ఒక్కరు మారినా ఆనందమే! | Paruchuri Gopal Krishna new movie dirty game start shooting | Sakshi
Sakshi News home page

ఒక్కరు మారినా ఆనందమే!

Published Thu, Aug 4 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

ఒక్కరు మారినా ఆనందమే!

ఒక్కరు మారినా ఆనందమే!

సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓ వైపు చిత్రాలకు కథలు అందిస్తూనే మరోవైపు అప్పుడప్పుడు వెండితెరపై కనిపిస్తుంటారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డర్టీ గేమ్’. అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో షిరిడీసాయి క్రియేషన్స్ పతాకంపై తాడి మనోహర్ కుమార్ కీలక పాత్ర పోషిస్తూ, నిర్మిస్తున్నారు.

సీనియర్ నటుడు సురేశ్, ఖయ్యుం ఇతర పాత్రధారులు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభమైంది. ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రమిది. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఈ సినిమా చూసి ఒక్క ఎమ్మెల్యే మారినా మా నిర్మాత జీవితం ధన్యమైనట్లే’’ అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. ‘‘మంచి మెసేజ్ ఇచ్చే చిత్రం నిర్మించడం ఆనందంగా ఉంది’’ అని నిర్మాత పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement