జెమినీ గణేశన్ పేరుతో చిత్రం | JIIVA, THE GEMINI GANESAN | Sakshi
Sakshi News home page

జెమినీ గణేశన్ పేరుతో చిత్రం

Published Tue, Nov 3 2015 2:59 AM | Last Updated on Fri, Aug 17 2018 2:34 PM

జెమినీ గణేశన్ పేరుతో చిత్రం - Sakshi

జెమినీ గణేశన్ పేరుతో చిత్రం

తమిళసినిమా: ప్రఖ్యాత నటుల పేర్లతో చిత్రాలు రావడం అన్నది అరుదైన విషయమే. ఆ మధ్య విశాల్ నటించిన చిత్రానికి ఎంజీఆర్ అనే టైటిల్ నిర్ణయించగా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మదగజరాజా అనే పేరును మార్చాల్సి వచ్చింది. నంబియార్ పేరుతో ఒక చిత్రం తెరకెక్కింది. ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్ పేరుతో ఒక హిందీ అనువాద చిత్రానికి రజనీకాంత్ అంగీకరించకపోవడంతో ఆ చిత్రం విడుదల నిలిచిపోయింది. ఇప్పుడు ప్రఖ్యాత నటుడు జెమినీగణేశన్ పేరుతో ఒక చిత్రం తెరకెక్కడానికి సిద్ధమవుతోంది.

ఈ టైటిల్‌కు జెమినీగణేశన్ కుటుంబం నుంచి అనుమతి లభించినట్లు దర్శకుడు ముత్తుకుమార్ తెలిపారు. ఈయన దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నటుడు జీవా హీరోగా టైటిల్ పాత్రను పోషించనున్నారట. త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని దర్శకుడు వెల్లడించారు.

నటుడు జీవాకు వరుస అపజయాలు ఎదురవ్వడంతో చిన్న గ్యాప్ తీసుకుని వరుసగా చిత్రాలను అంగీకరిస్తున్నారు. నయనతారతో నటిస్తున్న తిరునాళ్ షూటింగ్ తుది దశకు చేరుకుంది. కవలెవైండామ్, కో చిత్రాల టీమ్‌తో మరోసారి కలిసి నటించనున్నారు. ఇకపై వరుసగా తన చిత్రాల విడుదలకు జీవా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement