Start Shooting
-
ఇటు హీరోగా... అటు నిర్మాతగా...
నటుడిగా ఆమిర్ ఖాన్ మేకప్ వేసుకుని దాదాపు రెండేళ్లవుతోంది. ‘లాల్‌సింగ్ చద్దా’ (2022)లో చేసిన టైటిల్ రోల్, ‘సలామ్ వెంకీ’ (2022)లో చేసిన అతిథి పాత్ర తర్వాత ఆమిర్ ఖాన్ నటుడిగా మేకప్ వేసుకోలేదు. ఫైనల్‌గా ఫిబ్రవరిలో కెమెరా ముందుకు రానున్నారు. హీరోగా ‘సితారే జమీన్ పర్’ అంగీకరించారు ఆమిర్. ఫిబ్రవరి 2న ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారు. కొన్ని నెలలుగా ఈ చిత్రంలోని పాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నారు ఆమిర్ ఖాన్. పలు లుక్స్ ట్రై చేసి, చివరికి ఒకటి ఖరారు చేశారు. అలాగే పలుమార్లు స్క్రిప్ట్‌ని చదివారు. అన్నీ సంతృప్తికరంగా అనిపించడంతో ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్లాన్ చేశారు. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి 70 నుంచి 80 రోజులు డేట్స్ ఇచ్చారు ఆమిర్. ఈ చిత్రాన్ని క్రిస్మస్కి విడుదల చేయాలనుకుంటున్నారు. సన్నీ డియోల్ హీరోగా.. నిర్మాతగా ‘లాహోర్: 1947’ చిత్రాన్ని నిర్మించనున్నారు ఆమిర్ ఖాన్. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా మాత్రమే కాదు.. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో (ఏకేపీ) మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి ఆమిర్ భార్య కిరణ్ రావ్ దర్శకత్వంలో రూపొందిన ‘లాపతా లేడీస్’. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం విడుదల కానుంది. మరోటి ‘ప్రీతమ్ ప్యారే’. సంజయ్ శ్రీవాస్తవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమిర్ బుక్ న్యారేటర్గా అతిథి పాత్ర చేశారు. ఈ చిత్రం కూడా ప్రథమార్ధంలోనే విడుదల కానుంది. ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలను ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్ చేపట్టడం విశేషం. ఇలా హీరోగా, ఏకేపీ నిర్మించే చిత్రాలతో ఆమిర్ బిజీ. -
దృశ్యం-2 షూటింగ్ ప్రారంభోత్సవ ఫోటోలు
-
మేం దూరం పాటించడంలేదు
మళ్లీ లొకేషన్లోకి అడుగుపెట్టారు అఖిల్. బ్రేక్ తర్వాత చిత్రీకరణలో పాల్గొనడం భలే ఉంది అన్నారాయన. అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. రెండు రోజుల క్రితం పూజా హెగ్డే షూటింగ్లో పాల్గొన్నారు. తాజాగా అఖిల్ కూడా జాయినయ్యారు. లొకేషన్లో పూజాతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ‘అన్ని జాగ్రత్తలతోనే సినిమా షూట్ చేస్తున్నాం. మేమిద్దరమే (కెమెరా ముందు) మాస్క్ వేసుకోలేదు. మేము కూడా మాస్క్ వేసుకుంటే సినిమాలో మీరు మమ్మల్ని గుర్తుపట్టరు’’ అని సరదాగా అన్నారు అఖిల్. ‘సెట్లో భౌతిక దూరం పాటించనది మేమిద్దరమే. ఎందుకంటే ఒక రొమాంటిక్ కామెడీ సన్నివేశాన్ని తీస్తున్నాం కాబట్టి’’ అన్నారు పూజా హెగ్డే. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. -
ఎంజీఆర్ చిత్రానికి ముఖ్యమంత్రి క్లాప్
తమిళసినిమా: ఎంజీఆర్ చిత్రానికి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి క్లాప్ కొట్టారు. మక్కల్ తిలకం దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ జీవిత చరిత్ర వెండితెర కెక్కునున్న విషయం తెలిసిందే. రమణ కమ్యూనికేషన్ పతాకంపై ఏ.బాలకృష్ణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ఉదయం స్థానిక అడయారు సమీపంలోని ఫిలింసిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ చిత్రానికి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ముఖ్యఅతిథిగా హాజరై ముహూర్త సన్నివేశానికి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం, రాష్ట్రమంత్రులు పాండియన్, కడబూర్ రాజా, తిరువళ్లూర్ పార్లమెంట్ సభ్యులు వేణుగోపాల్, రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో ఎంజీఆర్‌గా సతీష్‌కుమార్ నటిస్తుండగా, అన్నాదురైగా దర్శకుడు ఎస్ఎస్.స్టాలిన్ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింగంపులి, బ్లాక్ పాండి, ఏఆర్.దీనదయాళన్, ముత్తురామన్ నటిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రులు వీఎన్.జానకి, జయలలితల పాత్రల్లో నటించే నటీమణుల ఎంపిక జరుగుతోందని నిర్మాత తెలిపారు. అదేవిధంగా చిత్ర టీజర్‌ను ఎంజీఆర్ జయంత్రి రోజు జనవరి 17న, చిత్రాన్ని ఏప్రిల్‌లోనూ విడుదలకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. -
ఒక్కరు మారినా ఆనందమే!
సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓ వైపు చిత్రాలకు కథలు అందిస్తూనే మరోవైపు అప్పుడప్పుడు వెండితెరపై కనిపిస్తుంటారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డర్టీ గేమ్’. అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో షిరిడీసాయి క్రియేషన్స్ పతాకంపై తాడి మనోహర్ కుమార్ కీలక పాత్ర పోషిస్తూ, నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు సురేశ్, ఖయ్యుం ఇతర పాత్రధారులు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభమైంది. ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రమిది. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఈ సినిమా చూసి ఒక్క ఎమ్మెల్యే మారినా మా నిర్మాత జీవితం ధన్యమైనట్లే’’ అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. ‘‘మంచి మెసేజ్ ఇచ్చే చిత్రం నిర్మించడం ఆనందంగా ఉంది’’ అని నిర్మాత పేర్కొన్నారు. -
అంతా రెడీ..!
ఇప్పటికే ‘మనం’ సినిమాతో జనం ముందుకొచ్చేశారు అఖిల్. ఇక హీరోగా అలరించడమే తరువాయి. అక్కినేని అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ శుభతరుణం కోసం ఇప్పటికే రంగం సిద్ధం చేసేశారట అక్కినేని నాగార్జున. నవంబర్ ద్వితీయార్ధంలో అఖిల్ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరుపనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మాస్‌ను మంత్రముగ్ధులను చేసే చిత్రాలను తెరకెక్కించే వీవీ వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయ్యిందని వినికిడి. హీరోయిజాన్ని అత్యంత శక్తిమంతంగా ఆవిష్కరించడంలో వినాయక్ దిట్ట. మరి హీరోగా నటిస్తున్న తొలి సినిమాలో అఖిల్‌ని ఆయన ఏ స్థాయిలో చూపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నితిన్ తండ్రి - నిర్మాత సుధాకరరెడ్డి నిర్మాణంలో, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రం రూపొం దనుందని సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.