క్లయిమాక్స్‌లో రామానుజన్
Published Thu, Mar 13 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM
గణిత శాస్త్రమేధావి రామానుజన్ జీవిత కథ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రామానుజన్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి జ్ఞాన రాజశేఖరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు పెరియార్, భారతీ వంటి నాయకుల జీవిత కథలను తెరపై ఆవిష్కరించారు. దివంగత నటుడు జెమిని గణేశన్ మనవడు అభినయ్ రామానుజన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన భార్యగా ప్రముఖ కన్నడ, మల యాళ నటి భామ నటిస్తున్నారు. సుహాసిని, అబ్బాస్, శరత్ బాబు, నిళల్‌గల్ రవి తదితరులు నటిస్తున్నారు. చిత్ర విశేషాలను దర్శకుడు తెలుపుతూ రామానుజన్ ప్రఖ్యాత గణితశాస్త్ర మేధావి అన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.
అయితే అలాంటి కీర్తి గడించిన వ్యక్తి తొలి రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు ఆ తరువాత ప్రపంచం ఆయన గణిత శాస్త్ర ప్రావీణ్యాన్ని గుర్తించడం తదితర పలు ఆసక్తికరమైన సంఘటనల సమాహారంగా రామానుజన్ చిత్రం ఉంటుందన్నారు. చిత్రంలోని చాలా సన్నివేశాలను లండన్‌లో చిత్రీకరించినట్లు తెలిపారు. చిత్రంలో చాలా మంది తమిళం తెలిసిన అమెరికన్లు నటించడం విశేషం అని చెప్పారు. తమిళం, ఆంగ్ల భాషల్లో రూపొం దిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి షెడ్యూల్ జరుపుకుంటుందని చెప్పారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
Advertisement
Advertisement