కన్నీళ్లు తెప్పిస్తున్న 'బిచ్చగాడు-2' సాంగ్‌ చెల్లి వినవే.. | Bichagadu 2: Chelli Vinave Full Video Song Out - Sakshi
Sakshi News home page

Bichagadu-2 : కన్నీళ్లు తెప్పిస్తున్న 'బిచ్చగాడు-2' సాంగ్‌ చెల్లి వినవే..

Published Thu, Apr 13 2023 7:53 AM | Last Updated on Thu, Apr 13 2023 9:28 AM

Chelli Vinave Video Song From Bichagadu-2 Is Out Now - Sakshi

‘బిచ్చగాడు’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రంతో తెలుగులో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌ ఆంటోని. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘బిచ్చగాడు–2’ తమిళ, తెలుగు భాషల్లో ఈ వేసవిలో విడుదల కానుంది. విజయ్‌ ఆంటోని హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రంలో కావ్య థాపర్‌ కథానాయిక.

విజయ్‌ ఆంటోని సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెల్లీ వినవే.. నా తల్లీ వినవే, నీ అన్నను కాను అమ్మను నేను, చిట్టీ వినవే.. నా బుజ్జీ కనవే.. నీ పుట్టుమచ్చై ఉంటా తోడు..’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఈ పాటను భాష్య శ్రీ రాయగా అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ‘‘ప్రతి ఒక్కర్నీ కదిలించేలా ఈ పాట సాగుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement