ఘనంగా ఎంజీఆర్ జయంతి వేడుకలు | grand birthday celebrations MGR | Sakshi
Sakshi News home page

ఘనంగా ఎంజీఆర్ జయంతి వేడుకలు

Published Sun, Jan 18 2015 4:47 AM | Last Updated on Thu, May 24 2018 12:08 PM

grand birthday celebrations MGR

 హొసూరు, సిఫ్‌కాట్, కెలమంగలం, క్రిష్ణగిరి: తమిళ ప్రజల ఆరాధ్యదైవం  మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎం.జీ. రామచంద్రనన్ 98వ జయంతి వేడుకలు శనివారం జిల్లా వ్యా ప్తంగా  ఆయన అభిమానులు, అన్నాడీఎంకే నాయకు లు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.హొసూరు యూనియ న్ కార్యదర్శి, మున్సిపల్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి అధ్యక్షతన బాగలూరు బస్టాండులో  ఎంజీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంజీఆర్ చిత్రపటానికి  పూలమాలలు వేసి  నివాళులర్పించారు.  అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పా టు చేశారు. అనంతరం బాగలూరు రోడ్డులోగల అనాథశరణాలయంలో పిల్లలకు  అన్నదానం చేశారు. హొసూరు పట్టణంలోని రామ్‌నగర్‌లో ఎంజీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు.
 
 పాఠశాల విద్యార్థులకు పె న్నులు, పెన్సిళ్లు, నోటుపుస్తకాలను అందజేశారు. మత్తిగిరిలో, హొసూరు మున్సిపాలిటీ పరిధి టి.విఎస్.నగర్‌లో ఎంజీఆర్ జయంతి వేడుకలు  ఘనంగా జరిగింది. జెండా ఎగురవేసి స్వీట్లు పంచిపెట్టి అన్నదానం నిర్వహించారు. జిల్లా డీఎంకే కార్యదర్శి గోవిందరాజు,  అన్నాడీఎంకే పట్టణ కార్యదర్శి నారాయణన్, అన్నాడీఎంకే నాయకులుజయప్రకాష్, యూనియన్ చైర్పర్సన్ పుష్పాసర్వేశ్,  వైస్ చైర్మన్ రాము,  జిల్లా కౌన్సిలర్ శేఖర్, నా యకులు సర్వేష్, రామచంద్రప్ప, మున్సిపల్ అన్నాడీఎంకే కౌన్సిలర్లు, యూనియన్ కౌన్సిలర్లు, అన్నాకార్మిక సంఘ నాయకుడు మహదేవ్, లజపతిరెడ్డి, రామన్న, మాజీ ము న్సిపల్ చైర్మన్ నంజుండస్వామి తదితరులు పాల్గొన్నారు,కెలమంగలంలో డెంకణీకోట తాలూక కెలమంగలంలో ఎంజీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ పంచాయతీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన  వేడుకల్లో ఎం జీఆర్‌కు ఘననివాళులర్పించారు. ఆస్పత్రిలో  రోగులకు పాలు, బ్రెడ్లు అందజేశారు.  పట్టణ కార్యదర్శి తిమ్మరాయ ప్ప, బోడిసిపల్లి సహకార సంఘ అధ్యక్షులు సంపంగి, ఏ.ఎస్. గోపాలరెడ్డి, రాజేంద్రప్ప, అన్నాడీఎంకే నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 డెంకణీకోటలో..
 డెంకణీకోట బస్టాండులో అన్నాడీఎంకే పార్టీ నాయకులు ఎం జీఆర్ జయంతి వేడుకలను ఘనంగా  జరుపుకొన్నారు. పట్ట ణ పంచాయతీ అధ్యక్షులు నాగేష్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో పట్టణ పంచాయతీ అన్నాడీఎంకే కౌన్సిలర్లు, నాయకుడు సంపంగిరామిరెడ్డి, డీఎస్ పాండ్యన్ పాల్గొన్నారు.
 
 క్రిష్ణగిరిలో
 జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోజిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి గోవిం దరాజు అధ్యక్షతన ఎంజీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. క్రిష్ణగిరి మున్సిపల్ చైర్మన్ తంగముత్తు అధ్యక్షతన జరిగిన జయంతోత్సవాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కార్యదర్శి గోవిందరాజు అన్ని కేంద్రాల్లో పాల్గొని ఎంజీఆర్‌కు నివాళులర్పించారు.
 
 సూళగిరిలో కనిపించని ఎంజీఆర్ జయంతి వేడుకలు
 సూళగిరిలోఅన్నాడీఎంకే పార్టీకి మంచి పట్టుంది.కానీ ఎంజీ ఆర్ 98వ  జయంతి వేడుకలు కనిపించలేదు. జిల్లా వ్యాప్తం గా ఎంజీఆర్ జయంతి వేడుకలను ఘనంగా  జరుపుకొం టుండగా, సూళగిరిలో మాత్రం ఎంజీఆర్‌ను పట్టించుకొన్నవారులేదు.సూళగిరి యూనియన్ చైర్మన్, వైస్ చైర్మన్లు అన్నాడీఎంకే వారు కావడం, ఆ పార్టీకి సూళగిరి ప్రాంతంలో  మం చి పట్టున్నా ఎంజీఆర్ జయంతి వేడుకలు జరుపక పోవడంతో  నాయకుల తీరుపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement