చెన్నై : ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్కి తమిళనాడు సీఎం జయలలిత ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఎంజీఆర్ 99వ జయంతి. ఈ సందర్భంగా చెన్నైలోని ఆయన విగ్రహానికి జయలలిత పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి జయలలిత స్వీట్లు పంచిపెట్టారు.
తమిళనాడు శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐఏడీఎంకే పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని శనివారం పార్టీ కార్యకర్తలకు సీఎం జయలలిత సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఎంజీఆర్కి సీఎం జయలలిత ఘన నివాళి
Published Sun, Jan 17 2016 2:27 PM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM
Advertisement
Advertisement