందుకే, నాగార్జునగారు అలా అన్నారు. ‘భలే భలే మగాడివోయ్’ షూటింగ్లో నా తీరు చూసి, ఆ చిత్ర దర్శకుడు మారుతి నన్ను ‘తమ్ముడు’ అని పిలవడం మొదలుపెట్టారు. ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? మంచి పాత్ర అయితే, వృద్ధురాలిగా చేయడానికైనా రెడీనే. ఫిమెల్ ఓరియంటెడ్ మూవీస్‌కి అవకాశం వస్తే చేస్తారా? సినిమా మొత్తాన్నీ భుజాల మీద మోసే అవకాశం ఉంటుంది కాబట్టి, అవకాశం వస్తే ఒప్పేసుకుంటా. ఒకవేళ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే బికినీ ధరిస్తారా? చిన్నప్పుడెప్పుడో బికినీ వేసుకున్నా. ఇప్పుడు నా శరీరాకృతి బికినీకి సూట్ కాదని నా ఫీలింగ్. అందుకని యస్ చెబుతానా? నో అంటానా? అని చెప్పలేకపోతున్నా. మరి, ఐటమ్ సాంగ్స్‌కి అవకాశం వస్తే? ఇప్పుడు చేసే ఆలోచన లేదు. భవిష్యత్తులో ఓకే. సినిమా పరిశ్రమలో మంచీ చెడూ - రెండు రకాలవాళ్లూ ఉంటారు. ఎలా డీల్ చేస్తున్నారు? నేను కొన్నేళ్ళు ముంబయ్‌లో ఉన్నా (నవ్వుతూ). ఎవరితో ఎలా వ్యవహరించాలో నేర్చుకున్నా. హైదరాబాద్‌లో చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. చాలామంది నన్ను సిస్టర్లా, కొంతమంది మంచి ఫ్రెండ్‌లా భావిస్తారు. సో... నాకు హ్యాపీగా ఉంది. షూటింగ్స్‌కు మీతో పాటు మీ అమ్మగారు వస్తున్నట్లు అనిపించడం లేదు? రాకూడదని కాదు. అమ్మ వస్తే, తన కంఫర్ట్ గురించి చూసుకోవాలి. ఇక, నేను షూటింగ్ చేసేదెలా? నా పదిహేడేళ్ల వయసులో టీవీ సీరియల్ చేశాను. అప్పట్నుంచీ వర్క్ చేస్తున్నా కాబట్టి, ఎవరి సహాయమూ లేకుండా నా కెరీర్‌నీ, దాని తాలూకు సమస్యలనూ ఎలా హ్యాండిల్ చేసుకోవాలో నాకు తెలుసు. చాలా క్రమశిక్షణ గల అమ్మాయిని అని చెప్పారు. ఫ్రాంక్‌గా ఉంటానని కూడా అన్నారు. ఇలా మీ గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. కానీ, మీలో ఉన్న చెడు లక్షణాలను షేర్ చేసుకుంటారా? (నవ్వుతూ...) నాలో ఉన్న అతి పెద్ద చెడ్డ లక్షణం ఏంటంటే... ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తాను. దానివల్ల నిందలపాలవుతాను. కాసేపు నిగ్రహించుకుంటే ఏం పోతుందని మా ఇంట్లోవాళ్లు, ఫ్రెండ్స్ అంటుంటారు. కొంతమంది కథానాయికలు అందం రెట్టింపు కావడానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటుంటారు. మీరు కూడా..? ప్రస్తుతానికైతే లేదు. ప్లాస్టిక్ సర్జరీ తప్పు కాదు. ఒకవేళ ఆ సర్జరీ ద్వారా ఓ అమ్మాయి కాన్ఫిడెన్స్ పెరుగుతుందనుకుంటే, చేయించుకోవడంలో తప్పూ లేదు. నా అందం, ఆత్మవిశ్వాసం విషయంలో నాకెలాంటి అపనమ్మకాలూ లేవు కాబట్టి, ప్లాస్టిక్ సర్జరీలు అవసరం లేదు (నవ్వులు). ఆడవాళ్లపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? సిగ్గుపడాల్సిన విషయం. అత్యాచారాలు, యాసిడ్ దాడుల గురించి విన్నప్పుడు, రగిలిపోతుంటాను. రోజు రోజుకీ ఆడవాళ్లపై దాడులు ఎక్కువ అవుతున్నాయి. చట్టంలో మార్పులు వస్తే, తగ్గుతాయని అందరూ అంటుంటారు. అలాగే మనం కూడా మారాలి. అన్యాయాన్ని ఎదిరించడానికి అందరం ఏకం కావాలి. - డి.జి. భవాని -
అరువు తెచ్చుకున్న చిరునవ్వు..!
ఆ సీన్ - ఈ సీన్ మనిషిని పోలిన మనిషి.. సినిమాను పోలిన సినిమా. మొదటిది యాదృచ్ఛికం, రెండోది ప్రయత్నపూర్వకం. సప్తసముద్రాలవతల ఎక్కడో తీసిన ఒక సినిమాను మనమూ చూసే అవకాశాన్నిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. అయితే ఇంగ్లిష్ సినిమాలు బాగా చూసే వారికి ‘కాపీ రా బాబూ..’ అనిపిస్తుంటాయి! అలాంటి వాటిలో ఇదీ ఒకటి. 1997 నాటి ఇటాలియన్ సినిమా ‘లా విటా ఈ బిల్లా’ (ఇంగ్లిష్‌లో.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ) విడుదలైనప్పుడు రివ్యూయర్లు ఆ సినిమాకు సరదాగా ఒక ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ‘మీరు అమ్మాయిలను పడగొట్టాలనుకొంటుంటే ఈ సినిమాను చూడండి..’ అని. ఆ సినిమాలో హీరోయిన్ను పడేయడానికి హీరో ప్లే చేసే ట్రిక్స్ ఆకట్టుకొనేలా ఉండటంతో ఆ లైన్ యాడ్ అయ్యింది. మరి అబ్బాయిలు ఎవరైనా ఆ ప్రయత్నం చేశారో లేదో కానీ... ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను పడగొట్టడానికి మాత్రం బాగా ఉపయోగపడింది! కాపీ అనుకొన్నా, స్ఫూర్తి అనుకొని సమాధానపడినా... ఆ ఇటాలియన్ సినిమా ఆధారంగా ఒక తెలుగు సినిమాను చేసేసి మనకు చూపించేశారు. బాధలోనూ చిరునవ్వును వీడకూడదన్న తత్వాన్ని చాటే ఆ సినిమాను మనోళ్లు అచ్చంగా ‘చిరునవ్వుతో’ పేరుతో దించేశారు. ‘చిరునవ్వుతో’లో వేణు, షహీన్‌లు హీరోహీరోయిన్లుగా రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపొంది 2000 సంవత్సరంలో విడుదల అయిన ఆ సినిమా యూట్యూబ్‌లో ఎక్కువ మంది చూసిన తెలుగు సినిమాల్లో ఒకటి. సెన్సిబుల్ సీన్స్‌తో హ్యూమర్ పండించే ఈ సినిమా ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. ‘అరే భలే తీశారే..’అనిపిస్తుంది. భలే తీయడం అనే క్రెడిట్ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా దర్శక, రచయితలకే దక్కాలి. ఈ సినిమాకు రెండు పార్శ్వాలున్నాయి. రోబర్ట్ బెనిగ్నీ దర్శకత్వంలో అతడే ముఖ్యపాత్రలో నటించగా రూపొందించిన ఈ సినిమాలో తొలిసగం లవ్‌స్టోరీతో సరదాసరదాగా సాగిపోతుంది. రెండో సగం నాజీల విశృంఖల విహారం, హీరో తన తనయుడి అసలు విషయం అర్థంకాకుండా చేయడానికి అంతా ఒక ఆట అని కప్పిపుచ్చుతూ ఆనందపెడుతూ చేసే హృద్యమైన ప్రయత్నాలతో ఉంటుంది. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ అవార్డునుకూడా అందుకొన్న ఈ సినిమాలోని తొలిసగం లోని సీన్లను యథాతథంగా ‘చిరునవ్వుతో’ సినిమాలో వాడేసుకొన్నారు. ఆ సినిమాను చూసిన వారికి కాపీ చేసిన సీన్లను గురించి బాగా అవగాహన ఉంటుంది. ఉదాహరణకు... ఒక సీన్లో హీరోయిన్ థియేటర్లోకి వెళ్లడం చూసి అదే సినిమా టికెట్ కొని లోపలకు వెళతాడు హీరో. ఆమె వెనుకవైపు ఉండటంతో తను స్క్రీన్‌వైపు చూడకుండా వెనక్కి తిరిగి ఆమెవైపు చూస్తుంటాడు. ఇక్కడితో మొదలు పెడితే.. హీరోహీరోయిన్ల మధ్య జరిగే సీన్లన్నింటి కీ మాతృక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమానే. చిరునవ్వుతో సినిమాలో హీరో వేణు తన క్యాప్‌తో గుండు సుందర్శనంతో ఆడే ఫన్నీ గేమ్ ఒరిజినాలిటీ ఇటాలియన్ సినిమాదే. తన ఫ్రెండ్ క్యాప్ తడిసిపోయిందంటూ కొత్త క్యాప్తెచ్చివ్వవా అంటూ హీరోయిన్ సరదాగా దేవుడిని వేడుకోగానే గుండు సుదర్శనం పాత్ర వచ్చి ఆ క్యాప్లాక్కొని తన క్యాప్‌ను అక్కడ పెట్టి వెళ్లడం దానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ సీన్స్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా..! రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వచ్చిన సినిమాను తమ సినిమా నేపథ్యానికి అనుగుణంగా చాలా తెలివిగా సీన్లను కాపీ చేశారు ‘చిరునవ్వుతో’ సినిమా వాళ్లు. అలా అని విమర్శించడానికేం లేదు.. ఎందుకంటే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా చూడని, చూసే అవకాశం లేని వారికి ఆ మ్యాజికల్ సీన్లను ‘చిరునవ్వుతో’ చూపించారు కదా! - బి.జీవన్‌రెడ్డి -
శీను ప్రేయసిగా...
‘అనామిక’ చిత్రం తర్వాత నయనతార మళ్లీ తెలుగు ప్రేక్షకులకు కనిపించలేదు. ఆమె ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ అనువాద చిత్రంతో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు పలకరించనున్నారు. ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా తమిళనాట ఘన విజయం సాధించిన ‘ఇదు కదిరివేలన్ కాదల్’ చిత్రాన్ని ‘శీనుగాడి లవ్‌స్టోరీ’ పేరుతో తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎస్.ఆర్. ప్రభాకరన్ దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రేమకథా చిత్రాలను అమితంగా ఇష్టపడే వారికి ఈ సినిమా కొత్త అనుభూతి కలిగిస్తుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే పాటలను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హారీస్ జయరాజ్, సమర్పణ: డాక్టర్ కె. సూర్యారావు. -
తెలుగు ప్రేక్షకులను మరువలేను: కాజల్
‘పచ్చని పొలాలు... ఆహ్లాదం గొలిపే పర్యాటక ప్రాంతాలున్న తూర్పుగోదావరి జిల్లాకు రావడం ఇదే మొదటిసారి. కాకినాడ రావడం ఆనందంగా ఉంది. ఇక్కడి అభిమానులు నాపై చూపుతున్న ఆప్యాయత మరువలేను.’ అని ప్రముఖ సినీనటి కాజల్‌అగర్వాల్ అన్నారు. మెయిన్‌రోడ్డులో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ‘శ్రీనికేతన్ ఉమెన్స్ షాపింగ్ వరల్డ్’ను ప్రారంభించేందుకు వచ్చిన కాజల్ మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. ప్ర: తూర్పుగోదావరి జిల్లా ఎలా ఉంది? జః చాలా బాగుంది. మళ్లీ రావాలనిపిస్తోంది ప్ర: కాకినాడ కాజా రుచి చూశారా? జః రుచి చూడలేదు. త్వరలోనే మళ్లీ వస్తా. ఈసారి తప్పకుండా కాజా తింటా. ప్రః తెలుగు ఇండస్ట్రీకి దూరమైనట్టున్నారు? జ: అబ్బే అదేం లేదు. తెలుగులో నటిస్తూనే ఉంటా. తెలుగు పరిశ్రమకు దూరమయ్యే ప్రసక్తే లేదు. ప్ర: బాలీవుడ్లో అవకాశాలు ఎలా ఉన్నాయి? జ : మంచి ఛాన్సులు వస్తున్నాయి. ఉత్తరాది ప్రేక్షకులు కూడా మంచి ఆదరణ చూపుతున్నారు. ప్రః ప్రస్తుతం ఏ సినిమాల్లోచేస్తున్నారు? జః ‘జో’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతికి ఇది విడుదలవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో మరో రెండు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్ర : నటిగా మీకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఏది ? జ : ముందు చందమామ.. ఆ తర్వాత మగధీర.. తర్వాత చాలా సినిమాలు ఉన్నాయి. ప్రః తెలుగులో మళ్లీ ఎప్పుడు కనిపిస్తారు? జః తెలుగులో కూడా మంచి ప్రాజెక్టులు ఉంటాయి. తెలుగు ప్రజల ఆదరాభిమానాల వల్లనే ఇవాళ నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. వారిని మరువలేను.