జయచిత్రకు శివాజీ గణేశన్ అవార్డు | shivaji ganeshan award to jaya chitra | Sakshi
Sakshi News home page

జయచిత్రకు శివాజీ గణేశన్ అవార్డు

Published Sat, Jan 4 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM

జయచిత్రకు  శివాజీ గణేశన్ అవార్డు

జయచిత్రకు శివాజీ గణేశన్ అవార్డు

సీనియర్ నటి, నిర్మాత, దర్శకురాలు జయచిత్రకు దివంగత ప్రఖ్యాత నటుడు శివాజిగణేశన్ అవార్డు లభించింది. మహా, యునెటైడ్ ఆర్టిస్ట్స్ ఆఫ్ ఇండియా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎంజీ ఆర్, శివాజీ గణేశన్, జేజే అవార్డ్సు, కన్నా లడ్డు తిన్న ఆశయా ఫిలిం ఆర్టిస్ట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నూతన సంవత్సరం నాడు స్థానిక వడపళనిలోని నక్షత్ర హోట ల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా న్యాయమూర్తి ఎ.రామమూర్తి, తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు అభిరామి రామనాథన్, దర్శకుడు ఎస్‌పి ముత్తురామన్ పాల్గొన్నారు. ఎంజీఆర్ అవార్డును దర్శకుడు పేరరసు, కదీర్‌కు అందించారు. శివాజీగణేశన్ అవార్డును నటి జయచిత్ర, నటుడు రమేష్ ఖన్నా, దర్శకుడు అరవింద్ రాజ్‌లకు అందించారు.
 
 జేజే అవార్డును సీనియర్ నటి రాజశ్రీ, దేవయాని రాజ్‌కుమార్, వడివుక్కరసి, గిల్డ్ మాజీ అధ్యక్షుడు జె.వి.రుక్మాంగథన్‌కు అందించారు. ప్రత్యేక అవార్డులను సంగీత దర్శకుడు శ్రీకాంత్‌దేవా, నటుడు ఎంఎస్ భాస్కర్, సీనియర్ జర్నలిస్టు నాగై దర్శన్, పీఆర్‌వో పెరుతులసి పళనివేల్, గోవిందరాజ్‌కు అందించారు. కన్నా లడ్డు తిన్న ఆశయా చిత్ర అవార్డును నటుడు, పవర్‌స్టార్ శ్రీనివాసన్, శివశంకర్, దర్శకుడు మణికంఠన్, నిర్మాత ఆర్‌ఎన్ మురళి, సహ నిర్మాత హెచ్.మురళి, పీఆర్‌వో గ్లామర్ సత్యకు అందించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement