MGR
-
ఎంజీఆర్ సోదరుడిగా మెప్పించిన చంద్రమోహన్
తమిళసినిమా: సినిమా ముద్దు బిడ్డలు చాలా తక్కువ మందే ఉంటారు. అందులో నటుడు చంద్రమోహన్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఎల్లలు దాటిన నటకులోత్తముడు ఈ చంద్రమోహనుడు. ఐదు దశాబ్దాలకు పైగా అలుపెరుగని నట దురంధరుడు. అందరికీ కావలసిన చంద్రమోహన్ నట జీవితం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చెన్నైనే. ఇక్కడే సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ నటుడిగా ఎదిగిన చంద్రమోహన్. ఆబాల గోపాలానికి ఇష్టుడిగా ముద్రపడ్డారు. అందుకే భాషా భేదం, పక్షపాతం చూడకుండా అన్ని భాషల వారి ఆదరణను పొందిన అతి కొద్దిమంది నటుల్లో ఆయన కూడా స్థానం సంపాదించుకున్నారు. చెన్నై రంగరాజపురంలోని యునైటెడ్ కాలనిలోని చంద్రమోహన్ నివాసం తెలియని చిత్ర ప్రముఖులు, సినీ ప్రియులు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన ఇంటి పక్కనే దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్ నివాసం. వీరిద్దరి మధ్య సినిమాకు అతీతమైన అనుబంధం. చంద్రమోహన్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినీ ప్రేక్షకులకు సుపరిచితులే. ముఖ్యంగా తమిళంలో మక్కళ్ తిలకం ఎంజీఆర్‌తో కలిసి నటించిన ఘనత సాధించారు. నాన్ నమదే అనే సూపర్ హిట్ చిత్రంలో ఎంజీఆర్ కు తమ్ముడిగా చంద్రమోహన్ నటించి తమిళ ప్రేక్షకుల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచి పోయారు. ఆ చిత్రంలో ఎంజీఆర్‌తో కలిసి చంద్రమోహన్ నటించిన అన్బు మలర్ అనే పాట క్లాసిక్‌గా నిలించింది. మరో విషయం ఏమిటంటే ఇది తెలుగులో ఎన్టీఆర్, మురళీమోహన్, బాలకృష్ణ కలిసి నటించిన అన్నదమ్ముల అనుబంధం చిత్రానికి రీమేక్. ఇకపోతే చంద్రమోహన్ తమిళంలో కథానాయకుడిగా నటించిన చిత్రం నీయా. నటి శ్రీప్రియ కథానాయకిగా నటించి నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఏ తరహా పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే చంద్రమోహన్ నటుడిగా ఎప్పటికీ చిరంజీవే అంటే అతిశయోక్తి కాదు. -
ఆ స్టార్ హీరోకి అభిమానిగా కార్తీ..
తమిళ నటుడు కార్తీ స్పీడ్ పెంచారనే చెప్పాలి. వరస సినిమాలతో హిట్స్ కొడుతున్న ఇతడు.. ఈ మధ్య కాలంలో విరుమాన్, పొన్నియిన్ సెల్వన్, సర్ధార్ లాంటి సక్సెస్ఫుల్ చిత్రాలలో ఆకట్టుకున్నారు. తాజాగా ఈయన హీరోగా నటిస్తున్న 25వ చిత్రం 'జపాన్' షూటింగ్ పూర్తయింది. చివరి పాటని ఇటీవలే కశ్మీర్లో కంప్లీట్ చేశారు. ఇప్పుడు కార్తీ కొత్త సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. (ఇదీ చదవండి: చిరంజీవి పూజగదిలో ఆ ఇద్దరి ఫొటోలు..) కార్తీ ప్రస్తుతం నలన్ కుమారసామి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇది కార్తీ 26వ చిత్రం. కృతిశెట్టి హీరోయిన్. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీస్తున్నారు. ఇందులో కార్తీ, తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్ వీరాభిమానిగా నటిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రానికి 'వా వాద్ధియారే' అనే టైటిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ చైన్నె పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దీని తర్వాత కార్తీ.. '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తాడు. ఇందులో అరవిందస్వామి కీలకపాత్ర చేయబోతున్నాడు. గోవింద్ వసంత సంగీతం, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తారు. ఈ చిత్రాన్ని కార్తీ అన్న సూర్యకు చెందిన 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. దీని తర్వాత సర్దార్ 2, ఖైదీ 2 చిత్రాల్లో కార్తీ నటించనున్నాడు. (ఇదీ చదవండి: ఈ తెలుగు హీరోయిన్ని గుర్తుపట్టారా? సుప్రీంకోర్టులో ఇప్పుడు లాయర్‌గా!) -
సుమన్ జైలుకు వెళ్లడంపై బయటికొచ్చిన అసలు నిజాలు.. ఇంతమంది ప్రమేయం ఉందా?
ఆయన అసలు పేరు సుమన్ తల్వార్. మద్రాసులో పుట్టిపెరిగిన ఈ సీనియర్ నటుడు దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి మెప్పించాడు. ఒకప్పట్లో బహుభాషా హీరోగా ఒక వెలుగు వెలిగాడు. కరాటే మార్షల్ ఆర్ట్స్‌లో తనకు టాలెంట్ ఉండటంతో యాక్షన్ సినిమాలకు అప్పట్లో మారుపేరుగా నిలిచాడు. అలా అన్ని భాషల్లో కలిపి దాదాపు 700 చిత్రాలు చేసినా.. తెలుగు సినిమాలోనే సెటిలయ్యాడు. సుమన్ డేట్స్ కోసం ఆ రోజుల్లో దర్శకనిర్మాతలు క్యూకట్టేవారు. చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో కూడా సుమన్ పోటీ పడేవాడు. అయితే నీలి చిత్రాలను సుమన్ తీసినట్లు వచ్చిన ఆరోపణలతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆపై జైలు జీవితం కూడా గడిపాడు. (ఇదీ చదవండి: జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?) ఆ కారణం వల్ల ఒక్కసారిగా ఆయన ఇమేజ్ దెబ్బతిన్నది. సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. దీని వెనుక చాలా మంది హీరోలతో పాటు పరిశ్రమకు చెందిన పలువురు కలిసి పక్కా ప్లాన్‌తో ఆయన్ను ఇరికించారనే ఆరోపణలు వచ్చాయి అవి ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి పేరును కూడా పలువురు ప్రచారం చేశారు. కానీ అందులో నిజం లేదని సుమన్ బహిరంగంగానే పలుమార్లు చెప్పాడు. అసలు విషయం ఏంటనేది ఇప్పటికీ ఆయన చెప్పలేదు. కానీ సుమన్ జైలుకు సంబంధించిన టాపిక్‌పై దివంగత సీనియర్ దర్శకులు సాగర్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగ వైరల్ అవుతున్నాయి. అప్పట్లో అమ్మదొంగా ‘స్టూవర్ట్‌పురం దొంగలు, ఓసినా మరదలా, ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నెంబర్ 1 సహా సుమారు 40 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలా ఆయన అందరికి సుపరిచయమే. ఈ కారణంతోనే జైలుకు వెళ్లాడు నీలి చిత్రాల విషయంలో సుమన్ జైలుకు వెళ్లలేదని ఆ వీడియోలో డైరెక్టర్ సాగర్ తెలిపారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్, అప్పట్లో తమిళనాడులో పనిచేస్తున్న డీజీపీ, ఒక లిక్కర్ కాంట్రాక్టర్ (వడియార్) వీళ్ల ముగ్గురి వల్లే సుమన్ జైలుకు వెళ్లాడని ఆయన చెప్పారు. ఆ సమయంలో లిక్కర్ కాంట్రాక్టర్ చాలా పవర్ ఫుల్ అలాంటి వ్యక్తి కూతురిని సుమన్ ఫ్రెండ్ ఒకరు ప్రేమించాడు. మరోవైపు హీరో సుమన్ అంటే ఆ రాష్ట్ర డీజీపీ కూతురికి చాలా ఇష్టం. అతని సినిమా షూటింగ్ ఎక్కడుంటే ఆ అమ్మాయి కూడా అక్కడికి వచ్చేదని ఆయన చెప్పుకొచ్చాడు. కానీ సుమన్ మాత్రం ఆ అమ్మాయిని ఇష్టపడే వాడు కాదని తెలిపాడు. ఒకరకంగా వన్‌సైడ్ లవ్ అని చెప్పాడు. కానీ డీజీపీ మాత్రం తన కూతురికి ఇప్పటికే పెళ్లి అయిందని, ఆమె సుమన్ ట్రాప్‌లో పడిందనే ఆలోచనతో ఎంజీఆర్‌కు తెలపడం. మరోవైపు సుమన్ ఫ్రెండ్ కూడా లిక్కర్ కాంట్రాక్టర్ కూతురితో ప్రేమ వ్యవహారం. ఈ రెండు విషయాలు సుమన్‌ను ఇబ్బంది పెట్టాయని సాగర్ తెలిపారు. సుమన్ అరెస్ట్ అవుతాడని ఆ నిర్మాతకు ముందే తెలుసు సుమన్ విషయంపై డైరెక్టర్ సాగర్ ఇలా చెప్పారు.. 'ఒకరోజు సుమన్‌ను ఎంజీఆర్ తన ఇంటికి పిలిచి పరోక్షంగా డీజీపీ కూతురికి దూరంగా ఉండాలని సూచించాడు. దీంతో సుమన్ కూడా చెప్పాల్సింది నాకు కాదు ఆ అమ్మాయికి అన్నాడు. అక్కడ ఎంజీఆర్‌కు కొంతమేరకు కోపం వచ్చింది. అలా ఒకరోజు అందరూ చూస్తుండగా నడిరోడ్డులో సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు సుమన్‌పై ఇలాంటి తప్పుడు కేసు పెట్టడంతో పాటు బెయిల్ రాకుండా ఉండే పలు సెక్షన్స్ నమోదు చేశారు. కానీ అప్పట్లో సుమన్‌పై చాలా పుకార్లు వచ్చాయి. అవన్నీ అబద్దాలే. (ఇదీ చదవండి: తమన్నా కోసం ఆ టాప్ హీరోయిన్ను టార్గెట్ చేసిన అజిత్) సుమన్ ఫ్రెండ్‌కు వీడియో క్యాసెట్ల షాప్ ఉండేది. అక్కడికి చాల మంది అమ్మాయిలు వచ్చేవారు కాబట్టి ఈజీగా ఇలాంటి కేసును సుమన్‌పై నమోదు చేశారు. ఇదే సమయంలో సుమన్ అరెస్ట్ కాబోతున్నాడని నిర్మాత దగ్గుబాటి రామానాయుడికి ముందే తెలుసు. ఆ సమయంలో సుమన్‌తో తీయాల్సిన సినిమా ఆపేశాడు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అడిగినా ఆయన తిరిగి సమాధానం చెప్పలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. జైలు నుంచి ఎలా రిలీజ్ అయ్యాడంటే సుమన్ అమ్మగారికి అప్పటి గవర్నర్ PC అలెగ్జాండర్ క్లాస్మేట్ కావడంతో జరిగిన విషయాన్ని ఆయనకు చెప్పడంతో బెయిల్ లభించిందని ఆయన చెప్పాడు. అయినా కూడా సుమారు ఆరు నెలలు జైలు జీవితాన్ని సుమన్ గడిపాడని ఆయన తెలిపాడు. జైలుకు వెళ్తున్న సమయంలో సుమన్ వద్ద ఉన్న డబ్బు,పలు ఆస్తి కాగితాలను తన స్నేహితులకు ఇచ్చాడట. అతను రిలీజ్ అయి బయటకు వచ్చాక వారందరూ కూడా సుమన్‌ను మోసం చేసి డబ్బు ఎగ్గొట్టారని ఆయన తెలిపాడు. అప్పట్లో సుమన్ వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆ సమయంలో అతని మేనేజర్ సారథినే కొంత సాయం చేశారు. తర్వాత మళ్లీ పలు సినిమాలు తీసి జీవితంలో నిలదొక్కున్నాడని సుమన్ గురించి పలు ఆసక్తకరమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సాగర్ చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
చర్చనీయాంశంగా మారిన విశాల్ టాటూ.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పొలిటికల్ ఎంట్రీ మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన సమయంలో ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఆ ఎన్నికల్లో విశాల్ పోటీ చేయలేకపోయారు. కానీ అప్పటినుంచి ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమనే చెబుతూ వస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దిగ్గజ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఫొటోను గుండెలపై టాటూ వేయించుకున్నారు. గతంలో విశాల్ పలుమార్లు తాను ఎంజీఆర్‌కు అభిమాని అని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏ సందర్బం లేకుండా విశాల్ తన ఛాతిపై ఎంజీఆర్ టాటూను వేయించుకోవడం ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో విశాల్ అన్నాడీఎంకే తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని, అందుకే ఆయన ఆ పార్టీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైనా సినిమా కోసం ఇలా టాటూ వేయించుకున్నారా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. #NikilNews23 #NikilVideos *புரட்சி தலைவர் எம். ஜி.ஆர் படத்தை தன் நெஞ்சில் பச்சைகுத்தி இருக்கும் நடிகர் விஷால் அவர்கள்* #Vishal @VishalKOfficial @HariKr_official @VffVishal #MGR pic.twitter.com/AmmqIsook5 — Nikil Murukan (@onlynikil) January 24, 2023 -
హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎంజీఆర్ మనువడు.. రిలీజ్‌కు రెడీ
తమిళసినిమా: ఎంజీఆర్ మనవడు జూనియర్ ఎంజీఆర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇరుంబన్. నటి ఐశ్వర్య దత్తా నాయకిగా నటించిన ఇందులో నటుడు యోగిబాబు, సెండ్రాయన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కీరా దర్శకత్వంలో తమిళ్ బాలా, ఆర్.వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం స్థానిక కేకేనగర్‌లోని శాంతి మెట్రిక్యులేషన్ స్కూల్లో నిర్వహించారు. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ చిత్ర ఆడియోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరంభ దశలో నటుడు విజయ్‌కు ఆయన తండ్రి దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ సపోర్ట్ చేశారని, అయితే విజయ్ సూపర్‌స్టార్‌గా ఎదగడానికి ఆయన కఠిన శ్రమే కారణమన్నారు. ఇప్పుడు డాన్స్‌లో ఇండియాలోనే విజయ్ను మించిన వారు లేరన్నారు. నటుడు ధనుష్‌కు కూడా మొదట్లో ఆయన తండ్రి అండగా ఉన్నారని, తన ప్రతిభతోనే అగ్ర హీరోగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎంజీఆర్ మనవడిగా సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న జూనియన్ ఎంజీఆర్ కూడా కష్టపడితేనే తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఇరుంబన్ చిత్ర పాటలు, ట్రైలర్ బాగున్నాయని సీమాన్ అన్నారు. చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
మా నాన్నతో ఎంజీఆర్‌కు జరిగిన గొడవను వెబ్ సిరీస్‌గా తీస్తున్నా: రాధిక
Radhika About Her Father MR Radha And MGR: రాధిక శరత్ కుమార్.. తెలుగు ప్రేక్షకులు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 80, 90లో స్టార్ హీరోయిన్గా ఆమె సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పారు. ‘న్యాయంగా కావాలి’ సినిమాలో ధైర్యవంతమైన యువతిగా.. స్వాతిముత్యంలో అభినయం పోషించిన రాధిక ఫైర్‌బ్రాండ్ అనే గుర్తింపు పొందారు. దాదాపు ఆమె దక్షిణాదికి చెందిన అందరు స్టార్ హీరోలు, లెజెండరి నటులతో కలిసి నటించారు. తమిళ నటుడు ఎం.ఆర్ రాధా వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన రాధిక తనకంటు సొంత గుర్తింపును ఎర్పరుచుకున్నారు. చదవండి: కాజల్ కొడుకు పేరు ఏంటో తెలుసా? ప్రస్తుతం తల్లి పాత్రలు, సీరియల్స్‌లో నటిస్తూనే మరోపక్క సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా మారారు. ఇటీవల ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో నటించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె ఓ షోకు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా రాధిక పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. న్యాయం కావాలి సినిమా టైంలో చిరంజీవిని కొట్టే సీన్ నిజంగా కొట్టానని, దీనికి తను 23 టేకులు తీసుకున్నానన్నారు. ఆ తర్వాత చూస్తే చిరంజీవి ముఖం ఎర్రగా వాచిపోయిందంటూ రాధిక ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. చదవండి: కొత్త జంటకు రణ్‌బీర్ తల్లి కళ్లు చెదిరే ఫ్లాట్ గిఫ్ట్, ఖరీదెంతంటే! ఆనంతరం ఆమె తమిళ ఇండస్ట్రీలో తన తండ్రి ఎం.ఆర్ రాధా, ఎంజీఆర్ మధ్య చోటు చేసుకున్న వివాదంపై తాను ఓ వెబ్ సీరిస్ తీస్తున్నట్లు చెప్పారు. కాగా ఆమె తండ్రి ఎం.ఆర్. రాధా హీరోగానే కాదు, పవర్ఫుల్ విలన్‌గా కూడా ప్రేక్షకులను మెప్పించారు. అదే సమయంలో తన తండ్రికి, ఎంజీఆర్‌తో మధ్య వివాదస్పద గొడవలు చోటు చేసుకున్నాయి. అయితే వాటిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆ విషయాలను గురించి రాధిక మాట్లాడుతూ.. ‘మా ఫాదర్ వివాదాస్పదమైన వ్యక్తి అనే విషయం తెలిసిందే. అప్పట్లో ఆయనకి .. ఎంజీఆర్‌కి ఏవో గొడవలు ఉండేవి. చదవండి: బాహుబలిని మించిన సినిమా తీస్తా: కమల్ ఆర్ ఖాన్ వాళ్లిద్దరి మధ్య చోటుచేసుకున్న కాల్పుల సంఘటన గురించి చాలామందికి తెలుసు. ఆ సంఘటన నేపథ్యంలోనే ఒక వెబ్ సిరీస్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. జులై నుంచి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుంది. నా కెరియర్ నా చేతిలో ఉండాలనే ఉద్దేశంతోనే 'రాడాన్' సంస్థను స్థాపించాను. మా బ్యానర్ మంచి పేరు తెచ్చుకోవడం ఆనందంగా ఉంది. మా బ్యానర్ ద్వారా మరిన్ని మంచి ప్రాజెక్టులు చేయాలనే ఆలోచనలో ఉన్నాము’ అని ఆమె చెప్పుకొచ్చారు. -
‘ఆ సన్నివేశాలు ఎంజీఆర్, జయలలితలను కించపరిచేలా ఉన్నాయి’
‘తలైవి’ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో వాస్తవిక తప్పిదాలు ఉన్నాయని అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) నేత, మాజీ మంత్రి డి జయకుమార్ పేర్కొన్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారం ‘తలైవి’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా శుక్రవారం(సెప్టెంబర్ 10) తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ నేపథ్యంలో చెన్నైలో తలైవి మూవీ చూసిన అన్నాడీఎంకే నేత డి జయకుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు. చదవండి: మరో విషాదం: ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తలైవి చిత్రాన్ని ఏఎల్ విజయ్ చాలా చక్కగా తెరకెక్కించారన్నారు. అయితే ఇందులో ఎంజీఆర్, జయలలిత మధ్య జరిగిన కొన్ని సన్నేవేశాల పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని సన్నివేశాలను తప్పుగా చూపించారని.. ఎంజీఆర్, జయలలితకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వనట్లుగా ఉన్నాయన్నారు. అవి వారిద్దరినీ కించపరిచేలా ఉన్నాయని వెంటనే ఆ సీన్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకులు, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి, కరుణానిధిగా నాజర్, లీడ్‌రోల్ కంగనా నటించారు. ఈ మేరకు వారిమధ్య జరిగిన కొన్ని సీన్లపై మాజీ మంత్రి జయకుమార్ స్పందించారు. ఎంజీఆర్ తొలి డీఎంకే ప్రభుత్వంలో ఎన్నడూ పదవులు ఆశించలేదన్నారు. చదవండి: చికిత్సకు స్పందిస్తున్న సాయిధరమ్‌తేజ్, బయటకొచ్చిన వీడియో కానీ ఈ చిత్రంలో ఆయన మంత్రి పదవి కోరగా దీనిని అప్పటి డీఎంకే సీఎం అన్నాదురై, ఎం కరుణా నిధిలు అడ్డుకున్నట్లు చూపించారు. ఇది నిజం కాదని, ఎందుకంటే నాటి డీఎంకే సీఎం అన్నాదురై ఎంజీఆర్‌ను మంత్రిని చేయాలనుకున్నారన్నారు. కానీ ఎంజీఆర్ స్వయంగా మంత్రి పదవిని తిరస్కరించారని, దీంతో అన్నాదురై కొత్తగా ఓ శాఖను కేటాయించి దానికి ఆయనను డిప్యూటీ చీఫ్‌గా నియమించారని చెప్పారు. ఇక 1969లో అన్నాదురై మరణించిన అనంతరం సీఎంగా కరుణా నిధి పేరును సూచించింది ఎంజీఆర్యే అని జయకుమార్ వెల్లడించారు. ఆ తరువాత ఎంజీఆర్, కరుణానిధి మధ్య విభేదాలు తలెత్తడంతో 1972లో డీఎంకే నుంచి బయటకు వచ్చిన ఎంజీఆర్ సొంతంగా అన్నాడీఏంకే పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. చదవండి: Kangana Ranaut: ‘తలైవి’ మూవీ రివ్యూ -
స్క్రీన్ వెనకాల పడ్డ కష్టం ప్రేక్షకులకు కనపడదు
‘‘ఒక మంచి పాత్రలో నటించడానికి ప్రిపేర్ అవ్వడం ఒక ఎత్తు అయితే, కెమెరా ముందు సరిగ్గా చేయడం మరో ఎత్తు. ఎంత కష్టపడ్డాం అనేది ముఖ్యం కాదు. స్క్రీన్‌పై మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నదే ముఖ్యం. ఎందుకంటే స్క్రీన్‌పై మంచి నటన కనబర్చడానికి స్క్రీన్ వెనకాల ఎంత కష్టపడ్డామో ప్రేక్షకులకు కనపడదు’’ అన్నారు అరవింద్ స్వామి. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘తలైవి’. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించగా, దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి చేశారు. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానున్న సందర్భంగా అరవింద్ స్వామి చెప్పిన విశేషాలు. ►ఎంజీఆర్ (ఎం.జి. రామచంద్రన్), శివాజీ గణేశన్ గార్ల సినిమాలు చూస్తూ పెరిగాను. కేవలం సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ఎంజీఆర్‌గారు తనదైన ముద్ర వేశారు. దర్శకుడు ఏఎల్ విజయ్‌గారు ‘తలైవి’లో ఎంజీఆర్ పాత్రను నాకు ఆఫర్ చేసినప్పుడు పెద్ద బాధ్యత అనిపించింది. ►ఎంజీఆర్గారిలా ట్రాన్స్ఫామ్ అయి, ఆ పాత్ర చేయడం చాలెంజ్లా భావించాను. పాత్ర పరంగా నేను ఏ చిన్న తప్పు చేసినా ప్రేక్షకులు, ఆయన అభిమానులు బాధపడే అవకాశం ఉంది. వాళ్లను దృష్టిలో పెట్టుకుని, నటుడిగా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి వందశాతం కష్టపడాలని నిర్ణయించుకున్నాను. ఎంజీఆర్గారిని అభిమానించేవారందరూ నేను పోషించిన పాత్ర చూసి హ్యాపీ ఫీలవ్వాలని అనుకున్నాను.! ►నిజానికి ఎంజీఆర్‌గారి బాడీ లాంగ్వేజ్‌కి నా బాడీ లాంగ్వేజ్ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆయన మేనరిజమ్స్ సినిమాల్లో ఒకలా, సాధారణ జీవితంలో మరోలా ఉంటాయి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కోసం కష్టపడ్డాను. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో, నటుడిగా ఎదిగాక, ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయన ఆరోగ్యంగా లేనప్పుడు.. ఇలా ఓ నాలుగు భాగాలుగా విభజించుకుని లుక్స్ పరంగా ప్రిపేర్ అయ్యాను. ►నేను ఎంజీఆర్‌ను కాదు... అరవింద్ స్వామిని. తెరపై ఆయనలా కనిపించడానికి ప్రయత్నించాను. ఒక నటుడిగా ఆయన పాత్ర చేశాను.. అంతే. ‘ధృవ’ సినిమా తర్వాత తెలుగులో పెద్ద ఆఫర్స్ వచ్చాయి. కానీ కుదర్లేదు. ఇప్పుడు కరెక్ట్ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాను. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా చూడను. కథ ఆసక్తికరంగా ఉంటే చాలు. ►ఇరవయ్యేళ్ల క్రితమే నాకు దర్శకత్వం అంటే ఆసక్తి కలిగింది. కానీ యాక్టర్‌గా ఉన్న కమిట్మెంట్స్, ఇతర వ్యాపార వ్యవహారాల వల్ల డైరెక్షన్ చేయలేకపోయాను. ఇటీవల ‘నవరస’ ఆంథాలజీలో ‘రౌద్రం’ భాగానికి దర్శకత్వం వహించడం హ్యాపీ. ప్రస్తుతం నా దగ్గర నాలుగు కథలున్నాయి. ఇవన్నీ మానవీయ సంబంధాల ఆధారంగా తయారు చేసుకున్న కథలే. -
పులమైపిత్తన్ కన్నుమూత.. ఎంజీఆర్‌తో 22 ఏళ్ల పరిచయం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రిసీడీయం మాజీ చైర్మన్, సినీ పాటల రచయిత, కవి పులమైపిత్తన్(86) అనారోగ్యంతో బుధవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సీఎం ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే నేతలు పన్నీరు సెల్వం, పళనిస్వామి నివాళులరి్పంచారు. తమిళ సినీ రంగంలో దివంగత సీఎం ఎంజీఆర్ నటించిన అనేక హిట్ చిత్రాలకు గేయ రచయితగా పనిచేసి పులమైపిత్తన్ తెర మీదకు వచ్చారు. అన్నాడీఎంకే ఆవిర్భావంతో ఎంజీఆర్ వెన్నంటి నడిచారు. వీరిద్దరి మధ్య 22 ఏళ్ల పరిచయం ఉంది. చదవండి: మరణంలోనూ వీడని స్నేహబంధం.. అందరూ యువకులే ఆ పార్టీ ప్రిసీడీయం చైర్మన్‌గా, గేయ రచయితగా గుర్తింపు పొందారు. దివంగత డీఎంకే అధినేత కరుణానిధి మెప్పును సైతం పొందారు. ఎమ్మెల్సీగా ప్రజా సేవలో ఉంటూనే, శివాజీ గణేషన్, కమల్, రజనీకాంత్ వంటి నటుల చిత్రాలకు అనేక సూపర్ హిట్ పాటల్ని అందించారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి నాలుగుసార్లు ఉత్తమ గేయ రచయిత అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈనెల 1న ఆయన్ని అడయార్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి బుధవారం ఉదయం 9.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారంతో అన్నాడీఎంకేలో విషాదం అలముకుంది. దర్శకుడు భారతీరాజా సహా ఇతర సినీప్రముఖులు పిత్తన్ భౌతికకాయానికి నివాళులరి్పంచారు. కాగా నీలాంకరైలోని ఆయ న నివాసంలో ఆప్తులు, పార్టీ వర్గాల సందర్శనార్థం భౌతిక కాయన్ని ఉంచారు. గురువారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు జరిపించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. పీఎంకే అధినేత రాందాసు, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, ఎండీఎంకే నేత వైగో, సంగీత దర్శకుడు ఇళయారాజా, నటుడు, మక్కల్ నీదిమయ్యం నేత కమల్‌హాసన్ తదితరులు సంతాపం తెలిపారు. చదవండి: శశికళకు మరో భారీ షాక్: రూ.వంద కోట్ల ఆస్తులు సీజ్ -
యంజీఆర్ పాత్రలో నటించింది ఎవరు?
ప్రస్తుతం కథల్ని కథానాయికలు కూడా నడుపుతున్నారు. హీరోయిన్ ప్రాధాన్య చిత్రాలకూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం సెట్స్‌మీద లేడీ ఓరియంటెడ్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ సినిమాలపై స్పెషల్ క్విజ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1571342813.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1591342813.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నేను ఎంజీఆర్ రాజకీయ వారసుడ్ని: కమల్
సాక్షి, చెన్నై: దివంగత ఎంజీఆర్ కలను సాకారం చేస్తే, ఆయనకు తానే రాజకీయ వారసుడ్ని అని మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తిరునల్వేలి, కన్యాకుమారిలో కమల్ పర్యటించారు. విద్యార్థులు, యువ సమూహం, మహిళాలోకంతో సమావేశం అయ్యారు. మీడియాతో కమల్ మాట్లాడుతూ రజనీ సిద్ధాంతాలు వేరు, తన సిద్ధాంతాలు వేరని, అయితే, తామిద్దరం మంచి మిత్రులం అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో తమ సిద్ధాంతాలు ఒకే రకంగా ఉంటాయా అన్నది రజనీ చేయబోయే వ్యాఖ్యలు, నిర్ణయాలపై ఆధారపడి ఉందన్నారు. మార్పు జరుగుతుందని ఆశిద్దామని, ఆయనతో రహస్యాలు ఏవీలేవు అని, బహిరంగంగానే రజనీకి తాను ఆహ్వానం పలికేశానని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బహిరంగంగానే మళ్లీ పిలుస్తున్నానని, తన కూటమిలోకి రావాలంటూ చమత్కరించారు. టార్చ్‌లైట్ చిహ్నం కోసం ప్రయ త్నాలు చేస్తున్నారని, దక్కుతుందని భావిద్దామన్నారు. మక్కల్ నీది మయ్యం నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అన్నది సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంటూ, అందుకు తగ్గ పరిస్థితుల కోసం వేచి చూద్దామన్నారు. ఎంజీఆర్ కలను సాకారం చేయగలిగితే, ఆయనకు తానే వారసుడ్ని అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వదులుకోను.. టార్చ్‌లైట్ చిహ్నం కోసం మక్కల్ నీది మయ్యం ఈసీని అభ్యర్థించేందుకు సిద్ధమైంది. ఈ చిహ్నంను వదులుకునే ప్రసక్తే లేదని ఎంజీఆర్ మక్కల్ కట్చి నేత విశ్వనాథన్ తెలిపారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆ పార్టీ కన్నా ముందే, తాము సంఘంగా ఉన్నప్పుడే ఎన్నికల్లో పోటీ చేశామని, ఇప్పుడు రాజకీయపార్టీగా నమోదు చేసుకున్నామని గుర్తు చేశారు. తమకు టార్చ్‌లైట్ చిహ్నంను ఎన్నికల కమిషన్ కేటాయించిందని, కమల్ వచ్చి అభ్యర్థించినా, ఆ చిహ్నంను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజకీయ ఆశ.. స్టార్లు అందరూ రాజకీయపార్టీలపై దృష్టిపెట్టడంతో నటుడు పార్థిబన్లోనూ ఆశలు చిగురించినట్టున్నాయి. పుదుచ్చేరిలో జరిగిన ఒత్త సెరుప్పు చిత్ర అవార్డు కార్యక్రమంలో పార్థిబన్ తన మదిలో మాటను బయటపెట్టారు. అందరూ రాజకీయపార్టీలు పెట్టేస్తున్నారని, విజయ్ కూడా పెట్టేస్తాడేమో అని పేర్కొంటూ, తాను ఓ రాజకీయపార్టీ పెట్టా లన్న ఆశతో ఉన్నట్టు, భవిష్యత్తులో ఇది జరుగుతుందేమో ఆ పార్టీకి పుదియపాదై అని పేరు పెట్టనున్నట్టు ప్రకటించారు. దీంతో చప్పట్లు మార్మో గాయి. చివరకు దీనిని సీరియస్‌గా తీసుకోకూడదని, కేవలం కామెడీ అంటూ ముగించారు. తన కుమార్తె రాజకీయాల్లోకి వస్తే, ఆమెకు మద్దతుగా ప్రచారం చేస్తానంటూ నటుడు సత్యరాజ్ ఓ మీడి యా ప్రశ్నకు సమాధానం ఇవ్వడం గమనార్హం. -
మ్యాజిక్ జరిగింది
కాల్పనిక పాత్రలు చేయడం సులువు అనలేం కానీ నిజజీవిత పాత్రలు చేయడంలో ఉన్న కష్టం అయితే కచ్చితంగా ఉండదు. ప్రముఖుల జీవిత కథల్లో నటించేటప్పుడు హావభావాలు, నడక, మాట... అన్నీ వారినే తలపించేలా ఉండాలి. అందుకే పురట్చి తలైవర్ (విప్లవ నాయకుడు) ఎంజీఆర్ పాత్ర ఒప్పుకున్నప్పుడు అరవింద్ స్వామి చాలా కసరత్తులు చేశారు. చివరికి ‘డెంటిస్ట్’ దగ్గరకు వెళ్లి తన పళ్లు ఎన్టీఆర్ పళ్లకి మ్యాచ్ అయ్యేలా ఉన్నాయా? అని కూడా చెక్ చేసుకున్నారంటే ఆయన ఎంత పర్ఫెక్షనిస్టో ఊహించవచ్చు. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కించిన ‘తలైవి’లో దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పాత్రను చేశారు అరవింద్ స్వామి. ఈ పాత్ర చిత్రీకరణ మంగళవారంతో పూర్తయింది. ‘‘చివరిసారిగా నన్ను పురట్చి తలైవర్ అందానికి దగ్గరగా తన పనితనంతో మ్యాజిక్ చేస్తున్న రషీద్‌కి ధన్యవాదాలు’’ అంటూ మేకప్ చేయించుకుంటున్న ఫొటోను షేర్ చేశారు అరవింద్ స్వామి. జనవరి 17న ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఈ ఏడాది విడుదల చేసిన అరవింద్ స్వామి లుక్‌కి మంచి స్పందన లభించింది. అరవింద్ స్వామి అన్నట్లు మేకప్ ఆర్టిస్ట్ పట్టణమ్ రషీద్ మ్యాజిక్ చేశారు. ‘తలైవి’గా కంగనా రనౌత్ నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
తలైవీ షూటింగ్ షురూ..!
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవతం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా 'తలైవీ'. ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు. దాదాపు ఏడు నెలల తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. వీటికి సంబంధించి సినిమా డైరెక్టర్ ఏఎల్ విజయ్‌తో కలిసి సెట్స్‌లో దిగిన ఫోటోను తన ట్విట్టర్లో షేర్ చేసింది. విజయ్ టాలెంట్ ఉన్న డైరెక్టరే కాకుండా మంచి వ్యక్తని కంగనా తెలిపింది. కంగనా పోస్ట్ చేసిన ఫొటోలో చీరకట్టులో కనిపించగా డైరెక్టర్ ఆమెకు సీన్ వివరిస్తున్నారు. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నా నాకు ఇష్టమైంది మాత్రం సినిమా సెట్ అని కంగనా ట్విట్టర్లో పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా కంగనా గత కొన్ని నెలలుగా హిమాచల్ ప్రదేశ్‌లోని తన ఇంటి వద్దే ఉంటుంది. Good morning friends, these are some stills from yesterday’s early morning scene discussion with my absolutely talented and most affectionate director A.L Vijay ji, there are many amazing places in this world but the most soothing and comforting to me is a film set #Thalaivi pic.twitter.com/qGjw0nQjRQ — Kangana Ranaut (@KanganaTeam) October 5, 2020 జయలలిత సినీ ప్రస్థానం మొదలుకొని రాజకీయాల్లో తలైవీగా ఎలా మారిందన్న అంశాలు ఈ సినిమాలో చూపించనున్నారు. గత ఏడాది నవంబర్‌లో జయలలిత జయంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దివంగత ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషలో ఈ సినిమా తెరకెక్కనుంది. -
చిత్రసీమ
సృజన.. సృష్టిలో చిత్రాలన్నిటినీ పోగేసేదాకా ఊరుకోదు. కన్వాస్, బ్రష్ రెస్ట్ తీసుకుంటే కంప్యూటర్, ఫొటోషాప్ వర్క్ మోడ్‌లోకి వెళ్తాయి. సాంస్కృతిక పునరుజ్జీవన కాలానికి, ‘పెరియారుమ్ పెరుమాళ్’ సినిమా పోస్టర్‌కు ముడి పెడ్తాయి. విన్సెంట్ వాంగో ప్రపంచ ప్రఖ్యాత పెయింటింగ్ ‘‘వీట్ ఫీల్డ్ విత్ సైప్రెసెస్’లో అమాయకమైన చిరునవ్వుతో సిల్క్‌స్మిత ప్రత్యక్షమవుతుంది. ఎడ్వర్డ్ మూంక్ ‘ది స్క్రీమ్’కి ‘అధే కంగళ్’ సినిమా జతకూడుతుంది. కత్సుషిక హొకుసై వేసిన ‘ది గ్రేట్ వేవ్ ఆఫ్ కనగవా’’లోకి ‘ఉలగమ్ సుట్రుమ్ వాలిబన్’ హీరో ఎమ్జీ రాంచంద్రన్ దూరిపోతాడు. ఎడ్వర్డ్ హోపర్ ‘ఆటోమాట్’ ముందు వెటరన్ నటి కేఆర్ విజయ ప్రత్యక్షమవుతారు చేతిలో టీ కప్పుతో. ఇలా ఆ కాలం చిత్రాలతో బయోస్కోప్ బొమ్మలను జత చేసి విచిత్రాలు చేస్తున్న ఆ ఆర్టిస్ట్ పేరు చార్ల్స్ బ్రిటో. చైన్నై కుర్రాడు. ఇంజనీరింగ్ చదివాడు. సినిమా ఫీల్డ్‌లో కెరీర్ వెదుక్కున్నాడు. ‘రెవలేషన్స్’ అనే ఇండీ, తమిళ్ సినిమాతోపాటు కొన్ని షార్ట్ ఫిల్మ్స్కీ పనిచేశాడు. ఆర్ట్ మీదున్న ఆసక్తితో తర్వాత జేఎన్‌యూలోని ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్‌లో మాస్టర్స్ చేశాడు. ఓ వైపు సినిమాలకు పనిచేస్తూనే ఇలా మాష్ అప్ ఆర్ట్‌తో మ్యాజిక్స్ చేస్తున్నాడు. ‘‘మాష్ అప్‌కి నేనేం కొత్తకాదు. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో చాలా మంది ఆర్టిస్ట్‌లు మాష్ అప్ చేస్తున్నారు. నేనైతే ‘తబ్రేజ్’ వర్క్స్‌తో ఇన్స్పైర్ అయ్యా. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాను కూడా. తబ్రేజ్ వర్క్స్‌ని బయట కొనుక్కుంటున్నారు కూడా. నాకూ అలాంటి రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. వాళ్ల పర్సనల్ ఫొటోగ్రాఫ్స్‌ని ఇలా వరల్డ్ ఫేమస్ పెయింటింగ్స్‌తో మాష్ అప్ చేసి ఇవ్వమని. సో.. నేను కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నాను’’ అంటున్నాడు చార్ల్స్ . ఒక దర్శకుడైతే ఏకంగా మూడువందల మాష్ అప్స్ చేసివ్వమని అడిగాడట. ‘‘నా మాష్ అప్స్‌కి వచ్చిన డిమాండ్ నాకే ఆశ్చర్యంగా ఉంది. అందుకని ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా తెరిచా. ఫొటోగ్రాఫర్స్, సినిమా డైరెక్టర్స్ నుంచి ఒకటే కాల్స్ వస్తున్నాయి’’ అని చెప్పాడు చార్ల్స్ బ్రిటో. చెప్పినట్టుగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ మాష్ అప్స్ అన్నీ వైరల్ అవుతున్నాయట. -
ఎర్రమల్లెలు వాడిపోయాయి....
నరసాపురం: ఎర్రమల్లెలు వాడిపోయాయి.. గలగలా వాక్ప్రవాహం ఆగిపోయింది.. ‘అదికాదు అబ్బాయి’ అంటూ ఆప్యాయంగా మాట్లాడే కంఠం మూగబోయింది.. సినీరచయిత, సీపీఐ సీనియర్ నేత మంచిగంటి రామారావు(87) శనివారం సాయంత్రం నరసాపురం పట్టణం చినమామిడిపల్లిలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు. ఒక కుమారుడు నారాయణరావు జర్నలిస్ట్‌గా పనిచేస్తూ మూడేళ్ల క్రితం మృతి చెందారు. ఎంజీఆర్‌గా సుపరిచితుడైన రామారావు ప్రజానాట్యమండలిలో చురుగ్గా పనిచేస్తూ సినీరంగంవైపు మళ్లారు. పలు విప్లవ సినిమాలకు కథలు, మాటలు అందించారు. ప్రజానాట్య మండలి ఏర్పడిన తొలినాళ్లలోనే అందులో చేరి విశేష సేవలు అందించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజానాట్యమండలి తరఫున పలు ప్రదర్శనలు ఇచ్చారు. తన 21వ ఏట నుంచే సీపీఐలో చేరి పలు ప్రజాసమస్యలపై పనిచేశారు. ఆయన తొలితరం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్లో ఒకరు. 1950 నుంచి సీపీఐలో క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. రాష్ట్ర ప్రజానాట్యమండలి ఉపాధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రజానాట్యమండలి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా మాదాల రంగారావుకు పేరు తెచ్చిన ఎర్రమల్లెలు, యువతరం కదిలింది చిత్రాలకు కథా సహకారం అందించడమే కాకుండా మాటలు అందించారు. ధవళ సత్యం దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు మాటలు అందించారు. ఆయన మృతిపై నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, సీపీఐ రాష్ట్ర కమటి సభ్యుడు నెక్కంటి సుబ్బారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ సంతాపం తెలిపారు. ఆదివారం రామారావు భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎర్ర సినిమా చిరునామా.. ఎంజీఆర్ నర్సాపురం కాలువ.. పొడవునా దుమ్ము రేగే కంకర రోడ్డు... సైకిల్ హ్యాండల్కి ఒక పక్క తెల్లని సత్తు క్యారియర్.. మరో పక్క ఎర్రని జెండా... ఇదీ దశాబ్దాల క్రితం దృశ్యం. ఆ కష్టజీవికి అటుపక్క, ఇటుపక్క నిలబడి కాపుకాచిన కలం వీరుడు ఎంజీ రామారావు! వృత్తి రెవెన్యూ విభాగం.. ప్రవృత్తి సాంస్కృతిక రంగం. అందరూ బాబాయ్ అని పిలిచే ఆత్మీయుడు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తుదికంటా నిలిచిన కమ్యూనిష్టాగరిస్టుడు. నాకు తెలిసి వెండి తెరపై ఎర్ర జెండా ఎగురవేసిన వారిలో ఒకడు. మా భూమి నాటకంలా ఈయన రాసిన ఎర్రమట్టి నాటకం తెలుగునాట ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో గ్రామగ్రామాన ప్రదర్శించారు. కథ, నాటకం– కళ ఏదైనా ఆర్ట్‌ఫామ్ ఉండాలనేది ఎంజీఆర్ ఎప్పుడూ చెప్పేమాట. ఆయన రాసిన ఇరుసు, సత్యంవధ, జ్వాలాశిఖలు, యుగసంధి నాటకాలు పరిషత్ వేదికలపై బహుమతులు అందుకున్నాయి. చేతిలో డైరీ.. గలగలా వాక్ప్రవాహం.. ‘అదికాదు అబ్బాయి’ అని చెప్పే మాటలు వినడానికి తాడేపల్లిగూడెం వస్తే చాలు ఆయన చుట్టూ గుమిగూడేవారం. కుర్రకారు ఆయన ఫ్యాన్స్. కబుర్ల మధ్య కాలం కరిగిపోయేది. మా నాటకాల బ్యాచ్ ఇంతే అబ్బాయి అని ముక్తాయించి నర్సాపురం మొదటి బస్సుకు బయల్దేరేవారు. ఇప్పుడు.. మరెప్పటికీ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. –ఎస్.గుర్నాథ్ -
యంజీఆర్ – యంఆర్ రాధల కథేంటి?
తమిళ సినీ చరిత్రలో యంజీఆర్‌ను యంఆర్ రాధా తుపాకితో కాల్చడం పెద్ద సంచలనంతో పాటు మిస్టరీ. ఈ సంఘటన తమిళ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోనిది, ఎప్పుడూ చర్చ జరిగే టాపిక్. ఈ కాల్పుల్లో యంజీఆర్ తన గొంతును కోల్పోవడం, ఆ తర్వాత మాటల్లో స్పష్టత లోపించడం తమిళ ప్రేక్షకులకు తెలుసు. ఎంజీఆర్‌ను కాల్చిన సంఘటనలో రాధా అరెస్ట్ కావడం తెలిసిందే. ఇప్పుడు ఆ సంఘటన వెనక ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంటుందని తమిళ ప్రే„ý కులు భావిస్తున్నారు. దానికి కారణం.. యంఆర్ రాధా మీద ఓ బయోపిక్ రూపొందనుండటమే. నటి, యంఆర్ రాధ కుమార్తె రాధిక తన సొంత బ్యానర్ రధన్ మీడియా వర్క్స్‌పై ఈ బయోపిక్‌ను నిర్మించనున్నారు. రాధా మనవడు ఐకీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో రాధ పాత్రలో శింబు, యంజీఆర్ పాత్రలో అరవింద స్వామిని ఎంపిక చేసినట్టు సమాచారం. గత ఏడాదే మణిరత్నం ‘చెక్క చివంద వానమ్’ (తెలుగులో నవాబ్) సినిమాలో అరవింద స్వామి, శింబు అన్నదమ్ములుగా యాక్ట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. మళ్లీ మరోసారి కలసి నటించబోతున్నారన్న మాట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఎంజీఆర్ లతను తడిమిన దానికంటే ఘోరంగా ఆడుతున్నారు..
తమిళనాడు, పెరంబూరు: నటి కస్తూరికి దక్షిణ భారత నటీనటుల సంఘం నోటీసులు జారీ చేసింది. నటి కస్తూరి ఇటీవల ప్రతి విషయానికి స్పందిస్తూ ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలను పొందుపరుస్తూ వార్తలకెక్కుతోంది. అదే విధంగా ఇటీవల జరిగిన టీ.20 క్రికెట్ క్రీడను తిలకిస్తూ కోల్‌కొత్తా టీమ్ నత్తనడక క్రీడపై ట్విట్టర్లో ఏంటయ్యా పళ్లాండు వాళ్గ చిత్రంలో ఎంజీఆర్ నటి లతను తడిమిన దానికంటే ఘోరంగా ఆడుతున్నారు అని పేర్కొంది. ఇది కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. అన్నాడీఎంకే కార్యకర్తలు, ఎంజీఆర్ అభిమానులు నటి కస్తూరిని సామాజిక మాధ్యమాల్లో ఏకేస్తున్నారు. ఇక నటి లత కూడా కస్తూరికి సీరియస్‌గా హెచ్చరించారు. ఇలాంటి చీప్ ట్వీట్లతో ప్రచారం పొందాలను చూడడం కంటే మరేదైనా చేసుకోవచ్చుగా అని విమర్శించారు.కాగా నటి కస్తూరి వ్యవహారం గురించి దక్షిణభారత నటీనటులు సంఘం స్పందిస్తూ ఆమెకు నోటీసులు జారీ చేశారు. అందులో ఎంజీఆర్, నటి లతలపై, ఆమె చేసిన కామెంట్‌కు విరవణ ఇవ్వాల్సిందిగా పేర్కొన్నారు. నటి కస్తూరి తాను నటి లతపై ఎలాంటి విమర్శలు చేయలేదని, అయినా తన ట్వీట్ ఎవరినైనా బాధించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని మరో ట్వీట్ చేసింది. కాగా నటీనటుల సంఘానికి ఏం వివరణ ఇచ్చుకుంటుందో చూడాలి. -
ఉలగమ్ సుట్రుమ్ వాలిబన్
ఉలగమ్ సుట్రుమ్ వాలిబన్..అంటే.. లోకం చుట్టిన యువకుడు అని అర్థం‘ఉలగమ్ సుట్రుమ్ వాలిబన్... ’ సూపర్ హిట్ సినిమా‘నాడోడి మన్నన్’... బంపర్ హిట్‘ఆయిరత్తిల్ ఒరువన్’... కనకవర్షం కురిపించిన మరో హిట్ మూవీ‘రిక్షాకారన్’... బయ్యర్లను లక్షాధికారులను చేసింది.ఈ సినిమాలతో పాటు అంతకుముందు ఎంజీఆర్ చేసిన అన్ని చిత్రాల రికార్డులను బ్రేక్ చేసిన సినిమా ‘ఉలగమ్ సుట్రుమ్ వాలిబన్’. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్లో ఎన్నో పవర్ఫుల్ పాత్రలు చేశారు ఎంజీఆర్.ఇప్పుడు ఆయన మీదే 3 చిత్రాలు తెరకెక్కుతున్నాయి.లెజెండరీ హీరోకు లేటెస్ట్ టెక్నాలజీ తోడైతే.. అభిమానుల గుండెలు నిండక మానవు. సాధారణంగా కథలు, అందులోని పాత్రలను ఊహాజనితంగా తయారు చేస్తారు రచయితలు. ఒక కథకు కావాల్సిన కథా వస్తువు ఒక వ్యక్తి జీవితం నుంచి దొరికితే అది కచ్చితంగా చరిత్ర అవుతుంది. తమిళ నాట అలాంటి చరిత్ర ఉన్న వ్యక్తి ఎంజీఆర్ (మరుదూర్ గోపాలన్ రామచంద్రన్). తమిళనాట ప్రజలు అభిమానంతో ‘మక్కళ్ తిలగం’ (ప్రజల నాయకుడు) అని పిలుచుకుంటారు. 1977 వరకూ రాజకీయాలు వేరు.. సినిమాలు వేరు. కానీ రాజకీయాలకు గ్లామర్‌ను అద్దింది ఎంజీఆర్. భారత దేశంలోనే సినిమా స్టార్ ముఖ్యమంత్రిగా మారిన ట్రెండ్ ఎంజీఆర్‌తోనే మొదలైంది. కామన్ మ్యాన్ నుంచి సూపర్ స్టార్‌గా ఎదిగి, కలర్ కాస్ట్యూమ్స్ నుంచి ఖద్దర్ తొడిగి సీయం కుర్చీపై కూర్చున్న ఎంజీఆర్ కథ కచ్చితంగా ఆడియన్స్‌ను ఎగై్జట్ చేయక మానదు. ఇప్పుడు ఆయన్నే కథా వస్తువుగా పెట్టి తమిళనాట మూడు సినిమాలు ముస్తాబవుతున్నాయి. అందులో ఒకటి ఆయన జీవిత్ర చరిత్ర ఆధారంగా రూపొందుతున్న బయోపిక్. రెండోది ఎంజీఆర్‌ను యానిమేషన్ పాత్రలో తెరకెక్కిస్తున్న చిత్రం. మరోటి యంజీఆర్నే తిరిగి స్క్రీన్‌పై తీసుకొచ్చే గ్రాఫికల్ మ్యాజిక్. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. సో.. ఎంజీఆర్ అభిమానులు ఆనందపడటానికి ఒకటి కాదు.. రెండు కాదు... ఆయన మీద మూడు సినిమాలు వస్తున్నాయి. సినిమా జర్నీపైనే ఫోకస్ తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి కామరాజ్ బయోపిక్‌ను తెరకెక్కించిన దర్శకుడు ఎ.బాలకృష్ణన్ ఈసారి ఎంజీఆర్ జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరిస్తున్నారు. ఈ బయోపిక్‌లో ఎంజీఆర్ బాల్య దశ నుంచి యాక్టర్‌గా ఎదుగుతున్న రోజులపై ఎక్కువ దృష్టి పెట్టారట బాలకృష్ణన్. ఎంజీఆర్ రోల్‌ను సతీశ్‌కుమార్ పోషిస్తున్నారు. ఇందులో జయలలిత, కరు ణానిథిల పాత్రల కోసం నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు దర్శకుడు. సినిమాలో ఎక్కువ భాగం ఎంజీఆర్ నటుడిగా పడ్డ కష్టాలను డిస్కస్ చేయనున్నారట. ఎంజీఆర్ జీవితంలో నటుడు యం.ఆర్. రాధ (నటి రాధిక తండ్రి)కు కీలక పాత్ర ఉంది. ఓ ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఎంజీఆర్‌ను యం.ఆర్. రాధ షూట్ చేసి, తాను కూడా షూట్ చేసుకున్నారని, ఇద్దరినీ వెంటనే ఆస్పత్రిలో చేర్పించడం వల్ల ప్రాణాపాయం తప్పిందని గతంలో తమిళనాడులో కథలు కథలుగా చెప్పుకున్నారు. ఆ తుపాకీ తూటా ఎంజీఆర్ గొంతులో దిగినందువల్లే ఆ తర్వాతి రోజుల్లో ఆయన వాయిస్‌లో మార్పొచ్చిందని చెబుతారు. ఇప్పుడు ఎంజీఆర్ బయోపిక్‌లో యం.ఆర్. రాధ పాత్ర కూడా ఉంటుందట. ఆ పాత్రలో బాలా సింగ్ అనే నటుడు కనిపించనున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే ఎక్కువ శాతం పొలిటికల్‌గా కంటే ఎంజీఆర్ సినిమా జర్నీ మీద దృష్టి పెట్టారని అర్థం అవుతోంది. ‘‘ఎంజీఆర్ మూడో భార్య జానకిగా తమిళ బిగ్ బాస్ ఫేమ్ రిత్విక కనిపిస్తారు. ఆయన లైఫ్ ఈవెంట్స్, రాజకీయాలకు ఆయన చరిష్మా ఎలా ఉపయోగపడింది? అనే విషయాలతో పాటు ఈ సినిమాలో జయలలితను కేవలం ఎంజీఆర్ కో–స్టార్‌గానే చూపించదలిచాను’’ అంటూ చిత్ర విశేషాలను పంచుకున్నారు దర్శకుడు బాలకృష్ణన్. యంజీఆర్ మళ్లీ వస్తున్నారు తమ అభిమాన నటుణ్ణి మళ్లీ తెరపై చూసుకునే అవకాశం రావడం అంటే అభిమానుల ఆనందం రెండింతలు అవ్వడమే. అది గ్రాఫిక్స్ రూపంలో అయినా ఎంజాయ్ చేస్తారు. ‘యమదొంగ’ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్‌ను గ్రాఫిక్స్ ద్వారా కొన్ని నిమిషాలు చూపిస్తే అభిమానులు ఎంతో సంబరపడ్డారు. ‘నాగరాహువు’ చిత్రం ద్వారా కన్నడ స్టార్ విష్ణువర్ధన్ మళ్లీ తెరపై కనిపిస్తే అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇప్పుడు అలాంటి గ్రాఫిక్స్ వండర్ని ఎంజీఆర్ అభిమానులకు ఇవ్వడానికి సిద్ధం అవుతోంది ఓ మలేసియన్ కంపెనీ. ‘మగేంద్ర’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాకు సంబంధించిన వర్క్ చేస్తున్నారు. ఈ కంపెనీ 3డీ మోడల్ ద్వారా ఎంజీఆర్ రూపు రేఖలు తీసుకురావడానికి రెండేళ్లుగా పని చేస్తోందట. హాలీవుడ్ చిత్రం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ పూర్తి కాకముందే అందులోని నటుడు పాల్ వాకర్ చనిపోతే ఈ టెక్నాలజీ ద్వారానే కొన్ని సీన్లను చిత్రీకరించారు. ఇప్పుడు ఇదే పద్ధతిలో ఎంజీఆర్‌తో ఏకంగా సినిమానే ప్లాన్ చేసింది ఈ కంపెనీ. ఈ ప్రాజెక్ట్‌ను పి.వాసు డైరెక్ట్ చేయనున్నారు. ఎక్స్ప్రెషన్స్, మ్యానరిజం, వాయిస్ అన్నింట్లో చాలా కేర్ తీసుకోనున్నాం అని చిత్రబృందం ప్రకటించింది. ‘‘చిన్నప్పటి నుంచి ఎంజీఆర్ సినిమాలు చూసిన దర్శకుడు కావడంతో పి. వాసు ఈ ప్రాజెక్ట్‌ను కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారనుకుంటున్నాం. సుమారు ఐదువేల ఎంజీఆర్ ఫొటోలు చూసి ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్‌గా రావడానికి వర్క్ చేశాం’’ అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఎంజీఆర్ కల నెరవేర్చుతున్నాం ప్రతి నటుడికీ యాక్టర్‌గా కొన్ని ఫేవరెట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎలా అయినా సరే వాటిని గ్రాండ్‌గా ప్రేక్షకులకు చూపించాలనుకుంటారు. కొన్నిసార్లు అవి సెట్స్‌పైకి వెళ్లడానికి ఏవేవో కారణాలు అడ్డుపడతాయి. అలా ఆగిపోయిన ప్రాజెక్ట్ ‘కిళక్కు ఆఫ్రికావిల్ రాజు’ (తూర్పు ఆఫ్రికాలో రాజు). ఆ సినిమా ఆగిపోవడానికి కారణం పాలిటిక్స్. ఎంజీఆర్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆ సినిమా కార్యరూపం దాల్చలేకపోయింది. ఎంజీఆర్ బ్లాక్బాస్టర్ ‘ఉలగమ్ సుట్రుమ్ వాలిబన్’లో ఆయన తదుపరి చిత్రం ‘ఆఫ్రికావిల్ రాజు’ అని టైటిల్ కార్డ్‌లో ప్రకటించారు. జేమ్స్ బాండ్, మిషన్ ఇంపాజిబుల్ తరహాలో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేశారట ఎంజీఆర్. అప్పటికి భారీ బడ్జెట్ చిత్రాల ట్రెండ్ తక్కువ. 1970లో ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు ఎంజీఆర్. ఈ చిత్రాన్ని ప్రపంచంలో పలు లొకేషన్స్‌లో భారీ ఎత్తున చిత్రీకరించాలనుకున్నారట. అయితే ఆ సినిమా ఎంజీఆర్‌కి ఓ కలలా మిగిలిపోయింది. సో.. ఇప్పుడు అదే టైటిల్‌తో ఎంజీఆర్‌ను యానిమేషన్ పాత్రలో అరుళ్ మూర్తి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ సినిమాని రూపొందించనున్నారు. ఈ తాజా చిత్రంలో ఎంజీఆర్ ఫ్యాన్స్ కోరుకునేవన్నీ ఉంటాయి. యూత్‌కి తగ్గట్టుగా ఎంజీఆర్ ఇందులో ఫ్రెంచ్ బియర్డ్‌తో కనిపిస్తారు. అలాగే సినిమాలో ఫైట్స్, కార్ రేసులు, బైక్ స్టంట్స్ పుష్కలంగా ఉంటాయి అని చిత్రబృందం చెప్పుకొచ్చింది. ఇందులో ‘అఖిల్’ ఫేమ్ సయేషా సైగల్ ఓ కీలక పాత్ర చేస్తున్నారట.ఒకటి గ్రాఫిక్స్, మరోటి యానిమేషన్, ఇంకోటి లైవ్ ఆర్టిస్టులతో... ఎంజీఆర్ జీవితం ఆధారంగా మొత్తం మూడు సినిమాలు రానున్నాయి. ఎంజీఆర్ చనిపోయి దాదాపు 30 ఏళ్లకు పైగా అయింది. అభిమానుల మనసుల్లో ఉండిపోయారు. ఈ మూడు చిత్రాలూ వాళ్లను ఖుషీ చేస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే నేటి తరానికి ఎంజీఆర్ లైఫ్ గురించి తెలుసుకునే అవకాశం ఉంది. ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
28ఏళ్ల తరువాత కలుసుకున్న ప్రేమ జంట
తమిళనాడు, వేలూరు: ఎంజీఆర్ శత జయంతి పురస్కరించుకొని జీవిత శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను మానవతా దృక్పథంతో విడుదల చేయడంతో 28 ఏళ్ల తరువాత ప్రేమ జంట మళ్లీ కలుసుకుంది. వివరాలు.. శ్రీలంకకు చెందిన బక్కర్ ఆలియాస్ విజయ (60) శ్రీలంక తమిళుల వైరుద్యం సమయంలో తమిళనాడుకు చేరుకున్నారు. వీధుల్లో నాట్యం అడుతూ జీవనం సాగించేవారు. విజయ నాట్యానికి ఆకర్షిణితులైన సుబ్రమణియం ఆమెను ప్రేమించాడు. సుబ్రమణియం ఇంట్లో వీరి ప్రేమకు అంగీకరించలేదు. దీంతో సుబ్రమణియం 1985లో విజయతో కలిసి వెళ్లిపోయాడు. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అనంతరం వీధుల్లో నాట్యం ఆడుతూ జీవనం సాగించే వారు. రాత్రి వేళల్లో రోడ్డు పక్కన నిద్రిస్తుండగా ఓ వ్యక్తి విజయపై అత్యాచారానికి యత్నించాడు. సుబ్రమణ్యన్, విజయ ఆగ్రహంతో అతనిపై దాడి చేయగా తలకు గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి సుబ్రమణియన్, విజయను అరెస్ట్ చేశారు. 1990లో కోవై కోర్టు వారికి జీవిత శిక్ష విధించింది. వేలూరు మహిళా జైల్లో విజయను, పురుషుల జైల్లో సుబ్రమణియన్‌ను ఉంచారు. జైల్లో విజయకు అనారోగ్యం ఏర్పడి మాట పడిపోయింది. దీంతో 2013లో విజయను విడుదల చేయడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో వేలూరు సమీపం అరియూర్‌లోని వృద్ధాశ్రమంలో చేరారు. ఇదిలాఉండగా ఎంజీఆర్ శత జయంతిని పురస్కరించుకుని శనివారం ఉదయం సుబ్రమణియన్‌ను విడుదల చేశారు. దీంతో సుబ్రమణియన్ భార్యను చూసేందుకు వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో సుబ్రమణియన్‌ను చూసి విజయ ఉద్వేగానికి లోనయ్యారు. దీనిపై సుబ్రమణియన్ మాట్లాడుతూ.. ఆత్మరక్షణ కోసం తాము చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించామని ప్రస్తుతం సొంత గ్రామానికి వెళ్లనున్నట్టు తెలిపారు. బంధువులు తమను చేర్చుకోరని అయినప్పటికీ విజయను విడవబోనని వెల్లడించాడు. -
యంజీఆర్ మళ్లీ వస్తున్నారు
యంజీఆర్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. మళ్లీ తెరపై తమ అభిమాన నటుణ్ణి చూసుకొనే అవకాశం ఉంది. నటుడిగా సూపర్‌స్టార్ అయి, ఆ తర్వాత రాజకీయాల్లో ముఖ్యమంత్రి హోదాను అందుకొని తమిళనాట చిరస్థాయి ఖ్యాతిని గడించారు యంజీఆర్. ఆరెంజ్ కంట్రీ అనే ఓ మలేషియన్ కంపెనీ యంజీర్‌ను తిరిగి తెర మీదకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. యన్ ఫేస్ టెక్నాలజీ ద్వారా యంజీర్‌ను తిరిగి స్క్రీన్ మీద చూపించనున్నారు. ‘నరసింహా, చంద్రముఖి’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన పి.వాసుని డైరెక్టర్‌గా ఎంచుకున్నారు. 22 మిలియన్ డాలర్స్ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్‌ను ప్రాంతీయ భాషల్లోని నటులతో షూట్ చేయనున్నాం అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. -
వెండితెరకు యంజీఆర్ జీవితం
తమిళనాట సినిమాల్లో అయినా.. రాజకీయాల్లో అయినా యంజీర్‌ది స్ఫూర్తి కలిగించే ప్రయాణం. ఈ ప్రయాణాన్ని ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూపించనున్నారు దర్శకుడు ఎ.బాలకృష్ణన్. నటుడిగా, దర్శకుడిగా ఉన్నత స్థాన్నాన్ని అధిరోహించిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు యంజీఆర్. ఓ నటుడు ముఖ్యమంత్రి కావడం భారతదేశంలోనే తొలిసారి. భారతరత్న అవార్డు అందుకున్నారాయన. ఇలా ప్రస్థావించడానికి బోలెడు చరిత్ర ఉన్న బయోపిక్ ఇది. పాపులర్ టీవీ నటుడు సతీశ్ కుమార్ యంజీఆర్‌గా కనిపించనున్నారు. రైత్విక, వైయపురి హీరోయిన్లుగా కనిపించనున్నారు. బాల్యం, సినీ ప్రయాణం, రాజకీయాలను ఈ సినిమాలో చూపించనున్నారు దర్శకుడు. ‘మక్కల్ తిళగం’(జన నాయకుడు) అని ఆయన అభిమానులు పిలుచుకుంటారు. యంజీఆర్, కరుణానిధి జీవితాల ఆధారంగా మణిరత్నం ‘ఇద్దరు’ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. -
ద్రవిడ ఉద్యమ దిగ్గజం
భారత దేశంలో సంభవించిన అహింసాత్మకమైన విప్లవాలలో అత్యంత ప్రధానమైనది ద్రవిడ ఉద్యమం. ఆ సంస్కరణ ఉద్యమానికి సుదీర్ఘకాలం నాయకత్వం వహించిన అసాధారణ వ్యక్తి ఇటీవల అస్తమించిన కళైంజ్ఞార్ కరుణానిధి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించక మునుపే 1910 దశకంలోనే మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మణేతర ప్రముఖులు స్థాపించిన సౌత్ ఇండియన్ లిబరల్ అసోసియేషన్ లక్ష్యాలలో ప్రధానమైనవి బ్రాహ్మణభావజాల ఆధిక్యాన్ని అంతం చేయడం, సమసమాజం నిర్మించడం, సామాజికన్యాయం సాధించడం. ఆ అసోసియేషన్ జస్టిస్ పార్టీగా ప్రాచుర్యం పొందింది. కులమతాలకు వ్యతిరేకంగా పోరాడుతూ స్వాతంత్య్ర సమరం చేయడం అసాధ్యమనే గాంధీజీ వైఖరితో తీవ్రంగా విభేదించిన రామస్వామినాయకర్ కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి జస్టిస్పార్టీలో చేరారు. ఆయన చేరికతో నాయకత్వంలో సమూలమైన మార్పు వచ్చింది. జస్టిస్ పార్టీ ఎజెండా కంటే భిన్నమైన విస్తృతమైన కార్యాచరణ అవసరమని భావించిన పెరియార్ (పెద్దాయన) రామస్వామి నాయకర్ ఆ పార్టీని రద్దు చేసి ‘ద్రవిడ కళగం’(ద్రవిడ సమాఖ్య)–డికె– నెలకొల్పారు. నాటి విద్యార్థి ఉద్యమ నాయకుడూ, అద్భుతమైన వక్త సీఎన్ అన్నాదురై పెరియార్‌కు ప్రథమ అనుచరుడిగా కుదురుకున్నారు. డికె ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. రాజీలేని హేతువాదం ప్రాతిపదికగా ఉద్యమం విస్తృతంగా నిర్వహించడం సాధ్యం కాదని అయిదేళ్ళు తిరగకుండానే అన్నాదురై గ్రహించారు. హేతువాదం, సామాజికన్యాయం, నిరీశ్వరవాదం ప్రాతిపదికగా సామాజిక ఉద్యమం ఉధృతంగా కొనసాగించాలని పెరియార్ అభిప్రాయం. రాజకీయాల పొడ ఆయనకు గిట్టదు. రాజకీయ పార్టీ పెట్టి, గెలిచి అధికారంలోకి వచ్చి పెరియార్ చెబుతున్న లక్ష్యాలనే సాధించాలన్నది అన్నాదురై వాదన. డిఎంకె ఆవిర్భావం అన్నాదురై నాయకత్వంలో చెన్నైలో 1948 సెప్టెంబర్ 17న ద్రవిడ మున్నేట్ర కళగం (డిఎంకె) ఆవిర్భవించింది. అప్పటికే కరుణానిధికి 25 ఏళ్ళు. జస్టిస్ పార్టీ కార్యక్రమాలలో, హిందీ వ్యతిరేక ఉద్యమంలో 14వ ఏట నుంచే చురుకుగా పాల్గొన్నారు. చక్రవర్తి రాజగోపాలాచారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ మిత్రులతో కలసి ప్రదర్శనలు చేశారు. తిరుచిరాపల్లిలో దాల్మియాపురం పేరును తిరిగి కళ్ళెగుడిగా మార్చే ఉద్యమంలో సాహసోపేతంగా వ్యవహరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ప్రతిభావంతమైన వక్తగా, సినిమా స్క్రిప్టు ద్వారా ద్రవిడ ఉద్యమ భావజాల వ్యాప్తికి అసాధారణ స్థాయిలో దోహదం చేసే రచయితగా, కార్యకర్తలను సమీకరించి ముందుకు నడిపించే సేనానిగా బహుముఖంగా రాణిస్తూ తమిళుల జీవితంతో పెనవేసుకుపోయారు. తమిళ సాహిత్యాన్నీ, సంస్కృతినీ వివిధ రూపాలలో వినియోగించుకొని ‘ద్రవిడనాడు’ ఉద్యమస్ఫూర్తిని పతాకస్థాయికి తీసుకొని వెళ్ళడంలో ప్రధాన పాత్ర కరుణానిధిదే. సమాఖ్యస్ఫూర్తి, రాష్ట్రాల స్వయంనిర్ణయాధికారం, సకలభాషల సమానత్వం, లౌకికవాదం డిఎంకె భావజాలంలో ప్రధానమైనవి. ద్రవిడ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు కరుణానిధి పిన్నవయస్సులోనే స్వదస్తూరితో రాసిన వార్తాపత్రికను తయారు చేసి స్నేహితుల ద్వారా పంపిణీ చేయించేవారు. డిఎంకె అధికార పత్రిక ‘మురసొలి’ (ఢంకా) కి అదే బీజం. ‘మురసొలి’లో కరుణానిధి పార్టీ కార్యకర్తలకోసం రాసిన లేఖలు వారికి పార్టీ విధానాలనూ, కార్యకారణ సంబంధాలనూ విశదీకరించడానికి ఉద్దేశించినవి. పార్టీ నాయకులతో, కార్యకర్తలతో సంభాషణకు ఆయన ‘మురసొలి’ని సమర్థంగా ఉపయోగించుకున్నారు. ద్రవిడ ఉద్యమ సారథి పెరియార్ సైతం ‘కుడియారసు’ (రిపబ్లిక్–గణతంత్ర వ్యవస్థ) అనే పత్రిక ద్వారా తన ఆలోచనలను కార్యకర్తలతో పంచుకునేవారు. కరుణానిధి ప్రతిభావంతుడైన వక్త. ఛలోక్తులతో, వ్యంగ్యాస్త్రాలతో ప్రత్యర్థులను ఉడికిస్తూ, సభను రక్తికట్టించే శక్తి అయన సొంతం. ఆయన ప్రసంగాల కేసెట్లు తమిళ సినిమా పాటల కేసెట్లకంటే బాగా అమ్ముడుపోయేవి. రాజకీయాలలో ఎంత సామర్థ్యం ఉన్నదో సాహిత్యంలోనూ అంతటి అధికారం ఉన్నది. సంగీతం అంటే ప్రాణం. ఇంతటి బహుముఖ ప్రజ్ఞ కలిగిన రాజకీయ నాయకులు దేశంలోనే అరుదు. పురాణాలలోని, ఇతిహాసాలలోని పాత్రల ద్వారా పార్టీ భావజాలాన్ని ప్రచారం చేయడం, పోస్టర్లూ, బ్యానర్లూ, కట్అవుట్లూ వంటి హంగులు ఉపయోగించుకోవడం భారత రాజకీయాలకు తమిళ రాజకీయం అందించిన కొత్తవిద్య. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టి రామారావు పసుపు రంగుతోసహా డిఎంకె ప్రచార ప్రక్రియలన్నిటినీ అనుకరించారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి అనేక రాష్ట్రాలకూ కటౌట్ల సంస్కృతి పాకింది. టీవీ చానళ్ళూ, వీడియో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారం విస్తృతి, వైవిధ్యం అనూహ్యంగా పెరిగిపోయాయి. 2014 ఎన్నికలలో మోదీ విశ్వరూపం ప్రదర్శించడానికి వీడియో టెక్నాలజీ దోహదం చేసింది. కరుణానిధి ప్రస్థానం పార్టీలో అత్యంత ప్రభావశీలిగా ఎదిగిన కరుణానిధి 1957లో మొదటిసారి మద్రాసు శాసనసభకు ఎన్నికైన సమయంలో కూడా డిఎంకె లక్ష్యాలలో స్వతంత్ర ద్రవిడనాడు ప్రధానమైనది. ఈ వేర్పాటువాదం డిఎంకె ఎజెండాలో చాలాకాలం ఉంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత జాతీయ రాజకీయాలతో మమేకమై, సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వాములైన తర్వాత వేర్పాటువాదం పూర్వపక్షమైపోయింది. 1967 ఎన్నికలలో కాంగ్రెస్‌ను మట్టికరిపించి అధికారంలోకి వచ్చిన డిఎంకె అన్నాదురై నాయకత్వంలో తమిళనాడులో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్నాదురై మంత్రివర్గంలో పబ్లిక్‌వర్క్స్ మంత్రి కరుణానిధి. రెండేళ్ళ తర్వాత కేన్సర్ కారణంగా అన్నాదురై మరణించారు. వారసత్వ పోరులో అప్పటి ఆప్తమిత్రుడు ఎంజి రామచంద్రన్ సహకారంతో నెడుంజళియన్ వంటి సీనియర్లను తోసిరాజని ముఖ్యమంత్రి పదవిని కరుణానిధి కైవసం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మురికివాడల నిర్మూలన, మనుషులు లాగే రిక్షాల నిషేధం, విద్యుదీకరణ పనులు ముమ్మరంగా చేశారు. దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రతి కుటుంబానికీ రూపాయికి కిలో చొప్పున పాతిక కిలోలు బియ్యం ఇవ్వడం, ప్రభుత్వం పంపిణీ వ్యవస్థను నెలకొల్పడం, రేషన్ షాపులను నడపడం, రైతులకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయడం, పంట రుణాలు మంజూరు చేయడం, పంట పండకపోతే రుణాలు మాఫ్ చేయడం వంటి అనేక సంక్షేమకార్యక్రమాలు కరుణానిధి, ఎంజీఆర్‌ల హయాంలోనే ఆరంభమైనాయి. అమ్మ క్యాంటీన్ వంటివి జయలలిత సృష్టి. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తమిళనాడు దేశ చరిత్రలో నిలిచిపోతుంది. కడచిన మూడు దశాబ్దాలలో తమిళనాడు పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందింది. రఘురామరాజన్ రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా ఉండగా 2013లో చేసిన అధ్యయనంలో దేశంలోని ప్రవృద్ధ రాష్ట్రాలలో తమిళనాడు మూడవ స్థానంలో (గుజరాత్, మహారాష్ట్ర తర్వాత) నిలిచింది. సాహిత్య, సాంస్కృతిక రంగాలకు కరుణానిధి పెద్దపీట వేశారు. తిరువళ్ళువార్ పేరిట వళ్ళువార్కొట్టాం నిర్మించారు. మూడు సాగరాలు– బంగాళాఖాతం, హిందూమహాసముద్రం, అరేబియా సముద్రం ఏకమయ్యేచోట కన్యాకుమారిలో 133 అడుగుల ఎత్తు తిరువళ్ళువార్ విగ్రహం ప్రతిష్ఠించారు. ఎంజీఆర్‌తో విభేదాలు కరుణానిధి అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే ఆయనకూ, ఎంజీఆర్కీ మధ్య దూరం పెరిగింది. అధికారం కరుణానిధి తలకెక్కిందని ఎంజీఆర్ భావించారు. ఎంజీఆర్‌లో ఈర్షా్యద్వేషాలు పెరిగాయని కరుణానిధి తలపోశారు. సినిమాలలో ఎంజిఆర్‌కి పోటీగా పెద్దకొడుకు ముత్తును కరుణానిధి ప్రవేశపెట్టారు. కరుణానిధిపై ఎంజిఆర్ అవినీతి ఆరోపణలు చేశారు. 1972లో డిఎంకె చీలిపోయింది. ఎంజీఆర్ ఏఐఏడిఎంకె స్థాపించి 1977 ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. తన ఆరోపణల ఆధారంగా కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన ఇందిరాగాంధీనీ, ఆమె ఉపకారాన్నీ విస్మరించి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదనను ఎంజిఆర్ తిరస్కరించారు. 1980లో ఎంజిఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. తర్వాత జరిగిన ఎన్నికలలోనూ, 1984లోనూ ఎంజీఆర్ విజయం సాధించడంతో కరుణానిధి పుష్కరకాలం ప్రతిపక్ష నాయకుడిగానే ఉండవలసి వచ్చింది. 1989లో కరుణానిధి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడే నేషనల్ ఫ్రంట్ తరఫున విపి సింగ్‌ను ప్రధాని చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారు. అత్యధికశాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్న రాష్ట్రం తమిళనాడు. తమిళ టైగర్లను సమర్థిస్తున్నారనే ఆరోపణపైన కరుణానిధి ప్రభుత్వాన్ని 1991లో నాటి ప్రధాని చంద్రశేఖర్ రద్దు చేశారు. 2006లో చివరిసారిగా, ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 2011లో జయలలిత ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు మూడోసారి స్వీకరించారు. 2016లోనూ ఆమే గెలిచారు. ద్రవిడ పార్టీలు జాతీయ రాజకీయాలను గణనీయంగా ప్రభావితం చేశాయి. 1967–69లో ఇందిరాగాంధీకీ, నిజలింగప్ప, మొరార్జీదేశాయ్, అతుల్యఘోష్ ఇత్యాది సీనియర్ నాయకులకూ మధ్య విభేదాలు చెలరేగి చీలిక దిశగా కాంగ్రెస్ ప్రయాణం సాగినప్పుడు కరుణానిధి ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి పదవికి జరిగిన పోటీలో వి.వి. గిరిని గెలిపించడానికీ, నీలం సంజీవరెడ్డిని ఓడించడానికీ కరుణానిధి చట్టసభల సభ్యులను సమీకరించారు. 1975లో ఆత్యయిక పరిస్థితి ప్రకటించడాన్ని కరుణానిధి తీవ్రంగా విమర్శించారు. జార్జి ఫెర్నాండెస్, సుబ్రహ్మణ్యస్వామి వంటి ఇందిర విరోధులకు తమిళనాడులో ఆశ్రయం ఇచ్చారు. దాంతో ఆగ్రహించిన ఇందిరాగాంధీ కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ను అరెస్టు చేయించారు. పోలీసు కస్టడీలో స్టాలిన్‌ను హింసించినట్టు వార్తలు వచ్చాయి. కరుణానిధిపైన కేసులు పెట్టడమే కాకుండా ఆయన ప్రభుత్వాన్ని 1976లో బర్తరఫ్ చేశారు. విప్లవ సంస్కరణల వెనకంజ ఈ దశలో ద్రవిడ భావజాలం పలచపడింది. అవినీతి, బంధుప్రీతి పెరిగాయి. వ్యక్తి ఆరాధన పతాకస్థాయికి చేరింది. ఈ విషయాలలో ద్రవిడ పార్టీలకీ, దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకీ పెద్దగా వ్యత్యాసం లేకుండా పోయింది. ఇతర ప్రాంతీయ పార్టీల తరహాలోనే డిఎంకె సైతం కేవలం కరుణానిధి కుటుంబ సభ్యుల చేతిలో ఉంది. జయలలితకు కుటుంబం లేదు కనుక ఆమె మరణించగానే ఏఐఏడిఎంకె చీలిపోయింది. డిఎంకె స్టాలిన్ సారధ్యంలో పదిలంగా ఉంది. ద్రవిడ భావజాలానికి విరుద్ధమైన బీజేపీ, కాంగ్రెస్‌లతో నిస్సంకోచంగా పొత్తు పెట్టుకొని ఎన్డీఏ, యూపీఏ కూటములలో డిఎంకె, ఏఐఏడిఎంకెలు భాగస్వాములుగా ఉన్నాయి. ఎన్నికల అక్రమాలలో తమిళనాడేమీ తక్కువ తినలేదు. సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఎన్నికలకు ముందు కలర్ టీవీ సెట్లు ఉచితంగా ఓటర్లకు పంపిణీ చేసే కార్యక్రమం కరుణానిధి హయాంలోనే అమలు జరిగింది. జయలలిత వారసుడుగా చెప్పుకుంటున్న దినకరన్ ఆర్కె పురం ఉపఎన్నికలో ఖర్చు చేసిన మొత్తం నంద్యాల ఉపఎన్నికలో చంద్రబాబునాయుడు ఖర్చుకు సమానం. ద్రవిడ పార్టీల పాలన యాభై సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న తమిళనాడు ఇతర రాష్ట్రాలతో సమానంగా అన్ని రకాలా దిగజారినప్పటికీ అభివృద్ధిలో మాత్రం ముందంజలో ఉంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలితలు రాజకీయంగా ఎంతగా కీచులాడుకున్నా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఒకే విధానం అమలు చేసేవారు. ముగ్గురూ కేంద్రం నుంచి తమిళనాడుకు రావలసిన నిధులనూ, పరిశ్రమలనూ, ఇతర వనరులనూ దబాయించో, బతిమిలాడో సంపాదించేవారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీపడేవారు కాదు. ద్రవిడ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన పార్టీలో అధినేతకు పడిపడి పాదాభివందనం చేసే సంస్కృతి స్థిరపడింది. కుల నిర్మూలన కోసం పోరాడాలనే సంకల్పం సడలింది. తమిళనాడులో దళితుల పరిస్థితి ఇతర రాష్ట్రాలలో కంటే మెరుగ్గా లేదు. పెరియార్ ఆశించిన విప్లవాత్మక సంస్కరణలు ఆయన వారసుల అధికార రాజకీయ రంధిలో గల్లంతైనాయి. ఇందుకు కరుణానిధి మాత్రమే బాధ్యులు కారు. ఎంజీఆర్, జయలలిత కూడా ద్రవిడ ఉద్యమ స్ఫూర్తికి యధాశక్తి విఘాతం కలిగించారు. కె. రామచంద్రమూర్తి -
తమిళ రాజ‘కీ’యం ఎవరి చేతుల్లో?
సాక్షి ప్రతినిధి, చెన్నై/ సాక్షి నాలెడ్జ్ సెంటర్: జయలలిత కన్నుమూతతో ‘రెండాకులు’ రాలిపోయాయి. కరుణ మరణంతో ‘ఉదయసూర్యుడు’ అస్తమించాడు. తమిళనాడు రాజకీయాల్లో భారీ రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇక తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేవారు ఎవరనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. తమిళనాడులో కామరాజ్ నాడార్ హయాంలోనే జాతీయ పార్టీలకు కాలం చెల్లింది. అన్నాదురై నేతృత్వంలో ఉదయించిన ద్రవిడ సిద్ధాంతాల డీఎంకే తిరుగులేని పార్టీగా మారింది. తర్వాత ప్రముఖ సినీ నటుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) నాయకత్వంలో ఏర్పడిన అన్నాడీఎంకే తమిళనాట మరో బలీయమైన రాజకీయ పార్టీగా నిలిచింది. ఎంజీఆర్ జనాకర్షణ ధాటికి కరుణానిధి సైతం తల్లడిల్లిపోయారు. ఎంజీఆర్ మరణించిన తర్వాత ఇక తమకు తిరుగులేదని ఆశించిన డీఎంకేకు నిరాశే మిగిలింది. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత పార్టీని పరుగులు పెట్టించారు. ఎంజీఆర్‌కు ధీటుగా కరుణకు గట్టిపోటీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు డీఎంకే లేదా అన్నాడీఎంకే మాత్రమే చాయిస్. ఎంజీఆర్ హయాంలో రెండుసార్లు, జయ హయాంలో ఒకసారి మినహా ప్రతిసారీ ఈ రెండు పార్టీలూ ఐదేళ్లకొకసారి అధికారాన్ని పంచుకున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేంత స్థాయి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు లేదు. రెండు ప్రధాన ద్రవిడ పార్టీల అధినేతలు జయలలిత, కరుణానిధి రెండేళ్ల వ్యవధిలోనే కన్నుమూశారు. దీంతో తమిళనాట వారిద్దరి స్థాయి ప్రజాకర్షణ, రాజకీయ చాతుర్యం కలిగిన నేతలు ఎవరు? రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను పూడ్చే స్థాయి ఎవరికి ఉందనే చర్చ మొదలైంది. కమల్, రజనీకాంత్‌ల ప్రభావమెంత? పురచ్చితలైవి జయలలిత జీవించి ఉన్నంతకాలం రాజకీయ ప్రవేశానికి వెనకడుగు వేసిన నటులు.. కమల్‌హాసన్, రజనీకాంత్ జయ మరణం తర్వాత తామున్నామంటూ ముందుకు వచ్చారు. అన్నాడీఎంకే ఆస్తికత్వం, డీఎంకే నాస్తికత్వం సిద్ధాంతాలతో రాజకీయాలు నెరిపాయి. అలాగే ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి ముగ్గురూ సినీ నేపథ్యంతో ప్రాచుర్యం పొందినవారే. రజనీకాంత్, కమల్ సైతం సినీ క్రేజుపైనే ఆధారపడి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాసేవలతో మమేకమైన సందర్భాలు ఇద్దరికీ లేవు. అంతేకాకుండా అన్నాడీఎంకే, డీఎంకే మాదిరిగానే రజనీ, కమల్ ఆస్తిక, నాస్తిక సిద్ధాంతాలను అనుసరిస్తున్నారు. తనది ఆధ్యాత్మిక పార్టీ అని రజనీకాంత్ ప్రకటించారు. ఇక కమల్ పూర్తిగా నాస్తికుడు అనేది ప్రజలందరికీ తెలిసిందే. ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ ఏర్పాటు, జిల్లాల్లో పర్యటనలతో కమల్ తన రాజకీయ ప్రయాణ వేగాన్ని పెంచగా, పార్టీ ఏర్పాటుపై రజనీకాంత్ 8 నెలలుగా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇటీవల ఒక ప్రముఖ దినపత్రిక తమిళనాడులో సర్వే చేసి కమల్, రజనీ ఇద్దరికీ అధికారంలోకి వచ్చేంత సామర్థ్యం లేదని తేల్చింది. ఇద్దరికీ కలిపి కనీసం పది శాతం మంది కూడా వారి పాలనను కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. సినీనటులు రాజకీయాల్లో రాణించే రోజులు అంతరించిపోయాయని సర్వేలో పేర్కొంది. స్టాలిన్‌కి తిరుగులేనట్టే.. కరుణానిధి తన రాజకీయ వారసుడిగా మూడో కుమారుడు ఎంకే స్టాలిన్‌ను కిందటేడాది జనవరిలో ప్రకటించి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఫలితంగా కరుణ రెండో కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి, చిన్న కూతురు, రాజ్యసభ ఎంపీ కనిమొళి, ఆయన మేనల్లుడి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ డీఎంకే నాయకత్వం కోసం పోటీ పడే అవకాశాలు లేవు. 65 ఏళ్ల స్టాలిన్ 1973 నుంచీ డీఎంకే కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, 1984 నుంచీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 45 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఉన్న సంబంధాలు, పార్టీ విభాగాలపై ఉన్న పట్టు కారణంగా స్టాలిన్‌కు పార్టీని ముందుకు తీసుకెళ్లే అన్ని అవకాశాలూ ఉన్నాయి. స్టాలిన్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే రాష్ట్రవ్యాప్తంగా ‘నమక్కు నామే (మనకు మనమే)’ పేరుతో పాదయాత్ర చేసి ప్రజలకు మరింత చేరువయ్యారు. జయ మరణం తర్వాత అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన లుకలుకలను అవకాశంగా తీసుకుని ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారంలోకి రాకుండా సంయమనం పాటించారు. ఈ నిదానమే ప్రజలకు నచ్చిందో ఏమో ఇటీవల జరిగిన సర్వేలో రాబోయేది డీఎంకే ప్రభుత్వం.. కాబోయే సీఎం స్టాలిన్ అని తేలింది. రజనీ చేతుల్లోకి అన్నాడీఎంకే! అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీఆర్ మరణం తర్వాత ఆయన స్థాయిలో జయలలిత పార్టీని నడిపారు. ఆమె మరణం తర్వాత సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కలిసి పనిచేస్తున్నా వారిద్దరి నాయకత్వాన పార్టీలో రెండు గ్రూపులు నడుస్తున్నాయనేది బహిరంగ రహస్యమే. బీజేపీతో పన్నీర్‌సెల్వంకు సన్నిహిత సంబంధాలున్నందున రాబోయే ఎన్నికల్లో ఆయన వర్గం ఎన్డీఏకు దగ్గరైతే అన్నాడీఎంకే బలహీనపడే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితిలో శశికళ సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ నాయకత్వంలోని ‘అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం’ అన్నాడీఎంకేను చీల్చి కొంతమేరకు బలపడే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ఎన్ని ముక్కలవుతుందో చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జయలలిత తర్వాత జనాకర్షణ శక్తి ఉన్న నేతలెవరూ లేకపోవడం, అర్థబలం, అంగబలం సంపాదించిన శశికళ జైల్లో ఉండడంతో అన్నాడీఎంకే గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని తేల్చిచెబుతున్నారు. వాస్తవానికి ‘అమ్మ’ మరణంతో అనాథగా మారిన అన్నాడీఎంకేకు ఆసరాగా నిలవడం ద్వారా తమిళనాట వేళ్లూనుకోవాలని బీజేపీ తాపత్రయపడింది. అయితే అధికార పార్టీకి జనాకర్షణ కలిగిన నాయకులు లేకపోవడం వల్ల బీజేపి ప్రయత్నాలకు గండిపడింది. ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూసిన బీజేపీకి తన మిత్రుడు రజనీకాంత్ కంటపడ్డారు. బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు విముఖత ప్రదర్శించిన రజనీకాంత్‌ను అన్నాడీఎంకే అధినేతగా చేసి లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది. అన్నాడీఎంకే శ్రేణుల్లోనూ అంతర్గతంగా ఈ చర్చ నడుస్తోంది. బీజేపీ ఆలోచనలకు అనుగుణంగా రజనీకాంత్ పార్టీ ప్రకటనలో జాప్యాన్ని కొనసాగిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే రాబోయే ఎన్నికల్లో రజనీ నాయకత్వంలోని అన్నాడీఎంకే, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రత్యర్థులుగా తలపడతాయి. షెడ్యూల్ ప్రకారం తమిళనాడు అసెంబ్లీకి 2021లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మూడేళ్ల కాలంలో తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి సమీకరణలు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి. -
మనస్సాక్షినే నమ్ముతాను..
‘ఎంజీఆర్ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత కూడా మా మధ్య స్నేహం కొనసాగింది. ఇద్దరం వేరు వేరు పార్టీలకు నాయకులమైనప్పటికీ స్నేహితుల్లా మసలుకున్నాం. ఎంజీఆర్ తర్వాత, ఆ పార్టీ నాయకత్వం మమ్మల్ని ద్వేషించడం మొదలెట్టింది. కామరాజ్ – నేనూ దోస్తులమే. మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి భక్తవత్సలంతోనూ స్నేహం చేశాను. ఆర్ వెంకటరామన్ ఇప్పటికీ నా స్నేహితుడే (2007 నాటికి). తమిళనాడులో ఏఐఏడీఎంకే అని పిలవబడే పార్టీని మినహాయిస్తే, మిగిలిన వారితో మాకు మంచి స్నేహమే వుంది’ అని 2007లో ఓ వార్తా ్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరుణ చెప్పారు. - ‘నా మనస్సాక్షినే నేను నమ్ముతాను. నా దైవం అదొక్కటే’ అంటారు కరుణ. - సంకీర్ణ ప్రభుత్వామనేది తాత్కాలిక ఏర్పాటు. సంకీర్ణం కారణంగా మేం కొన్ని డిమాండ్లు సాధించుకోగలిగాం. తమిళ భాషకు ప్రాచీన ప్రతిపత్తి లభిస్తుందని మేమెప్పుడూ అనుకోలేదు. చివరికి అది కూడా సంకీర్ణం వల్లే సాకారమైంది’ అని ఓ ఇంటర్వ్యూలో వివరించారు కరుణానిధి. - కేంద్రంలో తాను కలసిన వ్యక్తుల్లో వీపీ సింగ్‌ను గొప్ప మనిషిగా భావిస్తారు కరుణ. వీపీ చేపట్టిన సామాజిక సంస్కరణలు, రిజర్వేషన్లు, మండల్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలు తమ స్నేహానికి వారధి వేశాయంటారు. - కరుణతో వాజ్‌పేయ్ బాగుండేవారు. ‘మా బంధం గట్టిగా ఉండడానికి మురసోలి మారన్ ఒకానొక కారణం’ అని కరుణ ఒక సందర్భంలో చెప్పారు. (వాజ్‌పేయ్ ప్రభుత్వంలో మారన్ కేబినెట్ మంత్రి పనిచేశారు. ఇప్పుడు లేరు)) ఈ నేతలిద్దరూ ఎమర్జెన్సీ కాలంలో ఒకే వేదికపై ప్రసంగాలు చేశారు. రాముడు నాకు శత్రువు కాదు.. వాల్మీకి రామాయణాన్నీ, తులసీ రామాయణాన్నీ చదివాను. పలు రామాయణాల్లో మాదిరిగానే తులసీ రామాయణంలో సీత రాముడి చెల్లెలు. వాల్మీకి రామాయణంలో మాత్రం ఆమె రాముడికి భార్య. ఆర్యులు – ద్రవిడుల మధ్య జరిగిన యుద్ధం ఆధారంగా రామాయణాన్ని రచించారు. రాముడు ఓ కల్పిత పాత్ర. జవహర్లాల్ నెహ్రూ కూడా రాముణ్ణి నాయకుడిగానే చూశారు. దేవుడిగా కాదు. సి. రాజగోపాలచారి రచించిన ‘చక్రవర్తి తిరుమగల్’ పుస్తకం ప్రకారం – రాముడు యువరాజు. దేవుడు కాదు. రాముడికి నేను శత్రువును కాను. ముస్లింలు / క్రైస్తవులు పండుగల వేళ ఆహ్వానిస్తే వెళతాం. అలాగే హిందువులూ ఆహ్వానిస్తే ఎందుకెళ్లం? అందులో తప్పేం లేదు కదా!.. – 2007లో కరుణానిధి ఇచ్చిన ఇంటర్వ్యూల నుంచి కళానిధి చిన్నతనంలో చదువు పట్ల ఆసక్తి వుండేది కాదని కరుణ తన ఆత్మకథలో రాసుకున్నారు. నాటకం, కవిత్వం, తమిళ సాహిత్యం వైపే ఆయన మనసు మళ్లుతుండేదట. కరుణ తండ్రి ముత్తువేలు.. చనిపోవడానికి ఒక నెల ముందు కరుణానిధి మాటలు రాసిన‘రాజకుమారి’ సినిమా చూడాలనుకున్నారట. కానీ అప్పటికే ఆయన కంటి చూపుకు దూరమయ్యారు. కనీసం కొడుకు రాసిన మాటలైనా విందామనుకున్నారాయన. దీంతో తిరువారూర్‌లో ఓ థియేటర్‌కు తీసుకుపోయారు. ‘రచయితగా నేను ఎదిగిన తీరును చూసి ఆయన ఎంతో సంబరపడ్డారు’ అని ఆత్మకథలో చెప్పారు కరుణ. -(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
తుది వీడ్కోలు..!
వ్యక్తి ఆరాధన తమిళనాట తీవ్రస్థాయిలో ఉంటుంది. తాము ప్రేమించేనేత మరణిస్తే తట్టుకోలేక పెద్ద సంఖ్యలో అభిమానులు మృతిచెందిన సంఘటనలు గతంలో చూశాం. అలాగే ఆ నేతల చివరి చూపుల కోసం లక్షలాది మంది తరలివచ్చి అంతిమయాత్రల్లో పాల్గొన్న దృశ్యాలు తమిళనాడులో కనిపిస్తాయి. అభిమానం ఎంతగా ఉందంటే అన్నాదురై అంతిమయాత్రలో పాల్గొన్న వారి సంఖ్య గిన్నెస్‌బుక్‌లో కూడా రికార్డ్ అయ్యింది. అన్నా మొదలుకుని కరుణానిధి వరకు ఈ అంతిమయాత్రలు సాగిన తీరు ఇలా ఉంది. అన్నాదురై: తమ భావాలు, అభిప్రాయాలతో, చేపట్టిన కార్యక్రమాలు, పనులతో ప్రజలపై చెరగని ముద్ర వేసిన రాజకీయ ప్రముఖులు, నేతలకు మనదేశంలో నీరాజనాలు పట్టడం చూస్తుంటాం. ఇలాంటి నేతలు మరణించినపుడు వారి అంతిమయాత్రలో లెక్కకు మించి సంఖ్యలో ప్రజలు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించడం తెలిసిందే. ద్రవిడోద్యమ దిగ్గజంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు, తమిళ హక్కులు, సంస్కతి పరిరక్షణలో తుదికంటా పోరాడి తమిళనాడులోని వివిధ వర్గాల ప్రజలపై ప్రభావం చూపిన మాజీ సీఎం అన్నాదురై 59 ఏళ్ల వయసులో కేన్సర్‌తో మరణించారు. 1969 ఫిబ్రవరి 3న జరిగిన ఆయన అంతిమయాత్రకు కోటిన్నర మంది ప్రజలు హాజరుకావడంతో ‘అత్యధిక సంఖ్యలో ప్రజలు పలికిన తుది వీడ్కోలు’గా గిన్నెస్ ప్రపంచరికార్డ్ నమోదైంది. చెన్నైలో అన్నాదురై భౌతికకాయంతో కూడిన శవపేటికను లక్షలాది మంది అనుసరిస్తున్న ఫోటోలు దీనికి సాక్ష్యంగా నిలిచాయి. ఎంజీఆర్: తమిళనాడులో డీఎంకే రాజకీయాలు, భావజాల వ్యాప్తికి సినీమాధ్యమం ద్వారా కృషి చేసిన వారిలో అన్నాదురై, ఎం.కరుణానిధి, ఎంజీ.రామచంద్రన్ ప్రముఖులు. అయితే సినిమా తెరపై వాటిని తన నటనరూపంలో చూపి ఎంజీఆర్ ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజల సమస్యలు ఎత్తిచూపుతూ, వారితో మమేకమయ్యేలా రూపొందించిన పాత్రలు (కథ,స్క్రీన్ ప్లే కరుణానిధి) ఆయనను అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఆ తర్వాత ఆయన డీఎంకేతో విభేదించి సొంతంగా ఏఐడీఎంకేను స్థాపించి సీఎం పీఠాన్ని అధిరోహించారు. కొన్నేళ్ల తర్వాత అనారోగ్యం బారిన పడి తిరిగి కోలుకోలేదు. 1987 డిసెంబర్ 24న 71 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. ఆయన మరణం తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులివ్వాల్సి వచ్చింది. అంతిమయాత్రలో చెలరేగిన హింసలో 29 మంది మరణించారు. 47 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక 30 మంది అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంజీఆర్ భౌతికకాయాన్ని ఉంచిన వాహనాన్ని అనుసరించినవారు, అంతిమయాత్రలో పాల్గొన్న వారు కలిపి దాదాపు పది లక్షల మంది ఉండొచ్చునని ఓ అంచనా. జయలలిత: సినీనటిగా జీవితం ప్రారంభించిన జె.జయలలిత, ఆ తర్వాత రాజకీయాల్లోనూ ఎంజీఆర్ సన్నిహితురాలిగా మారి ఎన్నో ఎత్తుపళ్లాలు చవిచూశారు. అటు ప్రతిపక్షపాత్రతో పాటు సీఎం పదవిని చేపట్టాక, అనేక సంక్షేమపథకాల అమలు ద్వారా పేదవర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. విప్లవనాయకి (పురచ్చి తలైవి)గా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. తమిళ రాజకీయాల్లో భాగంగా చోటు చేసుకున్న పరిణామాల్లో ఎన్నికల్లో గెలుపోటములు చవిచూశారు. మళ్లీ సీఎంగా ఎన్నికై ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆమె అక్కడే తుదిశ్వాస విడిచారు. చెన్నై మెరీనా బీచ్‌లో జరిగిన అంతిమయాత్రలో దాదాపు పదిలక్షల మంది పాల్గొన్నట్టుగా అంచనా వేస్తున్నారు. కరుణానిధి: తమిళనాడు రాజకీయాలను సుదీర్ఘకాలం పాటు ప్రభావితం చేసిన మాజీ సీఎం ఎం.కరుణానిధి 94 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు. ఐదుసార్లు సీఎంగా, 13 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఓ పర్యాయం ఎమ్మెల్సీగా, దాదాపు 50 ఏళ్ల పాటు డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆ రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. మెరీనా బీచ్‌లోనే కరుణానిధి భౌతికకాయాన్ని ఖననం చేసేందుకు డీఎంకే పట్టుబట్టడంతో ఈ అంశంపై కోర్టు గుమ్మం తొక్కాల్సి వచ్చింది. చివరకు న్యాయస్థానం దానికి అనుకూలంగానే ఆదేశాలిచ్చింది. కరుణానిధి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాలు వద్ద ఉంచిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందినట్టు పలువురు గాయపడినట్లు వార్తాసంస్థలు వెల్లడించాయి. అక్కడ పెద్దసంఖ్యలో గుమికూడిన వారి నియంత్రణకు పోలీసులు లాఠీచార్జీ జరపడంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత ఈ అంతిమయాత్ర చెన్నై నగర వీధుల మీదుగా మెరీనా బీచ్‌కు చేరుకుంది. దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్‌నేతల్లో ఒకరైన కరుణానిధి అంతిమయాత్రలో లక్షల్లో ప్రజలు పాల్గొన్నట్టుగా అంచనావేస్తున్నారు. మెరీనా తీరంలోనే మాజీ సీఎంలు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత సమాధుల పక్కనే కరుణానిధి పార్ధివదేహాన్ని కూడా ఖననం చేశారు. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ముగిసిన ఓ మహా శకం
కరుణానిధి మరణంతో తమిళనాడు రాజకీయాల్లో ఓ శకానికి తెరపడింది. 94 ఏళ్ల కవి, రాజకీయనేత మరణవార్త ప్రకటించగానే నిశ్శబ్దం తాండవమాడింది. ఈ కాలంలో వాస్తవ జీవితంలో కన్నా భారీగా కనిపించిన ముగ్గురు బడా తమిళ నేతలు తమ విలక్షణ శైలితో రాజకీయాలను శాసించారు. అయితే, వారి రాజకీయాలు తక్కువ వైషమ్యా లతో నడిస్తే బావుండేదని అనిపిస్తుంది. మెరీనాలో మాజీ ముఖ్యమంత్రులు సీఎన్ అణ్ణాదురై, ఎంజీఆర్, జయలలిత సమాధుల పక్కనే కరుణానిధి అంత్యక్రియలు జరుగ నున్నాయి. తమిళనాడును తీర్చిదిద్దిన నేతలకు ఇలా మెరీనాలో సమాధులు ఏర్పాటు చేయడం ద్వారా వారికి కృతజత్ఞలు తెలిపే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ‘ఇళందు వా తలైవా ఇళందు వా’ (నాయ కుడా లేవండి, బయటకు రండి!). గత పది రోజులుగా చెన్నై కావేరీ ఆస్పత్రి వెలుపల ఉద్వే గపూరితంగా పిలిచిన మాటలివి. తమ నాయకుడిని మరి కొన్నేళ్లు బతికేలా చూడాలంటూ జనం దేవుణ్ని ప్రార్థించారు. కర్పూరం వెలిగిం చారు. జగమెరిగిన నాస్తికుడైన ముత్తువేల్ కరుణానిధి కోసం ఇలా అభి మానులు చేయడం విశేషమే. మంగళవారం నాయంత్రం 6.10 గంట లకు కరుణానిధి కన్నుమూశారు. 94 ఏళ్ల కవి, రాజకీయ నేత మరణ వార్త ప్రకటించగానే నిశ్శబ్దం తాండవమాడింది. ఇదేమీ ఊహించనిది కాదు. కరుణ ఆరోగ్యస్థితిపై ముందు రోజు ఆస్పత్రి విడుదల చేసిన ప్రక టనలో ఆయన ఏ క్షణంలోనైనా కన్నుమూయవచ్చనే విషయం వెల్లడిం చారు. జయలలిత 2016 డిసెంబర్లో మరణించడానికి కొన్ని రోజులు ముందు కరుణ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఎం.జి.రామచంద్రన్‌తో స్నేహం శత్రుత్వంగా మారడం, తర్వాత జయలలితతో బద్ధవైరం ఆయన రాజకీయ జీవితంలో కొట్టొచ్చి నట్టు కనిపించే విషయాలు. ఏడాదిన్నరగా కరుణానిధి ఇంటికే పరిమిత య్యారు. రాజకీయాల్లో చురుకుగా లేరు. డీఎంకేను పూర్తిగా నడిపిస్తు న్నది ఆయన కొడుకు ఎంకే స్టాలినే. ఆయన గొప్ప సినీ రచయిత. కానీ, మలుపులు, మార్పులతో నిండిన తన కథను వాస్తవం కన్నా మెరుగ్గా రాయగలిగేవారు కాదేమో! ‘రాజకుమారి’ సినీ జీవితం ఆరంభం! ఓసారి ఆయన జీవితంలో వెనక్కి వెళ్లి 1947లో ఏం జరిగిందో చూద్దాం. ఎంజీఆర్ నటించిన తమిళ చిత్రం ‘రాజకుమారి’ కథ కరుణానిధి రాశారు. మూడేళ్ల తర్వాత ‘మంత్రి కుమారి’ కథా రచయితగా హీరో పాత్రకు ఎంజీఆర్ పేరును ఆయన సిఫార్సు చేశారు. ఈ రెండు సిని మాలూ సూపర్ హిట్టవడంతో సినీరంగంలో కరుణ, ఎంజీఆర్‌కు ఎదు రులేకుండా పోయింది. కరుణానిధి 75కు పైగా చిత్రాలకు రచయిత. అయితే, సినీరంగంలో తనతోపాటు ఎదిగిన ఎంజీఆర్ డీఎంకేకు ప్రధాన ప్రచారకునిగా తనను మించిపోతారని కరుణ అప్పట్లో ఊహించలేదు. దీంతో నిరాశకు గురైన కరుణ తమిళ చిత్రరంగంలో ఎంజీఆర్‌కు పోటీగా తన పెద్ద కొడుకు ముత్తును ప్రోత్సహించడానికి ప్రయత్నించారు. ఎంజీ ఆర్‌ను అనుకరించేలా చేయడానికి కూడా వెనుకాడలేదు. కానీ, ఈ ప్రయత్నంలో ముత్తు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఎంజీఆర్‌కు పెరుగుతున్న జనాదరణ చూసి కరుణ జీర్ణించుకోలేకపోయారు. ఇద్దరి మధ్య గొడవ పెరిగి పోయాక ఎంజీఆర్‌ను డీఎంకే నుంచి కరుణానిధి బహిష్కరించారు. తన కృషి ఫలితంగా ఏర్పడిన సినీ ఇమేజ్‌తో ఎంజీఆర్ రాజకీయంగా ముందుకు దూసుకుపోవడం కరుణానిధికి చికాకు పుట్టిం చింది. అణ్ణా ద్రవిడ మున్నేట్ర కజగం(ఏడీఎంకే) అనే పేరుతో ఎంజీఆర్ పార్టీ పెట్టగానే, దాన్ని నడిగర్ కచ్చి అంటే నటుడి పార్టీ అని కరుణ పిలిచేవారు. ఎంజీఆర్ సినిమాలు, రాజకీయాలు ఒకటి కాదని చెబుతూ నటులు రాజకీయాలకు మంచిది కాదని ప్రచారం చేయడానికి పాటలు కూడా ఆయన రాశారు. ‘సినిమా సోరు పోడుమా’ (సినిమా కూడు పెడు తుందా?) అనే పాటల పుస్తకాన్ని కూడా ఆయన ప్రచురించారు. ఎంజీఆర్ అభియోగాలతో కరుణ బర్తరఫ్ కరుణానిధిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంజీఆర్ ఆయన ప్రభు త్వంపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ కేంద్రానికి మెమొరాండం సమర్పించారు. 1976 జనవరిలో డీఎంకే ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసి, ఆరోపణలపై దర్యాప్తునకు జస్టిస్ సర్కారియా కమిషన్ నియమిం చింది. 1976–89 మధ్యకాలం కరుణానిధికి నిజంగా కష్టకాలం. అధి కారం లేకుండా డీఎంకేపై తన పట్టు సడలకుండా, పార్టీ కార్యకర్తలు నిస్పృహకు లోనుకాకుండా ఆయన పట్టుదలతో కృషిచేశారు. అయితే, కరుణానిధిని ఊపిరి సలపనీయకుండా చేశారు ఎంజీఆర్. 1984లో కరుణ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక, శాసనమండలి రద్దుకు ఎంజీఆర్ తమి ళనాడు అసెంబ్లీలో తీర్మానం చేయించారు. పైకి ‘మండలి’ వల్ల అనవ సర ఖర్చని చెప్పినాగాని, కరుణకు మాట్లాడటానికి వేదిక లేకుండా చేయ డమే ఎంజీఆర్ ఉద్దేశమని డీఎంకే భావించింది. ఎన్నికల విజయాల విషయానికి వస్తే, దేశంలో కరుణే అగ్రస్థానంలో నిలబడతారు. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడమేగాక 1957 నుంచి 13 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక్క 1984లోనే ఆయన పోటీచేయలేదు. అయితే, రాజకీయాల్లో తనకంటే జూనియర్లయిన ఇద్దరు తనను పదవి నుంచి తొలగించగలగడం కరుణానిధిని బాధించింది. 1976లో తనను బర్తరఫ్ చేశాక ఎంజీఆర్ బతికున్నంత వరకూ ఆయన మళ్లీ ముఖ్య మంత్రి కాలేకపోయారు. 1987లో ఎంజీఆర్ కన్నుమూశాకే కరుణకు మళ్లీ అధికారం దక్కింది. అలాగే, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత రెండోసారి వరుస విజయం సాధించి కరుణానిధిని చివరిసారి సీఎం కాకుండా అడ్డుకున్నారు. జయలలితపై వ్యక్తిగత విమర్శలు జయలలిత రాజకీయాల్లోకి రాగానే డీఎంకే ఆమెపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడింది. 1982లో కడలూరులో జరిగిన ఏడీఎంకే మహాసభలో జయ తొలి రాజకీయ ప్రసంగం వినడానికి ఊరు ఊర ంతా తరలివచ్చిందని జయలలిత జీవిత చరిత్ర రాసిన వాసంతి పేర్కొన్నారు. ‘జనం అందమైన ముఖాన్ని చూడటానికి వచ్చారుగాని నిప్పులు చెరుగుతూ చేసిన జయ ఉపన్యాసం విన్నారు’ అని వాసంతి రాశారు. డీఎంకే పార్టీ దినపత్రికలో మాత్రం జయ రాజకీయప్రవేశాన్ని ‘కడలూర్ కేబరే’ అని ఎగతాళి చేసింది. 1989లో తమిళనాడు అసెంబ్లీ లోపల జరిగిన అవమా నకరమైన సంఘటన వారిద్దరి మధ్య సంబంధాలను శాశ్వతంగా క్షీణిం చేలా చేసింది. పాలకపక్షమైన డీఎంకే తన ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందని జయ ఆరోపించారు. వెంటనే సీఎం పదవిలో ఉన్న కరుణానిధి ఆమె నుద్దేశించి చేసిన అసభ్య వ్యాఖ్య ఆమెకు ఆగ్రహం తెప్పించింది. తర్వాత కరుణ మాటలను రికార్డుల నుంచి తొలగించారు. అనంతరం సభలో జరిగిన గందరగోళంలో డీఎంకే నేత దురైమురుగన్ జయ చీర లాగ డానికి ప్రయత్నించారు. మరుసటి ఎన్నికల్లో విజయం సాధించే వరకూ అసెంబ్లీలోకి అడుగుపెట్టనని ఆగ్రహంతో జయలలిత శపథం చేశారు. పురుషాధిక్యాన్ని అణచివేస్తానని కూడా చెప్పారు. 1991లో డీఎంకేకు ఘోర పరాజయం! 1991లో కరుణానిధికి గడ్డుకాలం మొదలైంది. అప్పటి ఎన్నికల్లో 225 సీట్లతో జయలలిత ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి అడుగుబెట్టారు. డీఎంకే నాయకత్వంలోని కూటమికి దక్కింది ఏడు సీట్లే. ఏడీఎంకే కూటమికి 59.8 శాతం ఓట్లు రాగా, డీఎంకే కూటమికి లభించినవి 30 శాతమే. దీంతో అసెంబ్లీకి హాజరయ్యేకంటే శాసనసభ్యత్వానికి రాజీ నామా చేయడం మేలని భావించి కరుణ ఆ పని చేశారు. 1989లో జయపై జరిగిన దాడికి ప్రతీకారంగా అసెంబ్లీలో తనపై ఏఐఏడీఎంకే దాడిచేయవచ్చనే అనుమానంతో కరుణ అసెంబ్లీకి రాజీనామా చేశారని అప్పటి ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతారు. ఇద్దరు నేతల మధ్య వైరం అంతటితో ఆగలేదు. 1990ల చివర్లో అవినీతి ఆరోపణలపై జయ లలితను కరుణానిధి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. తర్వాత అధికా రంలోకి వచ్చిన జయలలిత 2001లో ఫ్లైఓవర్ కేసులో అర్ధరాత్రి కరు ణానిధిని అరెస్ట్ చేయించి పగ తీర్చుకున్నారు. ఇలా పగ, ప్రతీకారాలతో వారి రాజకీయాలు విద్వేషపూరితంగా మారాయి. వారిద్దరి మధ్య రాజ కీయ శత్రుత్వానికి ముగింపు లేకుండా పోయింది. పదిహేనేళ్ల తర్వాత కూడా కరుణానిధి కుటుంబంపై జయ కోపం తగ్గలేదు. 2016లో ముఖ్య మంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ కార్యక్రమా నికి డీఎంకే తరఫున హాజరైన కరుణానిధి కొడుకు ఎం.కె.స్టాలిన్‌కు ముందు వరుసలో కూర్చునే అవకాశం ఆమె ఇవ్వలేదు. వాస్తవానికి 89 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని డీఎంకే ప్రధాన ప్రతిపక్షమైనప్పటికీ జయ లలిత స్టాలిన్‌కు తగిన స్థానంలో కూర్చునే అవకాశం కల్పించలేదు. ఇది ‘ఉద్దేశపూరితంగా చేసిన అవమానం’ అంటూ కరుణ ఆగ్రహంతో, ‘‘జయలలిత మారలేదు. ఎప్పటికీ ఆమె మారదు,’’ అని దుయ్యబ ట్టారు. దీంతో స్టాలిన్‌ను అవమానించే ఉద్దేశం తనకు లేదని జయలలిత వివరణ ఇచ్చుకున్నారు. కరుణపై ఎంజీఆర్‌కు ప్రత్యేక అభిమానం! పైకి బద్ధ రాజకీయ శత్రువులుగా కనిపించినా కరుణానిధిపై ఎంజీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉందని ఇద్దరితో సాన్నిహిత్యం ఉన్నవారు చెబు తారు. అందుకే కరుణానిధిని ఎవరైనా పేరు పెట్టి ప్రస్తావిస్తే వారిని ఎంజీఆర్ కోప్పడేవారని అంటారు. కరుణను ‘కళైంజ్ఞర్’ (కళాకారుడు) అని పిలవాలని ఎంజీఆర్ గట్టిగా చెప్పేవారు. ఎంజీఆర్ మరణించిన ప్పుడు ఆయన నివాసానికి మొదట వెళ్లింది కరుణానిధే కావడం విశేషం. కరుణ ఓదార్చలేని స్థాయిలో కన్నీరు కారుస్తూ విలపించారు. సముద్ర తీరంలోని మెరీనాలో మాజీ ముఖ్యమంత్రులు సీఎన్ అణ్ణాదురై, ఎంజీ ఆర్, జయలలిత సమాధుల పక్కనే కరుణానిధి అంత్యక్రియలు జరుగు తాయని చెప్పారు. తమిళనాడు భవిష్యత్తును తీర్చిదిద్దిన నేతలకు ఇలా మెరీనాలో సమాధులు ఏర్పాటు చేయడం ద్వారా వారికి కృతజత్ఞలు తెలిపే సంప్రదాయం ఇప్పుడు కూడా కొనసాగుతుంది. కరుణానిధి మరణంతో తమిళనాడు రాజకీయాల్లో ఓ శకానికి తెరపడింది. ఈ కాలంలో వాస్తవ జీవితంలో కన్నా భారీగా కనిపించిన ముగ్గురు బడా తమిళ నేతలు తమ విలక్షణ శైలితో రాజకీయాలను శాసించారు. అయితే, వారి రాజకీయాలు తక్కువ వైషమ్యాలతో నడిస్తే బావుండేదని మాత్రం మనకు అనిపిస్తుంది. వ్యాసకర్త : టీఎస్ సుధీర్, సీనియర్ జర్నలిస్టు -
త్వరలో ఎంజీఆర్ చిత్ర టీజర్
తమిళసినిమా: ఎంజీఆర్ ఇది పేరు కాదు చరిత్ర. సినీరంగంలోనూ, రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకుని సినీ, రాజకీయ చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎంజీఆర్. అలాంటి గొప్ప నటుడు, రాజకీయ నాయకుడు బయోపిక్ చిత్రంగా తెరకెక్కించాలని చాలా మంది ప్రయత్నించినా జరగలేదు. అలాంటిది ఏ.బాలకృష్ణన్ ఆ సాహసం చేస్తున్నారు. ఈయన ఇంతకు ముందు కామరాజర్ ఇతి వృత్తంలో చిత్రం చేసి అందరి ప్రశంసలు పొందారు. తాజాగా ఎంజీఆర్ బయోపిక్‌ను రమణా కమ్యునికేషన్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంబోత్సవానికి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. కాగా ఎంజీఆర్ చిత్ర వివరాలను దర్శక నిర్మాత ఏ.బాలకృష్ణన్ తెలుపుతూ ఇందులో ఎంజీర్ ముఖ కవళికలతో కూడిన వాణిజ్య చిత్రాల నటుడు సతీష్‌కుమార్ ఆయన పాత్రలో నటిస్తున్నారని చెప్పారు. ఎంజీఆర్ సతీమణి జానకీగా నటి రిత్విక, ఎంఆర్.రాధగా బాలాసింగ్, దర్శకుడు పంతులుగా వైజీ.మహేంద్రన్, ఎంజీఆర్ సోదరుడు చక్రపాణిగా మలయాళ నటుడు రఘు, నాటక రంగ యజమానిగా దీనదయాళన్, ప్రాణ స్నేహితుడిగా వైయాపురి మొదలగు పలువురు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని తెలిపారు. ఎంజీఆర్ చిత్ర కథలతో పాటు పాటలకు ప్రాముఖ్యతనిచ్చిన విషయం తెలిసిందేనన్నారు. అందుకు ఆయన చిత్రాలు, పాటలు నేటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయన్నారు. అదే విధంగా ఎంజీఆర్ చిత్రం కోసం గతంలో ఆయన చిత్రాలకు పాటలను రాసిన గీత రచయితలు పులమైపిత్తన్, ముత్తురామలింగం, పూవై సెంగూట్టువన్లతో రాయించినట్లు చెప్పారు. ఈ చిత్రానికి ఐదుగురు సంగీత దర్శకులు పని చేయడం విశేషం అన్నారు. చిత్ర టీజర్‌ను వచ్చే వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర దర్శక నిర్మాత ఏ.బాలకృష్ణన్ తెలిపారు. -
రజనీ కూడా ఎంజీఆర్ టైపేనా?
సాక్షి, చెన్నై : కొత్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రజనీకాంత్ గత కొంత కాలంగా అందుకు అనువైన చిత్రాలలోనే నటిస్తున్నారు. తాజాగా అయన నటించిన చిత్రం ‘కాలా’ ఈ నెల ఏడవ తేదీన విడుదలవుతున్న విషయం తెల్సిందే. నాటి బాషా నుంచి నేటి కాలా వరకు ఏ చిత్రంలో రజనీకాంత్ నటించినా అందులో పేదల పక్షమే వహించారు. రాజకీయాల్లో రాణించాలనుకునే సినీ నటులకు సినిమా పేద ప్రేక్షకులే పట్టం గడతారు. నాడు ఎంజీ రామచంద్రన్ విషయంలో అదే జరిగింది. పేదలు, అణగారిన వర్గాల పెన్నిధిగా రజనీకాంత్ కన్నా ఆయనే ఎక్కువ చిత్రాల్లో నటించారు. అలాంటి వారిని గెలిపించుకుంటే తమ అభ్యున్నతికి పాటు పడుతారని పేదవాడు ఆశిస్తాడు తప్పా. అది జరిగే పని కాదు. 1977లో తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన ఎంజీ రామచంద్రన్ పదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగినా పేద ప్రజలకు చేసిందేమీ లేదు. ఆయన అనుసరించిన పన్ను విధానం వల్ల ధనవంతులకు రాయితీ లభించగా, పేదలపై పన్ను భారం పడింది. ఆయన తీసుకొచ్చిన గూండాస్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ లా చట్టాలు ప్రజా ఆందోళనలను, ప్రతిపక్షాన్ని అణచివేసేందుకే ఉపయోగపడ్డాయి. వార్తా పత్రికలను సెన్సార్ చేయడానికి ఓ చట్టం చేయడానికి ఆయన ప్రయత్నించారు. ఎప్పుడూ తన వ్యక్తిగత ప్రతిష్టను కోరుకునే ఎంజీఆర్ సద్విమర్శలను కూడా అనుమతించేవారు కాదు. అందుకనే ఎంజీఆర్ మరణానంతరమే ఆయనపై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. ఎంజీఆర్ దృక్పథాల గురించి ఎంఎస్ఎస్ పాండ్యన్ రాసిన ‘ఇమేజ్ ట్రాప్’ పుస్తకంలో మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఎంజీఆర్ లాగా కాకుండా ఏ పదవి లేనప్పుడే రజనీకాంత్‌పై విమర్శలు వస్తున్నాయి. నాడు ఎంజీఆర్లాగానే నేడు తమిళనాడులో రజనీకాంత్‌కు కూడా పేద, మధ్యతరగతి అభిమానులే ఎక్కువగా ఉన్నారు. అధికారంలోకి వచ్చాక ఎంజీఆర్ లాగా కాకుండా పేదల పక్షపాతిగానే రజనీకాంత్ కొనసాగుతారా? చూడాలి! -
ఎంజీఆర్‌తో ఢీ
తమిళసినిమా: లెజెండరీ యాక్టర్, చరిత్రకారుడు ఎంజీఆర్‌తో కలిసి నటించే అవకాశం కోసం అప్పట్లో చాలా మంది ఎదురుచూసి ఉంటారు. అలాంటి వారిలో అతి కొద్దిమందికే ఆయనతో నటించే అవకాశం లభించి ఉంటుంది. చాలా మందికి అది కలగానే మిగిలిపోయి ఉంటుంది. అలాంటిది ఎంజీఆర్ జీవించి లేకపోయినా ఆయనతో నటించే లక్కీ ఛాన్స్‌ను నటి అక్షరగౌడ్ అందుకుంది. అదేంటని ఆశ్చర్య పోతున్నారా. ఈ డిజిటల్ యుగంలో ఏదైనా సాధ్యమే. ఎంజీఆర్ ఉలగం చుట్రుమ్ వాలిభన్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో దానికి సీక్వెల్ చేయాలని భావించినా, ఆయన రాజకీయాల్లో బిజీ కావడంతో అది జరగలేదు. అయితే ఎంజీఆర్ ఉలగం చుట్రుమ్ వాలిభన్ చిత్రానికి సీక్వెల్ తాజాగా కిళక్కు ఆఫ్రికావిల్ రాజు పేరుతో తెరరూపం దాల్చుతోంది. ఇది కొంత భాగం యానిమేషన్‌లోనూ మరి కొంత భాగం నటీనటులు నటించే విధంగానూ రూపొందుతోంది. ఎంజీఆర్, జయలలిత, నాగేశ్ వంటి పాత్రలు యానిమేషన్‌లోనూ ఇతర పాత్రలు నేరుగానూ ఉంటాయట. ఇందులో ఎంజీఆర్‌కు ప్రతినాయకిగా అక్షరగౌడ్ను ఎంపిక చేశారు. ఈ అమ్మడు ఇంతకుముందు ఉయిర్‌తిరు 420, తుపాకీ, ఆరంభం, ఇరుంబు కుదిరై, బోగన్ చిత్రాల్లో గ్లామరస్ విలనీయాన్ని ప్రదర్శించారు. కిళక్కు ఆఫ్రికావిల్ రాజు చిత్రంలో ఎంజీఆర్ ఆఫ్రికా వెళ్లినప్పుడు అక్కడ ఆయనతో ప్రతినాయకిగా అక్షరగౌడ్ ఢీకొంటారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. -
ఎంజీఆర్, పెరియార్ విగ్రహాలపై కాషాయ వస్త్రాలు
సాక్షి, చెన్నై : విగ్రహాల విధ్వంసం ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా తమిళనాడు మాజీ సీఎంలు ఎంజీఆర్, అన్నాదురై, ద్రవిడ కజగం వ్యవస్ధాపకులు పెరియార్ విగ్రహాలకు కాషాయ వస్త్రాలను కట్టడం కలకలం రేపింది. నమక్కల్‌లో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అస్సాంలోని కోక్రాజర్ పట్టణంలో జన్‌సంఘ్ వ్యవస్ధాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ విగ్రహం ధ్వంసం చేసిన మరుసటి రోజు ఈ ఉదంతం వెలుగుచూడటం గమనార్హం. బుధవారం ఉదయం కొందరు దుండగులు ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో కోక్రాజర్ డిప్యూటీ కమిషనర్ నిరంజన్ బారువా పోలీసు అధికారులతో కలిసి ఘటనా స్ధలాన్ని సందర్శించారు. అంతకుముందు ఈ నెల 7న కోల్‌కతాలోనూ శ్యామా ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చినందుకు నిరసనగా తాము ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేశామని నిందితులు స్వయంగా వెల్లడించారు. మరోవైపు బీఆర్ అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాలనూ ఇటీవల ధ్వంసం చేసిన ఘటనలు వెలుగుచూడటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఎంజీఆర్, జయలలిత కాంబినేషన్లో 29వ చిత్రం
తమిళసినిమా: దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత కలిసి 28 చిత్రాల్లో నటించారు. అవన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందినవే. తాజాగా ఆ జంట 29వ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. మరణించిన వారు మళ్లీ నటించడమేంటీ అనుకుంటున్నారా? అవును.. అత్యం త ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎంజీఆర్, జయలలిత జంట గా కిళక్కు ఆఫ్రికావిల్ రాజు అనే యానియేషన్ చిత్రం తెరకెక్కుతోంది. ఎంజీఆర్ కథానాయకుడిగా 1972లోనే హాంకాంగ్, జపాన్ వంటి దేశాల్లో ఉలగం చుట్రుం వాలిభన్ అనే బ్రహ్మండ చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో ఎంజీ ఆర్ దానికి సీక్వెల్‌గా కిళక్కు ఆఫ్రికావిల్ రాజు చిత్రం చేయాలని భావించారు. ఆ తరువాత ఆ యన రాజకీయ రంగప్రవే శం చేయడంతో ఆ చిత్రం తెరకెక్కలేదు. కాగా అదే పేరుతో ఉళగం చుట్రుం వాలిబన్ చిత్రానికి సీక్వెల్‌గా అప్పట్లో ఎంజీఆర్‌తో కలిసి పలు చిత్రాలలో నటించిన ఆయన స్నేహితుడు ఐసరి వేలన్ కొడు కు ఐసరి గణేశ్ వేల్స్ ఫి లిం ఇంటర్నేషనల్, ప్రభుదేవా స్టూడియోస్ సంస్థలు కలిసి యానిమేషన్ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇటీవల ఎంజీఆర్ 101వ జయంతి రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఆయన 102వ జయంతి సందర్భంగా కిళక్కు ఆఫ్రికావిల్ రాజు చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో ఎంజీఆర్‌కు జంటగా జయలలిత నటింపజేస్తున్నట్లు ఆమె జయంతి సందర్భంగా శనివారం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర సృష్టికర్త (దర్శకుడు) అరుణ్మూర్తి మాట్లాడుతూ ఇది ఒక చారిత్రాత్మక ప్రయోగంగా నిలిచిపోతుందన్నారు. ప్రేక్షకుల మనసుల్ని గెలుసుకున్న పురట్చి తలైవన్ ఎంజీఆర్, పురట్చి తలైవి జయలలితలను మళ్లీ తెరపై చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇలాంటి యానిమేషన్ చిత్రాలను వాల్ట్ డిస్నీ లాంటి సంస్థలు రూపొందించడానికి కనీసం నాలుగేళ్లు పడుతుందని, తాము ఏడాదిలో పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎంజీఆర్ చిత్రాల ఫార్ములా ఈ చిత్రంలోనూ ఉంటుందని, అప్పటి కాలానికి తగ్గట్టుగానే చిత్ర కథనాన్ని తయారు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. -
ఎంజీఆర్ తరహాలోనే కమల్ కూడా
సాక్షి, చెన్నై : తమిళనాడులో రాజకీయాలు, సినిమాలు అన్నదమ్ముల లాంటివనే విషయం అందరికి తెల్సిందే. అందుకనే సినిమా నటులు ఎక్కువగా రాజకీయాల్లోకి వచ్చి హిట్టవుతుంటారు. అలాంటి హిట్లను ఆశిస్తూ ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఎంజీ రామచంద్రన్ సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చి ఇలాంటి వారికి ముందుగానే మార్గదర్శకం చేశారు. ఎంజీఆర్ రాజకీయాల్లో రాణింపుకు ఆయన సినిమాల్లోని పాటలు ఆయనకు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. ఎంజీఆర్‌ను సినిమాల్లో ఎక్కువగా నిలబెట్టిందీ ఎంఎస్ విశ్వనాథన్ సమకూర్చిన పాటలు కాగా, ఆ పాటలను రాసిందీ కన్నదాసన్, వాలీ. 1965లో వచ్చిన ‘ఉంగల్ వీటు పిల్లయ్’ సినిమాలోని నాన్ అనయిట్టల్ అతు నాదంతువిట్టల్ (నేను ఏది ఆదేశిస్తే అదవుతుంది) అన్న పాట అప్పట్లో ఉర్రూతలూగించింది. ఆయన డీఎంకే నుంచి విడిపోయి అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం పార్టీని పెట్టినప్పుడు ఈ పాట పార్టీ గీతంగా ఊరు, వాడ మారుమోగిపోయింది. ఇప్పుడు ఆయన తరహాలోనే రాజకీయాల్లో రాణించేందుకు కమల్ హాసన్ తాను నటించిన సినిమాల్లోని, ముఖ్యంగా రాజకీయ సినిమాలు లేదా సినిమాల్లోని రాజకీయపరమైన పాటలను ప్రచారం కోసం వాడుకోవాలని చూస్తున్నారని తెల్సింది. ఎంజీఆర్‌కు ఎంఎస్ విశ్వనాథన్ సంగీత దర్శకుడిగా ఉన్నట్లుగా, కమల్ హాసన్‌కు కూడా ఇళయరాజా సమకూర్చిన పాటలే ఎక్కువగా ఉన్నాయన్న విషయం తెల్సిందే. నిజంగా చెప్పాలంటే ఆయన నటించిన చాలా సినిమాల్లో ఇళయరాజా సమకూర్చిన పాటలే ఆయనకు ప్రాణం పోశాయి. కమల్ హాసన్ మొన్న బుధవారంనాడు తన కొత్త పార్టీని పకటించినప్పుడు తమిళనాడులోని ఎనిమిది గ్రామాలను ఆదర్శగ్రామాలుగా దిద్దుతానని చెప్పారు. తాను హీరోగా నటించిన దర్శకుడు కే. బాలచందర్ 1988లో తీసిన ‘ఉన్నల్ ముడియం తంబీ (నీవు సాధించగలవు, సోదరా!)’ చిత్రంలోనిదే ఆ ఐడియా. అదే సినిమాను బాలచందర్ అదే ఏడాది తెలుగులో చిరంజీవి హీరోగా ‘రుద్రవీణ’ను తీశారు. మద్యం మత్తును వదిలించుకోవాలంటూ ఆ సినిమాలో టైటిల్ సాంగ్ సాగుతుంది. రాజకీయ నాయకులు మద్యాన్ని ప్రోత్సహించడాన్ని తూర్పార పడుతుంది. ఈ పాటను కూడా ఆయన తన ప్రచారానికి ఎక్కువ వాడుకుంటారని తెల్సింది. అలాగే సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1989లో వచ్చిన ‘అపూర్వ సహోదరర్గళ్ (తెలుగులో–విచిత్ర సోదరులు)’ చిత్రంలోని అవినీతికి వ్యతిరేకంగా సాగే ఓ పాటను కూడా ప్రచారానికి వాడుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రంలో తరతరాలుగా పెరుగుతూ వస్తున్న అవినీతిని అంతం చేయాల్సిన అవసరం కూడా తనను పార్టీని పెట్టేల ప్రేరేపించిందని కూడా పార్టీ ఆవిర్భావ సభలో కమల్ హాసన్ ప్రకటించారు. ఇక ‘తేవర్ మగన్’ చిత్రంలో ఎంజీఆర్‌తో కలిసి ఆయన నటించిన విషయం తెల్సిందే. రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న తేవర్ కులస్థుల దర్పానికి ప్రతిబింబంగా పేరు పొందిన ఈ సినిమాల్లోని పాటలను కూడా ఆయన ప్రచారానికి వాడుకుంటారనడంలో సందేహం లేదు. -
1600మంది ఖైదీలకు విముక్తి
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎంజీ రామచంద్రన్, జయలలితల జయంతి సందర్భంగా తమిళనాడు జైళ్లలోని 1,600 మంది యావజ్జీవ ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించనున్నది. ఎంజీఆర్ జయంత్యుత్సవాలను ఈనెల 17వ తేదీన, వచ్చే నెల 25న జయలలిత జయంతిని నిర్వహించనున్నారు. ఈ సందర్భాలను పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జైళ్లలో పదేళ్లకుపైగా యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అన్ని జైళ్లలోని జాబితాను కలుపుకుంటే 1,900 మంది ఖైదీల విడుదలకు జైళ్లశాఖ నుంచి సిఫార్సులు అందాయి. వీరిలో 1,600 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఎంజీఆర్ చిత్రానికి ముఖ్యమంత్రి క్లాప్
తమిళసినిమా: ఎంజీఆర్ చిత్రానికి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి క్లాప్ కొట్టారు. మక్కల్ తిలకం దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ జీవిత చరిత్ర వెండితెర కెక్కునున్న విషయం తెలిసిందే. రమణ కమ్యూనికేషన్ పతాకంపై ఏ.బాలకృష్ణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ఉదయం స్థానిక అడయారు సమీపంలోని ఫిలింసిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ చిత్రానికి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ముఖ్యఅతిథిగా హాజరై ముహూర్త సన్నివేశానికి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం, రాష్ట్రమంత్రులు పాండియన్, కడబూర్ రాజా, తిరువళ్లూర్ పార్లమెంట్ సభ్యులు వేణుగోపాల్, రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో ఎంజీఆర్‌గా సతీష్‌కుమార్ నటిస్తుండగా, అన్నాదురైగా దర్శకుడు ఎస్ఎస్.స్టాలిన్ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింగంపులి, బ్లాక్ పాండి, ఏఆర్.దీనదయాళన్, ముత్తురామన్ నటిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రులు వీఎన్.జానకి, జయలలితల పాత్రల్లో నటించే నటీమణుల ఎంపిక జరుగుతోందని నిర్మాత తెలిపారు. అదేవిధంగా చిత్ర టీజర్‌ను ఎంజీఆర్ జయంత్రి రోజు జనవరి 17న, చిత్రాన్ని ఏప్రిల్‌లోనూ విడుదలకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. -
రీల్ పైకి ఎంజీఆర్ రియల్ లైఫ్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్... ఇప్పుడు ఇటు సౌత్ అటు నార్త్‌లో బయోపిక్‌ల (జీవితకథ) ట్రెండ్ నడుస్తోంది. మూవీస్, స్పోర్ట్స్, పాలిటిక్స్‌కి చెందిన సెలబ్రిటీల జీవిత కథలను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించడానికి ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో ప్రముఖ దివంగత నటుడు, తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ బయోపిక్‌కి శ్రీకారం జరిగింది. బాలకృష్ణన్ దర్శకత్వంలో రమణ కమ్యూనికేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రారంభం కానుంది. ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ముఖ్య అతిథిగా హాజరవుతారు. మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రకు ఇంకా ఎవర్నీ సెలక్ట్ చేయలేదు. ఈ పాత్ర కోసం చిత్రబృందం పలువురి పేర్లను పరిశీలిస్తున్నారట. కాగా, ‘బాహుబలి’లో కట్టప్పగా అలరించిన సత్యరాజ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు కోలీవుడ్ టాక్. తెలుగులోనూ ఎన్టీఆర్ బయోపిక్‌లు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటు సినిమా, అటు రాజకీయరంగంలో రాణించిన ఎన్టీఆర్, ఎంజీఆర్ బయోపిక్‌లు ఏకకాలంలో రూపొందనుండటం తెలుగు, తమిళ రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ అయింది. -
తెరపైకి ఎంజీఆర్ జీవితచరిత్ర
తమిళసినిమా: ప్రజా నటుడు ఎంజీఆర్ జీవిత చరిత్ర జగమెరిగినదే. ఆయన నటన, రాజకీయ జీవితం తెరచిన పుస్తకమే. ఇప్పటికే ఇరువర్ చిత్రంలో దర్శకుడు మణిరత్నం ఎంజీఆర్ జీవితంలోని ఒక కోణాన్ని తెరపై ఆవిష్కరించారు. అయితే సగటు మనిషి చేత మక్కల్ తిలకం బిరుదాంకితుడైన ఎంజీఆర్ జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు కామరాజ్ ది కింగ్‌మేకర్, ముదల్వర్ మహాత్మ చిత్రాలను నిర్మించిన రమణ కమ్యునికేషన్ సంస్థ అధినేత ఏ.బాలకృష్ణన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఎంజీఆర్ బాయ్స్ నాటక కంపెనీ కాలం నుంచి ప్రారంభమయ్యి, ఆయన సినీ జీవితం, అన్నాదురైతో భేటీ, రాజకీయరంగ ప్రవేశం, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వైనం వరకూ అంశాలు చిత్రంలో చోటు చేసుకుంటాయని చెప్పారు. ఎంజీఆర్ నటుడు గానే కాకుండా ఇతర రంగాలలోనూ ప్రాచుర్యం పొందారన్నారు. ఆ విషయాలను చిత్రంలో పొందుపరచనున్నామని తెలిపారు. ఎంజీఆర్ శతాబ్ది సందర్భంగా ఆయన జీవితచరిత్రను తెరకెక్కించడం సంతోషంగా ఉందని అన్నారు. వచ్చే నెల 8వ తేదీన చిత్రాన్ని ప్రారంభించనున్నామని, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి చేతుల మీదగా చిత్ర ప్రారంభం జరగనుందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు, శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, సినీ ప్రముఖులు పాల్గొననున్నారని చిత్ర నిర్మాత ఏ.బాలకృష్ణన్ వెల్లడించారు. -
జయ టార్గెట్ చేశారు
♦ విశ్వరూపం విడుదలలో రాజకీయం ♦ కామరాజనాడార్, ఎంజీఆర్, శివాజీ కూడా విద్యావేత్తలు కాదు ♦ పౌరుడిగా విమర్శించే హక్కుంది ♦ రాజకీయ పార్టీకోసం ఒత్తిడి చేయవద్దు ♦ ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్ స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, చెన్నై : జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తనను టార్గెట్ చేశారని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రశ్నకు బదులేదీ’ కార్యక్రమం కింద ‘తంది’ తమిళచానల్కు కమల్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ శనివారం ప్రసారమైంది. ఈ సందర్భంగా ఆయన పలు ఆంశాలను ఆయన ముక్కుసూటిగా ప్రస్తావించారు. ఆయన మాటల్లోనే.. రాజకీయ విమర్శలు కొత్తగా చేస్తున్నవి కాదు, ముఖ్యమంత్రి జయలలిత నా సినీజీవితంపై ప్రత్యేకంగా గురిపెట్టారు. విశ్వరూపం సినిమాలో ఒక సామాజికవర్గాన్ని కించపరచలేదు, ఈ విషయాన్ని వారే అంగీకరించారు. సినిమా విడుదల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు ఆనాటి పాలకుల రాజకీయమే. సినిమాను రాజకీయం చేసిన ప్రభుత్వ వైఖరితో విసిగి వేసారిపోయిన నేను రాష్ట్రం లేదా దేశం విడిచి వెళతానని అన్నాను. అంటే తెల్లదొరలతో చేరిపోతానని కాదు. ఇలాంటి వేధింపులు లేని మరో రాష్ట్రంలో స్థిరపడతానని అర్థం. నేను తీసుకున్న నిర్ణయానికి సిగ్గుపడాల్సిన నేతలు నేడు విమర్శలు చేస్తున్నారు. మనస్సులో ఏదో పెట్టుకుని నేను విమర్శలు చేయడం లేదు, ప్రజలతో పంచుకుంటున్నాను. దేశం మంచి మార్గంలో పయనించాలని ఒక పౌరుడిగా కోరుకోవడం, విమర్శించిడం నా హక్కు. దీన్ని ఎవరు తప్పు పట్టినా పట్టించుకోను. రజనీకాంత్ పార్టీ పెట్టినా తప్పుంటే విమర్శలకు వెనుకాడను. తమిళనాడు ప్రజలు నాయకత్వ లక్షణాలను ఉన్నవారిని కాకుండా నిపుణులను మాత్రమే వెదుకుతున్నారు. నాకు కనీసం ప్రాథమిక విద్య కూడా లేదని కొందరు హేళన చేస్తున్నారు. కామరా>జనాడార్ చదుకోకున్నా ప్రత్యేకమైన సమర్థత కలిగిన వారు, ప్రజల మన్నలను పొందారు. శివాజీ గణేశన్, ఎంజీ రామచంద్రన్ కూడా ఉన్నత విద్యలు అభ్యసించలేదు. అయితే వారు ఎంచుకున్న రంగాల్లో నిష్ణాతులుగా నిరూపించుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు నేడు అటువంటి నేతలు లేరు. నిర్మాతగా, నటుడిగా సరైన మార్గంలో వెళుతున్నా, క్రమం తప్పకుండా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా. నా చిన్నతనం నుంచే ఇంట్లో అందరం కలిసి అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. మనఃపూర్వకంగా ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవిస్తాం. ఈ చర్చల్లో ఆస్తికత్వం, నాస్తికత్వం అంశాలు కూడా మా చర్చల్లో చోటు చేసుకుంటాయి. మనసుకు తోచిన అభిప్రాయాలను వెల్లడి చేసేందుకు ఎప్పుడూ నేను జంకలేదు. -
వంతెనలకు ఎంజీఆర్, జయలలిత పేర్లు
మదురైలో రెండు వంతెనలు ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి కేకేనగర్ : మదురైలో కొత్తగా నిర్మించిన రెండు వంతెనలను ఎంజీఆర్, జయలలిత పేర్లతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రారంభించారు. మదురై వైగై నది మీదుగా రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం 2014లో ప్రారంభమైంది. వీటి నిర్మాణం కోసం అప్పటి ముఖ్యమంత్రి జయలలిత రూ.30.47కోట్లను కేటాయించారు. అరబ్ పాలయం, అరుళ్ దాస్పురం, సెల్లూర్, తిరుముల్లై రాయర్ పట్టిదురై ప్రాంతాలను కలిపే విధంగా నదిపై వంతెన నిర్మాణం పూర్తయ్యింది. ఆరబ్ పాళయం – అరుళ్దాస్ పురం వంతెనకు జయలలిత పేరు, సెల్లూర్ – తిరుమలైరాయర్ పట్టిదురై వంతెనకు ఎంజీఆర్ పేరు పెట్టారు. మదురైలో చిత్తిరై ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించే దిశగా ఈ కొత్త వంతెనలను ప్రారంభిచడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, మదురైలో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో వంతెనలను ప్రారంభించారు. అనంతరం రూ.22.25 కోట్ల విలువైన అభివృద్ధి పథకాలు, సంక్షేమ సహాయకాలను అందజేసి ప్రసంగించారు. విమానం ద్వారా ఆయన శుక్రవారం మధ్యాహ్నం మదురై చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. -
దీప ఇన్ చార్జ్‌లు
► నాలుగు డివిజను్లగా ఏర్పాటు ► మొదట్లోనే వ్యతిరేకత ► కమిటీలో మరింత జాప్యం సాక్షి, చెన్నై: ఎంజీఆర్, అమ్మ దీపపేరవైకు ఇన్ చార్జ్ లను ప్రకటించారు. రాష్ట్రాన్ని నాలుగు డివిజను్లగా విభజించి ఇన్ చార్జ్ ల జాబితాను ఆ పేరవై కార్యదర్శి, దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప శుక్రవారం విడుదల చేశారు. ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా అనేక చోట్ల పదవుల వివాదం ఏర్పడింది. ఇక, పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటులో మరింత జాప్యం తప్పదన్న ప్రచారం ఊపందుకుంది. మేనత్త జయలలిత జయంతి రోజున దీప తన రాజకీయ పయనం గురించి ప్రకటన చేశారు. ఆ మేరకు ఎంజీఆర్, అమ్మ, దీపపేరవైతో తన రాజకీయ పయనం సాగుతుందని చేసిన ప్రకటన మద్దతు దారుల్లోఆనందాన్ని నింపింది. అదే సమయంలో ఆ పేరవై నిర్వాహకులుగా తన మిత్రులు పలువుర్ని నియమించి వివాదాన్ని దీప కొని తెచ్చుకున్నారు. ఈ మంటల్ని చల్లార్చేందుకు మద్దతుదారుల్ని బుజ్జగించేందుకు దీప తీవ్రంగానే శ్రమించాల్సిన పరిస్థితి. తదుపరి ఆమె ఇంటి ముందుగానీ, సమావేశాలకు గానీ మద్దతుదారుల సంఖ్య క్రమంగా తగు్గతూ రావడంతో ఆ శిబిరంలో కలవరం బయలు దేరినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయి కమిటీ అన్నది పక్కన పెట్టి, రాష్ట్రాన్ని నాలుగు డివిజను్లగా విభజించి తన పేరవైకు ఇన్ చార్జ్ లను దీప ప్రకటించడం గమనార్హం. ఈ నియామకాలను సైతం ఆయా ప్రాంతాల్లో మద్దతుదారులు వ్యతిరేకిస్తుండడం చర్చకు దారి తీసింది. మాజీ సీఎం పన్నీరు సెల్వం శిబిరం దీపకు మళ్లీ పిలుపునిస్తుండడంతో, ఆ శిబిరంలోకి దూకేనా, పేరవైతో ముందుకు సాగేనా, కొత్త పార్టీని పెట్టేనా అన్నది వేచిచూడాల్సిందే. డివిజన్లు : తొలి డివిజన్ లో కన్యాకుమారి, తిరునల్వేలి, తూతు్తకుడి, రామనాథపురం, శివగంగై, విరుదునగర్, మదురై, తేని జిల్లాలను చేర్చారు. రెండో డివిజన్ లో దిండుగల్, తిరుప్పూర్, కోయంబతూ్తరు, నీలగిరి, ఈరోడ్, నామక్కల్, కరూర్, సేలం, మూడో డివిజన్ లో తిరువారూర్, పుదుకోట్టై, తంజావూరు, తిరుచ్చి, పెరంబలూరు, అరియలూరు, కడలూరు, నాలుగో డివిజన్ లో ధర్మపురి, కృష్ణగిరి, తిరువణ్ణామలై, కాంచీపురం, వేలూరు, విల్లుపురం, తిరువళూ్లరు, చెన్నై జిల్లాలను చేర్చారు. ఇన్ చార్జ్ లు: దురైయప్ప(తిరునల్వేలి), పుసుం పొన్ పాండియన్ (మదురై), తొండన్ జీ సుబ్రమణి(తూతు్తకుడి), సెంథిల్ మురుగన్ (కన్యాకుమారి), వీరకుమార్ (తేని), భారతీ సుబ్బురాం (విరుదునగర్), సరస్వతి (నామక్కల్), అమినన్ (సేలం), కరుప్పుస్వామి(కరూర్), రాజామణి(నామక్కల్),రాజ పరమ శివం(పుదుకోట్టై), ఇలవలగన్ (పెరంబలూరు), మురుగన(తంజావూరు), సెల్వవినాయ్ గం(కడలూరు), రాజకన్నప్పన్(వేలూరు), హేమచంద్రన్ఇన్ చార్్జల జాబితాలో ఉన్నారు. -
ఎంజీఆర్, జయలలిత విగ్రహాల ఏర్పాటు
క్రిష్ణగిరి(సూళగిరి): తమ లీడర్‌పై నాయకులకు అమితమైన ప్రేమ ఉంటుంది. అలాంటి అభిమానం ఎంతటికైనా దారితీస్తుంది. ఆ అభిమానమే వారి విగ్రహాల ఏర్పాటుకు కారణమైంది. తమిళనాడులోని సూళగిరి యూనియన్ అన్నాడీఎంకే వ్యవసాయ విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి తన సొంత స్థలంలో, సొంత ఖర్చుతో దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత విగ్రహాలను ఏర్పాటు చేశారు. విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుడు గోవిందు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్నాడీఎంకే నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హజరయ్యారు. -
ఎంజీఆర్ బాటలో పన్నీరు
► న్యాయం కోసం పయనం సాక్షి, చెన్నై: దివంగత పురట్చితలైవర్ ఎంజీఆర్ బాటలో మాజీ సీఎం పన్నీరుసెల్వం ప్రజలో్లకి వెళ్లేందుకు నిర్ణయించారు. గతంలో ఎంజీఆర్ అనుసరించినట్టే, తాను సైతం ‘న్యాయం కోసం’ అంటూ కేడర్‌లోకి చొచ్చుకు వెళ్లనున్నారు. అన్నాడీఎంకే మూడుగా చీలడంతో ఎవరి వ్యూహాలతో వారు కేడర్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో తమ సత్తాను చాటుకునేందుకు తగ్గ పయనానికి సిద్ధం అవుతున్నారు. చిన్నమ్మ శశికళ శిబిరం ప్రస్తుతం అధికారంలో ఉండడంతో, మిగిలిన రెండు శిబిరాలు ప్రజా, కేడర్ మద్దతు లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి. ఓ వైపు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై సిద్ధం అవుతుంటే, మరోవైపు అన్నాడీఎంకే తమదేనని చాటుకునే విధంగా మాజీ సీఎం పన్నీరుసెల్వం కార్యాచరణలో నిమగ్నం అయ్యారు. కేడర్, పార్టీ వర్గాలతో సుదీర్ఘ చర్చలు సాగిస్తున్నారు. ఆదివారం కూడా ఈ సమావేశం సాగింది. ఇందులో సీనియర్లు నత్తం విశ్వనాథన్, పొన్నయ్యన్, కేపీ మునుస్వామి పాల్గొన్నారు. అన్నాదురై మరణంతో డీఎంకేను కరుణానిధి ఏ విధంగా తన గుప్పెట్లోకి తీసుకున్నారో, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ, అన్నాడీఎంకే ఆవిర్భావానికి నాంది పలుకుతూ అప్పట్లో ఎంజీఆర్ సాగించిన పయనాన్ని ఆసరాగా తీసుకునేందుకు నిర్ణయించారు. ఎంజీఆర్ బాటలో ‘న్యాయం కోసం ’ అన్న నినాదంతో కేడర్, ప్రజలో్లకి చొచు్చకు వెళ్లేందుకు నిర్ణయించారు. ఈ పయనం ఏ జిల్లా నుంచి శ్రీకారం చుటా్టలో అన్న విషయంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక, సమావేశానంతరం పొన్నయ్యన్ మీడియాతో మాట్లాడుతూ, అమ్మ మరణం మిస్టరీపై తీవ్రంగానే స్పందించారు. శశికి అంటుకోలేదుగా : పన్నీరు శిబిరంలోని సీనియర్ నేత పొన్నయ్యన్ మాట్లాడుతూ అమ్మ జయలలిత అపోలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు పలుమార్లు ఆమెను చూడడానికి ప్రయత్నించామన్నారు. అయితే, అమ్మకు భయంకరైన అంటు రోగం వచ్చినట్టు, ఈ ప్రభావం ఇతరులకు సోకే ప్రమాదం ఉన్నట్టు ప్రచారాన్ని గుప్పించారని ఆరోపించారు. అయితే, అమ్మ వెన్నంటి శశికళ మాత్రమే ఉన్నారని, ఆమెకు మాత్రం ఆ రోగం ఎందుకు రాలేదని ప్రశ్నించారు.పోయెస్ గార్డెన్ నుంచి అపోలో ఆసుపత్రికి వచ్చేటప్పుడే అమ్మకు స్ప్పహ లేదన్న సమాచారాలు వస్తుండడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రి, శశికళకు మధ్య ఏదో రహస్య ఒప్పందం ఉన్నట్టుందని, అందుకే అమ్మ ఆరోగ్య పరిస్థితి, మరణం గురించి పొంతనలేని సమాధానాలు, ప్రకటనల్ని చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. న్యాయ విచారణ జరిపించడం ద్వారా అన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చి తీరుతాయన్నారు. -
నాడూ.. నేడూ.. అదే డ్రామా!
-
నాడూ.. నేడూ.. అదే డ్రామా!
తమిళనాట చరిత్ర పునరావృతం - 30 ఏళ్ల కిందట ఎంజీఆర్ చనిపోయినపుడూ ఇదే సంక్షోభం - ఆనాడు జానకి, జయలలితల మధ్య ఆధిపత్య పోరాటం - ఇరు వర్గాలు మద్దతుదారులతో శిబిరాలు నిర్వహించిన వైనం - జానకిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ ఖురానా - విశ్వాస పరీక్ష సందర్భంగా శాసనసభలో ఇరు వర్గాల ఘర్షణ - ఓటింగ్ చెల్లదంటూ జానకి సర్కారును రద్దు చేసిన గవర్నర్ - అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే గెలుపు ‘చరిత్ర పునరావృతమవుతుంది.. మొదట విషాదంగా, తర్వాత ప్రహసనంగా!’ అన్నాడు కార్ల్ మార్క్స్. తమిళనాట ఇప్పుడు అదే జరుగుతోంది. సరిగ్గా ముప్పై ఏళ్ల కిందట అన్నా డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎం.జీ.ఆర్ చనిపోయినపుడు.. పార్టీలో, ప్రభుత్వంలో ఆధిపత్యం కోసం ఇద్దరి మధ్య పోరాటం జరిగింది. ఎంజీఆర్ భార్య జానకి, ఆయన రాజకీయ శిష్యురాలు జయలలితల మధ్య ఉత్కంఠ భరిత హైడ్రామా సాగింది. నాడు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు జానకి, జయలలితల వెనుక రెండుగా చీలిపోయారు. అయితే జానకి వైపే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటిలాగానే ఇరు వర్గాలూ ఎమ్మెల్యేల శిబిరాలు నిర్వహించాయి. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతున్న జానకిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ సభలో బలాన్ని నిరూపించుకోవాలని నిర్దేశించారు. ఆ విశ్వాసపరీక్ష సందర్భంగా సభలో హింస చెలరేగింది. రెండు వర్గాల ఎమ్మెల్యేలు ఘర్షణ పడ్డారు. స్పీకర్ పోలీసులను పిలిపించి మరీ సభలో లాఠీచార్జి చేయించిన పరిస్థితి. చివరికి జయ వర్గం ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసి విశ్వాసపరీక్ష నిర్వహించారు. నాడు కూడా ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆ విశ్వాస పరీక్షలో జానకి గెలుపొందినట్లు ప్రకటించారు. కానీ.. గవర్నర్ ఆ విశ్వాస పరీక్ష చెల్లదని ప్రకటించారు. కేంద్రం జోక్యంతో జానకి ప్రభుత్వం రద్దయింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జానకి రాజకీయాల నుంచి తప్పుకుని అన్నా డీఎంకే రెండు వర్గాలూ ఏకమవడం, కేంద్రం డీఎంకే సర్కారును రద్దు చేయటం, రాజీవ్‌గాంధీ హత్యానంతర ఎన్నికల్లో జయ నేతృత్వంలోని అన్నా డీఎంకే గెలుపొందటం చరిత్ర. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత అదే డిసెంబర్ నెలలో జయలలిత చనిపోయారు. ఇప్పుడు కూడా.. అన్నా డీఎంకేలో మళ్లీ అదే చరిత్ర పునరావృతమయింది. జయలలిత నెచ్చెలి శశికళకు, అమ్మ నమ్మినబంటు పన్నీర్‌సెల్వంకు మధ్య అధికారం కోసం పోరాటం సాగుతోంది. నాడు ఎంజీఆర్ తెరచాటున ఉన్న జానకి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. నేడు జయలలిత స్నేహితురాలిగా తెరవెనుక ఉన్న శశికళ తెరపైకి వచ్చే ప్రయత్నం చేశారు. నాడు ఎంజీఆర్ ఆశీస్సులతో పార్టీ ప్రచార కార్యదర్శిగా, ఎంపీగా క్రియాశీలంగా ఉండగా.. నేడు జయ నమ్మినబంటుగా ఆమె పరోక్షంలో ఆమె ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్‌సెల్వం అధికారం తనకే దక్కుతుందని ప్రకటించారు. శశికళ తన వర్గం ఎమ్మెల్యేలందరినీ రిసార్టుకు తరలించి శిబిరం నడిపారు. పన్నీర్‌సెల్వం వైపు కేవలం పది మంది మాత్రమే నిలిచారు. అయితే.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనూహ్యంగా దోషిగా నిర్ధారితురాలై శశికళ జైలుకు వెళ్లడంతో.. ఆమె తన స్థానంలో పళనిస్వామిని అధికార రేసులోకి పంపారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతున్న పళనిస్వామితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన గవర్నర్ విద్యాసాగర్‌రావు.. సభలో 15 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని నిర్దేశించారు. ఆ మేరకు శనివారం సభలో విశ్వాసపరీక్ష నిర్వహించగా.. మళ్లీ ఆనాటి గందరగోళమే చెలరేగింది. అయితే.. ఈసారి పన్నీర్ సెల్వం బలం తక్కువగా ఉండటంతో.. బలంగా ఉన్న ప్రతిపక్షం ‘క్రియాశీల’మవటమే తేడా. రహస్య బ్యాలెట్ ఓటింగ్‌కు పట్టుబడుతూ ఆందోళనకు దిగిన డీఎంకే సభ్యులను బయటకు పంపించిన స్పీకర్.. విశ్వాసపపరీక్షలో పళనిస్వామి నెగ్గినట్లు ప్రకటించారు. ఇక తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచిచూడాలి. ఈ నేపథ్యంలో ఎంజీఆర్ మరణించినపుడు తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాలను ఒకసారి వీక్షిస్తే... ఎంజీఆర్ మృతదేహం వద్ద..: డీఎంకే నుంచి చీలిపోయి అన్నా డీఎంకే పార్టీని స్థాపించి రాష్ట్రంలో ఎదురులేని నేతగా.. తమిళుల ఆరాధ్యదైవంగా పూజలందుకున్న ఎం.జి.రామచంద్రన్ 1987 డిసెంబర్ 24న కన్నుమూశారు. అప్పటికే ఆయనతో కలిసి అత్యధిక సినిమాల్లో హీరోయిన్గా నటించిన జయలలిత.. ఆయన ఆశీస్సులతోనే పార్టీ ప్రచార కార్యదర్శిగా, ఎంపీగా పనిచేస్తూ ప్రజాదరణ పొందారు. కానీ.. ఎంజీఆర్ భార్య జానకికి ఆమె అంటే పడదు. దీంతో ఎంజీఆర్ చనిపోయినపుడు ఆయన స్వగృహం ‘గార్డెన్స్’లో మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన జయలలితను లోనికి కూడా రానివ్వలేదు. అయితే.. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్‌కు తరలించినపుడు మాత్రం జయలలిత ఆయన తల వద్ద కదలకుండా కూర్చుండిపోయారు. ఆ తర్వాత అంతిమయాత్ర సందర్భంగా ఎంజీఆర్ భౌతికకాయం ఉంచిన వాహనం పైకి జయలలిత ఎక్కినప్పుడు కూడా.. ఆమెను ఆ వాహనం నుంచి కిందికి తోసేసిన ఘటనను ప్రజలందరూ వీక్షించారు. రాజకీయ చదరంగం షురూ..: ఎంజీఆర్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత.. రాజకీయ చదరంగం మొదలైంది. జానకి వయసు 62 ఏళ్లు. జయలలిత వయసు 39 సంవత్సరాలు. ఇద్దరూ శాసనసభ్యలు కారు. అప్పటికే రాజ్యసభ ఎంపీ అయిన జయలలిత కొద్ది రోజుల్లోనే అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టడానికి జానకి సిద్ధమయ్యారు. జయలలిత ఆమెకు సవాల్ విసిరారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెండు శిబిరాల్లో చీలిపోయారు. జానకి శిబిరంలో 95 మంది ఎమ్మెల్యేలు చేరితే.. జయ శిబిరంలో 30 మంది జమయ్యారు. కానీ.. తమకు 70 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆమె వర్గం ప్రకటించుకుంది. జానకికి మద్దతుగా ఎంజీఆర్ అనుచరుడు ఆర్.ఎం.వీరప్పన్ నిలిస్తే.. జయలలితకు మద్దతుగా ఎస్.తిరునావుక్కరసర్ పనిచేశారు. వీరప్పన్.. జానకి వర్గం ఎమ్మెల్యేలను నగరంలోని త్రీస్టార్ హోటల్ ‘ప్రెసిడెంట్’కు తరలించారు. తిరునావుక్కరసర్.. జయ వర్గం ఎమ్మెల్యేలను ఫైవ్ స్టార్ హోటల్ ‘అడయార్ పార్క్’లో ఉంచారు. ఆ తర్వాత వారిని అక్కడి నుంచి ‘భారత దర్శన్’ యాత్ర పేరుతో పర్యటనకు కూడా పంపించారు. ఇండోర్, ముంబై తదితర ప్రాంతాల సందర్శన అనంతరం బెంగళూరు సమీపంలోని నంది హిల్స్‌కు వారిని తరలించారు. రణరంగమైన శాసనసభ..: అప్పటి గవర్నర్ ఎస్.ఎల్.ఖురానా.. ఇరు పక్షాలనూ ఆహ్వానించారు. తమ బలాలను చూపించమని కోరారు. జానకి మద్దతుదారులను వీరప్పన్ రాజ్ భవన్‌కు తీసుకెళ్లి గవర్నర్ ముందు నిలిపారు. కానీ.. జయ ఆ పని చేయలేదు. ఎందుకంటే అవసరమైనంత మంది సభ్యులు ఆమెవైపు లేరు. దీంతో 1998లో జానకిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఖురానా ఆహ్వానించారు. కానీ.. ఆ ప్రభుత్వం కేవలం రెండు వారాలే సాగింది. విశ్వాస పరీక్ష కోసం శాసనసభ సమావేశమైనపుడు.. జయ, జానకి వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అప్పటి శాసనసభ స్పీకర్ పి.హెచ్.పాండ్యన్.. అనూహ్యంగా పోలీసులను పిలిపించి ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలపై లాఠీచార్జీ కూడా చేయించడం సంచలనం సృష్టించింది. అసమ్మతి ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు గెంటేసిన తర్వాత స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ప్రతిపక్ష డీఎంకే ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో జానకి విశ్వాసపరీక్ష నెగ్గినట్లు స్పీకర్ పాండ్యన్ ప్రకటించారు. అయితే.. ఆ ఓటింగ్ ప్రక్రియ పద్ధతిగా జరగలేదంటూ గవర్నర్ ఖురానా.. జానకి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఎన్నికల్లో డీఎంకే గెలుపు.. బర్తరఫ్..: ఆ తర్వాతి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. అన్నా డీఎంకేలో వర్గ పోరు ప్రతిపక్ష డీఎంకేకు లాభించింది. ఆ పార్టీ 13 ఏళ్ల విరామం అనంతరం మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జానకి రాజకీయాల నుంచి వైదొలగగా.. అన్నా డీఎంకే చీలిక వర్గాలు రెండూ జయలలిత నాయకత్వంలో ఏకమయ్యాయి. ఆ తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన చంద్రశేఖర్ ప్రభుత్వం.. రాజీవ్ గాంధీ ఒత్తిడితో 1991 జనవరిలో తమిళనాడులో కరుణానిధి సర్కారును బర్తరఫ్ చేసింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తో అన్నా డీఎంకే పొత్తు పెట్టుకుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా తమిళనాడులో రాజీవ్ గాంధీ హత్యకు గురవడంతో ఎన్నికల్లో వీచిన సానుభూతి పవనాలతో అన్నా డీఎంకే భారీ విజయం సాధించింది. జయలలిత 1991లో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి చెన్నైకు చిన్నమ్మ? విజేత పళని అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు -
'ఎంజీఆర్ బాటలో పన్నీర్ సెల్వం'
-
'ఎంజీఆర్ బాటలో పన్నీర్ సెల్వం'
చెన్నై: రోజురోజుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి మద్ధతు పెరిగిపోతుండగా అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు కష్టాలు రెట్టింపవుతున్నాయి. పన్నీర్ వర్గంలో అన్నాడీఎంకే మాజీ ఎంపీ, సీనియర్ నేత రామరాజన్ చేరిపోయారు. నేటి ఉదయం చెన్నైలో పన్నీర్ సెల్వాన్ని తన మద్ధతుదారులతో ఆయన కలుసుకుని మద్ధతు ప్రకటించారు. 'అమ్మ' జయలలిత వీర విధేయుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమే తమ పార్టీ నేత అని తెలిపారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ బాటలో పన్నీర్ నడుచుకుంటున్నారని కొనియాడారు. ఎంజీఆర్ వారసత్వాన్ని జయ అందిపుచ్చుకున్నట్లుగా, జయ అనంతరం ఆమె రాజకీయ వారసత్వాన్ని పన్నీర్ సెల్వం కొనసాగించాలని నటుడు, మాజీ ఎంపీ రామరాజన్ ఆకాంక్షించారు. ఆదివారం ఉదయం అన్నాడీఎంకే ఎంపీలు బి. సెంగొట్టువన్, జె. జెయసింగ్ చిన్నమ్మ శశికళను కాదని పన్నీర్ సెల్వాన్ని నేరుగా కలిసి తమ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. క్యాంపు రాజకీయాలు నడిపినా శశికళపై పార్టీ నేతల్లో విశ్వాసం అంతగా లేదని స్పష్టమవుతోంది. దాంతో శనివారం సాయంత్రం గోల్డెన్ బే రిసార్టులో ఎమ్మెల్యేలతో శశికళ భేటీలోనూ ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 20 మంది ఎమ్మెల్యేలు తాము పన్నీర్ కే మద్ధతు ఇస్తామని చెప్పగా.. శశికళకు చెందిన మన్నార్ గుడి వర్గం సీఎం అభ్యర్థిగా ప్రిసీడియం చైర్మన్ సెంగొట్టయన్ ను ప్రతిపాదిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తమిళ రాజకీయాలపై మరిన్ని కథనాలు శశికళ అక్రమాస్తులపై రేపు తీర్పులేదు త్వరలో అధికారంలోకి డీఎంకే! తెరపైకి కొత్త సీఎం.. శశి వర్గం ట్విస్ట్! శశికళకు మరో ఎదురుదెబ్బ -
ఎంజీఆర్ బతికుంటే ఇలా జరిగేదా?
జల్లికట్టుపై కమల్ హాసన్ సాక్షి, ప్రతినిధి, చెన్నై: జల్లికట్టు కోసం పోరాడుతున్న తమిళనాడు విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగాలను ప్రముఖు నటుడు కమల్ హాసన్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘విద్యార్థులనే కాకుండా మహిళలను, బాలలను కూడా బలవంతంగా తరలించారు. ఎంజీఆర్ (దివంగత సీఎం) బతికుంటే ఇలా జరిగేదా? ఆయన విద్యార్థులను కలసి మాట్లాడేవారు. సీఎం పన్నీర్ సెల్వం కూడా అలా చేసి ఉండాల్సింది. జల్లికట్టుకు అడ్డంకుల్లేకుండా శాశ్వత చట్టం చేయాలని 20 ఏళ్లుగా కోరుతున్నాం. ఈ ఆటను నిషేధించినవారు పల్లెలపై దాడి చేసే మదపుటేనుగులను ఎందుకు నిషేధించడం లేదు?’ అని ప్రశ్నించారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడారు. సాధారణ స్థితికి: జల్లికట్టు మద్దతుదారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలతో సోమవారం అట్టుడికిన తమిళనాడులో మంగళవారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నై మెరీనా బీచ్‌తోపాటు పలు ప్రాంతాల్లో అదనపు పోలీసు పికెటింగ్‌లను ఏర్పాటు చేశారు. జల్లికట్టు కోసం శాశ్వత చట్టం తేవాలని వందమంది నిరసనకారులు బీచ్‌లో ధర్నా చేశారు. అరెస్ట్ చేసిన తమ వందమంది సహచరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి వడపళని పోలీస్‌స్టే షన్ ను ముట్టడించేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి చెదరగొట్టారు. విరుదునగర్ జిల్లా కాన్సాపురంలో జల్లికట్టులో ఓ ఎద్దు పొడవడంతో ఒక పోలీసు చనిపోయాడు. జల్లికట్టును అనుమతిస్తూ 2016లో జారీచేసిన నోటిఫికేషన్ ను వాపసు తీసుకుంటామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. -
అమ్మ ఒక వజ్రం
అమ్మ (జయలలిత) ఒక వజ్రం అని సూపర్‌స్టార్ రజనీకాంత్ కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి ఇక లేరన్న వార్త తమిళప్రజల గుండెల్ని గాయపరచింది.సినీలోకాన్ని అంతగా గుండెల్ని పిండింది. అమ్మ భౌతికకాయానికి జాతి, మతం, తన పర భేదాల్లేకుండా దేశ ప్రజలందరూ నివాళులర్పించారు. అమ్మ మళ్లీ తిరిగి రావాలని గుండెలోతుల్లోంచి ఆకాంక్షించారు. కాగా దక్షిణ భారత నటీనటుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక కోడంబాక్కంలోని శ్రీరాఘవేంద్ర కల్యాణ మండపంలో నిర్వహించిన సంతాప సభలో చిత్ర పరిశ్రమ అంతా కన్నీటి అంజలి తెలిపింది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సహా పలువురు ప్రముఖులు అమ్మతో తమ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎన్నికల్లో అమ్మకు వ్యతిరేకించాను అమ్మకు అంజలి ఘటించిన అనంతరం రజనీకాంత్ మాట్లాడుతూ 1996 శాసనసభ ఎన్నికల్లో తాను జయలలితకు వ్యతిరేకంగా నిలిచానన్నారు. ఆ విషయం తనను ఇప్పటికీ వెక్కిరిస్తూనే ఉందన్నారు. ఆ తరువాత తన కూతురు ఐశ్వర్య తన వివాహాన్ని పోయస్గార్డెన్లోనే జరుపుకోవాలని కోరుకుందన్నారు. దీంతో పొరుగునే ఉన్న జయలలితను పెళ్లికి ఆహ్వానించకుండా ఎలాగని భావించి ఆమెను కలవడానికి అనుమతి కోరగా వెంటనే అనుమతించారన్నారు.తాము పెళ్లి పత్రికను అందించి ఆహ్వానించి మీ సమక్షంలో వివాహం జరగాలని కోరామన్నారు. అదే తేదీన పార్టీ సమావేశం ఉందని.. అయినా దాన్ని వాయిదా వేయించి పెళ్లికి వస్తాననీ హామీ ఇచ్చారన్నారు. చెప్పినట్లుగానే జయలలిత ఐశ్వర్య పెళ్లికి వచ్చారనీ గుర్తు చేసుకున్నారు. పురుషాధిక్యాన్ని ఎదురొడ్డి తన సొంత ప్రయత్నాలతోనే అమ్మ పోరాడి గెలిచారనీ పేర్కొన్నారు. ఈత,ఎదురీత జయలలిత నుంచే నేర్చుకోవాలని సూచించారు. నటిగానూ, రాజకీయంగానూ తన గురువు, ఆరాధ్యదైవం ఎంజీఆర్ కంటే సాధికురాలు జయలలిత అని పేర్కొన్నారు. తమిళనాట పురట్చితలైవిగా ఎదిగి ప్రజల గుండెల్లో అమ్మగా స్థిరస్థాయిగా నిలిపోయారన్నారు. ఇప్పుడు కోహినూర్ వజ్రంగా మెరీనా తీరంలో నిక్షిప్తమయ్యారనీ ఆయన పేర్కొన్నారు. నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్, విశాల్, కార్తీ, శివకుమార్, వడివేలు, మోహన్, కార్తీక్, రాజేశ్, ఆర్వీ.ఉదయకుమార్, జీవా, నటి సచ్చు, సంగీత, గీత, రాధ, అంబిక, రాజశేఖర్, జీవిత, రోహిణితో పాటు పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు. -
శశికళ జయకు దగ్గరైన వేళ
-
అన్నీ తానైన శశికళ..
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంతిమ సంస్కారంలో ఆమె స్నేహితురాలు అన్నీ తానై కార్యక్రమాలు నిర్వహించారు. రాజాజీ హాల్లో జయలలిత పార్ధివదేహం చుట్టూ సీఎం పన్నీర్ సెల్వం, శశికళ, ఆమె భర్త నటరాజన్, దత్తపుత్రుడు సుధాకర్, అన్న కూతురు దీప ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నారు. ఇంతకాలం జయలలిత దగ్గరకు రాకుండా ఉన్న శశికళ భర్త నటరాజన్ మంగళవారం ఆమె భౌతికకాయం వద్ద హడావుడి చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చిన సమయంలో ఇతరులెవరూ దరిదాపుల్లోకి రాకుండా శశికళ కట్టడి చేయగలిగారు. హిందూ సంప్రదాయం ప్రకారం దత్త పుత్రుడు అంతిమ సంస్కారం చేయాల్సి ఉంది. అయితే జయ దత్తపుత్రుడు సుధాకర్‌కు ఆ అవకాశం కల్పిస్తే అధికారికంగా వారసుడిగా గుర్తించినట్లు అవుతుందనే భయంతో ఆయన్ను ఆ దరిదాపుల్లోకి కూడా రాకుండా చేశారు. గవర్నర్, సీఎం, మాజీ గవర్నర్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చివరిసారిగా పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించాక శవపేటిక మీద ఉంచిన జాతీయజెండాను తీసి శశికళకు అందించారు. ఆ తర్వాత ఆమె శవపేటిక చుట్టూ నీళ్లు, బియ్యం చల్లి, గంధపు చెక్కల ముక్కలు ఉంచి జయకు అంతిమ సంస్కారాలు చేశారు. స్నేహితురాలి పట్ల ఉన్న అపార అభిమానం చాటుకుని ఆమె రుణం తీర్చుకోవడానికే శశికళ తన చేతుల మీదుగా అంత్యక్రియలు చేశారని శశికళ మద్దతుదారులు చెబుతున్నారు. ఇకపై పార్టీలో, ప్రభుత్వంలో తాను ఏది చెబితే అదే జరుగుతుందని పరోక్షంగా చూపించుకోవడానికి జయ బంధువులెవరినీ దరిదాపుల్లోకి కూడా రాకుండా చేశారని శశికళ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అన్నా డీఎంకేలో ఆధిపత్య పోరు కూడా కనిపించింది. తన స్నేహితురాలి చివరి యాత్ర తన ఇష్ట్రపకారమే జరగాలని పట్టుబట్టిన ఆమె స్నేహితురాలు శశికళ తన పంతం నెగ్గించుకున్నారు. నేస్తం మాటే నెగ్గింది... అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచినప్పటి నుంచి ఆమె అంత్యక్రియల నిర్వహణపై పన్నీర్ సెల్వం, శశికళ తమ మాట చెల్లుబాటు అయ్యేలా ప్రయత్నించారు. దేశవ్యాప్తంగా ఉక్కు మహిళగా పేరు పొందిన అమ్మ పార్థివ దేహాన్ని మంగళ, బుధవారాలు ప్రజల సందర్శనార్థం ఉంచి గురువారం అంత్యక్రియలు చేరుుంచాలని పన్నీర్ సెల్వం భావించారు. మంగళవారం వీఐపీలు ఆమె భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించి వెళితే, బుధ, గురువారాలు సాధారణ ప్రజలకు చివరి చూపు అవకాశం కల్పించాలని ఆయన భావించారు. మూడు రోజుల పాటు మృత దేహాన్ని ఉంచుకోవడానికి అవసరమైన వైద్య సహాయం ఏర్పాటు చేరుుంచాలని కూడా యోచించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సోమవారం రాత్రి అపోలో ఆసుపత్రిలో చర్చలు జరిపిన సందర్భంలో సెల్వం తన అభిప్రాయాలను తెలియచేశారు. ఇదే చర్చల్లో పాల్గొన్న శశికళ మంగళవారమే అంత్యక్రియలు పూర్తి చేద్దామని స్పష్టంచేశారు. ఆలస్యం అయ్యే కొద్దీ పార్టీ శ్రేణులు, ప్రజలను అదుపు చేయడం ఇబ్బంది అవుతుందని ఆమె గట్టిగా చెప్పారు. చివరకు ఆమె మాటే నెగ్గి మంగళవారం సాయంత్రమే అంత్యక్రియలు చేయాలని నిర్ణరుుంచారు. అతనెవరు?: మెరీనా బీచ్ ఒడ్డున జయలలిత అంతిమ సంస్కారం చేస్తున్న సమయంలో మొదటి నుంచి చివరి దాకా శశికళ వెన్నంటే ఉన్న యువకుడు ఎవరు? అతనికి అంత ప్రాధాన్యత ఎలా దక్కింది? అని అన్నా డీఎంకే పార్టీ ముఖ్యులతో పాటు, తమిళ మీడియా సంస్థలు ఆరా తీశారుు. అతను జయలలిత సోదరుడు జయకుమార్ కొడుకు దీపక్‌గా గుర్తించారు. ఇప్పటివరకు ఎవరో కూడా తెలియని దీపక్‌కు శశికళ అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారనేది రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది. ఉదయం నుంచి వెంకయ్య అక్కడే రాజాజీ హాల్‌కు ఉదయం 8గంటలకు జయలలిత భౌతికకాయం వచ్చినప్పటినుంచి మెరీనా బీచ్ ఒడ్డున అంత్యక్రియలు ముగిసే వరకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అక్కడే గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకే వెంకయ్య తొలి నుంచి చివరివరకు అంతిమ సంస్కారాలను దగ్గరుండి నడిపించారని బీజేపీ వర్గాలు చెబుతున్నారుు. -
అమ్మ పేరుతోనే మొదలు..
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలున్న ప్రతి రోజూ సభల్లో పురచ్చితలైవి, అమ్మ అంటూ జయలలిత పేరు వినిపించని రోజు ఉండదంటే అతిశయోక్తి లేదు. లోక్‌సభలో 37 మంది సభ్యులతో మూడో అతి పెద్ద పార్టీగా, రాజ్యసభలో 13 మంది సభ్యులతో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్న ఏఐడీఎంకే నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతి సభ్యుడు ఉభయ సభల్లో తాము ప్రసంగించే ముందు జయలలితకు కృతజ్ఞతలు చెప్పడం ఆనవాయితీ. అలా ఏ సభ్యుడైనా అమ్మ పేరు సంబోధించినప్పుడు మిగిలిన సభ్యులు బల్లలు చరుస్తారు. దీంతో సభలోని దాదాపు అన్ని పార్టీల ఇతర సభ్యులు కూడా ఆసక్తిగా వినడం కనిపిస్తుంది. అలా ప్రతిసారి సంబోధించడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించినా.. వారి నాయకురాలిపై ఆ సభ్యులకు ఉన్న వాత్సల్యం అబ్బురపరుస్తుంది. సభ్యులు తమ ప్రసంగాల్లో జయలలిత చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనియాడుతూ తమ ప్రసంగాలను ముగిస్తారు. జైలు జీవితంలో వైరాగ్యం సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు జీవితంలో వచ్చిన వైరాగ్యం, తీవ్రమైన మధుమేహం, వైద్య చికిత్సలపై నిరాసక్తత అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రాణాలను హరించి వేశారుు. జయలలిత సుమారు 45 ఏళ్ల వయస్సులోనే మధుమేహ వ్యాధి బారినపడ్డారు. తీరికలేని రాజకీయ జీవితం వల్ల ఆ వ్యాధి రానురానూ మరింత ముదిరింది. ఆసుపత్రిలో చేరితే ప్రచారం జరుగుతుందని వెనకంజ వేసిన జయలలిత కొన్నాళ్లు ఇంటి వద్దే చికిత్స చేరుుంచుకున్నారు. అరుుతే టాన్సీ భూముల కుంభకోణంపై ఒకసారి జైలుకు వెళ్లిన జయ.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014లో కొన్నాళ్లు బెంగళూరులో జైలు జీవితం గడిపారు. రెండోసారి జైలు జీవితం మానసికంగా వైరాగ్యానికి దారితీసింది. జైలులో ఉన్నపుడు చికిత్స చేసేందుకు వచ్చిన వైద్యులను దరిచేరనీయలేదు. మందులు వేసుకునేందుకు నిరాకరించారు. విషాదాల డిసెంబర్ సాక్షి, చెన్నై: తమిళనాడుకు డిసెంబర్ నెల ఎప్పుడూ విషాదాన్నే అందిస్తోంది. ప్రజల మనసులు గెలుచ్చుకున్న మహానాయకుల మరణాలు కానీ.. ప్రజలను కకావికలం చేసే పెను విపత్తులు గానీ డిసెంబర్లోనే అధికంగా సంభవించడం కాకతాళీయం! అందులో ముఖ్య ఘటనలు... 2016: డిసెంబర్ 5: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం. 2015:డిసెంబర్: అనూహ్యంగా వచ్చిపడ్డ కుండపోత వర్షాలు చెన్నై, కాంచీపురం, కడలూరు, తిరువళ్లూరు, తూత్తుకుడి తదితర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. అధికారిక లెక్కల ప్రకారం 422 మంది మృత్యువాతపడ్డారు. 2004: డిసెంబర్ 26: సునామీ విరుచుకుపడింది. భారత తీరంలో దాదాపు 20 వేల మందిని కబళించింది. అందులో అత్యధికులు తమిళులే. ఆ సునామీ వల్ల 6.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 1987: డిసెంబర్ 24: అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎం.జి.రామచంద్రన్ మృతి చెందారు. ఆయన అభిమానులు 100 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. 972: డిసెంబర్ 25: స్వతంత్ర భారతదేశం మొదటి, చివరి గవర్నర్ జనరల్, సంయుక్త మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన సి.రాజగోపాలాచారి మృతి చెందారు. 1973: డిసెంబర్ 24: సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర ఉద్యమకారుడు, ఆత్మగౌరవ ఉద్యమ ఆద్యుడు, ద్రవిడ కళగం వ్యవస్థాపకుడు ‘పెరియార్’ రామస్వామి మరణించారు. 1964: డిసెంబర్ 22: భారీ తుఫాను తమిళనాడును ముఖ్యంగా దక్షిణ తీరాన్ని అతలాకుతలం చేసింది. రామేశ్వరం నుంచి పంబన్ బ్రిడ్జి మీదుగా వెళ్తున్న రైలును సముద్రం మింగేసింది. ఈ ప్రమాదంలో 115 మంది ప్రయాణికులు మృతి చెందారు. తీరంలో మరో 800 మందికి పైగా ప్రజలు చనిపోయారు. -
అమ్మలోటు తీర్చేదెవరు?
సీఎం పదవిని శశికళ ఎందుకు కోరలేదు? మరణించేవరకూ జయ వెన్నంటి ఉన్న శశికళ ముఖ్యమంత్రి పదవిని ఎందుకు కోరలేదు? అన్న ప్రశ్నకు రాజకీయ పండితులు అనేక కారణాలు చెబుతున్నారు. జయ, శశికళను పట్టి పీడిస్తున్న అక్రమాస్తుల కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. జయ కన్నుమూసినా-ఈ కేసు నడుస్తుంది. శశికళ ఈ కేసులో రెండో ముద్దాయి. ఈ కారణంగానే ఆమె సీఎం పదవి ఆశించలేదని చెబుతున్నారు. ఆమె సుప్రీంకోర్టు నుంచి నిర్దోషిగా బయటపడే వరకూ ముఖ్యమంత్రి పదవిపై కన్నేయకపోవచ్చు. ‘అమ్మ’ బతికుండగా చట్టపరమైన ఇబ్బందులొచ్చినప్పుడు మాత్రమే సీఎం పదవి చేపట్టిన అనుభవం పన్నీర్సెల్వంది. ఇప్పుడు, శశికళను ఇబ్బందిపెట్టకుండా, అలా అని కీలుబొమ్మ సీఎం అని పేరు తెచ్చుకోకుండా బండి నడపడం ఆయనకు కుదిరేపని కాదు. ఈ క్రమంలో ఈ ఇద్దరు తేవర్ల మధ్య విభేదాలొస్తే ప్రభుత్వం కూలిపోతుంది. డీఎంకే, దాని అధినేత ఎం.కరుణానిధిని బూచిగా చూపించి అన్నాడీఎంకేలో సాధిస్తున్న ఐక్యత ఎక్కువ కాలం నిలబడదు. శశికళ కారణంగా తేవర్లు ఇప్పటికే ఏఐఏడీఎంకేలో ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నారనే ఆరోపణ ఉంది. జయలేని ఈ పరిస్థితుల్లో శశికళ, ఆమె కుటుంబ సభ్యుల కారణంగా రాష్ట్రంలో తేవర్ల ఆధిపత్యం కనిపిస్తే అది ఈ పార్టీకి శాపమవుతుంది. దాదాపు వందేళ్ల తమిళ రాజకీయాల్లో ‘బ్రాహ్మణేతర ప్రజాస్వామ్యం’ బలపడింది. అంటే తమిళనాట ఏ ఒక్క కులం ఆధిపత్యం లేకుండా పాలన, రాజకీయాలు నడుస్తున్నాయి. డీఎంకేలో సైతం తేవర్లకు తగినంత ప్రాతినిధ్యం ఉంది. అసెంబ్లీలో 42 మంది తేవర్లు ఎమ్మేలేలున్నా, జయ మంత్రివర్గంలో గౌండర్లకు తగినంత వాటా ఇచ్చారు. ఒకవేళ సెల్వం, శశికళ ఏకమైతే, పార్టీలో గౌండర్, నాడార్, వన్నియార్ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలందరూ చేతులు కలిపితే డీఎంకేలో చేరడానికి ఫిరాయింపు నిరోధకచట్టం అడ్డంకి కాదని తమిళ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ నిర్మాణం బలహీనం డీఎంకే సంస్థాగత నిర్మాణం పటిష్టమైంది. క్రమం తప్పకుం డా అన్ని జిల్లాల్లో పార్టీ కమిటీలకు ఎన్నికల ద్వారా మాత్రమే నేతలను ఎన్నుకుంటారు. నాయకత్వం మాత్రమే కరుణానిధి కుటుంబం గుప్పిట్లో ఉంది. ఏఐఏడీఎంకేకు అలాంటి బలమైన వ్యవస్థ లేదు. జయ వంటి నేత లేనప్పుడు ఏఐఏడీఎంకే బలహీన మయ్యే ప్రమాదముంది. బీజేపీ ఏఐఏడీఎంకే అంతర్గత రాజకీయా ల్లో పెద్దగా జోక్యం చేసుకోదనే వాదన వినిపిస్తోంది. నరేంద్రమోదీ ప్రభుత్వంగాని, బీజేపీ కేంద్ర నాయకత్వంగాని ప్రస్తుత సెల్వం సర్కారును నిలబెట్టడానికి ప్రయత్నించకపోవచ్చు. కర్ణాటకలో మాదిరిగా విస్తరించడానికి వీలులేని తమిళనాట మితిమీరిన రాజకీయం చేసి నష్టపోయే స్థితిలో బీజేపీ లేదు. పన్నీర్‌సెల్వంను వద్దునుకుంటే- ప్రధాన శూద్రకులాలు తేవర్లు, కొంగు వెల్లాల గౌండర్ల మధ్య రాజీ కుదిరితే లోక్‌సభ డెప్యూటీ స్పీకర్ ఎం.తంబిదురైకి అవకాశం రావచ్చని ప్రచారం జరుగుతోంది. తేవర్ల ‘ఆధిపత్యం’ కరుణకు ఆయుధమవుతుందా? జయ నీడన శశికళ నాయకత్వాన తేవర్లు డీఎంకే హయాంతో పోల్చితే కాస్త ఎక్కువ అధికారం అనుభవిస్తున్నారు. ఎంతకాదన్నా జయ కులాలకు ప్రాధాన్యం విషయంలో సమతూకం పాటించారు. అలాకాక పన్నీర్‌సెల్వం, శశికళ ఓ అవగాహనకు వచ్చి లేదా రాకుండా పాలనలో తేవర్ల ఆధిపత్యాన్ని తీసుకొస్తే అది కరుణానిధికి పదునైన ఆయుధమవుతుంది. కొద్ది నెలలకైనా ఏఐడీఎంకేలో కీచులాటలను వాడుకోవడానికి కరుణ రంగంలోకి దిగుతారు. తేవరేతర కులాలను ఏకం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇలాంటి ప్రమాదాలు రాకుండా జాగ్రత్తగా పార్టీని, ప్రభుత్వాన్ని సాఫీగా నడిపే సామర్ధ్యం ఏఐడీఎంకే నాయకత్వానికి లేవు. మరో విధంగా చెప్పాలంటే-సెల్వం డా.మన్మోహన్సింగ్ కాదు. శశికళ సోనియాగాంధీ కాదు. తమిళనాట గౌండర్లు, తేవర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటే, ఉత్తర జిల్లాల్లో వన్నియార్లు ఎక్కువ. మదురై నుంచి కన్యాకుమారి జిల్లా వరకూ నాడార్ల ఉనికి బాగా కనిపిస్తుంది. ఏఐఏడీఎంకే భవిష్యత్? ‘‘జయ మరణం తర్వాత ఏఐఏడీఎంకే చీలిపోతుందని భావిస్తున్నా. 30 శాతం పార్టీ ఎమ్యెలేలు తేవర్ కులానికి చెందినవారు (పన్నీర్ సెల్వం, శశికళ-ఇద్దరూ తేవర్లే). దాదాపు 70 శాతము న్న తేవరేతర శాసనసభ్యులు తేవర్ల ఆధిపత్యాన్ని సహించక పోవచ్చు.’’ జయలలిత చనిపోయాక తమిళనాడు పాలకపక్షం భవితవ్యంపై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి చెప్పిన మాటలివి. కొత్త సీఎంగా పన్నీర్‌కు పార్టీ ఉన్నతస్థాయి సమావేశంలో మద్దతు లభించింది. పార్టీ నాయక త్వాన్ని శశికళకు అప్పగించడానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని మంగళవారం రాత్రి చెన్నై నుంచి వార్తలొచ్చాయి. జయలలిత అనంతర పరిస్థితుల్లో ఏఐఏడీఎంకే భవిష్యత్తు ఎలా ఉంటుందనే ప్రశ్నకు జవాబు మాత్రం కొన్ని నెలల తర్వాత లభించవచ్చు. డీఎంకేకే అడ్వాంటేజ్! 92 ఏళ్లు దాటిన కరుణానిధి ఎక్కువ కాలం బతక్కపోవచ్చేమోగాని ఆయన మరణానంతరం డీఎంకేను నిలబెట్టడానికి ఆయన చిన్న కొడుకు, మాజీ డెప్యూటీ సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు, చిన్న కూతురు కనిమొళి ఉన్నారు. 29 ఏళ్ల క్రితంఎంజీఆర్ మరణానంతర పరిస్థితులను డీఎంకేకు అనుకూలంగా కరుణ మార్చగలిగారు. ఇప్పుడు కూడా ఏఐడీఎంకే కీచులాటలు ప్రమాదకర స్థాయికి చేరితే లబ్ధిపొందేది మళ్లీ డీఎంకేయే. ఏ రకంగా చూసినా ఏఐఏడీఎంకేను 2021 మే అసెంబ్లీ ఎన్నిక ల వరకూ నడిపించే గట్టి నాయకుడే కనిపించడం లేదు. ఎంజీఆర్ మరణానంతర పరిణామాలు పునరావృతం కావేమో! 1987 డిసెంబర్లో పార్టీ స్థాపకుడు, సీఎం ఎం.జి.రామచంద్రన్ మరణించాక జరిగిన పరిణామాలు పునరావృతమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అప్పట్లో ఇద్దరు సీఎంలు(వీఆర్ నెడుంజెళియన్, జానకీ రామచంద్రన్) రెండు నెలల్లోపే అధికారం కోల్పోయాక ఎంజీఆర్ వారసురాలిగా జయలలిత ఆవిర్భవించారు. అన్నాడీఎంకే అంతర్గత కుమ్ములాటలను సాకుగా చూపి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం దాదాపు ఏడాది రాష్ట్రపతి పాలన విధించింది. 1988 జనవరి ఎన్నికల్ల్లో ఓడినా 1991 మే నాటికి జయలలిత సీఎం అయ్యారు. జయ మాదిరి జనాకర్షణ శక్తి ఉన్న నేత పాలకపక్షంలో హఠాత్తుగా పుట్టుకొచ్చే అవకాశాలు లేవు. తమిళ హీరో అజిత్‌కుమార్‌ను జయ తన వారసుడని చెప్పారని జరుగుతున్న ప్రచారానికి అధారాలు సృష్టిస్తే తప్ప ఆయన రంగం మీదకు రావడం కష్టం. -
‘అన్నా’ నుంచి ‘అమ్మ’ వరకూ...
-
'అమ్మ' పడిలేచిన కెరటం
-
జయలలిత 'శక్తి స్వరూపిణి'
-
‘అన్నా’ నుంచి ‘అమ్మ’ వరకూ...
- ఆరాధ్య ‘దైవాల’ కోసం తమిళుల ఆవేదన - ద్రవిడ రాజకీయాల ఆద్యుడు అన్నాదురై అంతిమయాత్రలో కోటిన్నర మంది.. - ఎంజీఆర్ మరణించిప్పుడు వందల మంది ఆత్మహత్య - కరుణానిధి అరెస్టయినప్పుడూ ఆత్మార్పణలు - ఇప్పుడు అమ్మ జయలలిత కోసం ఆక్రందనలు.. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) దాదాపు 47 ఏళ్ల కిందట.. అన్నాదురై మరణించినప్పుడు ఆయన అంతిమ యాత్రలో కోటిన్నర మంది పాల్గొన్నారు. అంతకు ముందు గొప్పనేతలైన మహాత్మాగాంధీ, అబ్రహంలింకన్ అంతిమయాత్రల్లో కూడా ఇంతమంది హాజరుకాలేదు. ఆయన మీద అభిమానంతో ఎన్నో గుండెల ఆగిపోయాయి. మూడు దశాబ్దాల కిందట.. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల బ్రూక్లిన్ ఆస్పత్రిలో ఎంజీఆర్ కన్నుమూసినపుడు తమిళనాడు శోకసంద్రమైంది. ఆయన ఆస్పత్రిలో ఉన్నపుడు.. తమ ‘దేవుడి’ క్షేమం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పూజలు, ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. ఆయన మరణ వార్త తెలియగానే ఎంతో మంది చనిపోగా.. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. నాడు గురువు కోసం పరితపించిన తమిళ గుండె.. ఇప్పుడు ఆయన శిష్యురాలైన తమ ‘అమ్మ’ కోసం చెరువుగా మారుతోంది!! తమిళ జనం అంతే.. ఎవరినైనా ప్రేమిస్తే గుండె లోతుల్లోంచి ప్రేమిస్తారు! ఆ వ్యక్తిని తమ జీవన సర్వస్వంగా.. దేవుడికంటే ఎక్కువగా ఆరాధిస్తారు! వారు లేకుంటే తమకు బతుకే లేదన్నంతగా కొలుస్తారు! తమ ఆరాధ్య నేతలు కన్నుమూస్తే.. తామూ జీవితం చాలించేంతగా పరితపిస్తారు!! తమిళులు తమ నాయకులను ఇంతగా ఆరాధించడానికి వారి వారి గుణగణాలే కాదు.. సాహితీ, సాంస్కృతిక రంగంలో వారి వారి విశిష్టతలు, వారు అనుసరించే విధివిధానాలు కూడా కారణమే! మరీ ముఖ్యంగా.. తమిళ సంస్కృతికి, సంప్రదాయాలకు, సాహిత్యానికి పెద్ద పీట వేయటం.. ప్రాధాన్యం ఇవ్వడం ఈ వ్యక్తి ఆరాధనకు కేంద్ర బిందువని విశ్లేషకుల అంచనా. అలాగే.. ఆయా నాయకులు తమ విశిష్టతను మరింతగా ప్రచారంలోకి తీసుకురావడానికి.. ప్రజల్లో వ్యక్తిగతంగా అభిమానాన్ని పెంపొందించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. అన్నాదురై: తమిళనాడులో ద్రవిడ రాజకీయాల ఆద్యుల్లో ప్రముఖుడు.. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ వ్యవస్థాపకుడు సి.ఎన్.అన్నాదురై. ద్రవిడ రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడు. 1967- 1969 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అన్నా ఒక గొప్ప ప్రసంగకర్తగా, నాటకరచయితగా కూడా ప్రఖ్యాతి గాంచారు. ఆయన సీఎంగా ఉండగానే.. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 1969 ఫిబ్రవరి 3వ తేదీన కన్నుమూశారు. ఆయన అంతిమయాత్రలో కోటిన్నర మంది అభిమానులు పాల్గొన్నారు. ప్రపంచ చరిత్రలో అప్పటికి అదే అతి భారీ అంతిమయాత్ర. అంతకుముందు గొప్ప నేతలైన మహాత్మా గాంధీ అంతిమ యాత్రలో కానీ, అబ్రహాం లింకన్ అంత్యక్రియలకు కానీ.. ఇంత భారీగా జనం హాజరుకాలేదు. అన్నా కన్నుమూసినపుడు ఎంతో మంది అభిమానులు గుండె ఆగి చనిపోయారు. ఇంకా ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎంజీఆర్: అన్నాదురై తర్వాత ఆయన పార్టీకే చెందిన ఎంజీఆర్‌ను తమిళులు ఎంతగానో అభిమానించారు. తమిళ సినీ రంగాన్ని పరిపాలించిన ఎంజీఆర్.. డీఎంకేలో చేరిన తర్వాత ఆ పార్టీ నుంచి చీలిపోయి అన్నా డీఎంకేను స్థాపించి అధికారంలోకి వచ్చారు. ఎంజీఆర్ ఆవేశపూరితమైన శక్తిమంతమైన ప్రసంగీకుడిగా ఖ్యాతిగడించారు. ‘నా రక్తంలో రక్తమైన తమిళ ప్రజలారా...’ అంటూ ఆయన ఆరంభించే ప్రసంగం తమిళులను ఉర్రూతలూగించేది. ఎంజీఆర్ అధికారంలో ఉన్నపుడు పేదలకు మధ్యాహ్న భోజన పథకం, మహిళలకు ప్రత్యేక బస్సులు ప్రవేశపెట్టారు. ఆయన వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 1987లో అనారోగ్యంతో అమెరికాలో కన్నుమూశారు. ఎంజీఆర్‌ను కిడ్నీ చికిత్స కోసం అమెరికా తరలించినపుడే.. 100 మందికి పైగా నిప్పంటించుకుని ఆత్మాహుతి చేసుకున్నారు. అదే సంవత్సరం డిసెంబర్ 24న ఎంజీఆర్ తుదిశ్వాస విడిచినపుడు మరో 31 మంది ఆత్మహత్య చేసుకున్నారు. జయలలిత కోసం: ఎంజీఆర్‌ను ఎంతగానో ఆరాధించిన తమిళులు.. ఆయన వారసురాలిగా జయలలితను భావించారు. సినిమా రంగంలో ఎంతో ఖ్యాతి గల ఆమె.. రాజకీయంగానూ తనదైన విశిష్టతను ప్రతిష్టించుకున్నారు. బహు భాషా కోవిదురాలైన జయ అనర్గళంగా ప్రసంగించగలరు. రచయిత్రి కూడా. తమిళులకు పురుచ్చి తలైవి(విప్లవ నాయకి)గా.. వారి గుండెల్లో అమ్మగా స్థానం పొందారు. 2011-16 మధ్య జయలలిత తనను తమిళులు పిలుచుకునే ‘అమ్మ’ పేరుతో క్యాంటీన్లు ప్రారంభించారు. పలు ప్రభుత్వ పథకాలకు అదే పేరు పెట్టి ఉప్పు, బేబీకేర్ కిట్లు తదితరాలు అందించారు. 2014లో జయలలితను అరెస్ట్ చేసినపుడు 16 మంది ఆత్మాహుతి చేసుకున్నారు. ఇప్పుడు ఆమె కన్నుమూయడంతో తమిళులు మరోసారి తమ ఆరాధ్య నాయకురాలి కోసం గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. కరుణానిధి అరెస్టయినపుడూ.. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని కూడా తమిళులు ఎంతగానో ఆరాధిస్తారు. అన్నాదురై స్థాపించిన డీఎంకే నుంచి ఎంజీఆర్ చీలిపోయిన తర్వాత కరుణానిధి పార్టీ సారథిగా కొనసాగుతున్నారు. కరుణానిధి కవిగా, నవలా రచయితగా, సినీ గేయ రచయితగా, సంభాషణల రచయితగా పేరుగాంచారు. 1986లో తమిళనాడులో రెండోసారి హిందీ వ్యతిరేక నిరసనలు చెలరేగిన తర్వాత.. కరుణానిధిని అరెస్ట్ చేసినపుడు 21 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ఎక్కువ మంది నిప్పంటించుకుని చనిపోయారు. 2006-11 మధ్య డీఎంకే అధికారంలో ఉన్నపుడు కరుణానిధి పేద కుటుంబాల కోసం.. తన బిరుదునే పేరుగా పెట్టి ‘కళైంగర్ ఆరోగ్య బీమా పథకం’ ప్రవేశపెట్టారు. -
పడిలేచిన కెరటం
తమిళులందరూ ‘అమ్మ’గా ప్రేమించే జయలలిత ఆ స్థానానికి చేరుకోవడానికి.. వారి గుండెల్లో చోటు సంపాదించుకోవడానికి చేసిన ప్రస్థానం అసాధారణమైనది! పురుషాధిక్య రాజకీయాలు.. కరడుగట్టిన ద్రవిడ రాజకీయాల్లో వైష్ణవ బ్రాహ్మణ వర్గానికి చెందిన స్త్రీ.. అవినీతి ఆరోపణలు.. కేసులు.. అరెస్టులు.. జైళ్లు.. అనర్హత వేట్లు! అరుునా.. మొక్కవోని ధైర్యం.. సడలని సంకల్పం.. ముళ్లబాటను పూలబాటగా మలచుకుని.. జనం గుండెల్లో చెదరని స్థానం సంపాదించుకున్న పురచ్చి తలైవి!! రాజకీయ అరంగేట్రం: దక్షిణాది సినీ రంగంలో ముఖ్యంగా తమిళనాట అగ్రనాయికగా వెలుగొందుతున్న జయలలితను 1982లో రాజకీయాల్లోకి తీసుకువచ్చింది అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎం.జి.రామచంద్రన్. తొలుత పార్టీ సభ్యురాలిగా చేరిన జయలలిత ఏడాదిలోనే 1983లో పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. రాజ్యసభ సభ్యత్వం: ఆ మరుసటి ఏడాదే 1984లో ఎంజీఆర్ కిడ్నీ వ్యాధి చికిత్స కోసం అమెరికా పయనమయ్యే ముందుగా.. పార్టీ నుంచి జయలిలత రాజ్యసభకు ఎన్నికయ్యేలా చేశారు. ఇది పార్టీలో ఎంతో మంది సీనియర్లకు మింగుడుపడలేదు. మరోవైపు ఎంజీఆర్ అమెరికాలో చికిత్స పొందుతుండగా.. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున జయ ప్రచారం నిర్వహించి గెలిపించారు. ఎంజీఆర్‌కు, జయలలితకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించినా.. జయ చాకచక్యంగా వాటిని ఎదుర్కొన్నారు. పార్టీ కోసం పోరాటం: 1987లో ఎంజీఆర్ మరణంతో ఆయన వారసత్వం విషయమై అన్నాడీఎంకేలో వివాదం రాజుకుంది. ఎంజీఆర్ భార్య జానకీ రామంచంద్రన్, జయలలితల మధ్య పార్టీ చీలిపోరుుంది. జయలలితవైపు ఉన్న ఎమ్మెల్యేల్లో ఏడుగురిపై స్పీకర్ అనర్హత వేటు వేయగా.. జానకీ రామచంద్రన్ గ్రూపు విశ్వాస పరీక్షలో నెగ్గింది. అరుుతే.. కొద్ది కాలానికే కేంద్రంలోని రాజీవ్ గాంధీ సర్కారు తమిళనాడులో జానకీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. ప్రతిపక్ష నాయకురాలిగా: ఈ క్రమంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జానకీ గ్రూపుపై జయలలిత పైచేరుు సాధించారు. అరుుతే.. అన్నా డీఎంకేలో ఈ అంతర్గత విభేదాల కారణంగా ఆ ఎన్నికల్లో డీఎంకే గెలిచింది. ఆ పార్టీ అధినేత కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. జయలలిత తమిళనాడు శాసనసభలో తొలి మహిళా ప్రతిపక్షనేత అయ్యారు. చీలిపోరుున అన్నాడీఎంకే రెండు విభాగాలనూ పునరైక్యం చేసి పార్టీ పగ్గాలు చేపట్టారు. ఎన్నికల సంఘం స్తంభింపజేసిన పార్టీ రెండు ఆకుల గుర్తును తిరిగి పునరుద్ధరించారు. తొలిసారి ముఖ్యమంత్రి: జయలలిత ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు. ఆ అవమానకర ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత.. 1991 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఘన విజయం సాధించింది. నాటి ఎన్నికలకు ముందు రాజీవ్‌గాంధీ ఎల్టీటీఈ చేతిలో హత్యకు గురవగా.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న అన్నా డీఎంకే విజయానికి ఆ సానుభూతి పవనాలూ దోహదపడ్డారుు. మొత్తం 234 సీట్లకుగానూ 225 సీట్లు అన్నాడీఎంకే-కాంగ్రెస్ కూటమి గెలుచుకుంది. 1991 జూన్ 24న జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల పూర్తి కాలం పదవిలో కొనసాగారు. వరుస విజయం.. ఆపై అనారోగ్యం కోర్టు కేసుల నుంచి విముక్తి పొందిన జయలలిత 2016 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగించారు. ఎంజీఆర్ అనంతరం వరుసగా రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది రికార్డు సృష్టించారు. అంతేకాదు.. తమిళ ప్రజల గుండెల్లో ‘అమ్మ’గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. కానీ.. ఐదు నెలలు గడవక ముందే అనారోగ్యానికి గురయ్యారు. మూడు నెలలుగా ఆస్పత్రికే పరిమితమైన జయలలిత డిసెంబర్ ఐదోతేదీ సోమవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. శాసనసభలో దుశ్సాసనపర్వం 1989 మార్చి 25న తమిళనాడు శాసనసభలో జయలలిత తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. సభలో అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే సభ్యుల మధ్య ఘర్షణ తలెత్తింది. ప్రతిపక్ష నాయకురాలు జయలలితపై అధికారపక్ష సభ్యులు దాడికి దిగారు. డీఎంకే సభ్యుడు దురై మురుగన్ జయలలిత చీర లాగారన్న ఆరోపణలు వచ్చారుు. జయలలిత చిరిగిన చీరతో, రేగిన జుట్టుతో, ఎర్రబడిన ముఖంతో సభ నుంచి బయటకు వచ్చారు. మీడియాకు జరిగిన ఘటనను వివరించారు. మళ్లీ తాను ఆ శాసనసభలో అడుగుపెడితే ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని శపథం చేశారు. ఆరోపణలు అధిగమిస్తూ.. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జయలలితపై, ఆమె మంత్రివర్గంపై తీవ్ర స్థారుులో అవినీతి ఆరోపణలు వచ్చాయి. 1995లో జయ తన దత్తపుత్రుడు సుధాకరన్ వివాహ వేడుకను గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేంత ఆడంబరంగా నిర్వహించడం వంటివి తీవ్ర దుమారం రేపారుు. ఈ క్రమంలో 1996లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఘోరంగా ఓడిపోరుుంది. ఆ పార్టీకి కేవలం 4 సీట్లు మాత్రమే దక్కారుు. స్వయంగా జయలలిత సైతం డీఎంకే చేతిలో ఓడిపోరుుంది. కేసులు.. తొలిసారి ఆరెస్టు తమిళనాడులో 1996లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత జయలలితపై పలు అవినీతి ఆరోపణలతో కేసులు నమోదు చేసింది. కలర్ టీవీల కుంభకోణంలో ఆమెకు రూ.10 కోట్లకు పైగా ముడుపులు అందాయని, టాన్సీ భూములను సొంతం చేసుకోవడనికి జయలలిత సీఎంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేవి ముఖ్యమైన ఆరోపణలు. జయలలితకు ఆదాయానికి మించి రూ.66.65 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ అప్పటి జనతా పార్టీ నేత సుబ్రమణ్యంస్వామి కేసు వేశారు. అదే ఏడాది డిసెంబర్ 7వ తేదీన జయను అరెస్ట్ చేయగా.. 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. కలర్ టీవీ కేసును 2000 సంవత్సరంలో కోర్టు కొట్టివేసింది. సీఎంగా ప్రమాణం.. అనర్హత 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అరుుతే.. కేసుల కారణంగా జయలలిత ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు. కానీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ.. జయలలితను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ఆమె 2001 మే 14న రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. కానీ.. టాన్సీ భూములు, ప్లెజెంట్ స్టే హోటల్ కేసుల్లో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు పెండింగ్‌లో ఉండగా ఆమె సీఎం పదవి చేపట్టడం చెల్లదని సుప్రీంకోర్టు సెప్టెంబర్‌లో తీర్పునిచ్చింది. దీంతో ఆమె తనకు విశ్వాసపాత్రుడైన ఒ.పన్నీరుసెల్వానికి సీఎంగా బాధ్యతలు అప్పగించారు. మళ్లీ ముఖ్యమంత్రిగా.. జయలలిత తనపై నమోదైన కేసుల్లో న్యాయపోరాటం చేశారు. టాన్సీ భూములు, ప్లెజెంట్ స్టే హోటల్ కేసులను 2001లో కింది కోర్టులు కొట్టివేయగా.. 2003లో సుప్రీంకోర్టు ఆ తీర్పులను సమర్థించింది. దీంతో అదే ఏడాది మార్చిలో జయలలిత మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఉప ఎన్నికలో పోటీ చేసి అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యారు. మరో ఓటమి.. మరో గెలుపు జయలలిత, ఆమె సారథ్యంలోని అన్నా డీఎంకే 2006 అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. కేవలం 61 సీట్లు మాత్రమే గెలుపొందింది. అత్యధికంగా 96 సీట్లు గెలుపొందిన డీఎంకే.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. అరుుతే.. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత మళ్లీ విజయం సాధించారు. అదే ఏడాది మే నెలలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.ఆమె సారథ్యంలోని అన్నా డీఎంకే 11 పార్టీల తో పొత్తు పెట్టుకుని ఈ గెలుపును సొంతం చేసుకుం ది. జయ రాజకీయ ప్రస్థానం వేగం పుంజుకుంది. మళ్లీ అరెస్టు, జైలు, విముక్తి అయితే.. జయలలితను ఆస్తుల కేసు వెంటాడుతూనే ఉంది. 2014 సెప్టెంబర్‌లో జయలలితను దోషిగా పేర్కొంటూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. దీంతో జయ మరోసారి సీఎం పదవికి అనర్హురాలయ్యారు. మళ్లీ జైలుకు వెళ్లారు. ఆమె ఒ.పన్నీరుసెల్వంను సీఎంగా నియమించారు. కొద్ది రోజులకే సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యేక కోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. 2015లో కర్ణాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం.. జయలలితకు శిక్ష విధిస్తూ కింది కోర్టు తీర్పును రద్దు చేసింది. దీంతో జయ మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆరోజు... అవమానం... ఆ రోజు... డిసెంబరు 24... 1987 ఎంజీఆర్ మరణ వార్త... వినగానే జయ స్థాణువైపోరుుంది. కొంచెం సేపటికి తేరుకుని రామవరం గార్డెన్స్ (ఎంజీఆర్ ఇల్లు) వెళ్లేందుకు డ్రైవర్‌ను పిలిచింది. కానీ ఇంట్లోకి అడుగుపెట్టవద్దన్న హెచ్చరికలు జారీ అయ్యారుు. కారులోంచి బయటకొచ్చిన జయ తలుపులను చేతులతో దబదబ మోదింది. చాలాసేపటి తరువాత తలుపులు తెరుచుకున్నా ఎంజీఆర్ మృతదేహం ఎక్కడ ఉంచారన్న విషయం మాత్రం ఎవరూ జయకు తెలియనివ్వలేదు. చాలాసార్లు మెట్లు ఎక్కి దిగి ఇల్లంతా వెతికింది జయ. ఆమె ముఖం మీదే గదుల తలుపులు వేసేశారు. ఎంజీఆర్ కడచూపు కూడా దక్కనివ్వలేదు. చిట్ట చివరకు.. ఎవరో... మృతదేహాన్ని పెరటి తలుపు నుంచి రాజాజీ హాల్‌కు తరలించారన్న సమాచారం ఇచ్చారు. అంతే... జయ ఆయాసంతో రొప్పుతూ రాజాజీ హాల్‌కు తీసుకెళ్లాల్సిందిగా డ్రైవర్‌ను ఆదేశించింది. హాల్‌కు వెళ్లగానే పరుగు పరుగున ఎంజీఆర్ మృతదేహం తల వైపు కూర్చుండి పోరుుంది. కనురెప్పలు సైతం వాల్చకుండా... దాదాపు 21 గంటలు అక్కడే అలాగే ఉండిపోయింది. ఎంజీఆర్‌కు నివాళులు అర్పించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆమె సంకల్పానికి నివ్వెరపోయారు. శారీరకంగా ఇంత దృఢంగా ఉన్న జయపై ఆ దశలో జరిగిన మానసిక హింస అంతా ఇంతా కాదు. ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ మద్దతుదారులు జయ చుట్టుపక్కలే నిలబడి కాళ్లు తొక్కుతూ హింసించారు. వెనుకనుంచి గోళ్లతో గిచ్చారు. అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేసేందుకు శతధా ప్రయత్నించారు. అరుునా జయ చెక్కు చెదరలేదు. ఆత్మగౌరవానికి తీవ్రమైన భంగపాటు జరిగినా... ఎవరు ఎంత అవహేళన చేసినా ఉన్న చోటి నుంచి అస్సలు కదల్లేదు. పరిసరాల్లో ఏం జరుగుతోందో కూడా పట్టించుకోని స్థితికి చేరిపోయారు ఆమె. అరుుతే అంతటి విషమ పరిస్థితిలోనూ ఆమె మెదడును ఒక ప్రశ్న మాత్రం తొలిచేస్తూనే ఉండి ఉంటుంది. ‘‘ఇప్పుడేం చేయాలి?’’ అని. దాదాపు 38 ఏళ్ల వయసు... మంచి భవిష్యత్తు ఉంటుందని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎదురుగా జీవం లేకుండా పడి ఉన్నాడు. అప్పటివరకూ తమ నాయకుడికి రాజకీయ వారసురాలు తనేనన్న పార్టీ కార్యకర్తలూ పట్టించుకోని పరిస్థితి. అరుుతే... ఓటమిని తేలికగా తీసుకునే వ్యక్తి... .జయ కానే కాదు! అంతిమ యాత్రలోనూ అదే అవమానం... ఎంజీఆర్ అంతిమ యాత్ర మొదలయ్యే క్షణాలు... మృతదేహాన్ని ఉంచిన వాహనంలోకి ఎక్కేందుకు జయ ప్రయత్నించారు. డ్యూటీలో ఉన్న పోలీసులు ఓ చేయి అందించారు కూడా. అయితే ఆమె పైకి ఎక్కిందో లేదు... దిగిపోవాల్సిందిగా అరుపులు. చూస్తే ఎదురుగా ఎమ్మెల్యే కేపీ రామలింగం తనవైపు దూసుకొస్తూ కనిపించాడు. ఏమైందో తెలిసేలోపుగానే జయపై దాడి మొదలైంది. జానకీ రామచంద్రన్ దగ్గరి బంధువు దీపన్ జయ నుదుటిపై కొట్టాడు. వాహనం నుంచి కిందకు తోసేశాడు. తగిలిన గాయాలు ఆమెను బాధించాయో లేదోగానీ... ఆ అవమానం మాత్రం ఆమెను నిశ్చేష్టురాలిని చేసేసింది. అంత్యక్రియల్లో పాల్గొనకుండానే వెనక్కు వచ్చేయాల్సి వచ్చింది. మలుపు తిప్పిన ఆ రోజు... జయకు జరిగిన అవమానాలు ఏఐఏడీఎంకే కార్యకర్తలందరిలోనూ దావానలంలా వ్యాపించాయి. ఒక్కరొక్కరుగా కార్యకర్తలు, నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఆమె ఇంటికి చేరుకోవడం మొదలైంది. జరిగిన అవమానాన్ని ఖండించారు. ఎంజీఆర్ వారసురాలిగా తాము మీ వెంటే ఉంటామని జయకు భరోసా ఇచ్చారు. ఆ తరువాత రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 97 మంది ఎమ్మెల్యేలతో జానకీ రామచంద్రన్ ఇచ్చిన లేఖను ఆమోదిస్తూ గవర్నర్ ఎస్.ఎల్.ఖురానా ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. 1988 జనవరి ఏడున జానకి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా సూచించారు. ఆ రోజు అసెంబ్లీ అంత గందరగోళంతో నిండిపోయింది. కొంతమంది గూండాలు జయ మద్దతుదారులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై దాడులు చేశారు. తమిళనాడు చరిత్రలో మొదటిసారి పోలీసులు అసెంబ్లీలోకి ప్రవేశించి లాఠీఛార్జి చేశారు. ఈ సందర్భంలోనే సభాపతి జానకి రామచంద్రన్ విశ్వాస పరీక్ష నెగ్గినట్లు ప్రకటించారు. ఆ వెంటనే... జయ అసెంబ్లీ బయటకు వచ్చి ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆక్రోశం వ్యక్తం చేశారు. జానకి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరారు. అసెంబ్లీ సంఘటనలన్నింటితో గవర్నర్‌కు నివేదిక సమర్పించారు. ఆ తరువాత అసెంబ్లీని రద్దు చేసి తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా గవర్నర్ కేంద్రానికి సిఫారసు చేశారు. తమిళనాడులో జయ శకానికి నాందీ పడింది! (‘అమ్మ... జయలలితాస్ జర్నీ ఫ్రమ్ మూవీస్టార్ టు పొలిటికల్ క్వీన్’ గ్రంథం నుంచి. రచయిత: వాసంతి) -
శక్తి స్వరూపిణి
సాక్షి ప్రతినిధి, చెన్నై: పురచ్చితలైవి(విప్లవ నాయకి)లోని తెగువ.. అమ్మలోని అనురాగం.. ఎన్ని కష్టాలెదురైనా వెనక్కి తగ్గని నైజం ఆమె సొంతం. రెండేళ్లకే తండ్రి చనిపోయినా.. తల్లి సినిమాల్లోకి వెళ్లడంతో చిన్నతనంలో మాతృప్రేమకు దూరమైనా.. ఆమె కుంగిపోలేదు. చదువుల్లో టాపర్ అయినా.. కుటుంబపోషణ కోసం నాటకాల బాటపట్టినా.. ఎక్కడా నిరుత్సాహపడలేదు. నిండుసభలో దుశ్శాసన పర్వాన్ని ఎదుర్కొన్నా.. ఆ తర్వాత రెండేళ్లకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ధీరోదాత్త. ఇలా ఒక్కసారి కాదు ఏకంగా ఆరుసార్లు ముఖ్యమంత్రిగా ప్రజామన్ననలు పొందిన రికార్డు జయలలితకే సాధ్యం. తరతరాలుగా వేళ్లూనుకుపోయి ఉన్న పురుషాధిక్య సమాజంలో.. అందులోనూ రాజకీయాల్లో నెగ్గుకు రావడమంటే మాటలు కాదు. ఇది దాదాపు అసాధ్యమే. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అందరి చేత ‘జయ’హో అనిపించుకున్నారు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో పుట్టినా జాతీయస్థాయి రాజకీయ పుంగవుల చేత జేజేలు కొట్టించుకున్నారు. ఒకనాడు ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్లను ఉక్కు మహిళ అనే వారు. ఈ కోవలోనే జయలలితనూ దక్షిణాది ఉక్కు మహిళ అని పిలుచుకోవచ్చు. ఆటుపోట్లతో అమ్మ ఎదురీత ఎంజీఆర్ మరణంతో జయకు కష్టాలు ప్రారంభమయ్యాయి. విపక్షం డీఎంకేతో పాటు స్వపక్షం అన్నాడీఎంకే నుంచి కూడా ఆమె అవమానాలను ఎదుర్కొన్నారు. ఎంజీఆర్ మృతి చెందగానే పార్టీ రెండుగా చీలింది. ఒక వర్గానికి నాయకత్వం వహించిన ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఆర్టికల్ 356 ప్రయోగించి జానకీ రామచంద్రన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. అక్కడితో ఆమె శకం ముగిసింది. 1989లో ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా తన వర్గానికి నాయకత్వం వహించి ఎన్నికల బరిలోకి దిగిన జయ.. తేనీ జిల్లా బోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆమె పార్టీ కేవలం 27 సీట్లు మాత్రమే గెలవడంతో ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. తద్వారా తమిళనాడు తొలి మహిళా ప్రతిపక్ష నేతగా జయ చరిత్ర కెక్కారు. అదే ఏడాది జయ జీవితంలో మర్చిపోలేని చేదు సంఘటన చోటుచేసుకుంది. నిండు సభలో స్పీకర్ సాక్షిగా అధికారపక్షం డీఎంకే చేతిలో దాడికి, తీవ్ర పరాభవానికి గురయ్యారు. చినిగిన చీరతో అసెంబ్లీ నుంచి వెళ్లిపోతూ.. ‘ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టను’ అని జయ శపథం చేశారు. కాగా, చట్టసభలో ఎదురైన పరాభవం ఆమెకు ప్రజల నుంచి అంతులేని సానుభూతి తెచ్చిపెట్టింది. అదే సమయంలో అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఏకమవ్వడంతో జయలలిత పార్టీ సామ్రాజ్ఞిగా ఎదిగారు. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆమె స్నేహహస్తం అందించారు. ఆ ఎన్నికల సమయంలోనే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని ఎల్టీటీఈ తీవ్రవాదులు హతమార్చారు. కాగా, ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, కాంగ్రెస్ కూటమి 234 అసెంబ్లీ స్థానాలకు గానూ 225 చోట్ల, 39 పార్లమెంటు స్థానాల్లో గెలుపొంది జయకేతనం ఎగరవేసింది. దీంతో 1991లో జయలలిత తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. శపధాన్ని రెండేళ్లు కూడా తిరగక ముందే నెరవేర్చి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో జయ అడుగుపెట్టారు. అనంతరం 1996 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోరుుంది. మళ్లీ 2001లో రెండోసారి జయ ముఖ్యమంత్రి అయ్యారు. ఆతర్వాత 2002లో మూడోసారి, 2011లో నాలుగోసారి, 2015లో ఐదోసారి, 2016లో ఆరోసారి ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు చేపట్టారు. రికార్డుల్లో గురువును మించిన శిష్యురాలు రాజకీయాల్లో ఓనమాలు దిద్దించిన ఎంజీఆర్ సాధించిన రికార్డులను బద్దలుకొట్టడం ద్వారా గురువును మించిన శిష్యురాలు అనిపించుకున్నారు జయ. ఎంజీఆర్ మూడుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తే.. ఆయన శిష్యురాలు జయలలిత ఆరుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే గత పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి 39 స్థానాల్లో 37 స్థానాలను గెలుచుకున్న రికార్డు కూడా జయకు మాత్రమే సొంతం. మిత్రపక్ష పార్టీలను కూడా రెండు ఆకుల గుర్తుపైనే పోటీ చేరుుంచి గెలిపించడం జయ నాయకత్వ పటిమకు నిదర్శనం. అధికార పార్టీని ఐదేళ్ల తర్వాత ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం తమిళనాడు ప్రజల సంప్రదాయం. దీనిని కూడా ఆనాడు ఎంజీఆర్ తుడిచిపెట్టగా, ఇటీవలి ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం ద్వారా జయలలిత ఆ రికార్డును కూడా చెరిపివేశారు. ఎంజీఆర్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, జయలలిత 8 సార్లు పోటీ చేసి 7సార్లు గెలిచారు. ముహూర్తమంటే మక్కువ జ్యోతిష, సంఖ్యాశాస్త్రాలపై నమ్మకం కలిగిన జయలలిత తాను నివసిస్తున్న పోయెస్‌గార్డెన్‌లోని భవనానికి తన తల్లి పేరు కలిసొచ్చేలా ‘వేద నిలయం’ అని పేరు పెట్టుకున్నారు. అలాగే తన పేరును jayalalithaa (చివరన ‘ఎ’ అక్షరం అదనంగా)గా మార్చుకున్నారు. ఇక మంచి ముహూర్తం లేనిదే జయ కాలు బయటపెట్టరు. దైవభక్తి మెండుగా ఉన్న జయలలిత చెన్నై నగరంలోని కొట్టూరుపురం వినాయకుని ఆలయానికి తరచూ వెళుతుంటారు. అలాగే తన నెలసరి వేతనంతో ఆలయాల్లో నిత్యాన్నదానాలతో పాటు చిన్న గున్న ఏనుగును కూడా బహూకరించేవారు. కోమలవల్లి... జయలలిత కర్నాటకలోని(నాటి మైసూరు రాష్ట్రం) మాండ్య జిల్లా మేల్కోటేలో తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జయరామన్, వేదవల్లి(సంధ్య) దంపతులకు 1948 ఫిబ్రవరి 24న జయలలిత జన్మించారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం బిడ్డలకు రెండు పేర్లు పెట్టాల్సి ఉంది. ఒకటి పూర్వీకుల పేరు, మరొకటి వ్యక్తిగత పేరు. దీంతో అమ్మమ్మ కోమలవల్లి పేరుతో పాటు జయలలిత అని నామకరణం చేశారు. జయలలిత అనే పేరు వెనుక ఒక చిన్న చరిత్ర ఉంది. జయ చిన్నతనంలో ఆమె కుటుంబం మైసూరులో రెండు ఇళ్లలో అద్దెకు ఉంది. అందులో ఒకటి జయ విలాస్, మరొకటి లలిత విలాస్. ఈ రెండు పేర్లను కలిపి జయలలిత అని పెట్టారని చెబుతుంటారు. తండ్రి న్యాయవాద వత్తిని నిర్వహించినా ధనంపై ఆశతో పనిచేయకపోవడంతో స్థితిమంతులు కాలేకపోయారు. జయకు రెండేళ్ల ప్రాయంలోనే తండ్రి చనిపోయాడు. దీంతో తల్లి వేదవల్లి చంటిబిడ్డ జయను చంకన వేసుకుని బెంగళూరులోని తన పుట్టింటికి వచ్చేసింది. వేదవల్లి సోదరి అంబుజవల్లి ఎరుుర్హోస్టెస్గా పనిచేస్తూ డ్రామాలు, సినిమాల్లో నటించేందుకు మద్రాస్‌కు మకాం మార్చింది. దీంతో చిన్నారి జయను వదిలి తల్లి వేదవల్లి కూడా కుటుంబపోషణ నిమిత్తం 1952లో మద్రాస్‌కు వచ్చేశారు. ఆ తర్వాత వేదవల్లి సినిమా నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మారి తన వెండితెర పేరును సంధ్యగా మార్చుకున్నారు. తల్లిని విడిచి ఉండలేని జయలలిత కూడా 1958లో మద్రాసుకు చేరారు. జయ విద్యాభ్యాసం బెంగళూరులోని బిషప్ కాటల్ గర్ల్స్ హైస్కూల్‌తో పాటు మద్రాస్‌లోని చర్చిపార్క్ స్కూల్, స్టెల్లా మేరీస్ కాలేజీలో కొనసాగింది. చదువులో జయ ఎప్పుడూ టాపర్‌గా ఉండేవారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లిషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల దిట్టగా ఎదిగారు. అరుుతే, న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకోవాలనుకున్న జయ.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా సినీపరిశ్రమలో అడుగుపెట్టాల్సి వచ్చింది. అనంతర కాలంలో తమిళ ప్రజలు దేవుడిగా కొలిచే వెండితెర వేల్పు ఎంజీ రామచంద్రన్‌తో ఆమెకు పరిచయ భాగ్యం కలిగింది. ఇష్టాఇష్టాలు జయలలిత పూర్తి శాకాహారి. తన జీవితాన్ని ప్రభావితం చేసిన వారిలో మొదటి వ్యక్తిగా తల్లి సంధ్య పేరును ప్రస్తావించే జయలలిత.. అనంతరం రాజకీయ గురువు ఎంజీఆర్, మదర్ సెలినా(తన స్కూల్ టీచర్)ను కూడా తప్పకుండా గుర్తు చేసుకుంటారు. న్యాయశాస్త్రాన్ని అమితంగా ఇష్టపడే జయలలిత మంచి పుస్తకాలను సేకరించి పోయెస్ గార్డెన్‌లోని తన ఇంట్లో పెద్ద గ్రంథాలయమే ఏర్పాటు చేసుకున్నారు. ఇక జయలలితకు ఇష్టమైన పుస్తకం ‘వైల్డ్ స్వాన్స్’. ఇదిలాఉండగా, జయ ఇంట్లోనే తమిళ, ఇంగ్లిష్ పాత చిత్రాలను కూడా చూసేవారు. రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాలు ఆమెను డాక్టరేట్‌తో సత్కరించడం విశేషం. ఇక, జయకు ప్రాణ స్నేహితురాలు(నెచ్చెలి) శశికళ అరుుతే బద్ద విరోధి డీఎంకే అధినేత ఎం.కరుణానిధి. ఎంజీఆర్ అడుగుజాడల్లో.. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్)ను రాజకీయ గురువుగా భావించిన జయలలిత ఆయన అడుగుజాడల్లో నడవడం ప్రారంభించారు. 1982లో ఆమెకు ఎంజీఆర్ పార్టీ సభ్యత్వం కల్పించారు. బహిరంగ సభల్లో జయను ‘పెన్నిన్ పెరుమై’(మహిళలకే గర్వకారణం) అంటూ ఎంజీఆర్ పరిచయం చేసేవారు. 1983లో పార్టీ ప్రచార కార్యదర్శిగా ఆమెను నియమించారు. ఈ బాధ్యతలను జయ సమర్థవంతంగా నిర్వర్తించి ఆయన మెప్పు పొందారు. దీంతో 1984లో ఆమెను రాజ్యసభకు ఎంపిక చేశారు. అదే ఏడాది ఎంజీఆర్‌కు గుండెపోటు రావడం, అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకు రావడంతో పార్టీ ప్రచార కార్యదర్శిగా జయ విస్తృతంగా పర్యటించి పార్టీకి మంచి ఫలితాలు రాబట్టారు. కాగా, మూడేళ్ల తర్వాత 1987లో ఎంజీఆర్ మృతి చెందారు. పురట్చితలైవర్ (విప్లవనాయకుడు) అంటూ ఎంజీఆర్‌ను ప్రేమగా పిలుచుకునే ప్రజలు.. ఆయన రాజకీయ భావజాలాన్ని అందిపుచ్చుకున్న జయలలితను పురట్చితలైవి (విప్లవనాయకి)గా పిలవనారంభించారు. అమ్మ.. చిన్నమ్మ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ జీవితాన్ని ఎంతగా చెప్పుకున్నా.. ఆమె నెచ్చెలి శశికళను ప్రస్తావించకుంటే అది అసంపూర్తే. అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ‘ఈమె శశికళ మాత్రమే కాదు, జయలలిత నీడ’ అనేంతటి ప్రాధాన్యతను కల్పించుకుని టాక్ ఆఫ్ ది కంట్రీగా మారారు. శశికళ జయకు దగ్గరైన వేళ 1983లో జయలలిత అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు వీడియో కవరేజీ ఫొటో స్టూడియోను నడుపుతున్న శశికళను కలెక్టర్ చంద్రలేఖ జయకు పరిచయం చేశారు. వారిద్దరి పరిచయం స్నేహంగా మారింది. ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, ఆయన మరణం తర్వాత జయలలితకు పార్టీలో వ్యతిరేకుల నుంచి ఒత్తిడి ప్రారంభమైంది. ఈ కష్టకాలంలో శశికళ జయకు అండగా నిలిచారు. ఆ తరువాత జయలలిత నివాసమైన పోయెస్‌గార్డెన్‌లోనే శశికళ నివసించడం ప్రారంభించారు. 1991లో తొలిసారిగా జయ ముఖ్యమంత్రి అయ్యారు. పోయెస్‌గార్డెన్‌లో శశికళ బంధువుల పెత్తనం పెరిగింది. శశికళ అన్న కుమారుడు సుధాకరన్ను జయ దత్తు తీసుకున్నారు. 1996లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ అరెస్టుకాగా, ఆమెతో పాటూ శశికళ కూడా అరెస్టయ్యారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినా టాన్సీ కుంభకోణం వివాదాల్లో చిక్కుకుని ఉన్నందున జయ సీఎం కాలేక పోయారు. అపుడు పన్నీర్‌సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా పీఠంపై కూర్చోబెట్టింది శశికళనే. 2011లో జయ మళ్లీ అధికారంలోకి రాగా శశికళ కుటుంబ సభ్యుల అట్టహాసం మళ్లీ వేగం పుంజుకుంది. దీంతో జయలలిత ఆగ్రహం చెంది శశికళను పోయెస్‌గార్డెన్ నుంచి బైటకు పంపివేశారు. అరుుతే రెండోసారి కూడా శశికళ, జయలలితల మధ్య విభేదాలు ఎంతోకాలం నిలబడలేదు. శశికళ మళ్లీ పోయెస్‌గార్డెన్‌కు చేరుకున్నారు. ‘నన్ను చూసుకోవడం శశికళ వల్లనే సాధ్యం, ఆమె లేకుండా నేను ఒంటరిగా ఉండలేను’ అనే ఆప్యాయతను జయ ప్రదర్శించారు. -
అప్పుడు జయ.. ఇప్పుడామె వారసులు!
తమిళనాడులో రాజకీయ చరిత్ర పునరావృతం అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటిలాగే గతంలోనూ అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ అనారోగ్యంపాలై అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆస్పత్రిలో చేరిన వెంటనే అన్నాడీఎంకే పార్టీలో వర్గ రాజకీయాలు వెలుగులోకి వచ్చాయి. సినీ నిర్మాత, సీనియర్ నాయకుడు ఆర్ఎం వీరప్పన్ నేతృత్వంలోని ఈ వర్గం అప్పట్లో ఆస్పత్రిలో ఉన్న ఎంజీఆర్‌ను కలిసేందుకు జయలలితను అనుమతించలేదు. 1982లో అన్నాడీఎంకేలో చేరిన జయలలిత అతి త్వరలోనే ముఖ్య నాయకురాలిగా పేరుతెచ్చుకున్నారు. ఆమె ఎదుగుదలను ఓర్వలేకపోయిన వీరప్పన్ వర్గం జయలలితను అణచివేసేందుకు ప్రయత్నించింది. జపాన్ నుంచి వచ్చిన వైద్యబృందం ఎంజీఆర్‌కు చికిత్స అందజేస్తున్నట్టు ఆమె పార్టీ తరఫున ప్రకటన కూడా విడుదల చేశారు. కానీ. ఈ ప్రకటనను ఖండించిన అప్పటి పార్టీ ప్రధాన కార్యదర్శి పీయూ షణ్ముగం.. జయలలితకు షోకాజ్ నోటీసులు జారీచేస్తామని హెచ్చరించారు కూడా. ఇదంతా గతం కాగా.. ఇప్పుడు వర్తమానంలోనూ గతంలాంటి పరిస్థితే కనిపిస్తోంది. గత 15 రోజులకుపైగా జయలలిత అదే అపోలో ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో ఆమె రాజకీయ వారసులు ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. తన రాజకీయ వారసుడిగా ప్రముఖ సినీ నటుడు అజిత్ కుమార్‌ను పేర్కొంటూ జయలలిత వీలునామా రాశారని కథనాలు కూడా వస్తున్నాయి. మరోవైపు జయలలిత రాజకీయ వారసురాలిని నేనేనంటూ ఆమె అన్న కూతురు దీప ముందుకొచ్చారు. జయలలిత సొంత సోదరుడు జయకుమార్, విజయలక్ష్మి దంపతుల కూతురు దీప. ఆమె ఇటీవల అపోలో ఆస్పత్రి వద్ద జయ వారసురాలినంటూ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అన్నాడీఎంకే నేతలు జయలలితను కలిసేందుకు దీపను అనుమతించలేదు. దీంతో నిరాశగా వెనుదిరిగిన ఆమె.. జయ వారసత్వం కోసం తనదైన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కథనాల సంగతి ఎలా ఉన్నా జయలలిత త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు కోరుకుంటున్నారు. -
ఎంజీఆర్ అల్లుడి హత్యకేసులో ఏడుగురికి జీవితఖైదు
చెన్నై: అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) అల్లుడు విజయన్ హత్య కేసులో చెన్నై సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఎంజీఆర్ పెంపుడు కుమార్తె బాను శ్రీధర్ సహా ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. ఎంజీఆర్ మరో పెంపుడు కూతురు సుధ భర్త అయిన విజయన్ 2008, జూన్ 4న అళ్వార్ పేటలో హత్యకు గురైయ్యారు. ఆయనను కారుతో గుద్ది, ఇనుప రాడ్లతో మోది చంపారు. ఈ కేసులో మొదట అభిరామపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తర్వాత సీబీసీఐడీకి అప్పగించారు. దాదాపు 70 మంది కోర్టులో సాక్ష్యమిచ్చారు. కానిస్టేబుల్ కరుణ సహకారంతో సోదరి భర్తను బాను శ్రీధర్ చంపించినట్టు దర్యాప్తులో తేలింది. ఆస్తి తగాదాలతో ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు రుజువైంది. కానిస్టేబుల్ కరుణకు బాను రూ. 4లక్షలు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. బానుకు సహకరించిన ఆమె స్నేహితురాలు భువన ఇప్పటికి పరారీలో ఉంది. కోర్టు తీర్పుపై విజయన్ భార్య సుధ స్పందించారు. పోలీసులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. తన భర్తకు చివరికి న్యాయం దక్కిందన్నారు. -
ఎమ్జీఆర్ చిత్ర రీమేక్‌లో విజయ్?
ఎమ్జీఆర్ చిత్ర రీమేక్‌లో విజయ్ నటించనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌లో అవునంటూ ప్రచారం జరుగుతోంది. దివంగత మక్కల్ తిలగమ్ ఎమ్జీఆర్ నటించిన ఇంగ వీటి పిళ్లై చిత్ర రీమేక్‌లో నటించాలన్న ఆకాంక్షను ఈ తరం నటులు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అందులో ఇళయదళపతి విజయ్ పేరు ఉండటం గమనార్హం. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన రెండుకు పైగా పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో సమంత, ఎమీజాక్సన్‌లు ఆయనతో రొమాన్స్ చేస్తున్నారు. తెరి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మార్చిలో ఆడియో, ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత కలైపులి ధాను సన్నాహాలు చేస్తున్నారు. కాగా విజయ్ త దుపరి భరతన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇది ఆయన 60 వ చిత్రం అన్నది గమనార్హం. కీర్తీసురేశ్ కథానాయకిగా నటించనున్న ఈ చిత్రంలో మరో ఇద్దరు బ్యూటీస్ కూడా నటించనున్నట్లు తాజా సమాచారం. అందులో ఒకరు క్రేజీ భామ కాజల్‌అగర్వాల్ అనీ, మరో నటి ఐశ్వర్య రాజేశ్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు భరతన్ దర్శకత్వంలో విజయ్ అళగీయ తిరుమగన్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. కాగా ఈ తాజా చిత్రంలో కూడా విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నారనీ తెలిసింది. మరో విశేషం ఏమిటంటే విజయ్ నటించనున్న 60వ చిత్రం ఎమ్జీఆర్ నటించిన ఇంగ వీటిపిళ్లైకి రీమేక్ అని కోలీవుడ్ వర్గాల బోగట్టా. అందులో ఎమ్జీఆర్ అమాయకపు యువకుడిగానూ ధైర్యవంతుడిగానూ రెండు వైవిధ్యభరిత పాత్రల్లో నటించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. అలాంటి చిత్రాన్ని చిన్న చిన్న మార్పులతో విజయ్ హీరోగా తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే ఎమ్జీఆర్ నటిం చిన ఇంగ వీటిపిళ్లై చిత్రాన్ని విజయా సంస్థే నిర్మించిందన్నది గమనార్హం. -
మళ్లీ నేనే సీఎం
సమరశంఖం పూరించండి కార్యకర్తలకు దిశానిర్దేశం అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పిలుపు చెన్నై : రాబోయే అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కార్యకర్తలంతా సంఘటిత శక్తిగా మారాలని అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత పిలుపునిచ్చారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ 99వ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి జయలలిత కార్యకర్తలకు శనివారం ఉత్తరాల ద్వారా సందేశం పంపారు. తమిళరాజకీయ, సినిమా రంగాల్లో దేదీప్యమానంగా వెలిగిన ఎంజీ రామచంద్రన్‌కు నూరేళ్ల జయంతి వేడుకలు సమీపిస్తున్నా ప్రజలు నేటికీ మరిచిపోలేదని అన్నారు. రాజకీయ, సినీరంగాల్లో ఆయన సాగించిన కఠోరపరిశ్రమనే ప్రజల హృదయాల్లో నిలిచిపోవడానికి కారణమని అన్నారు. ఎంజీఆర్ జీవితం మరెన్నో తరాలకు మార్గదర్శకమని ఆమె అన్నారు. ప్రజల కోసం తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపిన మహానేతగా ఆమె ఎంజీఆర్ ని కొనియాడారు. ప్రజాజీవితంలో తనను ప్రియమైన సోదరిగా భావించేవారని ఆమె తెలిపారు. రెండెంకెల జయంతి వేడుకలు ఈ ఏడాదికి ఇదే ఆఖరని, వచ్చే ఏడాది శతవసంతాల సంబరాలను జరుపుకుంటున్నామని తెలిపారు. తన నేతృత్వంలో మరోసారి ప్రభుత్వాన్ని చేపట్టడతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఎంజీఆర్ నూరేళ్ల జయంతిని అధికారికంగా జరుపుకోవడం సంతోష దాయకమని చెప్పారు. ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాల కోసం గతంలో ఎన్నడూ సాధించని అపూర్వమైన విజయాన్ని పార్టీ సొంతం చేసుకునేలా కార్యకర్తలు పాటుపడాలని ఆమె కోరారు. ప్రతి కుటుంబానికి అందేలా అమలుచేసిన అభివృద్ధి పథకాలే అన్నాడీఎంకేకు విజయసోపానాలుగా భావించాలని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే భారీ మెజార్టీతో గెలుపొందడం, తన నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జయలలిత ధీమా వ్యక్తం చేశారు. రూ.88 కోట్ల పథకాల ప్రారంభోత్సవాలు: ఇదిలా ఉండగా, సీఎం జయలలిత రాష్ట్రంలో చేపట్టిన రూ.88 కోట్ల విలువైన పథకాలకు, నిర్మాణాలకు శనివారం ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లోని సహకార సంఘాల గిడ్డంగులు, అమ్మ ఫార్మసీలు, ఫలసరకుల దుకాణాలను వీడియో కాన్ఫరెన్స్ద్వారా ఆమె ప్రారంభించారు. -
ఎంజీఆర్‌కి సీఎం జయలలిత ఘన నివాళి
చెన్నై : ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌కి తమిళనాడు సీఎం జయలలిత ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఎంజీఆర్ 99వ జయంతి. ఈ సందర్భంగా చెన్నైలోని ఆయన విగ్రహానికి జయలలిత పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి జయలలిత స్వీట్లు పంచిపెట్టారు. తమిళనాడు శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐఏడీఎంకే పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని శనివారం పార్టీ కార్యకర్తలకు సీఎం జయలలిత సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. -
జెమినీ గణేశన్ పేరుతో చిత్రం
తమిళసినిమా: ప్రఖ్యాత నటుల పేర్లతో చిత్రాలు రావడం అన్నది అరుదైన విషయమే. ఆ మధ్య విశాల్ నటించిన చిత్రానికి ఎంజీఆర్ అనే టైటిల్ నిర్ణయించగా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మదగజరాజా అనే పేరును మార్చాల్సి వచ్చింది. నంబియార్ పేరుతో ఒక చిత్రం తెరకెక్కింది. ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్ పేరుతో ఒక హిందీ అనువాద చిత్రానికి రజనీకాంత్ అంగీకరించకపోవడంతో ఆ చిత్రం విడుదల నిలిచిపోయింది. ఇప్పుడు ప్రఖ్యాత నటుడు జెమినీగణేశన్ పేరుతో ఒక చిత్రం తెరకెక్కడానికి సిద్ధమవుతోంది. ఈ టైటిల్‌కు జెమినీగణేశన్ కుటుంబం నుంచి అనుమతి లభించినట్లు దర్శకుడు ముత్తుకుమార్ తెలిపారు. ఈయన దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నటుడు జీవా హీరోగా టైటిల్ పాత్రను పోషించనున్నారట. త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని దర్శకుడు వెల్లడించారు. నటుడు జీవాకు వరుస అపజయాలు ఎదురవ్వడంతో చిన్న గ్యాప్ తీసుకుని వరుసగా చిత్రాలను అంగీకరిస్తున్నారు. నయనతారతో నటిస్తున్న తిరునాళ్ షూటింగ్ తుది దశకు చేరుకుంది. కవలెవైండామ్, కో చిత్రాల టీమ్‌తో మరోసారి కలిసి నటించనున్నారు. ఇకపై వరుసగా తన చిత్రాల విడుదలకు జీవా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. -
స్నేహితులను ఆహ్వానించను
ఇకపై తన సినిమా వేడుకలకు స్నేహితులను ఆహ్వానించనంటున్నారు నటుడు, నిర్మాత విశాల్. తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై తాజాగా నిర్మించి, నటించిన చిత్రం ఆంబళ. సంక్రాంతికి తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రజాదరణ పొందడంతో సోమవారం వడపళనిలోని హోటల్లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. విశాల్ మాట్లాడుతూ ఆంబళ చిత్రం విజయవంతమవడం ఒక ఎత్తు అయితే తన కోరికను నెరవేర్చిన చిత్రంగా చాలా సంతోషం కలిగించిందన్నారు. ఈ విజయాన్ని ఇంతకుముందే జరుపుకోవాల్సి ఉన్నా జరగలేదన్నారు. 2012లో సుందర్‌సి దర్శకత్వంలో తాను నటించిన మదగజరాజ (ఎంజిఆర్) చిత్రాన్ని అప్పట్లో సంక్రాంతికి విడుదల చేయాలని కోరుకున్నామన్నారు. ఆ చిత్ర విడుదల అనివార్య కారణాల వలన వాయిదా పడటంతో ఆ బాధ ఇప్పటి వరకు తనను వెంటాడుతూ వచ్చిందన్నారు. ఈ సంక్రాంతికి విడుదలై తన కోరికను తీర్చిన చిత్రం ఆంబళ అని అన్నారు. మరో విషయం ఏమిటంటే సంక్రాంతికి ఇతర చిత్రాలు ఏమేమి విడుదల కానున్నాయన్న విషయం నిజంగా తనకు తెలియదన్నారు. అలాంటిది ఎవరినైనా నరుక్కుంటూ పోతాను అని తాను అన్నట్టు ఆర్య ప్రచారం చేశారన్నారు. తానలా అనలేదన్నారు. ఇంతకుముందు నటి లక్ష్మీమీనన్‌తో కలుపుతూ నటుడు విష్ణు విశాల్ నాన్ శిగప్పు మనిదన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై చెప్పి వదంతులకు ఆస్కారం కలిగించారన్నారు. అందుకే ఇకపై తన సినిమా వేడుకలకు తన స్నేహితులను ఆహ్వానించనని అన్నారు. తదుపరి చిత్రాల వివరాలను తెలుపుతూ ప్రస్తుతం సుశీంద్రన్ దర్శకత్వంలో నటిస్తున్నానని ఆ తరువాత లింగుస్వామి దర్శకత్వంలో సండకోళి-2 చిత్రం చేయనున్నట్లు వెల్లడించారు. దర్శకుడు సుందర్ సి మాట్లాడుతూ ఈ ఏడాది చివరిలో విశాల్‌తో ఉలగం చుట్రు వాలిబర్ చిత్రం తరహాలో బ్రహ్మాండమైన చిత్రం చేయనున్నట్లు తెలిపారు. -
ఘనంగా ఎంజీఆర్ జయంతి వేడుకలు
హొసూరు, సిఫ్‌కాట్, కెలమంగలం, క్రిష్ణగిరి: తమిళ ప్రజల ఆరాధ్యదైవం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎం.జీ. రామచంద్రనన్ 98వ జయంతి వేడుకలు శనివారం జిల్లా వ్యా ప్తంగా ఆయన అభిమానులు, అన్నాడీఎంకే నాయకు లు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.హొసూరు యూనియ న్ కార్యదర్శి, మున్సిపల్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి అధ్యక్షతన బాగలూరు బస్టాండులో ఎంజీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంజీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పా టు చేశారు. అనంతరం బాగలూరు రోడ్డులోగల అనాథశరణాలయంలో పిల్లలకు అన్నదానం చేశారు. హొసూరు పట్టణంలోని రామ్‌నగర్‌లో ఎంజీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాల విద్యార్థులకు పె న్నులు, పెన్సిళ్లు, నోటుపుస్తకాలను అందజేశారు. మత్తిగిరిలో, హొసూరు మున్సిపాలిటీ పరిధి టి.విఎస్.నగర్లో ఎంజీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగింది. జెండా ఎగురవేసి స్వీట్లు పంచిపెట్టి అన్నదానం నిర్వహించారు. జిల్లా డీఎంకే కార్యదర్శి గోవిందరాజు, అన్నాడీఎంకే పట్టణ కార్యదర్శి నారాయణన్, అన్నాడీఎంకే నాయకులుజయప్రకాష్, యూనియన్ చైర్పర్సన్ పుష్పాసర్వేశ్, వైస్ చైర్మన్ రాము, జిల్లా కౌన్సిలర్ శేఖర్, నా యకులు సర్వేష్, రామచంద్రప్ప, మున్సిపల్ అన్నాడీఎంకే కౌన్సిలర్లు, యూనియన్ కౌన్సిలర్లు, అన్నాకార్మిక సంఘ నాయకుడు మహదేవ్, లజపతిరెడ్డి, రామన్న, మాజీ ము న్సిపల్ చైర్మన్ నంజుండస్వామి తదితరులు పాల్గొన్నారు,కెలమంగలంలో డెంకణీకోట తాలూక కెలమంగలంలో ఎంజీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ పంచాయతీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ఎం జీఆర్‌కు ఘననివాళులర్పించారు. ఆస్పత్రిలో రోగులకు పాలు, బ్రెడ్లు అందజేశారు. పట్టణ కార్యదర్శి తిమ్మరాయ ప్ప, బోడిసిపల్లి సహకార సంఘ అధ్యక్షులు సంపంగి, ఏ.ఎస్. గోపాలరెడ్డి, రాజేంద్రప్ప, అన్నాడీఎంకే నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డెంకణీకోటలో.. డెంకణీకోట బస్టాండులో అన్నాడీఎంకే పార్టీ నాయకులు ఎం జీఆర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. పట్ట ణ పంచాయతీ అధ్యక్షులు నాగేష్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో పట్టణ పంచాయతీ అన్నాడీఎంకే కౌన్సిలర్లు, నాయకుడు సంపంగిరామిరెడ్డి, డీఎస్ పాండ్యన్ పాల్గొన్నారు. క్రిష్ణగిరిలో జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోజిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి గోవిం దరాజు అధ్యక్షతన ఎంజీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. క్రిష్ణగిరి మున్సిపల్ చైర్మన్ తంగముత్తు అధ్యక్షతన జరిగిన జయంతోత్సవాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కార్యదర్శి గోవిందరాజు అన్ని కేంద్రాల్లో పాల్గొని ఎంజీఆర్‌కు నివాళులర్పించారు. సూళగిరిలో కనిపించని ఎంజీఆర్ జయంతి వేడుకలు సూళగిరిలోఅన్నాడీఎంకే పార్టీకి మంచి పట్టుంది.కానీ ఎంజీ ఆర్ 98వ జయంతి వేడుకలు కనిపించలేదు. జిల్లా వ్యాప్తం గా ఎంజీఆర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొం టుండగా, సూళగిరిలో మాత్రం ఎంజీఆర్‌ను పట్టించుకొన్నవారులేదు.సూళగిరి యూనియన్ చైర్మన్, వైస్ చైర్మన్లు అన్నాడీఎంకే వారు కావడం, ఆ పార్టీకి సూళగిరి ప్రాంతంలో మం చి పట్టున్నా ఎంజీఆర్ జయంతి వేడుకలు జరుపక పోవడంతో నాయకుల తీరుపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ఎంజీఆర్‌కు ఘన నివాళి
చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ 98వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలు శనివారం నివాళులు అర్పించారు. ప్రజలు ఎంజీఆర్ అంటూ అభిమానంగా పిలుచుకునే ఎంజీ రామచంద్రన్ ఆకర్షణ అంతా ఇంతా కాదు. డీఎంకే నుంచి వైదొలిగి, అన్నాడీఎంకే స్థాపించిన ఎంజీఆర్‌పై రాష్ట్ర ప్రజల అభిమానం రాజకీయాలకు అతీతమైనది. 1917లో సిలోన్ (ప్రస్తుతం శ్రీలంక)లోని కాండిలో జన్మించి 1987 డిసెంబరు 29న కాలం చేశారు. ఎంజీర్ మరణించి 37 ఏళ్లు దాటుతున్నా ప్రజల హృదయాల్లో ఆయన ముద్ర చెరిగిపోలేదు. అందుకే శనివారం ఎంజీఆర్ జయంతిని వాడవాడలా జరుపుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఎంజీఆర్ ఫొటోలను ఉంచి మైకుల ద్వారా ఆయన నటించిన సినిమాల్లోని పాటలతో హోరెత్తించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంటి వద్దనే జయ నివాళి పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత చెన్నై పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలో అలంకరించిన నిలువెత్తు ఎంజీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముకుళిత హస్తాలతో కొద్దిసేపు మౌనం పాటించారు. పార్టీ కార్యాలయంలోను, గిండిలోని ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ ప్రాంగణంలోని ఎంజీఆర్ విగ్ర హం వద్ద ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, పలువురు మంత్రులు నివాళులర్పించారు. చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎంజీఆర్ విగ్రహానికి పార్టీ కార్యాలయ కార్యదర్శి మధుసూదన్ తొలుత పూలమాల వేసి శ్ర ద్ధాంజలి ఘటించారు. పలువురు మంత్రులు, పార్టీ నేతలు, అనుబంధ సంఘాల నేతల సమక్షంలో ఎంజీఆర్‌పై ప్రత్యేక సంచికను విడుదల చేశారు. పార్టీ కార్యాలయం ఉన్న రాయపేట రోడ్డు ఎంజీఆర్ అభిమానులతో నిండిపోయింది. టీనగర్‌లోని ఎంజీఆర్ స్మారక మందిరం వద్ద పలువురు మాజీ మంత్రులు, పార్టీ నేతలు నివాళులర్పించారు. పుదియనీది కట్చి అధ్యక్షులు ఏసీ షణ్ముగం 200 మందికి ఉచితంగా చీరలు పంచిపెట్టారు. డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ కోయంబేడులోని తన పార్టీ కార్యాలయంలో ఎంజీఆర్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. -
ఎంజీఆర్‌కు ఘన నివాళి
హొసూరు/కెలమంగలం/క్రిష్ణగిరి : తమిళనాడు రాష్ట్ర అభివృద్దికి ఎంజీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని హొసూరు మున్సిపల్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి అన్నారు. క్రిష్ణగిరి జిల్లా వ్యాప్తంగా ఎంజీఆర్ వర్ధంతిని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు భక్తిశ్రద్ధలతో బుధవారం నిర్వహించారు. హొసూరులోని క్రిష్ణగిరి రోడ్డు కూడలిలో ఎంజీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘననివాళులర్పించారు. ఎంజీఆర్ ఆశయ సాధనలో ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు సేవలందిస్తుందని హొసూరు యూనియన్ చైర్పర్సన్ పుష్పాసర్వేష్ కొనియాడారు. హొసూరులో జరిగిన వర్దంతి వేడుకలలో పట్టణ అన్నాడీఎంకే కార్యదర్శి నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ రాము, అన్నాడీఎంకే నాయకుడు జయప్రకాష్, అన్నాడీఎంకే మున్సిపల్ కౌన్సిలర్లు మారేగౌడ, త్యాగరాజరెడ్డి, అన్నాడీఎంకే నాయకులు రామచంద్రప్ప, చిట్టి తదితరులు పాల్గొని నివాళులర్పించారు. బేరికెలో : హొసూరు తాలూకా బేరికెలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎం.జి. రామచంద్రన్ వర్ధంతి వేడుకలను అన్నాడీఎంకే నాయకుడు శరవణన్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్రంలో బీద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎంజీఆర్ అని కాటినాయకనదొడ్డి పంచాయతీ అధ్యక్షుడు సారథి కొనియాడారు. బేరికె బస్టాండులో ఎంజీఆర్ చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కెలమంగలంలో : డెంకణీకోట తాలూకా కెలమంగలంలో ఎంజీఆర్ వర్ధంతిని పట్టణ పంచాయతీ అధ్యక్షుడు సయ్యద్‌హస్సేన్ అధ్యక్షతన నిర్వహించారు. బస్టాండులో ఎంజీఆర్ చిత్రపటాన్నుంచి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ పంచాయతీ ఉపాధ్యక్షుడు మంజునాథ్, అన్నాడీఎంకే పట్టణ కార్యదర్శి తిమ్మరాయప్ప, బోడిసిపల్లి సహాకార సంఘ అధ్యక్షుడు సంపంగి, అన్నాడీఎంకే నాయకులు రాజేంద్రప్ప, దస్తగిరి, ఎస్.ఏ. గోపాలరెడ్డి, మంజునాథ్ పాల్గొన్నారు. తళిలో : డెంకణీకోట తాలూకా తళిలో అన్నాడీఎంకే నాయకులు ఎంజీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తళి యూనియన్ అన్నాడీఎంకే కార్యదర్శి క్రిష్ణన్ అధ్యక్షతన తళి బస్టాండులో ఎంజీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. కార్యక్రమంలో రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డెంకణీకోటలో : డెంకణీకోట పట్టణ పంచాయతీ అధ్యక్షుడు నాగేష్ అధ్యక్షతన ఎంజీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగింది. పాత బస్టాండులో ఎంజీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అన్నాడీఎంకే నాయకులు సంపంగిరామరెడ్డి, డి.ఎస్. పాండ్యన్, అన్నాడీఎంకే కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్రిష్ణగిరిలో : జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలో అన్నాడీఎంకే కార్యదర్శి గోవిందరాజు అధ్యక్షతన ఎంజీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధ్యక్షుడు అర్జునన్, అన్నాడీఎంకే నాయకులు తెన్నరసు, కేశవన్, మున్సిపల్ చైర్మన్ తంగముత్తు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొని ఎంజీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏనుగుల సంచారంతో పంటలు నష్టం కెలమంగలం : డెంకణీ కోట తాలూకాలోని నగనూరు అటవీ ప్రాంతంలో మకాం వేసిన 15 ఏనుగులు మంగళవారం రాత్రి దళసూరు, ఆళళ్లి గ్రామ రైతుల పంటపొలాల్లో సంచరించడంతో రాగి పంటకు నష్టం వాటిల్లింది. మొత్తం ఐదు ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, అటవీశాఖ అధికారులు పరిహారం ఇప్పించాలని బాధిత రైతులు కోరారు. -
‘అమ్మ’ అదృశ్యం
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్రంలో ఏమూల చూసినా కనిపించే అమ్మ ఫొటోలు క్రమేణా అదృశ్యమవుతున్నాయి. జైలు పాలైన జయలలిత సీఎం పదవిని కోల్పోవడంతో ఆమె ఫొటోలను ఆగమేఘాల మీద తొలగిస్తున్నారు. ఎంజీఆర్ వారసురాలిగా అన్నాడీఎంకే పగ్గాలు చేతపట్టిన జయలలిత ప్రజల్లో అదే స్థాయి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. అన్నాడీఎంకేలోనూ, ప్రభుత్వంలోనూ అమ్మదే ఆధిపత్యం, ఎన్నికల ప్రచార పర్వంలోనూ ఆమెదే ఏకఛత్రాధిపత్యం. అందుకే రాష్ట్రంలోని అనేక పథకాలకు అమ్మ పేరు పెట్టారు. ఇంతటి ప్రజాకర్షణ గల నేత జయకు జైలు శిక్షపడడం అన్నాడీఎంకేకు శరాఘాతంగా మారింది. విధిలేని పరిస్థితిలో పన్నీర్‌సెల్వం సీఎం అయ్యారు. జయ అధికార చాంబర్‌ను అలాగే వదిలి ఆర్థిక మంత్రి చాంబర్‌నే సీఎం చాంబర్‌గా మార్చుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జయలలిత పేరుతో వెలిసిన పథకాల బోర్డులు తొలగించక తప్పలేదు. జయ పోయిస్గార్డెన్లోని తన ఇంటి నుంచి బీచ్‌రోడ్డు మీదుగా సచివాలయూనికి చేరుకునే మార్గంలో బస్టాపుల్లోని ప్రభుత్వ పథకాల బోర్టులను తొలగించేశారు. వాటి స్థానంలో సాధారణ బోర్డులను పెట్టే పనులు ప్రారంభమయ్యూయి. ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఫొటోలను తీసివేయాలని ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో సైతం అమ్మ ఫొటోల స్థానంలో కొత్త ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఫొటోలు వెలిశాయి. అమ్మ క్యాంటీన్లు, అమ్మ వాటర్ బాటిల్, అమ్మ ఉప్పు, అమ్మ ఫార్మసీలు ఇప్పటికే చలామణిలో ఉన్నాయి. వాటిని ఎలా నిర్వహిస్తారో వేచిచూడాలి. బస్తా రూ.190కే అందేలా అమ్మ సిమెంట్ పథకాన్ని కోర్టుకు హాజరయ్యే ముందు రోజునే జయ ప్రకటించారు. ఈ ఏడాది చివర్లోగా వాడుకలోకి తెచ్చేందుకు కార్పొరేషన్ పరిధిలో అమ్మ థియేటర్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ థియేటర్లు వస్తాయా లేక పనులు అర్థాంతరంగా నిలిచిపోతాయానేది ప్రశ్నార్థకంగా మారింది. -
అవినీతిని తరిమికొడతా
రాష్ట్రంలోని అవినీతిని తరిమికొట్టేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేర్కొన్నారు. తిరువణ్ణామలై పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఎంజీఆర్ ప్రారంభించిన నూనె పరిశ్రమను ప్రస్తుత అన్నాడీఎంకే ప్రభుత్వం టాస్మాక్ గోడౌన్‌గా మార్చిందని విమర్శించారు. వేలూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని అవినీతిని పారద్రోలేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేర్కొన్నారు. తిరువణ్ణామలై పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ కూటమి పార్టీలోని పాట్టాలి మక్కల్ పార్టీ అభ్యర్థి ఎదురొలి మణికి మద్దతుగా బుధవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. విజయకాంత్ మాట్లాడుతూ తిరువణ్ణామలైలో ఎంజీఆర్ ప్రారంభించిన టేన్‌కాప్ నూనె పరిశ్రమ ప్రస్తుతం టాస్మాక్ గోడౌన్‌గా మారిందని వీటిపై డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఏనాడైనా చర్యలు చేపట్టాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీంఎకే పార్టీలు కలిసి రాష్ట్రంలోని అనేక పరిశ్రమలను మూసివేయడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు వీధిన పడే దుస్థితి ఏర్పడిందన్నారు. సాతనూర్ డ్యామ్ నుంచి తిరువణ్ణామలైకి వస్తున్న తాగునీరు ప్రస్తుతం నిలిచి పోయిందని దీనిపై ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంగంలోని ప్రభుత్వ ఆస్పత్రిని విస్తరిస్తామని సంవత్సరం క్రితం తెలిపారని, అరుుతే ఇంత వరకూ పనులు ప్రారంభించలేదన్నారు. గిరివలయానికి ప్రతినెలా ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని అయితే ఇక్కడ కనీస వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని ఇక దేశాన్ని అభివృద్ధి చేస్తామని తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. తాను రాష్ట్రంలోని అవినీతి, కుంభకోణాలను పారద్రోలేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఇందుకు నరేంద్ర మోడీ తప్పక సహకరిస్తారన్నారు. రాష్ట్రంలో బీజేపీ కూటమి అభ్యర్థులు అత్యధిక సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నారు. తాము ఏర్పరుచుకున్న కూటమితో ఇప్పటికే పలు పార్టీలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. తిరువణ్ణామలైలో ఎదురొలి మణి, డీఎండీకే, పీఎంకే, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చెక్కు చెదరని అభిమానం
అభిమానానికి హద్దులు, అంతం లేని అతికొద్దిమంది కథా నాయకుల్లో దివంగత మహానటుడు ఎంజీఆర్ ఒకరు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ మకుటం లేని మహరాజుగా వెలిగారు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు ఆయిరత్తిల్ ఒరువన్ ఒకటి. 1965లో తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో నేటి ముఖ్యమంత్రి జయలలిత ఎంజీఆర్‌తో తొలిసారిగా హీరోయిన్గా జత కట్టారు. బీఆర్ పంతులు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రేమ, హాస్యం, యాక్షన్ తదితర జనరంజక అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే చెన్నైలోని మిడ్‌ల్యాండ్, శ్రీకృష్ణ మేఘల థియేటర్లలో వందరోజులు దాటి ప్రదర్శితమైంది. అదేవిధంగా మదురై, కోవై, తిరుచ్చి, సేలం తదితర ప్రాంతాల్లో 150 రోజులకు పైగా ఆడింది. 48 ఏళ్లలో పలు ప్రాంతాల్లో పలుమార్లు విడుదలై ఇప్పటి వరకు మూడువేల థియేటర్లలో ప్రదర్శితమై బయ్యర్లకు లాభాలు ఆర్జించిపెట్టిన చిత్రం ఆయిరత్తిల్ ఒరువన్. అలాంటి చిత్రం మళ్లీ ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీతో ఆధునిక హంగులు దిద్దుకుని శుక్రవారం తెరపైకి వచ్చింది. ఆమోఘ ఆదరణ ఈ చిత్రానికి ఎంజీఆర్ అభిమానుల నుంచి అమోఘ ఆదరణ లభించింది. నగరంలోని సత్యం, ఎస్కేప్, ఐనాక్స్, పీవీఆర్, దేవి వంటి మల్టీఫ్లెక్సీ థియేటర్లలో విడుదలైంది. ఆయా థియేటర్లలో ఎంజీఆర్ అభిమానులు భారీ కటౌట్లు, బ్యానర్లు నెలకొల్పి ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించి తమ వీరాభిమానాన్ని నిరూపించుకున్నారు. అంతేకాకుండా కటౌట్లకు పుష్పాంజలి ఘటించారు. థియేటర్లలో మూడు రోజులకు పూర్తిగా అడ్వాన్స్ టికెట్లు బుక్ కావడం విశేషం. జనం కుటుంబం సహా సినిమా చూడడానికి తరలిరావడం మరొక విశేషం. కొత్త చిత్రాలకు కూడా ఇంత ఆదరణ ఉండదని థియేటర్ల యాజమాన్యం పేర్కొనడం విశేషం. కాలాన్ని గెలిచిన చిత్రం : ఆధునిక హంగులతో ఆయిరత్తిల్ ఒరువన్ చిత్రం విడుదలైన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో పేర్కొంటూ విప్లవ నాయకుడు ఎంజీఆర్ నటించిన చిత్రాలు తరాలకతీతంగా నిలిచే అజరామరమని పేర్కొన్నారు. ఆయన నటించిన చరిత్ర సృష్టించిన చిత్రాల్లో ఆయిరత్తిల్ ఒరువన్ ఒకటని తెలిపారు. ఆ చిత్రంలో తాను తొలిసారిగా ఎంజీఆర్‌కు జంటగా నటించానని తెలిపారు. -
విశ్లేషణం: రియాక్టివ్ లీడర్!
కోమలవల్లి... ఈ పేరు చెబితే చాలామందికి తెలియదు. కానీ రెండేళ్ల వయసులో తండ్రిని పోగొట్టుకుని, 15 ఏళ్ల వయసులో అయిష్టంగా సినీరంగ ప్రవేశంచేసి, అగ్రకథానిక స్థాయికి ఎదిగి, 140 సినిమాల్లో నటించి, అయిష్టంగానే రాజకీయ ప్రవేశం చేసి, నాలుగుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మగువ అంటే మాత్రం చెప్పేస్తారు... ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత, పురచ్చి తలైవి అమ్మ... అని! జయలలిత ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. మాటల్లో సూటిదనం, స్పష్టత ఉంటాయి. తెలివైనదని, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తని ఆమె మాటల్లో మనకు తెలిసిపోతుంది. ఆమె మనసు తెలుసుకోవడం కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే ఆమె మాట్లాడేటప్పుడు శరీరంలో ఎలాంటి కదలికలూ ఉండవు. మొహంలో భావోద్వేగాలూ ఉండవు. కానీ ఆమె మాటతీరు, మాట్లాడే మాటలు, జీవనశైలి, తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఆమె వ్యక్తిత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూటిగా, స్పష్టంగా... జయలలిత నిదానంగా, సున్నితంగా మాట్లాడతారు. ఎదుటివారి కళ్లలోకి సూటిగా చూస్తూ, చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్తారు. చెప్పడం ఇష్టంలేకపోయినా, ఎదుటివారి మాటలు ఇబ్బంది కలిగిస్తున్నా మొహమాటం లేకుండా ఆ విషయాన్ని వారికే చెప్తారు. మీడియా అడిగే ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పడమే కాదు, మీడియాకే ప్రశ్నలు వేస్తారు. సందర్భాన్ని బట్టి ఆమె స్వరంలో కోపం ధ్వనించినా మొహంలో మాత్రం కనిపించదు. ఎలాంటి సందర్భంలోనైనా బ్యాలెన్స్ కోల్పోకుండా ఉంటారు. వీటన్నింటినీ బట్టి ఆమె చాలా అసెర్టివ్ లీడర్ అని చెప్పవచ్చు. కానీ దీన్నే నిరంకుశత్వమంటుంటారు ప్రత్యర్థులు. రియాక్టివ్ ఫీలింగ్స్... బాల్యంలోనే తండ్రిని కోల్పోవడం, కోరుకున్న స్థాయిలో తల్లి ప్రేమను పొందలేకపోవడం, అయిష్టంగానే సినిమారంగంలోకి ప్రవేశించడం.. ఇవన్నీ జయలలిత వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. పైకి కఠినంగా కనిపించినా ఆమె నిరంతరం ప్రేమకోసం అన్వేషిస్తూనే ఉన్నారు. తన జీవితంలో 1/3 శాతం తల్లి, 1/3 శాతం ఎమ్జీఆర్, 1/3శాతం శశికళ ఆక్రమించారని అంగీకరిస్తారామె. ఈ మాటలు చెప్పేటప్పుడు, తన బాల్యం గురించి మాట్లాడేటప్పుడు ఆమె చూపు ఎడమవైపు కిందకు ఉంటుంది. గొంతు మంద్రస్థాయిలో, సున్నితంగా ఉంటుంది. అంటే ఆమె వాటిని నిజంగా ఫీలవుతున్నారని, వాస్తవాలనే చెప్తున్నారని అర్థం. ఆమెది అనుభూతి ప్రధాన వ్యక్తిత్వం. దీనికి తోడు రియాక్టివ్ పర్సన్. అందుకేనేమో తమిళనాడు అసెంబ్లీలో తనకు జరిగిన పరాభవాన్ని మనసులోకి తీసుకున్నారు, ప్రతీకారం తీర్చుకున్నారు ( అది ప్రతీకారం కాదని ఆమె అనవచ్చుగాక). సెల్ఫ్ సెంట్రిక్ బాల్యంలో కామ్‌గా, సిగ్గరిగా ఉండేదాన్నని చెప్తారు జయలలిత. అయితే జీవితం, జీవితంలో ఎదురైన వ్యక్తులు, అనుభవాలు, రాజకీయాలు తనను ధృఢంగా మార్చాయంటారు. నాయకుడు లేదా నాయకురాలు తన భావోద్వేగాలను పబ్లిక్‌గా ప్రదర్శించకూడదంటారు. అందుకేనేమో ఎంత సీరియస్ విషయం మాట్లాడుతున్నా ఆ భావాన్ని తన మొహంలో కనపడనీయరు. తాను, తన వ్యక్తిత్వం మారిన తీరు తనకే ఆశ్చర్యంగా ఉంటుందని చెప్తారావిడ. ఆమె సమస్యలకు దూరంగా పోరు. పరిష్కారాలకోసం చూస్తారు. ఎవరేం చెప్పారనేదానికన్నా తనకేది మంచని అనిపిస్తుందో అదే చేస్తారు. సెల్ఫ్ సెంట్రిక్‌గా ఉంటారు. అన్‌కండిషనల్ లవ్ అనేది పుస్తకాల్లోనే ఉంటుందని, జీవితాల్లో ఎక్కడా కానరాదని చెప్పడం ఆమె వాస్తవిక దృక్పథాన్ని వెల్లడిస్తుంది. సినిమాలు, రాజకీయాలూ రెండూ చెడ్డవేనని, అయినా తన జీవితం వాటిలోనే సాగిందని, సాగుతోందని చెప్తారు. తనకు ఇష్టం ఉన్నా లేకున్నా.. ఒకసారి ఒక పని చేపట్టాక దానికి పూర్తిగా అంకితం కావడమే జయలలిత బలం. అందుకే సినీరంగంలోనూ, రాజకీయ రంగంలోనూ కూడా ఆమె సక్సెస్ అయ్యారు! - విశేష్, సైకాలజిస్ట్ -
మన ఇద్దరు!
మహానటులు ఎమ్జీయార్, కరుణానిధిల ప్రగాఢ స్నేహం గురించి, దరిమిలా ఏర్పడిన రాజకీయ వైషమ్యం గురించి మణిరత్నం ‘ఇరువర్’ (ఇద్దరు) తీశారు. తెలుగునాట అలాంటి జంట ఒకదాన్ని తీసుకుని రసవత్తరమైన కథగా, సినిమాగా మలచాలంటే ఏయన్నార్ - ఎన్టీయార్ల పేర్లే తడతాయి. తమిళ జంట వంటి కథ కాదిది. దీనిలో స్నేహం ఉంది, స్పర్థ ఉంది, పోటాపోటీ గ్రూపులు నడిపే సామర్థ్యం ఉంది, మళ్లీ ఇద్దరూ కలిసి కొత్త తరాన్ని అదుపు చేసే ప్రయత్నమూ ఉంది, వేడి చల్లారాక చేతులు కలిపి మళ్లీ నటించడమూ ఉంది. కొన్ని విషయాల్లో పోలిక ఉంది, మరికొన్ని విషయాల్లో వైరుధ్యమూ ఉంది. వినడానికి ఇప్పుడు అతిశయోక్తిగా అనిపిస్తుందేమో కానీ, ఒకప్పుడు ఏఎన్నార్, ఎన్టీయార్ పోలికలున్న రికార్డింగ్ డ్యాన్సు ఆర్టిస్టులు బజార్లోకి వచ్చినా జనం గుమిగూడి ఆరాధనగా చూసేవారు. పెళ్లిచూపుల్లో సైతం అవతలివారు ‘నాగ్గాడి’ ఫ్యానో, ‘ఎమ్టీవోడి’ ఫ్యానో తేల్చుకున్నాకే సంభాషణ ముందుకు సాగేది. ఏయన్నార్, ఎన్టీయార్ తెలుగు సినిమా రంగపు తొలి దశలోనే హీరోలయ్యారు. 1950ల నుండి 80ల వరకు మూడు దశాబ్దాలు ఏలారు. 1940-49 మధ్య ఏడాదికి సరాసరి 8 సినిమాలు వస్తే, 1950లో 16 వచ్చాయి. 1950-59 మధ్య ఏడాదికి సగటున 23 వచ్చాయి. ఆ దశకంలోనే స్వాతంత్య్రానంతర భారతదేశం రెక్కలు విప్పుకోసాగింది. విద్యుత్ సౌకర్యం గ్రామాలకు విస్తరించి, థియేటర్లు రాసాగాయి. 1980 వచ్చేసరికి ఏడాదికి 118 సినిమాలు వచ్చాయి. అంటే వారానికి రెండు కంటే ఎక్కువ సినిమాలన్నమాట. ఏయన్నార్, ఎన్టీయార్ కెరియర్లు ఈ బూమ్ పీరియడ్‌తో పెనవేసుకున్నాయి. వాళ్లకు ముందున్న హీరోలు నారాయణరావు, నాగయ్య, రాఘురామయ్య వంటివారు. వాళ్లకున్న స్టార్ స్టేటస్‌ను మించి వీళ్లకు వచ్చింది. 1950ల తర్వాత పౌరాణిక, జానపద సినిమాలు తగ్గి సాంఘిక సినిమాలు రాసాగాయి. ప్రజలు తమ సమస్యలను వాటిలో చూసుకుని హీరోలతో మమేకమవసాగారు. వీళ్లల్లో ఏ ఒక్కరి ప్రస్తావన వచ్చినా, ఇంకోరితో పోలిక ఆటోమ్యాటిక్‌గా వచ్చేసేది. ‘‘రహస్యం’లో ఎన్టీయార్ వేసి ఉంటే హిట్టయ్యేది’... వంటివి నటన గురించైతే, ‘నాగేశ్వరరావు లౌక్యుడు, ఎన్టీయార్లా బోళా మనిషి కాడు’ అనే వ్యాఖ్యలు స్వభావం గురించి! నాగేశ్వరరావు అంటే చటుక్కున గుర్తుకువచ్చేది భగ్న ప్రేమికుడు. ప్రేమించిన అమ్మాయి కోసం త్యాగం చేసి ఆమె జీవితంలోంచి తొలగిపోయే మంచివాడు. అందుకే ఆయన ఆ ఇమేజీలో మిడిల్ క్లాస్ ప్రేక్షకుల హృదయంలో నిలిచిపోయాడు. ముఖ్యంగా స్త్రీలు ఈ పాత్రను ఆరాధించి, ఈ అపర దేవదాసును వాళ్ల మనసులో ప్రతిష్టాపించుకున్నారు. ఎన్టీ రామారావు కూడా విషాద నాయక పాత్రలు వేసినా నాగేశ్వరరావంత కన్విన్సింగ్‌గా వేయలేదు. ఉత్తరాదిన దిలీప్‌కుమార్, దక్షిణాదిన నాగేశ్వరరావు. మన మజ్నూ ఆయనే. సలీమూ ఆయనే. దాంతో ఆ ముద్ర ఎంత గాఢంగా పడిపోయిందంటే ఎన్టీయార్‌లో ఉన్న నట వైవిధ్యం ఏయన్నార్లో లేదని అనాలోచితంగా అనేసేటంతగా! కానీ ఆలోచిస్తే తొలి జానపదాల్లో అక్కినేనే హీరో! బాలరాజు, కీలుగుఱ్ఱం, మాయలమారి, స్వప్నసుందరి, సువర్ణసుందరి, స్త్రీ సాహసం, రత్నమాల, ముగ్గురు మరాఠీలు... సాంఘికాల్లో బాగా పాతుకున్నాక కూడా రహస్యం, వసంతసేనలలో వేశారు. చరిత్రాత్మక పాత్రల గురించి చెప్పుకుంటే, పల్నాటి యుద్ధం, అమర శిల్పి జక్కన, చాణక్య చంద్రగుప్త, రామదాసు... పౌరాణిక పాత్రలంటే - చెంచులక్ష్మి, మాయాబజారు, కృష్ణార్జున యుద్ధం. నవలా నాయకుడూ ఆయనే - చక్ర భ్రమణం, సెక్రటరీ, విజేత, ప్రేమనగర్... శరత్ పాత్రలు అత్యధికంగా ధరించిన తెలుగు నటుడూ ఆయనే - దేవదాసు, తోడికోడళ్లు, బాటసారి! భక్తుడి పాత్రల్లో అయితే నాగేశ్వరరావు తర్వాతే ఎవరైనా. విప్రనారాయణ, భక్త తుకారాం, కుంభార్, బుద్ధిమంతుడు... ఇలా. త్యాగమూర్తి పాత్రల్లో అక్కినేనికి పేరు వచ్చినా కామెడీ అదరగొట్టేశాడు. మిస్సమ్మ, పెళ్లిసందడి, బుద్ధిమంతుడు, చక్రపాణి, పెళ్లినాటి ప్రమాణాలు, గుండమ్మకథ, ప్రేమించి చూడు, గృహలక్ష్మి, బ్రహ్మచారి, అందాలరాముడు... ఇలా అనేకం గుర్తుకువస్తాయి. కొంటెతనం, చిలిపితనం ఆయనలో భలే పలుకుతుంది. నాగేశ్వరరావు గురించి ఏం తెలిసినా తెలియకపోయినా ఓ విషయం మాత్రం అందరికీ తెలుసు. ఆయన డబ్బున్నవాడు కాడు, చదువుకున్నవాడు కాడు, పల్లెటూరివాడు. అలాంటివాడు ఇంత పైకి ఎలా వచ్చాడు? ఎవరైనా పైకి రావాలంటే తనను తాను సమీక్షించుకోవాలి. నాగేశ్వరరావు ఆ పనిని నిరంతరం చేసుకున్నారు. కెరియర్ పట్ల ప్లానింగ్, పాత్ర పోషణలో సంయమనం ఆయనలో అడుగడుగునా కనబడతాయి. సీనియర్ల వద్ద నేర్చుకుంటూనే, తనకు ప్రత్యర్థిగా ఎదిగిన ఎన్టీయార్‌తో ఎలా తలపడాలి, తలపడి ఎలా నిలదొక్కుకోవాలి అన్నది బాగా అధ్యయనం చేసి, అమలు చేశారు. సినీరంగ ప్రవేశం చేసే నాటికి ఎన్టీయార్‌కు 26 యేళ్లు. ఏయన్నార్ కంటే ఏడాదిన్నర పెద్దయినా (1944 సీతారామ జననం నుండి లెక్కవేస్తే) ఐదేళ్లు వెనుకగా సినీరంగంలో ప్రవేశించారు. అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన నాగేశ్వరరావుని ఉలిక్కిపడేలా చేసిన రామారావు అర్హతలేమిటి? మంచి రూపం, మంచి శరీర సౌష్టవం, మంచి వాచికం, మంచి చదువు... అన్నీ మంచిలే! ఎన్నో లోపాలు అధిగమిస్తూ నాగేశ్వరరావు తన ప్రస్థానం సాగించారు. రామారావుకి ఆ బాధలు లేవు. హీ వాజ్ ఏ బోర్న్ హీరో! వస్తూవస్తూనే ఆయన హీరో అయిపోయారు. ఎన్టీయార్‌ని కలవడానికి వస్తూండగా దూరం నుండి చూసి బీఏ సుబ్బారావు, ‘‘ఇతను నా సినిమా హీరో అయితే ఎంత బాగుణ్ను’’ అనుకున్నారు. ఈయన దగ్గరకు వచ్చిన ఎన్టీయార్, ‘నేను ఫలానా’ అనగానే ‘అయితే నువ్వే నా హీరోవి’ అన్నారు. మేకప్ టెస్ట్ లేదు, వాయిస్ టెస్ట్ లేదు, వెయ్యి నూట పదహార్లు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసేసుకున్నారు. పాత్రలో జీవించడం అనే పదబంధం ఎన్టీయార్ విషయంలో అతికినట్టుగా మరెవరి విషయంలోనూ నప్పదు. ఏయన్నార్ ఎప్పుడూ అంటారు - ‘మనం పాత్రలో పూర్తిగా లీనం కాకూడదు. లీనమైనట్టు - నటించాలంతే! లేకపోతే తూకం తప్పుతాం. మనం వేరేగా ఉండి మన పాత్ర గమనాన్ని గమనించాలి’ అని. కానీ ఎన్టీయార్ పద్ధతి అది కాదు. ‘పల్లెటూరి పిల్ల’లో కోడెదూడతో పోట్లాడే దృశ్యంలో ఒడుపు తెలియక కుడిచేతి మణికట్టు విరగకొట్టుకున్నారు. ఈ లక్షణమే ఏయన్నార్‌ను, ఎన్టీయార్‌ను విడదీసి చూపుతుంది. ఎన్టీయార్ పౌరాణిక పాత్రల్లో చూపిన సంయమనం మామూలప్పుడు చూపలేదు. హీ వాజ్ ఆల్వేస్ ప్లేయింగ్ టూ ది గ్యాలరీ. ఇలాంటి వాళ్లని స్వాష్‌బక్లింగ్ హీరోస్ అంటారు. హీరోయిన్ను గాఢంగా హత్తుకోవడం, కత్తిని ముద్దు పెట్టుకోవడం, మారువేషం వేస్తూ వేస్తూ మధ్యలో మీసం పీకి ‘నేనేరా’ అన్నట్టు ప్రేక్షకులకేసి చూసి కన్నుకొట్టడం, విలన్‌ను చావగొట్టి చెవులు మూసి హాల్లో ఈలలు వేయించడం - ఇవన్నీ ఇలాంటి హీరోల లక్షణాలు. ఇవి చూస్తూ ప్రేక్షకుడు మైమరచిపోతాడు. వీటిలో హీరో మొరటుగా ఉంటాడు. హావభావాలు ప్రస్ఫుటంగా వ్యక్తం చేస్తాడు. చదువురానివాడికి కూడా అర్థమయ్యే రీతిలో హిస్ట్రియానిక్స్ ప్రదర్శిస్తాడు. అందువల్ల మధ్యతరగతివాళ్లు ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు ఇలాంటి హీరోను ఆమోదించరు. నేల తరగతి వనితలు మాత్రం ఆరాధిస్తారు. ఎందుకంటే ఇతను ఎప్పుడూ మంచివాడిగానే ఉంటాడు. మోటు సరసాలాడతాడు. త్యాగాలు చేసి పారిపోకుండా కోరినదాన్ని పోరాడి దక్కించుకుంటాడు. తమిళంలో ఎమ్జీయార్ ఇటువంటి పాత్రలే వేశారు. ఆయనను గొప్ప నటుడిగా విమర్శకులు అంగీకరించకపోవచ్చు. కానీ పాటకజనం అతన్ని నెత్తిమీద పెట్టుకున్నారు. ‘బాలరాజు’తో స్టార్డమ్ వచ్చి కీలుగుర్రం, రక్ష రేఖ, శ్రీలక్ష్మమ్మ కథ, స్వప్నసుందరిలతో స్థిరపడినా, జానపదాలనే నమ్ముకోకుండా సాంఘికాల్లో కూడా వేస్తేనే భవిష్యత్తు ఉంటుందని నాగేశ్వరరావు ముందుగానే గ్రహించారు. అదీ ఆయన ఘనత. అప్పటికే ఎన్టీయార్ రంగప్రవేశం చేశారు. ఆయన విగ్రహం, వాచికం చూడబోతే అలాంటి పాత్రలకు సరిగ్గా సూటవుతాడనిపిస్తోంది. తను దేనికి బాగా సూటవుతాడా అని ఆలోచిస్తే సాంఘికాల దారి పట్టడమే మంచిదనిపించి ఉంటుంది. సాంఘికాలకు పనికిరాడు అన్న టాక్ వచ్చినా ఆ పాత్రలకు తగ్గట్టుగా మేకప్, దుస్తులు వేయించుకుని స్టిల్స్ తీయించుకుని నిర్మాతలకు చూపారు. సగం పారితోషికానికే ‘సంసారం’లో వేశారు. ఆ సినిమా హిట్ అయింది. ‘దేవదాసు’ తర్వాత సాంఘికాలంటే ఏయన్నారే తగును అనే పేరు వచ్చేసింది. రామారావును పౌరాణికాలు, జానపదాల్లో బాగా గుర్తుపెట్టుకున్నా ఆయన వేసిన వాటిల్లో సాంఘికాలే ఎక్కువ. వాటిలో పెళ్లిచేసి చూడు, మిస్సమ్మ, వద్దంటే డబ్బు, తిక్క శంకరయ్య వంటి కామెడీలు, చిరంజీవులు, ఇంటికి దీపం ఇల్లాలే, రక్తసంబంధం, ఆత్మబంధువు వంటి ట్రాజెడీలు ఉన్నాయి. ఎన్టీయార్‌ని తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేనట్టు చేసినవి పౌరాణికాలే! ఆయన పౌరాణిక పాత్రల నిర్వహణ గురించి ‘న భూతో... ఇప్పట్లో న భవిష్యతి’ అని చెప్పగలం. నాగేశ్వరరావు వేసిన పాత్రలు ఆ తరువాత శోభన్‌బాబు వేశారు, తర్వాత నాగార్జున వేశారు, జగపతిబాబు వేశారు. ఏదో ఒక స్థాయిలో, ఎంతో కొంత దూరంలో ఆయన స్థానానికి చేరువగా వచ్చారు. కానీ ఎన్టీయార్ పౌరాణిక పాత్రల దగ్గరికి వచ్చేసరికి ఆయనలా ఒప్పించినవారు అరుదు. అరుదు అని ఎందుకనాలంటే కాంతారావూ కృష్ణుడు వేషం వేశారు, హరనాథూ వేశారు. బాగానే చేశారు. ‘సంపూర్ణ రామాయణం’లో శోభన్‌బాబూ వేసి నప్పించారు. రావణుడిగా, దుర్యోధనుడిగా, కీచకుడిగా ఎస్వీ రంగారావు గొప్పగా రాణించారు. అయితే ఎన్టీ రామారావు ఒక్కరే అన్ని రకాల పౌరాణిక పాత్రల్లోనూ నప్పారు. అది తెలిసిన ఏయన్నార్ పౌరాణికాల్లో భారీ పర్సనాలిటీ అవసరం లేని, గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పనక్కరలేని పాత్రలే ఎంచుకున్నారు. దుర్యోధనుడు లాంటివి వేసి హైరాన పడలేదు, పెట్టలేదు. ‘మాయాబజారు’లో అభిమన్యుడిది ఆహార్యం మార్పు తప్ప సాంఘిక సినిమాల్లో రొమాంటిక్ టైపు రోలే! కొంటెగా మాట్లాడే ‘భూకైలాస్’లో నారదుడి పాత్ర, రసికత్వమే ప్రధానంగా - చెంచులక్ష్మి, కృష్ణ మాయ, శ్రీకృష్ణార్జున యుద్ధం... ఇలాంటివే వేశారు. రామారావు ఎన్ని పాత్రలు వేసినా అన్నీ రాజసం ఉన్నవే. నాగేశ్వరరావు బ్రాహ్మణ పాత్రలు, కవి పాత్రలు వేసి చక్కగా ఒప్పించారు. రామారావు వేయలేదు, వేసినా నప్పేది కాదేమో! ‘శ్రీనాథుడు’ బ్రాహ్మణుడే కానీ రాజసం జాస్తి. కవి పాత్రలన్నీ ఏయన్నార్ వేసినవే - జయదేవ, కాళిదాసు, క్షేత్రయ్య, తెనాలి రామకృష్ణ. ఏయన్నార్, ఎన్టీయార్ తమకు నప్పిన పాత్రలను ఎలా ఎంచుకునేవారో ఒక్క ఉదాహరణ. ‘తెనాలి రామకృష్ణ’లో వారిద్దరూ పాత్రలు తారుమారు చేసుకుని ఉంటే సినిమా ఆడి ఉండేది కాదు. ఈ ఎరిక ఏయన్నార్‌కు బాగా ఉంది. ‘చాణక్య-చంద్రగుప్త’ తీస్తూ ఎన్టీయార్ ‘బ్రదర్! నువ్వు చంద్రగుప్తుడు, నేను చాణుక్యుడు వేద్దామా?’ అని అడిగితే నాగేశ్వరరావు - చాలా కాలిక్యులేటెడ్ కదా - ‘వద్దులే, ఇలాగే కానీ’ అన్నారట. వినోదా వారి ‘కన్యాశుల్కం’లో గిరీశం పాత్ర ఇస్తే నాగేశ్వరరావు వద్దనేశారు విలనిక్ షేడ్ ఉందని. ఎన్టీయార్ వేసేశారు. అలాగే ‘చింతామణి’లో వేశ్యకు విటుడిగా బిల్వమంగళుడి పాత్ర. ఏయన్నార్ వద్దన్నారు, ఎన్టీయార్ సరేనన్నారు. ఆయనకు అన్ని రకాల పాత్రలు వేయాలన్న తపన ఎక్కువ. ‘రాజు పేద’లో తాగుబోతు పాత్ర, ‘భీష్మ’లో ముసలి పాత్ర, ‘కలిసి వుంటే కలదు సుఖం’లో అవిటివాడి పాత్ర, ‘నర్తనశాల’లో ఆడంగి పాత్ర... నాగేశ్వరరావుకు పాత్రల ఎంపికపై కచ్చితమైన లెక్కలున్నాయి. 1971లో ‘దసరాబుల్లోడు’ రిలీజైంది. నాగేశ్వరరావు హఠాత్తుగా కుర్రవేషాలేస్తూ స్టెప్పులు మొదలెట్టారు. అది ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్. ఎన్టీయార్ విషయంలో ఈ పీరియడ్ నటుడిగా ఆయన స్థాయి తగ్గించింది. 1972 నాటికి ఆయన ‘బడిపంతులు’లో అద్భుతంగా నటించారు. 49 యేళ్లకే శరీరం భారీగా పెరిగిపోయింది. నాగేశ్వరరావులా ఆయన శరీరాన్ని అదుపులో పెట్టుకోలేదు. అప్పుడు కనుక ఆయన రిటైరై ఎప్పుడో అప్పుడొకటీ ఇప్పుడొకటీ వేస్తూ ఉంటే హుందాగా ఉండి ఉండేది. కానీ అప్పుడాయన విన్నింగ్ స్ట్రీక్‌లో ఉన్నాడు. జంజీర్, దీవార్, యాదోంకీ బారాత్ వంటి అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర హిందీ సినిమాల తెలుగు వెర్షన్లలో వేయడం మొదలెట్టాడు. వల్గారిటీ చేరింది. స్టెప్స్ వేయడం మొదలైంది. నాగేశ్వరరావు వేస్తే భరించగలిగాం కానీ ఈయన వేస్తే బాబోయ్ అనిపించింది. పెద్ద పొట్ట, దాన్ని దాచుకోవడానికి కోటు, కింద బెల్‌బాటమ్ పాంట్. ఈ ధోరణిలో సాగుతూండగానే అడవిరాముడు సూపర్ డూపర్ హిట్. అక్కణ్నుంచి యమగోల, వేటగాడు, డ్రైవర్ రాముడు, ఆటగాడు, సూపర్‌మ్యాన్ - చిత్రం ఏమిటంటే, ఇవన్నీ హిట్ అయ్యాయి. అప్పట్లో ఈయన తీసిన పౌరాణికాలన్నీ పరాజయం పాలయ్యాయి. రామారావు యువతరానికి చేరువైంది ఈ సినిమాల ద్వారానే. వాళ్లే ఆయనకు రాజకీయాల్లో ఓట్ బ్యాంక్ అయ్యారు. చివరికి వచ్చేసరికి బొబ్బిలిపులి, కొండవీటి సింహం - ఇవన్నీ అప్పటి మూడ్‌లో హిట్ కావచ్చు కానీ నటుడిగా ఆయన స్థాయిని దిగజార్చాయని వ్యాసకర్త వ్యక్తిగత అభిప్రాయం. ఎన్టీయార్ దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ఉన్నత స్థానంలో ఉండగానే తప్పుకుని తన ఆధిక్యతను చాటుకున్నారు. ఏయన్నార్ నటజీవితం చాలా ఏళ్లు సాగింది. అయితే మూసపాత్రలు రాకుండా చూసుకున్నారు. అదీ కెరియర్ ప్లానింగంటే! గ్లామర్ తగ్గాక ఆయన అత్యున్నతమైన నటన కనబరిచినది సీతారామయ్యగారి మనవరాలు (1992)లో. 50 ఏళ్లలో, 231 సినిమాల ద్వారా నేర్చుకున్నది ‘అన్లెర్న్’ చేసుకుని ఫ్రెష్‌గా వేశారాయన. ఎన్టీయార్‌లాగే ఏయన్నార్ కూడా నిర్మాతగా మారారు, స్టూడియో కట్టారు. కానీ దర్శకుడిగా మారలేదు. ఎన్టీయార్‌కి ముందు నుండీ అభ్యుదయ భావాలున్నాయి. సాంఘిక ప్రయోజనం ఉన్న సినిమాలు తీయాలి అనుకుని, సినిమా రంగానికి వచ్చిన 3, 4 యేళ్లలోనే ‘పిచ్చిపుల్లయ్య’, ‘తోడు దొంగలు (దానిలో 60 ఏళ్ల పాత్ర) వంటి మంచి సినిమాలు తీశారు. అదే నాగేశ్వరరావైతే నిర్మాతగా తొలి చిత్రం జానపద సినిమా! రంగానికి వచ్చిన పాతికేళ్లకు ‘సుడిగుండాలు’, ‘మరోప్రపంచం’ తీశారు. ఎన్టీయార్ తీసిన తొలి రెండు సినిమాలు దెబ్బతిన్నాయి. చాలా నిరాశకు లోనై, కత్తి పడితే తప్ప తన సంస్థ నిలదొక్కుకోదని గ్రహించాడు. ‘జయసింహ’తో ఎన్ఏటీ సంస్థ నిలబడి అనేక మంచి సినిమాలు తీసింది కానీ అన్నీ కమర్షియల్సే! ఆర్ట్ సినిమాల జోలికి పోలేదు. ఎన్టీయార్, ఏయన్నార్ ఇరువురి వారసులూ సినీరంగంలో వెలుగుతున్నారు. ఎన్టీయార్ రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ సంచలనం సృష్టించారు. ఏయన్నార్ సినీరంగాన్ని వదలలేదు. మద్రాసు నుండి హైదరాబాద్‌కు చిత్రపరిశ్రమను తరలించడంలో హీరోయిజం ప్రదర్శించినది నాగేశ్వరరావే. ఆ విషయంలో ఈయన క్యాంపుకు, ఎన్టీయార్ మద్రాసు క్యాంపుకు ఎలాంటి గొడవలుండేవో, మధ్యలో ఆర్టిస్టులు ఎలా నలిగేవారో గుమ్మడి ఆత్మకథ చదివితే తెలుస్తుంది. వ్యక్తిగతంగా ఈ ఇద్దరు నటులు బహిరంగంగా దూషించుకున్నది లేదు. కుటుంబాల పరంగా సత్సంబంధాలు పాటించారు. తెలుగుజాతికి సంబంధించినంతవరకూ వీరిద్దరూ మ్యాటినీ ఐడాల్స్ మాత్రమే కాదు, సోషల్స్ ఐకాన్స్ కూడా! చాలామంది నాటక కళాకారులు రంగస్థలంపైకి తాగి వచ్చి ప్రదర్శన రసాభాస చేసేవారు. జీవిత చరమాంకంలో డబ్బు లేక అల్లాడేవారు. వేదికపై వాళ్ల నటనను మెచ్చేవారు కూడా విడిగా వారితో కలవడానికి ఇచ్చగించేవారు కారు. సినిమా రంగం నాటక రంగానికి కొనసాగింపు కాబట్టి సినిమావాళ్లు కూడా ఇలాగే ఉంటారని జనం అనుకునేవారు. అందుకే దగ్గరి బంధువులు కూడా సినిమా నటులకు పిల్లనిచ్చేవారు కారు. క్రమేపీ ఈ ఇమేజీ మారడానికి కారణం ఏయన్నార్, ఎన్టీయార్లే. వాళ్లు తమ వ్యక్తిగత జీవితాలపై మచ్చ రాకుండా చూసుకోగలిగారు. ఎన్టీయార్ సినిమా రంగానికి వచ్చేటప్పటికే వివాహితుడు. వచ్చాక కూడా భార్యను విడిచి పెట్టలేదు. సాధారణ గృహస్తులాగే పిల్లల్ని కనడం, వాళ్లకు విద్యాబుద్ధులు చెప్పించడం, పెళ్లిళ్లు పేరంటాలు చేయించడం అవీ జరిపారు. ఏయన్నార్‌కు సినిమాలకు వచ్చాకనే పెళ్లయింది. సినిమాల్లో గ్లామర్ బాయ్‌గా ఉన్నా, ఇంటి దగ్గర మామూలు ఇంటాయనలాగానే ఉన్నారు. పిల్లల చదువుల గురించి హైదరాబాద్‌కి తరలి రావడం, తెలిసిన కుటుంబాల నుంచి అల్లుళ్లను తెచ్చుకోవడం, మీ ఇంటి పక్క పెద్దమనిషి ఎలా చేస్తాడో అలాగే చేశారు. భార్య పేర స్టూడియో కట్టారు. ఆవిడ చివరి ఐదేళ్లూ మంచాన పడితే జాగ్రత్తగా చూసుకున్నారు. ఏఎన్నార్, ఎన్టీయార్ ఇద్దరూ సాంస్కృతిక సభలకు, కాలేజీలకు, బంధువుల ఇళ్లల్లో ఫంక్షన్లకు వచ్చినప్పుడు మామూలు తెలుగు పెద్దమనిషి తరహాలో పంచెకట్టుతోనే వచ్చారు. రంగు రంగు డ్రెస్సులన్నీ ఉద్యోగ ధర్మంగా వేసుకున్నవే తప్ప విడిగా మేము హుందాగా ఉండేవాళ్లమేనని చాటిచెప్పారు. వారికి భాషపై గల పట్టు కూడా ప్రత్యేకించి ప్రస్తావించాలి. వారి తెలుగు ఉచ్ఛారణ శుద్ధంగా ఉండటం వలన, చక్కటి పదసంపద ఉండటం వలన వారు మనల్ని ప్రభావితం చేయగలిగారు. మన పాలిట వీళ్లు గ్లామరస్ టీచర్స్. ప్రేక్షకులకే కాదు. తర్వాత సినీరంగానికి వచ్చిన నటీనటులకు కూడా. - ఎమ్బీయస్ ప్రసాద్ ఏయన్నార్, ఎన్టీయార్ తమకు నప్పిన పాత్రలను ఎలా ఎంచుకునేవారో ఒక్క ఉదాహరణ. ‘చాణక్య-చంద్రగుప్త’ తీస్తూ ఎన్టీయార్ ‘బ్రదర్! నువ్వు చంద్రగుప్తుడు, నేను చాణుక్యుడు వేద్దామా?’ అని అడిగితే నాగేశ్వరరావు - చాలా కాలిక్యులేటెడ్ కదా - ‘వద్దులే, ఇలాగే కానీ’ అన్నారట. ఎన్టీయార్ దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ఉన్నత స్థానంలో ఉండగానే తప్పుకున్నారు. ఏయన్నార్ నటజీవితం చాలా ఏళ్లు సాగింది. తెలుగుజాతికి సంబంధించినంతవరకూ వీరిద్దరూ మ్యాటినీ ఐడాల్స్ మాత్రమే కాదు, సోషల్స్ ఐకాన్స్ కూడా!ఫంక్షన్లకు వచ్చినప్పుడు మామూలు తెలుగు పెద్దమనిషి తరహాలో పంచెకట్టుతోనే వచ్చారు. రంగు రంగు డ్రెస్సులన్నీ ఉద్యోగ ధర్మంగావేసుకున్నవే తప్ప విడిగా మేము హుందాగా ఉండేవాళ్లమేనని చాటిచెప్పారు. -
ముదురుతున్న ‘శివాజీ’ వివాదం
చెన్నై మెరీనా బీచ్ సమీపంలోని శివాజీ గణేశన్ విగ్రహ వివాదం మరింతగా ముదురుతోంది. విగ్రహాన్ని తొలగించాలని ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ శుక్రవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులో ఎంజీఆర్ తర్వాత అంతటి ప్రజాభిమానం కలిగిన వ్యక్తి నడిగర్ తిలగం శివాజీ గణేశన్. ఎంజీఆర్‌పై అభిమానానికి గుర్తుగా నగరంలో అనేక విగ్రహాలు ఉన్నాయి. బీచ్ వద్ద అతిపెద్ద సమాధి ఉంది. అలాగే శివాజీ గణేశన్ స్మృతి చిహ్నంగా 2006లో అప్పటి డీఎంకే ప్రభుత్వం బీచ్ రోడ్డులో విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఆ విగ్రహాన్ని ముఖ్యమంత్రి హోదాలో కరుణానిధి ప్రారంభించారు. రోడ్డు కూడలిలో ఉన్నందున ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటీవల వివాదం పుట్టుకొచ్చింది. విగ్రహాన్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. దీంతో అభిమానులు మద్రాసు హైకోర్టును ఆశ్రరుుంచారు. అక్కడ వాదోపవాదాలు పూర్తయి ఎట్టకేలకు విగ్ర హాన్ని అక్కడి నుంచి తొలగించి మరెక్కడైనా ప్రతిష్ఠించాలని హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు కోర్టు తీర్పుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ శివాజీ గణేశన్ అభిమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రభాకరన్ వాదనలు వినిపిస్తూ తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. అలాగే విగ్రహం తొలగింపు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తీర్పుపై స్టే విధించేందుకు, ఈ పిటిషన్‌ను అత్యవసర కేసుగా స్వీకరించేందుకు నిరాకరిస్తున్నట్లు న్యాయమూర్తులు సతీష్‌కుమార్, అగ్రిహోత్రి, కేకే శచీంద్రన్ పేర్కొన్నారు. విగ్రహ తరలింపు అభ్యంతర పిటిషన్‌ను సాధారణ కేసుగా కొనసాగించుకోవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా శివాజీ గణేశన్ కుమారులు రామ్‌కుమార్, ప్రభు శుక్రవారం తమ స్పందనను తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షలాది అభిమానులు కలిగిన తమ తండ్రి విగ్రహం తరలింపుపై ప్రభుత్వం తగిన నిర్ణయాన్ని తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ప్రకటించారు. విగ్రహం విషయంలో అభిమానులు ఆందోళనలు చేయవద్దని వారు కోరారు. శివాజీ గణేశన్ విగ్రహ వివాదం వెనుక అధికార పార్టీ దురుద్దేశం దాగి ఉందని డీఎంకే కోశాధికారి స్టాలిన్ వ్యాఖ్యానించారు. శివాజీ విగ్రహాన్ని కరుణానిధి ప్రారంభించినందునే దాన్ని తొలగింపు కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర మంత్రి జీకే వాసన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఏడేళ్లుగా అభిమానులను అలరిస్తున్న శివాజీ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించాల్సిన అవసరం లేదన్న సంగతిని ప్రభుత్వం గుర్తించాలని పేర్కొన్నారు. -
ఎంజీఆర్‌కు ఘన నివాళి
చెన్నై, సాక్షి ప్రతినిధి: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ జయంతి సందర్భంగా పొత్తేరిలోని టానిగ్టన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి జయలలిత పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తమిళులకు ద్రోహం చేసిన కాంగ్రెస్, డీఎంకేకు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెప్పాలని అన్నాడీఎంకే శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్నాదురై ఆశీర్వాదంతో ఆవిర్భవించిన డీఎంకే ఆయన ఆశయాలను కరుణానిధి గాలికొదిలారని ఆరోపించారు. తన కుటుంబ సంక్షేమానికి పాటుపడుతున్నారని విమర్శించారు. కరుణానిధి అరాచకాలను తట్టుకోలేకనే ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించారని ఆమె గుర్తుచేశారు. 1996 నుంచి 2013 వరకు ఒక్క ఏడాది మినహా 17 ఏళ్లు కేంద్రంలో పెత్తనం చెలాయించిన కరుణానిధి రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదని దుయ్యబట్టారు. 2008లో భారత్ నుంచి శ్రీలంకకు ఆయుధాలు తరలివెళ్లినప్పుడు కరుణ పట్టించుకోలేదని, 2009లో శ్రీలంకలోని తమిళులు ఊచకోతకు గురైనప్పుడు యూపీఏలో ఉన్నా చలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు గత ఏడాది అకస్మాత్తుగా యూపీఏ నుంచి వైదొలిగారని పేర్కొన్నారు. కరుణ కుటుంబ పరిపాలన అవినీతిలో కూరుకుపోయి దేశానికే అప్రతిష్ట తెచ్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌తో కటీఫ్ చెప్పానంటూనే కనిమొళి గెలుపుకోసం యాచనకు పాల్పడ్డారని ఎద్దేవా చేశారు. ఇలా అనేక విధాలుగా కరుణ కపట రాజకీయాలతో రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగూ ఓడిపోతుంది కాబట్టి శ్రీలంక సమస్యను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధికోసం ముందుగానే వైదొలగడం కరుణ మార్కు రాజకీయమని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని చిన్న పార్టీలు డీఎంకేతో జతకట్టకుంటే మళ్లీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునేందుకు ఆయన ఏమాత్రం వెనుకాడరని తెలిపారు. కావేరి జలాలు, విద్యుత్ వాటా, కచ్చదీవుల సమస్య తదితరాలపై కాంగ్రెస్ పార్టీ సైతం తమిళ ప్రజలకు ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, డీఎంకేల వైఫల్యాలన్నీ అన్నాడీఎంకేకు అంటగట్టేలా లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని, జాగ్రత్తగా ఉండాలని ఆమె పార్టీ కార్యకర్తలను అప్రమత్తం చేశారు. వారి దుష్ర్పచారాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, డీఎంకేలు చేసిన ద్రోహాన్ని వాడవాడలా ప్రచారం చేయాలని కోరారు. పార్టీ గెలుపు కోసం రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు సాగించనున్నట్లు ఆమె ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో 40 స్థానాలు గెలుపొందేలా సైనికుల్లా పనిచేయూలని విజ్ఞప్తి చేశారు. ఁవెట్రి మీదు వెట్రి వందు ఎన్నై సేరుం, అది వాంగితంద పెరుమై ఎల్లా ఉన్నైసేరుంరూ. (గెలుపుపై గెలుపు నన్ను చేరుతుంది, ఆ ఘనతంతా మీకు చెందుతుంది) అంటూ ఎంజీఆర్ నటించిన చిత్రంలోని సూపర్ హిట్ పాటను సభికుల హర్షధ్వానాల మధ్య ఆమె ప్రస్తావించారు. -
జయచిత్రకు శివాజీ గణేశన్ అవార్డు
సీనియర్ నటి, నిర్మాత, దర్శకురాలు జయచిత్రకు దివంగత ప్రఖ్యాత నటుడు శివాజిగణేశన్ అవార్డు లభించింది. మహా, యునెటైడ్ ఆర్టిస్ట్స్ ఆఫ్ ఇండియా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎంజీ ఆర్, శివాజీ గణేశన్, జేజే అవార్డ్సు, కన్నా లడ్డు తిన్న ఆశయా ఫిలిం ఆర్టిస్ట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నూతన సంవత్సరం నాడు స్థానిక వడపళనిలోని నక్షత్ర హోట ల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా న్యాయమూర్తి ఎ.రామమూర్తి, తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు అభిరామి రామనాథన్, దర్శకుడు ఎస్పి ముత్తురామన్ పాల్గొన్నారు. ఎంజీఆర్ అవార్డును దర్శకుడు పేరరసు, కదీర్‌కు అందించారు. శివాజీగణేశన్ అవార్డును నటి జయచిత్ర, నటుడు రమేష్ ఖన్నా, దర్శకుడు అరవింద్ రాజ్‌లకు అందించారు. జేజే అవార్డును సీనియర్ నటి రాజశ్రీ, దేవయాని రాజ్‌కుమార్, వడివుక్కరసి, గిల్డ్ మాజీ అధ్యక్షుడు జె.వి.రుక్మాంగథన్‌కు అందించారు. ప్రత్యేక అవార్డులను సంగీత దర్శకుడు శ్రీకాంత్‌దేవా, నటుడు ఎంఎస్ భాస్కర్, సీనియర్ జర్నలిస్టు నాగై దర్శన్, పీఆర్వో పెరుతులసి పళనివేల్, గోవిందరాజ్‌కు అందించారు. కన్నా లడ్డు తిన్న ఆశయా చిత్ర అవార్డును నటుడు, పవర్‌స్టార్ శ్రీనివాసన్, శివశంకర్, దర్శకుడు మణికంఠన్, నిర్మాత ఆర్ఎన్ మురళి, సహ నిర్మాత హెచ్.మురళి, పీఆర్వో గ్లామర్ సత్యకు అందించారు. -
ఆలయాన్ని కూల్చేయండి!
సాక్షి, చెన్నై: అందరివాడు, దివంగత ఎంజియార్ ఆరోగ్య క్షేమాన్ని కాంక్షిస్తూ నిర్మించిన ఆలయం మరి కొద్ది రోజుల్లో నేల మట్టం కానుంది. శ్రీనీది కరుమారియమ్మన్ ఆలయా న్ని కూల్చి వేయాల్సిందేనని మంగళవారం మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్మరణీయు డు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీయా ర్. అందరి వాడిగా మన్ననలు అందుకున్న ఎంజియార్కు రాష్ట్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. ఆయన విగ్రహం అంటూ లేని ఊరు ఉండదు. ఇందులో మద్రాసు హైకోర్టు ప్రవేశ మార్గంలో ఉన్న శ్రీనీది (న్యాయ) కరుమారియమ్మన్ ఆలయం ఒకటి. ఈ ఆలయ నిర్మాణానికి ఓ కారణం ఉంది. 27 ఏళ్ల క్రితం ఎంజియార్ అనారోగ్యం బారిన పడి అమెరికాలో చికిత్స పొందారు. ఆయన సంపూర్ణ ఆరోగ్య వంతుడు కావాలని కాంక్షిస్తూ ఈ ఆలయాన్ని అభిమానులు అప్పట్లో నిర్మించా రు. న్యాయ స్థానం ప్రవేశ మార్గంలో శ్రీ నీది కరుమారియమ్మన్ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 27 ఏళ్లుగా ఇక్కడ అమ్మవారికి పూజలు చేస్తూ వస్తున్నారు. వివిధ వేషాల్లో దివంగత నేత ఎంజియార్ చిత్ర పటాలను కొలువు దీర్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి ట్రస్టీగా కంద శ్రీనివాసన్ వ్యవహరిస్తున్నారు. ఈ ఆలయం హైకోర్టు ప్రవేశ మార్గంలోని ఎన్ఎస్సీ బోర్డు రోడ్డుపై ఉండటం, ఆ రోడ్డు విస్తరణ కావడం, ఫుట్ పాత్‌లు ఏర్పడటంతో ఈ ఆలయానికి చిక్కులు ఎదురయ్యాయి. పిటిషన్: రాకపోకలు అడ్డంకిగా ఉన్న ఈ ఆలయాన్ని తొలగించాలంటూ ఇటీవల సంఘ సేవకుడు ట్రాఫిక్ రామస్వామి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఈ ఆలయాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. అయితే, అధికారులు అందుకు తగ్గ చర్యల్ని వేగవంతం చేయలేదు. అదే సమయంలో ఆలయాన్ని కూల్చి వేయకుండా స్టే కోరుతూ కంద శ్రీనివాసన్ హైకోర్టును ఆశ్రయించాడు. అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మళ్లీ ట్రాఫిక్ రామస్వామి కోర్టుకు ఎక్కారు. కూల్చండి: న్యాయమూర్తులు సతీష్‌కుమార్ అగ్ని హోత్రి, కేకే శశిధరన్ నేతృత్వంలోని బెంచ్ ఆ పిటిషన్లను విచారిస్తూ వచ్చింది. మంగళవారం వాదనల అనంతరం ఆ ఆలయాన్ని కూల్చి వేయాల్సిందేనని బెంచ్ స్పష్టం చేసింది. ఈ ఆలయం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మితమైందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆలయం ఉన్న ఈ స్థలం ప్రైవేటు స్థలం కూడా కాదన్న విషయాన్ని గుర్తించాలని పిటిషనర్‌కు సూచించింది. ప్రైవేటు స్థలంలో నిర్మించుకోవాలేగానీ, ఇలా ప్రభుత్వ స్థలంలో కాదంటూ అక్షింతలు వేసింది. చెన్నై కార్పొరేషన్, దేవాదాయ శాఖ అధికారుల వివరణలు సైతం బెంచ్ పరిగణనలోకి తీసుకుందని వివరించారు. ఫుట్‌పాత్‌ను, కోర్టు ప్రవేశ మార్గాన్ని ఆక్రమిస్తూ నిర్మించిన ఈ ఆలయాన్ని పదిహేను రోజుల్లోపు కూల్చి వేయాల్సిందేనని కార్పొరేషన్ అధికారుల్ని బెంచ్ ఆదేశించింది. స్టే కోసం కందా శ్రీనివాసన్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. -
పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టాలి: రాంగోపాల్ వర్మ
కాటం రాయుడా కదిరి నరసింహుడా అంటూ సోషల్ మీడియాలో కిర్రాక్ పుట్టిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ క్రేజి వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సొంతంగా ఓ రాజకీయ పార్టీ ప్రారంభించవచ్చని రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశాడు. అంతేకాక మాటల జోరు పెంచి ఇప్పటి వరకు రాజకీయ నేతలుగా మారిన నటులు ఎంజీఆర్ నుంచి చిరంజీవిలలో పవన్ కళ్యాణ్ డైనమిక్ లీడర్ అని ప్రశంసలతో ముంచెత్తారు. 'ఇప్పటి వరకు తాను నా జీవితంలో ఎప్పుడు ఓటు వెయ్యలేదని.. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని ప్రారంభిస్తే ఓటు వేస్తాను అనే మాటకు కట్టుబడి ఉంటాను. పవన్ కళ్యాణ్ కు తన ఓటు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పవర్ స్టార్ కు ఓటు వేసేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ లో ఆలోచనల్లో నిజాయితీ, కళ్లలో పట్టుదల. చరిష్మా, ఇంటెన్సిటిలను బాల్ థాకరేలో కూడా చూడలేదు. ప్రజారాజ్యం పార్టీకి పవన్ కళ్యాణ్ సారథ్యం వహించి ఉంటే అఖండ మెజారిటీని సాధించి ఉండేదని తన ప్రగాఢ విశ్వాసం' అని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు చేశారు. ఇంకా తాను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి చేసిన వ్యాఖ్యలు కాదని.. తాను పవన్ ను కలిసి ఐదు సంవత్సరాలైందన్నాడు. ఓ డైరెక్టర్ గా కాకుండా ఓ ఆంధ్ర ప్రదేశ్ పౌరుడిగా స్పందించానని వర్మ తెలిపాడు. అంతేకాక చిరంజీవికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కాదని.. పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా చేసినవేనని వివరణ ఇచ్చాడు. ఈ రేంజ్ లో పవన్ కళ్యాణ్ ఎత్తుకోవడం వెనుక కారణాలేమై ఉంటాయని పవర్ స్టార్ అభిమానులు, సినీ అభిమానులు ఆలోచనల్లో పడ్డారు. ఏమైనా రాంగోపాల్ తన వ్యాఖ్యలతో మీడియాలో కాక పుట్టించడం ఖాయం.