sathish kumar
-
‘బట్టల రామస్వామి’కి హిట్ టాక్ రావడం హ్యాపీ: నిర్మాత
‘‘బట్టల రామస్వామి బయోపిక్కు’ చిత్రానికి హిట్ టాక్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమా ‘జీ 5’ ఓటీటీలో రిలీజ్ అయ్యిందంటే ముఖ్య కారణం మ్యాంగో టీవీ రామ్‌గారు. ఆయనకి థ్యాంక్స్’’ అని నిర్మాత సతీష్ కుమార్ ఐ అన్నారు. అల్తాఫ్ హాసన్, శాంతీ రావు, సాత్విక్ జైన్, లావణ్యా రెడ్డి, భద్రం, ధన్‌రాజ్ ముఖ్య పాత్రల్లో రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. సతీష్ కుమార్.ఐ, రామ్ వీరపనేని నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ‘జీ 5’ ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘సినిమాలపై మక్కువతో కోడి రామకృష్ణ దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా చేశాను. సెవెన్ హిల్స్ పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేశాను. రామోజీ రావు, రామానాయుడు, దాసరి నారాయణ రావు, ‘దిల్’ రాజు గార్ల స్ఫూర్తితో నిర్మాతగా మారాను. మా ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ సినిమాకి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. ఆ సినిమాకి నా భార్య వీణాదరి సహ నిర్మాతగా వ్యహరించింది. ఈ సినిమాకి రాజేంద్ర ప్రసాద్‌గారి లాంటి సీనియర్ ఆర్టిస్టులని తీసుకోవచ్చుగా అన్నారు. కథా బలం ఉన్న సినిమా కావడంతో కొత్తవారికి అవకాశం కల్పించాను. సెవెన్ హిల్స్ బ్యానర్లో ‘బ్యాక్ డోర్’ సినిమాని సమర్పిస్తున్నాం. పాయల్ రాజ్‌పుత్‌తో ఉగాదిన కొత్త సినిమా స్టార్ట్ చేశాం’ అన్నారు. -
ప్రియుడి కోసం భర్త దారుణ హత్య
సాక్షి, విశాఖపట్నం : ఆర్మీ సిపాయి సతీష్ కుమార్ ఆత్మహత్య కేసును విశాఖ సిటీ పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందని పోలీసులు నిర్థారించారు. ఈ కేసులో సతీష్ భార్య జ్యోతి, ఆమె ప్రియుడు భరత్ కుమార్, అతని స్నేహితుడు భాస్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన సతీష్ సైన్యంలో పనిచేస్తున్నాడు. సతీష్ జమ్మూకశ్మీర్‌లో ఉండగా, భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు విశాఖ సిటీ మద్దిలపాలెంలో ఉంటున్నారు. ఈ క్రమంలో జ్యోతి భరత్ కుమార్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. జ్యోతి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమె అత్త ఓ సారి మందలించింది. కొద్ది రోజుల తర్వాత సతీష్ డ్యూటీకి నెల రోజులు సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో జ్యోతి వివాహేతర సంబంధం గురించి తెలుసుకొని ఆమెను నిలదీశాడు. తన వివాహేతర సంబంధం బట్టబయలు కావడంతో భర్తను హతమార్చాలని పన్నాగం పన్నింది జ్యోతి. ప్రియుడు భరత్‌తో కలిసి ప్లాన్ చేసింది. సతీష్ కుమార్ తాగే విస్కీలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. సతీష్ నిద్రమత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడు భరత్, అతని స్నేహితుడు భాస్కర్లకు ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. ముగ్గురు కలిసి నిద్రమత్తులో ఉన్న సతీష్ మెడకి చున్నీ బిగించి హత్య చేశారు. అనంతరం అదే చున్నీతో ఫ్యాన్ ఫ్యాన్‌కి వ్రేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఏమి తెలియనట్లుగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. జ్యోతీ, భరత్, భాస్కర్లను అరెస్ట్ చేసిన సిటీ పోలీసులు మంగళవారం విశాఖ పోలీస్ కమీషనర్ ఆర్ కె మీనా ముందు హాజరు పరిచారు. -
ఉద్యోగం వదిలి.. సంగీతం వైపు మరలి..
జూబ్లీహిల్స్: నగరానికి చెందిన ప్రముఖ పియానిస్ట్ టీఎస్ సతీష్‌కుమార్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అత్యధిక వేగంతో పియానో వాయించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఒక్క నిమిషం వ్యవధిలో ఏకంగా 1999 నోట్స్ వాయించి జాతీయ రికార్డులకెక్కారు. వరల్డ్ రికార్డ్స్ ఇండియా, తెలుగు బుక్ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు సమక్షంలో ఇటీవల నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ అరుదైన రికార్డు సాధించారు. ఇప్పటివరకు సతీష్‌కుమార్ పేరిట ఏకంగా 31 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. కళానిధి, కళారత్న, కళా శిరోమణి సహా పలు బిరుదులు ఆయనను వరించాయి. ఉద్యోగం వదిలి.. సంగీతం వైపు మరలి.. సికింద్రాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన సతీష్‌కుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ మ్యాథ్స్ పూర్తి చేశారు. అనంతరం మద్రాస్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు. కొంతకాలం ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఉన్న మక్కువతో ఉద్యోగాన్ని వదిలి పియానో పట్టారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలో కళానిధి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నిర్వహిస్తున్నాను. ఇక్కడ 200మంది విద్యార్థులు సంగీత పాఠాలునేర్చుకుంటున్నారు. రికార్డుల పరంపర ఇదీ.. లండన్‌లోని ప్రసిద్ధ ట్రినిటీ మ్యూజిక్ కాలేజీ నుంచి 8వ గ్రేడ్ సర్టిఫికెట్, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికెట్లు సాధించిన తొలి భారతీయుడిగా సతీష్ నిలిచారు. పియానో, ఎకోస్టిక్ డ్రమ్స్ వాయించడం ద్వారా 8వ డబుల్ గ్రేడ్ సర్టిఫికెట్ సాధించారు. భారతదేశ సంగీత స్రష్టలుగా పేరుపొందిన ఇళయరాజా, ఏఆర్ రెహమాన్‌లు కూడా సింగిల్ గ్రేడ్ మాత్రమే సాధించడం గమనార్హం. రెహమాన్ అభినందనలు మరిచిపోలేను.. ఇప్పటికే వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ , ఇండియన్ బుక్ ఆఫ్రికార్డ్స్లో స్థానం సాధించా. కాలిఫోర్నియాలోని బర్కిలీ యూనివర్సిటీ నుంచి వచ్చే నెల 25న డాక్టరేట్ అందుకోబోతున్నా. ఇప్పటికే ఇండియన్ జీనియస్ అవార్డు అందుకున్నాను. లండన్‌కు చెందిన హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ‘ఫాస్టెస్ట్ పియానిస్ట్ ఆఫ్ ద వరల్డ్’ సర్టిఫికెట్తో సత్కరించింది. ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పలుమార్లు నన్ను ఫోన్లో అభినందించడం మర్చిపోలేని అనుభూతి. – టీఎస్ సతీష్‌కుమార్, పియానిస్ట్ -
వెండితెరకు యంజీఆర్ జీవితం
తమిళనాట సినిమాల్లో అయినా.. రాజకీయాల్లో అయినా యంజీర్‌ది స్ఫూర్తి కలిగించే ప్రయాణం. ఈ ప్రయాణాన్ని ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూపించనున్నారు దర్శకుడు ఎ.బాలకృష్ణన్. నటుడిగా, దర్శకుడిగా ఉన్నత స్థాన్నాన్ని అధిరోహించిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు యంజీఆర్. ఓ నటుడు ముఖ్యమంత్రి కావడం భారతదేశంలోనే తొలిసారి. భారతరత్న అవార్డు అందుకున్నారాయన. ఇలా ప్రస్థావించడానికి బోలెడు చరిత్ర ఉన్న బయోపిక్ ఇది. పాపులర్ టీవీ నటుడు సతీశ్ కుమార్ యంజీఆర్‌గా కనిపించనున్నారు. రైత్విక, వైయపురి హీరోయిన్లుగా కనిపించనున్నారు. బాల్యం, సినీ ప్రయాణం, రాజకీయాలను ఈ సినిమాలో చూపించనున్నారు దర్శకుడు. ‘మక్కల్ తిళగం’(జన నాయకుడు) అని ఆయన అభిమానులు పిలుచుకుంటారు. యంజీఆర్, కరుణానిధి జీవితాల ఆధారంగా మణిరత్నం ‘ఇద్దరు’ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. -
అవకాశాలు వస్తే సినిమాల్లో నటిస్తా!
పెరంబూరు: అవకాశాలు వస్తే సినిమాల్లో నటించడానికి సిద్ధం అని కామన్వెల్త్ చాంపియన్ సతీష్‌కుమార్ శివలింగం పేర్కొన్నారు. ఈయన ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకుని ఆ క్రీడలో పథకం గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కారు. ఒక వాణిజ్య సంస్థకు బ్రాండ్ అంబాసీడర్‌గా నియమితులైన సతీష్‌కుమార్ శివలింగం బుధవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వాణాజ్య ప్రకటనలు, సినిమాల్లో నటించే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు సతీష్‌కుమార్ శివలింగం బదులిస్తూ అలాంటి అవకాశాలు వస్తే, సమయం కుదిరితే తప్పకుండా నటిస్తానని చెప్పారు. అయితే తాను ఎక్కువ సమాయాన్ని క్రీడా శిక్షణలోనే గడుపుతానని తెలిపారు. ప్రతిభ కలిగిన యువకులు గ్రామాల్లో చాలా మంది ఉన్నారని, వారంతా క్రీడల్లో రాణించడానికి మీరిచ్చే సలహా ఏమిటన్న ప్రశ్నకు యువత నిరంతర శిక్షణ పొందాలన్నారు. క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, క్రీడా ప్రేక్షకులు కూడా క్రికెట్ క్రీడలానే ఇతర క్రీడలను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. -
ఒక్క నిమిషంలో 1999 నోట్స్
నగరానికి చెందిన పియానో వాయిద్యకారుడు టీఎస్సతీశ్కుమార్ అరుదైన ఘనత సాధించారు. అత్యధిక వేగంతో పియానో వాయించి సరికొత్త రికార్డు సృష్టించారు. నిమిషం వ్యవధిలోనే 1,999 నోట్స్ వాయించి జాతీయ రికార్డు నెలకొల్పారు. జూబ్లీహిల్స్: వరల్డ్ రికార్డ్స్ ఇండియా, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో ఫిబ్రవరిలో నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ రికార్డు సొంతం చేసుకున్నారు. గతంలో గుజరాత్‌కు చెందిన పియానో విద్వాంసుడు అమన్ బాట్ల నిమిషం వ్యవధిలో 1,208 నోట్స్ వాయించాడు. దీనిని సతీశ్‌కుమార్ బద్దలుకొట్టాడు. సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన సతీశ్ తండ్రి జయప్రకాష్ ఉపాధ్యాయుడు. ఇక్కడే పుట్టి పెరిగిన సతీశ్... ఉస్మానియాలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, మద్రాస్ యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తి చేశారు. కొంతకాలం ప్రభుత్వ లెక్చరర్‌గా పనిచేశారు. మ్యూజిక్ మీదున్న ఇష్టంతో ఉద్యోగాన్ని వదిలేసి ఈ రంగంలోకి ప్రవేశించారు. ఇవీ ఘనతలు... సంగీత ప్రపంచంలో లండన్‌లోని ట్రినిటీ మ్యూజిక్ కాలేజీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి నుంచి సర్టిఫికెట్ సాధించడం సంగీతకారులకు ఒక స్వప్నం. ఇలాంటి ఘనతను సతీశ్ సాధించారు. ట్రినిటీ మ్యూజిక్ కాలేజీలో 8వ గ్రేడ్ సర్టిఫికెట్ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. అలాగే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికెట్లు పొందారు. పియానో, ఎకోస్టిక్ డ్రమ్స్ వాయిద్యాలు వాయించి 8వ డబుల్ గ్రేడ్ సర్టిఫికెట్ సాధించారు. భారత సంగీత సామ్రాట్టులుగా పేరొందిన ఇళయరాజా, ఏఆర్ రెహమాన్‌లు సైతం సింగిల్ గ్రేడ్ మాత్రమే సాధించడం గమనార్హం. త్వరలో డాక్టరేట్... ‘ప్రస్తుతం వెస్ట్ మారేడ్‌పల్లిలో కళానిధి స్కూల్ ఆఫ్ మ్యూజిక్’ నిర్వహిస్తున్నాను. 200 మందికి పైగా విద్యార్థులు నా దగ్గర సంగీత పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇప్పటికే వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాను. కాలిఫోర్నియాలోని బర్కిలీ యూనివర్సిటీ నుంచి ఏప్రిల్ 25న డాక్టరేట్, త్వరలో గుజరాత్లో జరిగే కార్యక్రమంలో ఇండియన్ జీనియస్ అవార్డు అందుకోబోతున్నాను. నా శ్రీమతి విజయ కూడా సంగీతం శిక్షణ పొందారు. స్కూల్లో పాఠాలు చెబుతూ నాకు సహకరిస్తోంద’ని చెప్పారు సతీశ్‌కుమార్. -
పోలీసుల ప్రవర్తనతో పెళ్లి వేడుకలో విషాదం
హైదరాబాద్: నగరంలోని మీర్‌పేట పరిధిలో జరిగిన ఓ పెళ్లి వేడుక పోలీసుల దురుసు ప్రవర్తనతో విషాదంగా మారింది. వేడుకలో డీజే ప్లే అవుతుండగా ఆపేందుకు వచ్చిన పోలీసులు.. ఓ వ్యక్తి మృతికి కారణమయ్యారు. వివరాలు.. మీర్‌పేటలో సోమవారం రాత్రి ఓ పెళ్లి వేడుకలో డీజే సౌండ్‌ను ఆపేందుకు హోంగార్డు లోకేష్, హెడ్ కానిస్టేబుల్ ఖలీద్ వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న రిటైర్డ్ ఫైర్ ఉద్యోగి సతీష్ కుమార్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో జరిగిన తోపులాటలో సతీష్ కుమార్ కుప్పకూలాడు. సతీష్ కుమార్‌ను పోలీసు వాహనం ఎక్కించి, చనిపోయాడన్న అనుమానంతో పోలీసులు మధ్యలోనే పారిపోయారు. దీంతో బంధువులు సతీష్ కుమార్‌ను అపోలో అసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. సతీష్ మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. -
మూణ్ణాళ్ల ముచ్చటేనా!
కరీంనగర్ : పార్లమెంటరీ కార్యదర్శి పదవి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌కు మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యేలా ఉంది. పార్లమెంటరీ కార్యదర్శుల నియూమకాన్ని నిలిపివేయూలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఆయన పదవికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సతీశ్‌కుమార్‌కు సహాయమంత్రి హోదాతో ప్రభుత్వం 2014 డిసెంబర్ 29న పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే. విద్యాశాఖ బాధ్యతలను అప్పగించింది. పార్లమెంటరీ కార్యదర్శుల నియూమకాలు చెల్లనేరవని, సహాయమంత్రుల హోదా ఇవ్వడం రాజ్యాంగాన్ని అతిక్రమించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడంతో విచారణ చేపట్టిన కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా తీర్పునిచ్చింది. ఇకనుంచి ఈ నియూమకాలు, హోదాలు, సౌకర్యాలు విరమించుకోవాలని సూచించింది. దీంతో సతీశ్‌బాబుకు సహాయమంత్రి హోదా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలినట్లయింది. -
ఆర్మీ జవాన్ ఆత్మహత్య
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరం ఎల్లారెడ్డి గూడలోని తన నివాసంలోనే ఎన్ సతీష్ కుమార్ అనే ఆర్మీ జవాన్ బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సతీష్ ఈ నెల 7న స్వగృహ ప్రవేశం నిమిత్తం ఢిల్లీ నుంచి వచ్చాడు. ఆర్ధిక ఇబ్బందులతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇల్లు కట్టడానికి సుమారు రూ.6 లక్షలు అప్పు చేసినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.