తమిళసినిమా: ఎంజీఆర్ చిత్రానికి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి క్లాప్ కొట్టారు. మక్కల్ తిలకం దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ జీవిత చరిత్ర వెండితెర కెక్కునున్న విషయం తెలిసిందే. రమణ కమ్యూనికేషన్ పతాకంపై ఏ.బాలకృష్ణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ఉదయం స్థానిక అడయారు సమీపంలోని ఫిలింసిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ చిత్రానికి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ముఖ్యఅతిథిగా హాజరై ముహూర్త సన్నివేశానికి క్లాప్ కొట్టి ప్రారంభించారు.
ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం, రాష్ట్రమంత్రులు పాండియన్, కడబూర్ రాజా, తిరువళ్లూర్ పార్లమెంట్ సభ్యులు వేణుగోపాల్, రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో ఎంజీఆర్‌గా సతీష్‌కుమార్ నటిస్తుండగా, అన్నాదురైగా దర్శకుడు ఎస్‌ఎస్.స్టాలిన్ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింగంపులి, బ్లాక్ పాండి, ఏఆర్.దీనదయాళన్, ముత్తురామన్ నటిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రులు వీఎన్.జానకి, జయలలితల పాత్రల్లో నటించే నటీమణుల ఎంపిక జరుగుతోందని నిర్మాత తెలిపారు. అదేవిధంగా చిత్ర టీజర్‌ను ఎంజీఆర్ జయంత్రి రోజు జనవరి 17న, చిత్రాన్ని ఏప్రిల్‌లోనూ విడుదలకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment