నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డ్స్ వేడుకను నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు 8 రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నటుడు మురళీ మోహన్ పాల్గొని అవార్డులు అందజేశారు. తెలుగు సినీ నటులు మురళి మోహన్, కోట శ్రీనివాస్ రావు, బాబు మోహన్, దర్శకులు సురేష్ కృష్ణ, అశోక్, సత్యానంద్, సీనియర్ జర్నలిస్టులు వినాయక రావు, ధీరజ అప్పాజీ, కూనిరెడ్డి శ్రీనివాస్‌లకు ఈ అవార్డులు దక్కాయి.
(ఇది చదవండి: ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి.. దీని వెనుక ఇంత కథ ఉందా..!)
ఈ వేడుకను ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా, తెలుగు సినిమా వేదిక సంయుక్తంగా నిర్వహించారు. ఈ వేదికపై 101 మందికి అవార్డులు అందజేయగా.. వరల్డ్ బుక్ అఫ్ రికార్డులో చోటు సంపాదించింది. ఈ ఘనత సాధించిన ఎఫ్‌టీపీసీ సంస్థ అధ్యక్షులు చైతన్య జంగా - కార్యదర్శి వీస్ వర్మ పాకలపాటి లకు వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లండన్ సీఈఓ రాజీవ్ శ్రీవాత్సవ్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు.
మురళి మోహన్ మాట్లాడుతూ.. 'జాతీయ స్థాయిలో ఇంతమందిని ఒక వేడుకలో భాగస్వామ్యం చేయడం ఎంతో కష్టసాధ్యం. అయినప్పటికీ యుగపురుషుడు ఎన్టీఆర్‌పై అభిమానంతో ఈ సంస్థలు ఈ కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించారని.' అని అన్నారు. నటన, సేవా రంగాలలో ఎన్టీఆర్ ఎందరికో ఆదర్శ ప్రాయులని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ప్రభాకర్ రావు అభిప్రాయపడ్డారు.
(ఇది చదవండి: Kiara Advani: ఖరీదైన కారు కొన్న కియారా.. ధర ఎన్ని కోట్లంటే?)
ఈ కార్యక్రమంలో కోట శ్రీనివాస రావు, బాబు మోహన్, జెన్కో చైర్మన్ ప్రభాకర రావు, ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, సినీ ప్రముఖులు బసిరెడ్డి, దామోదర్ ప్రసాద్, కాశీ విశ్వనాధ్, ఎన్టీఆర్ మనవడు నందమూరి యశ్వంత్, తుమ్మల ప్రసన్న కుమార్, గౌతమ్ రాజు తదితరులు విచ్చేసి గ్రహీతలకు అవార్డులను బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment