‘తలైవి’ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో వాస్తవిక తప్పిదాలు ఉన్నాయని అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) నేత, మాజీ మంత్రి డి జయకుమార్ పేర్కొన్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారం ‘తలైవి’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా శుక్రవారం(సెప్టెంబర్ 10) తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ నేపథ్యంలో చెన్నైలో తలైవి మూవీ చూసిన అన్నాడీఎంకే నేత డి జయకుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
చదవండి: మరో విషాదం: ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తలైవి చిత్రాన్ని ఏఎల్ విజయ్ చాలా చక్కగా తెరకెక్కించారన్నారు. అయితే ఇందులో ఎంజీఆర్, జయలలిత మధ్య జరిగిన కొన్ని సన్నేవేశాల పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని సన్నివేశాలను తప్పుగా చూపించారని.. ఎంజీఆర్, జయలలితకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వనట్లుగా ఉన్నాయన్నారు. అవి వారిద్దరినీ కించపరిచేలా ఉన్నాయని వెంటనే ఆ సీన్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకులు, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి, కరుణానిధిగా నాజర్, లీడ్‌రోల్ కంగనా నటించారు. ఈ మేరకు వారిమధ్య జరిగిన కొన్ని సీన్లపై మాజీ మంత్రి జయకుమార్ స్పందించారు. ఎంజీఆర్ తొలి డీఎంకే ప్రభుత్వంలో ఎన్నడూ పదవులు ఆశించలేదన్నారు.
చదవండి: చికిత్సకు స్పందిస్తున్న సాయిధరమ్‌తేజ్, బయటకొచ్చిన వీడియో
కానీ ఈ చిత్రంలో ఆయన మంత్రి పదవి కోరగా దీనిని అప్పటి డీఎంకే సీఎం అన్నాదురై, ఎం కరుణా నిధిలు అడ్డుకున్నట్లు చూపించారు. ఇది నిజం కాదని, ఎందుకంటే నాటి డీఎంకే సీఎం అన్నాదురై ఎంజీఆర్‌ను మంత్రిని చేయాలనుకున్నారన్నారు. కానీ ఎంజీఆర్ స్వయంగా మంత్రి పదవిని తిరస్కరించారని, దీంతో అన్నాదురై కొత్తగా ఓ శాఖను కేటాయించి దానికి ఆయనను డిప్యూటీ చీఫ్‌గా నియమించారని చెప్పారు.
ఇక 1969లో అన్నాదురై మరణించిన అనంతరం సీఎంగా కరుణా నిధి పేరును సూచించింది ఎంజీఆర్‌యే అని జయకుమార్ వెల్లడించారు. ఆ తరువాత ఎంజీఆర్, కరుణానిధి మధ్య విభేదాలు తలెత్తడంతో 1972లో డీఎంకే నుంచి బయటకు వచ్చిన ఎంజీఆర్ సొంతంగా అన్నాడీఏంకే పార్టీని స్థాపించారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment