ఆయన అసలు పేరు సుమన్ తల్వార్. మద్రాసులో పుట్టిపెరిగిన ఈ సీనియర్ నటుడు దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి మెప్పించాడు. ఒకప్పట్లో బహుభాషా హీరోగా ఒక వెలుగు వెలిగాడు. కరాటే మార్షల్ ఆర్ట్స్‌లో తనకు టాలెంట్ ఉండటంతో యాక్షన్ సినిమాలకు అప్పట్లో మారుపేరుగా నిలిచాడు. అలా అన్ని భాషల్లో కలిపి దాదాపు 700 చిత్రాలు చేసినా.. తెలుగు సినిమాలోనే సెటిలయ్యాడు. సుమన్ డేట్స్ కోసం ఆ రోజుల్లో దర్శకనిర్మాతలు క్యూకట్టేవారు. చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో కూడా సుమన్ పోటీ పడేవాడు. అయితే నీలి చిత్రాలను సుమన్ తీసినట్లు వచ్చిన ఆరోపణలతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆపై జైలు జీవితం కూడా గడిపాడు.
(ఇదీ చదవండి: జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?)
ఆ కారణం వల్ల ఒక్కసారిగా ఆయన ఇమేజ్ దెబ్బతిన్నది. సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. దీని వెనుక చాలా మంది హీరోలతో పాటు పరిశ్రమకు చెందిన పలువురు కలిసి పక్కా ప్లాన్‌తో ఆయన్ను ఇరికించారనే ఆరోపణలు వచ్చాయి అవి ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి పేరును కూడా పలువురు ప్రచారం చేశారు. కానీ అందులో నిజం లేదని సుమన్ బహిరంగంగానే పలుమార్లు చెప్పాడు.
అసలు విషయం ఏంటనేది ఇప్పటికీ ఆయన చెప్పలేదు. కానీ సుమన్ జైలుకు సంబంధించిన టాపిక్‌పై దివంగత సీనియర్ దర్శకులు సాగర్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగ వైరల్ అవుతున్నాయి. అప్పట్లో అమ్మదొంగా ‘స్టూవర్ట్‌పురం దొంగలు, ఓసినా మరదలా, ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నెంబర్ 1 సహా సుమారు 40 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలా ఆయన అందరికి సుపరిచయమే.
ఈ కారణంతోనే జైలుకు వెళ్లాడు
నీలి చిత్రాల విషయంలో సుమన్ జైలుకు వెళ్లలేదని ఆ వీడియోలో డైరెక్టర్ సాగర్ తెలిపారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్, అప్పట్లో తమిళనాడులో పనిచేస్తున్న డీజీపీ, ఒక లిక్కర్ కాంట్రాక్టర్ (వడియార్) వీళ్ల ముగ్గురి వల్లే సుమన్ జైలుకు వెళ్లాడని ఆయన చెప్పారు. ఆ సమయంలో లిక్కర్ కాంట్రాక్టర్ చాలా పవర్ ఫుల్ అలాంటి వ్యక్తి కూతురిని సుమన్ ఫ్రెండ్ ఒకరు ప్రేమించాడు.
మరోవైపు హీరో సుమన్ అంటే ఆ రాష్ట్ర డీజీపీ కూతురికి చాలా ఇష్టం. అతని సినిమా షూటింగ్ ఎక్కడుంటే ఆ అమ్మాయి కూడా అక్కడికి వచ్చేదని ఆయన చెప్పుకొచ్చాడు. కానీ సుమన్ మాత్రం ఆ అమ్మాయిని ఇష్టపడే వాడు కాదని తెలిపాడు. ఒకరకంగా వన్‌సైడ్ లవ్ అని చెప్పాడు. కానీ డీజీపీ మాత్రం తన కూతురికి ఇప్పటికే పెళ్లి అయిందని, ఆమె సుమన్ ట్రాప్‌లో పడిందనే ఆలోచనతో ఎంజీఆర్‌కు తెలపడం. మరోవైపు సుమన్ ఫ్రెండ్ కూడా లిక్కర్ కాంట్రాక్టర్ కూతురితో ప్రేమ వ్యవహారం. ఈ రెండు విషయాలు సుమన్‌ను ఇబ్బంది పెట్టాయని సాగర్ తెలిపారు.
సుమన్ అరెస్ట్ అవుతాడని ఆ నిర్మాతకు ముందే తెలుసు
సుమన్ విషయంపై డైరెక్టర్ సాగర్ ఇలా చెప్పారు.. 'ఒకరోజు సుమన్‌ను ఎంజీఆర్ తన ఇంటికి పిలిచి పరోక్షంగా డీజీపీ కూతురికి దూరంగా ఉండాలని సూచించాడు. దీంతో సుమన్ కూడా చెప్పాల్సింది నాకు కాదు ఆ అమ్మాయికి అన్నాడు. అక్కడ ఎంజీఆర్‌కు కొంతమేరకు కోపం వచ్చింది. అలా ఒకరోజు అందరూ చూస్తుండగా నడిరోడ్డులో సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు సుమన్‌పై ఇలాంటి తప్పుడు కేసు పెట్టడంతో పాటు బెయిల్ రాకుండా ఉండే పలు సెక్షన్స్ నమోదు చేశారు. కానీ అప్పట్లో సుమన్‌పై చాలా పుకార్లు వచ్చాయి. అవన్నీ అబద్దాలే.
(ఇదీ చదవండి: తమన్నా కోసం ఆ టాప్ హీరోయిన్‌ను టార్గెట్ చేసిన అజిత్)
సుమన్ ఫ్రెండ్‌కు వీడియో క్యాసెట్ల షాప్ ఉండేది. అక్కడికి చాల మంది అమ్మాయిలు వచ్చేవారు కాబట్టి ఈజీగా ఇలాంటి కేసును సుమన్‌పై నమోదు చేశారు. ఇదే సమయంలో సుమన్ అరెస్ట్ కాబోతున్నాడని నిర్మాత దగ్గుబాటి రామానాయుడికి ముందే తెలుసు. ఆ సమయంలో సుమన్‌తో తీయాల్సిన సినిమా ఆపేశాడు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అడిగినా ఆయన తిరిగి సమాధానం చెప్పలేదని ఆయన గుర్తు చేసుకున్నారు.
జైలు నుంచి ఎలా రిలీజ్ అయ్యాడంటే
సుమన్ అమ్మగారికి అప్పటి గవర్నర్ PC అలెగ్జాండర్ క్లాస్‌మేట్ కావడంతో జరిగిన విషయాన్ని ఆయనకు చెప్పడంతో బెయిల్ లభించిందని ఆయన చెప్పాడు. అయినా కూడా సుమారు ఆరు నెలలు జైలు జీవితాన్ని సుమన్ గడిపాడని ఆయన తెలిపాడు. జైలుకు వెళ్తున్న సమయంలో సుమన్ వద్ద ఉన్న డబ్బు,పలు ఆస్తి కాగితాలను తన స్నేహితులకు ఇచ్చాడట. అతను రిలీజ్ అయి బయటకు వచ్చాక వారందరూ కూడా సుమన్‌ను మోసం చేసి డబ్బు ఎగ్గొట్టారని ఆయన తెలిపాడు.
అప్పట్లో సుమన్ వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆ సమయంలో అతని మేనేజర్ సారథినే కొంత సాయం చేశారు. తర్వాత మళ్లీ పలు సినిమాలు తీసి జీవితంలో నిలదొక్కున్నాడని సుమన్ గురించి పలు ఆసక్తకరమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సాగర్ చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment