ఆ స్టార్ హీరోకి అభిమానిగా కార్తీ.. | Karthi's New Movie Titled As 'Vaa Vaathiyare' - Sakshi
Sakshi News home page

Karthi New Movie: దిగ్గజ హీరోకి అభిమానిగా కార్తీ

Published Fri, Sep 1 2023 10:02 AM | Last Updated on Fri, Sep 1 2023 10:23 AM

Karthi New Movie Titled Vaa Vaathiyare - Sakshi

తమిళ నటుడు కార్తీ స్పీడ్‌ పెంచారనే చెప్పాలి. వరస సినిమాలతో హిట్స్ కొడుతున్న ఇతడు.. ఈ మధ్య కాలంలో విరుమాన్‌, పొన్నియిన్‌ సెల్వన్‌, సర్ధార్‌ లాంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలలో ఆకట్టుకున్నారు. తాజాగా ఈయన హీరోగా నటిస్తున్న 25వ చిత్రం 'జపాన్‌' షూటింగ్ పూర్తయింది. చివరి పాటని ఇటీవలే కశ్మీర్‌లో కంప్లీట్ చేశారు. ఇప్పుడు కార్తీ కొత్త సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది.

(ఇదీ చదవండి: చిరంజీవి పూజగదిలో ఆ ఇద్దరి ఫొటోలు..)

కార్తీ ప్రస్తుతం నలన్‌ కుమారసామి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇది కార్తీ 26వ చిత్రం. కృతిశెట్టి హీరోయిన్. స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ఇది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తీస్తున్నారు. ఇందులో కార్తీ, తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్‌ వీరాభిమానిగా నటిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రానికి 'వా వాద్ధియారే' అనే టైటిల్‌ నిర్ణయించినట్లు  తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. 

సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ చైన్నె పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దీని తర్వాత కార్తీ.. '96' ఫేమ్‌ ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నటిస్తాడు. ఇందులో అరవిందస్వామి కీలకపాత్ర చేయబోతున్నాడు. గోవింద్‌ వసంత సంగీతం, పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తారు. ఈ చిత్రాన్ని కార్తీ అన్న సూర్యకు చెందిన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించనుంది. దీని తర్వాత సర్దార్‌ 2, ఖైదీ 2 చిత్రాల్లో కార్తీ నటించనున్నాడు. 

(ఇదీ చదవండి: ఈ తెలుగు హీరోయిన్‌ని గుర్తుపట్టారా? సుప్రీంకోర్టులో ఇ‍ప్పుడు లాయర్‌గా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement