హైదరాబాద్: నగరంలోని మీర్‌పేట పరిధిలో జరిగిన ఓ పెళ్లి వేడుక పోలీసుల దురుసు ప్రవర్తనతో విషాదంగా మారింది. వేడుకలో డీజే ప్లే అవుతుండగా ఆపేందుకు వచ్చిన పోలీసులు.. ఓ వ్యక్తి మృతికి కారణమయ్యారు.
వివరాలు.. మీర్‌పేటలో సోమవారం రాత్రి ఓ పెళ్లి వేడుకలో డీజే సౌండ్‌ను ఆపేందుకు హోంగార్డు లోకేష్, హెడ్ కానిస్టేబుల్ ఖలీద్ వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న రిటైర్డ్ ఫైర్ ఉద్యోగి సతీష్ కుమార్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో జరిగిన తోపులాటలో సతీష్ కుమార్ కుప్పకూలాడు. సతీష్ కుమార్‌ను పోలీసు వాహనం ఎక్కించి, చనిపోయాడన్న అనుమానంతో పోలీసులు మధ్యలోనే పారిపోయారు. దీంతో బంధువులు సతీష్ కుమార్‌ను అపోలో అసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. సతీష్ మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసుల ప్రవర్తనతో పెళ్లి వేడుకలో విషాదం
Published Tue, Jun 6 2017 8:18 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM
Advertisement
Advertisement