వెండితెరకు యంజీఆర్‌ జీవితం | Making in the MGR biopic | Sakshi
Sakshi News home page

వెండితెరకు యంజీఆర్‌ జీవితం

Published Thu, Sep 6 2018 12:29 AM | Last Updated on Thu, Sep 6 2018 10:04 AM

Making in the MGR biopic - Sakshi

యంజీఆర్‌

తమిళనాట సినిమాల్లో అయినా.. రాజకీయాల్లో అయినా యంజీర్‌ది స్ఫూర్తి కలిగించే ప్రయాణం. ఈ ప్రయాణాన్ని ఇప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌పై చూపించనున్నారు దర్శకుడు ఎ.బాలకృష్ణన్‌. నటుడిగా, దర్శకుడిగా ఉన్నత స్థాన్నాన్ని అధిరోహించిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు యంజీఆర్‌. ఓ నటుడు ముఖ్యమంత్రి కావడం భారతదేశంలోనే తొలిసారి. భారతరత్న అవార్డు అందుకున్నారాయన.

ఇలా ప్రస్థావించడానికి బోలెడు చరిత్ర ఉన్న బయోపిక్‌ ఇది. పాపులర్‌ టీవీ నటుడు సతీశ్‌ కుమార్‌ యంజీఆర్‌గా కనిపించనున్నారు. రైత్విక, వైయపురి హీరోయిన్లుగా కనిపించనున్నారు. బాల్యం, సినీ ప్రయాణం, రాజకీయాలను ఈ సినిమాలో చూపించనున్నారు దర్శకుడు. ‘మక్కల్‌ తిళగం’(జన నాయకుడు) అని ఆయన అభిమానులు పిలుచుకుంటారు. యంజీఆర్, కరుణానిధి జీవితాల ఆధారంగా మణిరత్నం ‘ఇద్దరు’ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement