టాలీవుడ్‌లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల సందడి మొదలైంది. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి బైలా ప్రకారం ప్రస్తుత అధ్యక్షులు దిల్ రాజు పదవి కాలం ముగిసింది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం నేడు (జులై 28) ఉదయం 11 గంటలకు ఎన్నికలు ప్రారంభమవుతాయి. అయితే, ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్‌కు చెందిన సభ్యులలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. గతేడాది నిర్మాతల సెక్టార్ నుంచి సి.కల్యాణ్ ఫ్యానల్‌పై 17 ఓట్ల తేడాతో దిల్ రాజు గెలుపొందారు.
టీఎఫ్‌సీసీ అధ్యక్ష పదవి రేసులో ఈసారి డిస్ట్రిబ్యూటర్ విభాగం నుంచి ఠాగూర్ మధు (నెల్లూరు), భరత్ భూషణ్ (విశాఖపట్టణం) బరిలో ఉన్నారు. బైలా ప్రకారం ఒక ఉపాధ్యక్ష పదవిని నిర్మాతల నుంచి ఎన్నుకోవాల్సివుంది. ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్ , వైవీఎస్ చౌదరి పోటీలో ఉన్నారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, స్టూడియోల యజమానులు వంటి నాలుగు సెక్టార్స్‌లోని సభ్యులు ఓటు హక్కును ఉపయోగించుకుంటారు.
వీరిలో అధ్యక్ష, ఉపాధ్యక్షుడిని 48 మంది సభ్యులు ఎన్నుకోనున్నారు. 25 ఓట్ల మెజార్టీ ఎవరికి వస్తే వారే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నిక అయినట్లు ప్రకటిస్తారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఓటింగ్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment