
‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)’ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది. ఈమేరకు టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. టీఎఫ్‌సీసీ స్థాపించి 14 ఏళ్లు అయిందని తెలిపారు. ఇందులో వెయ్యికి పైగా నిర్మాతలతో పాటు సినిమాలో భాగమైన 24 శాఖలకు చెందిన 16వేల మంది సభ్యులుగా ఉన్నారని చెప్పారు.
టీఎఫ్‌సీసీ ప్రస్తుత కమిటీ గడువు ముగియనున్నటంతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. సెప్టెంబర్ 8న ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. టీఎఫ్‌సీసీ సభ్యులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇందులోని సభ్యులందరికీ ఇన్సూరెన్స్‌తో పాటు వారి పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు ఆయన గుర్తుచేశారు. సభ్యుల సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకెళ్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment