తెలుగు సినిమా పుట్టిన రోజు (ఫిబ్రవరి 6) సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన నటీనటులతో పాటు ఉత్తమ చిత్రాలను గుర్తించి వారికి అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ఇక నుంచి తెలుగు సినిమా పుట్టిన రోజు నాడు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6న ఈ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించాలని తీర్మానించారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా అవార్డులు ఉంటాయని తెలిపారు.
తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి నటీనటుల ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరణ జరగాలని పేర్కొన్నారు. ఈ జెండా రూపకల్పన బాధ్యతను పరిచూరి గోపాలకృష్ణకు ఫిల్మ్ ఛాంబర్ అప్పగించంది. తెలుగులో మొట్ట మొదట రిలీజైన మూవీ 'భక్త ప్రహ్లాద' అని తెలిసిందే.. 1932 ఫిబ్రవరి 6న ఆ మూవీ విడుదల కావడంతో ఆ రోజు నుంచి తెలుగు సినిమా పుట్టినరోజుగా టాలీవుడ్ జరుపుకుంటుంది. 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన టెక్నిషియన్స్ అందరూ ఈ వేడుకలలో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment